మదిలోంచి గదిలోకి.. నట్టింట్లో.. నచ్చేట్టు! | Simple Plantation Shutter Interior Design Ideas | Sakshi
Sakshi News home page

మదిలోంచి గదిలోకి.. నట్టింట్లో.. నచ్చేట్టు!

Published Sat, Jun 22 2024 7:15 AM | Last Updated on Sat, Jun 22 2024 7:25 AM

Simple Plantation Shutter Interior Design Ideas

     సింబయాటిక్స్‌తో కాలుష్య నివారణ
  
    టేబుల్‌ ప్లాంట్స్‌తో ఒత్తిడికి చెక్‌  

    ఆక్సిజన్‌ బాంబ్స్‌కు ఆదరణ  

నగర ప్రజల ఆలోచనా సరళి మారుతోంది.. పచ్చని ప్రకృతికి ఆకర్షితులవుతున్నారు.. గార్డెన్‌లో పెరగాల్సిన మొక్కలను గదుల్లో అలకరణకు పెడుతున్నారు. మొత్తానికి మొక్కలు నట్టింట్లో నచ్చే విధంగా ఏర్పాటుచేసుకుంటున్నారు. మదిలో మెదిలే ఆలోచనకు అనుగుణంగా గదులను మార్చేస్తున్నారు. నగర వాతావరణంలో తగ్గిపోతున్న ఆక్సిజన్‌ అవసరాలను తీర్చడానికీ, కాలుష్య కారకాలను నియంత్రిచడానికి ఇంటీరియర్‌ మొక్కలు ఉపకరిస్తున్నాయి.

పచ్చనిచెట్లు.. ప్రగతికి మెట్లు.. అన్నట్లు.. మొక్కలు ప్రగతికే కాదు.. ఆరోగ్యానికీ ఎంతో దోహదం చేస్తాయి.. ఈ కాన్సెప్‌్టతోనే ఇంటీరియర్‌ డిజైనర్స్‌ ఇంట్లో పెరిగే మొక్కలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఓ వైపు కాలుష్యం.. మరో వైపు ఒత్తిడి, డిప్రెషన్‌ వంటి మానసిక, శారీరక రుగ్మతలకు చక్కని పరిష్కారం ఈ ఇన్‌డోర్‌ ప్లాంట్స్‌. నగర వాతావరణంలో ఇళ్లు, ఆఫీసు అనే తేడా లేకుండా కాలుష్య కారకాలైన బెంజీన్, ఫార్మాల్డిహైడ్, యుబిక్విటస్, ట్రైక్లోరో ఇథిలిన్‌ వంటి ప్రమాదకర కారకాలు గాలిలో కలిసి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. బ్రాంకైటిస్, ఆస్తమా వంటి రోగాలతో పాటు కేన్సర్‌ వంటి ప్రాణాంతక రోగాలు దాడిచేస్తున్నాయి. వీటిని అరికట్టడంలో ఇంటీరియర్‌ ప్లాంట్స్‌ కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కాలుష్య నివారిణి సింబయాటిక్‌.. 
సింబయాటిక్‌ రిలేషన్ షిప్ అనే విధానంలో కొన్ని మొక్కలు గాలిలోని కాలుష్య కారకాలని నిర్మూలిస్తాయి. ఇందులో మొక్కల ఆకులు, వేర్లతో పాటు..మట్టిలోని సూక్ష్మజీవులు సైతం ప్రధాన పాత్ర పోషిస్తాయి. సహజంగానే ఇండోర్‌ ప్లాంట్స్‌ వాటి ఎదుగుదలకు కిరణజన్య సంయోగక్రియని (ఫోటోసింథసిస్‌) అధిక మొత్తంలో జరుపుతుంది. పత్రాలకున్న సూక్ష్మ రంధ్రాలు గాలిలోని విషవాయువులు, కార్బన్‌ డై ఆక్సైడ్‌ని పీల్చుకుని ఆక్సిజన్‌ విడుదల చేస్తాయి.

జెర్బరా డైసీ (జెర్బరా జెమ్‌సన్, డైసీ, గుల్‌బహర్‌)
 ఈ పూల మొక్క బెంజిన్, ‘క్యాన్సర్‌’ కారక రసాయనాలను తొలగించడంలో ఉపయోగపడుతుందని ‘నాసా’ తెలిపింది. ఈ మొక్క రాత్రంతా కార్బన్‌ డై ఆక్సైడ్‌ని పీల్చుకొని ఆక్సిజన్‌ని విడుదల చేస్తుంది. ప్రశాంతంగా నిద్ర పోవడానికి ఈ మొక్కను బెడ్‌రూంలో పెంచుకుంటారు. దీనిని ఇంట్లో సూర్యకాంతి పడేలా పెట్టుకోవాలి. ఇది ఇండోర్, ఔట్‌డోర్‌ ప్లాంట్‌ కూడా..   రంగుల పూలతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.


క్రైసాంథిమమ్‌ (క్రైసాంథిమమ్‌ మారిఫోలియమ్, గార్డెన్‌ మమ్‌) 
ఇంటి పరిసరాల్లోని అమ్మోనియా, బెంజిన్, ఫార్మాల్డిహైడ్, గ్జైలిన్‌తో పాటు ఇతర రసాయనాలను తొలగిస్తుంది. గాలిని శుద్ధి చేసే అత్యుత్తమమైన మొక్కగా ‘నాసా’ దీనిని గుర్తించింది. విభిన్న రంగుల పూలతో అతి తక్కువ ధరకు దొరికే సాధారణ మొక్క. గార్డెన్‌లోనూ పెరుగుతుంది. పొగతాగే ప్రదేశంలో, ప్లాస్టిక్, ఇంక్‌ పేయింట్స్, వారి్న‹Ù, ఆయిల్స్, డిటర్జెంట్స్, సింతటిక్‌ ఫైబర్స్, గ్యాసోలిన్, రబ్బర్‌ వాసన వచ్చే చోట ఉంచడం వల్ల విష వాయువులను నిర్మూలిస్తుంది. 

 

పీస్‌ లిల్లీ(స్పాతిపైలమ్‌) 
తెల్లటి పూలతో చూడగానే ఆకట్టుకుంటుంది. కాలుష్యకారకాలైన      బెంజిన్, టోల్యూన్, గ్జైలీన్, అమ్మోనియా, ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరో ఇౖథెలిన్‌లను ఫిల్టర్‌ చేస్తుంది. విషవాయులు వెలువడే ప్రాంతాల్లో ఈ మొక్కను పెంచితే వాటిని గ్రహించి పరిశుభ్రమైన గాలిని అందిస్తుంది. కార్పొరేట్‌ ఆఫీసుల్లో స్మోకింగ్‌ జోన్‌ వద్ద వీటిని పెట్టడం వల్ల కాలుష్యాన్ని తగ్గిస్తుంది.  

లెమన్‌గ్రాస్‌.. 
లెమన్‌గ్రాస్‌ మొక్కను వరండాలో, బాల్కనీలో సూర్యరశ్మి తగిలేలా పెంచుకోవాలి. విషవాయువులను తొలగించడంతో పాటు మంచి ఫ్లేవర్‌ను అందిస్తుంది. దోమల నివారణకు చక్కటి పరిష్కారం. ఈ మొక్క ఆకులను మరుగుతున్న టీలో వేసుకుంటే ఔషధ గుణాలను అందించమే కాకుండా మంచి రుచిని అందిస్తుంది.

కలబంద (అలోవెర) 
ఇది ఒక సకులెంట్‌ జాతి మొక్క. ఈ మొక్క గాలిని పూర్తి స్థాయిలో కాలుష్య రహితం చేస్తుంది. ఎంతలా అంటే... ఒక ఇంటిని రిఫ్రెష్‌ చేయడానికి ఒక్క మొక్క చాలు. వాతావరణంలోని ఫార్మాల్డిహైడ్‌ని తొలగించి, ఎన్నో ఔషధగుణాలను అందిస్తుంది. దీనిని వంటగది కిటికీ దగ్గర పెట్టుకుంటే ఎంతోమేలు. కిచెన్‌లో గ్యాస్‌స్టవ్‌ నుండి వెలువడే ఫార్మాల్డిహైడ్‌ని పూర్తిగా శోషించుకుంటుంది.

స్పైడర్‌ ప్లాంట్‌ (రిబ్బన్‌ ప్లాంట్‌) 
ఇంటిని శుభ్రపరిచే క్రమంలో స్ప్రే చేసినప్పుడు వెలువడే రసాయనాలను శోషించుకోడం స్పైడర్‌ ప్లాంట్‌ ప్రత్యేక లక్షణం. అన్ని నర్సరీల్లో లభించే అతి సామాన్యమైన మొక్క. తక్కువ నీటితో పెరుగుతుంది. దీనిని వరండాలో కానీ, బాత్‌రూమ్‌ దగ్గర, రోడ్డుకు ఇరువైపులా, కిటికీల దగ్గర పెట్టుకోవడం ఉత్తమం.  

మనీ ప్లాంట్‌(ఎపిపైరెమ్నమ్‌ ఆరియమ్‌) 
అందరి ఇళ్లలో విరివిరివిగా పెంచుకునే ఈ మొక్క కార్బన్‌ మోనాక్సైడ్, బెంజిన్, ఫార్మాల్డిహైడ్‌ తదితర కారకాలకు సహజ విరుగుడుగా పని చేస్తుంది. దీనిని బెడ్‌ రూమ్‌లో,  ఫరీ్నచర్‌ దగ్గర పెంచుకోవాలి. అంతేకాకుండా ఎక్కువ కాలం మూసి ఉంచే గదుల్లో, స్టోర్‌ రూమ్‌లో ఉంచడం వల్ల ఫలితాన్నిస్తుంది. 
 
స్నేక్‌ ప్లాంట్‌(సెన్సివేరియా లారెంటీ) 
పాము చర్మంపై చారలను పోలి ఉండే ఈ మొక్క ఇంట్లోని బెంజిన్, ఫార్మాల్డిహైడ్, గ్జైలిన్‌తో పాటు ట్రైక్లోరో ఇౖథెలిన్‌ను తొలగిస్తుంది. సాధారణంగా దీనిని కార్పొరేట్‌ ఆఫీసుల్లో, రెస్టారెంట్లలో పెంచుతుంటారు. దీని పెంపకం కోసం ప్రత్యేక జాగ్రత్తలు అవసరంలేదు. నెలకు ఒకటీ, రెండు సార్లు నీరు పోస్తే చాలు. కాంతి తగిలేలా అమర్చుకోవాలి. దీనిని కార్పెటింగ్‌ ఏరియాలో, రబ్బరు వస్తువులు, శుభ్రపరచి ఉంచిన వస్తువుల వద్ద ఏర్పాటు చేసుకోవాలి.  

డంబ్‌ కేన్‌(లొయోపాడ్‌ లిల్లీ) 
వెడల్పుగా ఉండే వీటి ఆకులు అతి తొందరగా గాల్లో కలుíÙతాలను తొలగిస్తుంది. ఈ మొక్క కాస్త విషకారిణి..దీని నుంచి వచ్చే పసరు తాకకుండా చూసుకోవాలి. తాకితే నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. దీనిని ఫరీ్నచర్‌ దగ్గర్లో పెంచుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంది. ఇవే కాకుండా డ్రాసేన, బాంబూ ప్లామ్‌ వంటి పలు మొక్కలు అతి త్వరగా పెరిగి గాలిలోని కాలుష్యకారకాలను తొలగిస్తాయి.

చైనీస్‌ ఎవర్‌గ్రీన్‌(ఆగ్లోనెమ మోడెస్టమ్‌) 
ఇది అధిక మొత్తంలో ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. బెంజీన్, ఫార్మాల్డిహైడ్‌లాంటి టాక్సిన్‌లను తొలగిస్తుంది.ఇంట్లో అలంకరణగా పెంచడం వల్ల అదృష్టం కలిసొస్తుందని ఆసియా ఖండంలోని కొన్ని దేశాల్లో నమ్ముతారు. ఈ మొక్కని గ్యాసోలిన్‌ కారక ప్రదేశాల్లో, కార్పెటింగ్‌ ఏరియాల్లో పెంచుకోవచ్చు.  


రబ్బర్‌ ప్లాంట్‌ (ఫైకస్‌ రోబస్టా) 
ఇది అధిక మొత్తంలో ఆక్సిజన్‌ విడుదల చేసి ౖ2 స్థాయిలను 
పెంచుతుంది. ఫార్మాల్డిహైడ్‌ వంటి విషవాయువులను తొలగిస్తుంది. ఖాళీ ప్రదేశంలో, సూర్యకాంతి పడేలా పెట్టుకుంటే మంచిది. దీని మందమైన ఆకులు సూర్య కాంతిని తట్టుకుని, ముదురు రంగులో అందంగా కనిపిస్తాయి. ఇది బోన్సాయిలో కూడా లభిస్తుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement