టీచరమ్మగా రాష్ట్రపతి | President Murmu takes up role of teacher for school students | Sakshi
Sakshi News home page

టీచరమ్మగా రాష్ట్రపతి

Published Fri, Jul 26 2024 4:14 AM | Last Updated on Fri, Jul 26 2024 4:14 AM

President Murmu takes up role of teacher for school students

భూతాపాన్ని ఎలా తగ్గించాలో విద్యార్థులకు వివరించిన ముర్ము భూతాపాన్ని ఎలా తగ్గించాలో విద్యార్థులకు వివరించిన ముర్ము

న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము టీచర్‌గా మారారు. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లయిన సందర్భంగా గురువారం ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. భూతాపం పర్యవసానాలు, తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు. ప్రెసిడెంట్‌ ఎస్టేట్‌లోని డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ కేంద్రీయ విద్యాలయలో 9వ తరగతి చదువుకునే 53 మంది విద్యార్థులతో ఆమె సంభాషించారు. 

మొక్కల పెంపకం, వాననీటి సంరక్షణ అవసరాన్ని తెలియజెప్పారు. ముఖాముఖి సందర్భంగా వారి ఆకాంక్షలు, లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. చదువుకుని వైద్యులు, శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఉందంటూ వారు చెప్పిన లక్ష్యాలను విని సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా నేడు శాస్త్రవేత్తలు, పాలనాధికారులు, పాలకులు సభలు, చర్చాగోషు్టలు, సమావేశాలు చేపట్టి ఓ పెద్ద సమస్యపై చర్చలు జరుపుతున్నారు. అదేమిటో మీకు తెలుసా?’అని వారినడిగారు. 

వాతావరణ మార్పులు, భూతాపం, పర్యావరణ కాలుష్యం..అంటూ విద్యార్థులు బదులిచ్చారు. రాష్ట్రపతి ముర్ము బదులిస్తూ..‘ఇది వరకు ఏడాదిలో ఆరు రుతువులుండేవి కానీ, నేడు నాలుగే ఉన్నాయి. వీటిలో అత్యధిక కాలం కొనసాగుతూ మనల్ని ఇబ్బంది పెట్టే రుతువు ఎండాకాలం. రోజురోజుకూ ఎండలు మండిపోతుండటంతో మనుషులే కాదు, జంతువులు, మొక్కలు, పక్షులూ ఇబ్బంది పడుతున్నాయి. కరువులు కూడా ఏర్పడుతున్నాయి. భూతాపమే వీటికి కారణం’అని ఆమె వివరించారు. ‘భూతాపాన్ని ఎదుర్కోవాలంటే నీటిని పొదుపుగా వాడాలి. వర్షం నీటిని సంరక్షించాలి. చెట్లను విరివిగా పెంచాలి’అని వారికి సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement