Kendriya Vidyalayam
-
టీచరమ్మగా రాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము టీచర్‌గా మారారు. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లయిన సందర్భంగా గురువారం ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. భూతాపం పర్యవసానాలు, తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు. ప్రెసిడెంట్ ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయలో 9వ తరగతి చదువుకునే 53 మంది విద్యార్థులతో ఆమె సంభాషించారు. మొక్కల పెంపకం, వాననీటి సంరక్షణ అవసరాన్ని తెలియజెప్పారు. ముఖాముఖి సందర్భంగా వారి ఆకాంక్షలు, లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. చదువుకుని వైద్యులు, శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఉందంటూ వారు చెప్పిన లక్ష్యాలను విని సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా నేడు శాస్త్రవేత్తలు, పాలనాధికారులు, పాలకులు సభలు, చర్చాగోషు్టలు, సమావేశాలు చేపట్టి ఓ పెద్ద సమస్యపై చర్చలు జరుపుతున్నారు. అదేమిటో మీకు తెలుసా?’అని వారినడిగారు. వాతావరణ మార్పులు, భూతాపం, పర్యావరణ కాలుష్యం..అంటూ విద్యార్థులు బదులిచ్చారు. రాష్ట్రపతి ముర్ము బదులిస్తూ..‘ఇది వరకు ఏడాదిలో ఆరు రుతువులుండేవి కానీ, నేడు నాలుగే ఉన్నాయి. వీటిలో అత్యధిక కాలం కొనసాగుతూ మనల్ని ఇబ్బంది పెట్టే రుతువు ఎండాకాలం. రోజురోజుకూ ఎండలు మండిపోతుండటంతో మనుషులే కాదు, జంతువులు, మొక్కలు, పక్షులూ ఇబ్బంది పడుతున్నాయి. కరువులు కూడా ఏర్పడుతున్నాయి. భూతాపమే వీటికి కారణం’అని ఆమె వివరించారు. ‘భూతాపాన్ని ఎదుర్కోవాలంటే నీటిని పొదుపుగా వాడాలి. వర్షం నీటిని సంరక్షించాలి. చెట్లను విరివిగా పెంచాలి’అని వారికి సూచించారు. -
కేంద్రీయ విద్యాలయంలో వేధింపులు.. లైబ్రేరియన్‌పై పేరెంట్స్ దాడి
సాక్షి, అనంతపూర్: విద్యా బుద్ధులు చెప్పాల్సిన టీచర్లు, లెక్చరర్లు విద్యార్థినిల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్ లైంగిక వేధింపులకు పాల్పడటంతో బాధితురాలి పేరెంట్స్ అతడిపై దాడి చేశారు. ఈ ఘటన అనంతపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఎస్కేయూలోని కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్ భాను ప్రకాశ్ నాయక్ విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురిచేశాడు. విద్యార్థులను భాను ప్రకాశ్ దుర్భాషలాడాడు. ఇక, విద్యార్థులు తమ పేరెంట్స్‌కు చెప్పారు. దీంతో, ఆగ్రహానికి లోనైన విద్యార్ధులు పేరెంట్స్, బంధువులు.. భానుప్రకాశ్‌కు దేహశుద్ది చేశారు. ఈ క్రమంలో కేంద్రీయ విద్యాలయంలో పేరెంట్స్ ఆందోళనకు దిగారు. అంతేకాకుండా భాను ప్రకాశ్‌పై ప్రిన్సిపాల్‌కు పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: Cyber Crime: రూ. 5 కట్టమని.. రూ.1.85 లక్షలు దోచుకున్నారు -
కేంద్రీయ విద్యాలయం పిలుస్తోంది
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిర్వహించే 2020–2021 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ప్రవేశాల ప్రక్రియ ప్రకటనను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ వెలువరించింది. ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ జూలై 20 నుంచే ప్రారంభమైంది. ఈ నెల 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు ఉంది. దీంతో పాటు 2వ, 8వ, 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సాక్షి, కొండాపూర్(సంగారెడ్డి): వివిధ రంగాలలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికుల పిల్లలతో పాటుగా ఇతరుల పిల్లలకు ప్రాధాన్యతలను అనుసరించి ప్రవేశాలు కల్పిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. అవి రెండు కూడా ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలోనే ఉండగా, అందులో ఒకటి ఝరాసంగం మండల కేంద్రం కాగా, మరొకటి ఎద్దు మైలారం (ఓడిఎఫ్)లో ఉంది. వీరికే మొదటి ప్రాధాన్యత ఆర్మీ ఉద్యోగుల బదిలీలను దృష్టిలో ఉంచుకొని వారి పిల్లల చదువులకు ఆటంకం కలుగకుండా ఉండాలనే ఆలోచనతో మొదటగా సీబీఎస్ఈ సిలబస్‌తో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆర్మీ ఉద్యోగుల పిల్లలకే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వాటి అనుబంధ సంస్థల ఉద్యోగుల పిల్లలకు కూడా వీటిలో ప్రవేశాలను కల్పిస్తున్నారు. ప్రవేశాలు పొందే విద్యార్థి మార్చి 31 నాటికి 5 నుంచి 7 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. వికలాంగ విద్యార్థుల మాత్రం రెండేళ్ల సడలింపు ఉంటుంది. ఇందులో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం చొప్పున , తాజా ప్రవేశాలలో మూడు శాతం సీట్లు దివ్యాంగులకు రిజర్వు చేస్తారు. ఎంపిక విధానం.. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కేంద్రీయ విద్యాలయం సంఘటన్ (కేవీఎస్) నుంచి 80 మంది విద్యార్థుల ఎంపిక జాబితా నేరుగా విద్యాలయానికి పంపుతారు.ఆ జాబితాను కేవీఎస్ అధికారులు సంబందిత వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. లిస్ట్‌లో ఉన్నవారు మాత్రమే తమ రిజినల్ సర్టిఫికేట్లతో కేవీలో సంప్రదించి ప్రవేశాలను పొందాల్సి ఉంటుంది. ఎలాంటి డ్రా అయిన చైర్మన్ సూచించిన అధికారితో పాటుగా వీఎంసీ మెంబర్, ప్రిన్సిపాల్ నూతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ( వీరిలో ఒకరు విద్యా హక్కు చట్టం ప్రకారం సీటు పొందే వారు). ఒక విద్యార్థి సమక్షంలో ఎంపిక నిర్వహిస్తారు. షెడ్యూల్ ఇలా.. జూలై 20వ తేదీ నుంచి 1వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్లో నమోదు ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు నమోదు చేసుకొనే అవకాశం 11న ఎంపికైన విద్యార్థులకు సంబంధించిన ప్రొవిజినల్ తొలి జాబితా ప్రకటన సీట్లు ఏమైనా మిగిలి ఉంటే ఈనెల 24న రెండో జాబితా విడుదల రెండో విడతలో సీట్లు భర్తీ కాని పక్షంలో మూడో జాబితా 26న విడుదల మొదటి నోటిఫికేషన్లో దరఖాస్తు ప్రక్రియ సజావుగా సాగకపోయినా, దరఖాస్తులు ఎక్కువగా రాకపోయినా రెండో నోటిఫికేషన్ జారీ చేస్తారు. దరఖాస్తు చేసుకునే విధానం http://kvsonlineadmission.kvs.gov.in & http://tlm4all.com ద్వారా లాగిన్ కావాలి. కేంద్రీయ విద్యాలయంలో సాధారణంగా ప్రతీఏడాది ఒకటో తరగతికి ఫిబ్రవరి లేదా మార్చి నెలలో అడ్మిషన్లు ఇస్తారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ విద్యాలయాల ప్రారంభంపై సందిగ్ధత ఉండడంపై జాప్యం జరిగింది. రెండు సెక్షన్లలో 40 మంది విద్యార్థులకు చొప్పున 80 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. రిజిష్ట్రేషన్ కోసం పుట్టిన తేదీ, కులం, నివాసం, వృత్తి ధ్రువీకరణ పత్రాల సమాచారం పొందుపరచాల్సి ఉంటుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, దారిద్య్ర రేఖకు దిగువన కోటాలో దరఖాస్తు చేసుకొనే వారు ధ్రువీకరణ పత్రం సంఖ్యను నమోదు చేయాలి.పీహెచ్‌సీలు తప్పనిసరిగా దివ్యాంగ పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. ఔబీసీలు తప్పనిసరిగా ఓబీసీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఒకే సంతానం (కూతురు) గల వారు నేరుగా విద్యాలయంలోనే దరఖాస్తు చేసుకునే వీలుంది.ఈ కోటాలో సెక్షన్‌కు ఇద్దరు చొప్పున నలుగురికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. మరో సంతానం లేనట్లుగా నోటరీ ద్వారా జారీ చేసిన ఆఫిడవిట్‌ను అందజేయాలి. ఒక వేళ ఈ కోటాలో ఎక్కువ దరఖాస్తులు వస్తే డ్రా పద్ధతిన ఎంపిక చేస్తారు. -
పల్లె సీమలో కేంద్రీయ విద్య
పల్లె సీమలో కేంద్రీయ విద్యాలయానికి పునాదులు పడుతున్నాయి. పచ్చని వ్యవసాయ పొలాలు.. ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య పాలచ్చూరులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు వేగవంతంగా అడుగులు పడుతున్నాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దు మండలంగా ఉన్న పెళ్లకూరు దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్ప లేకపోయాయి. గత టీడీపీ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టకపోగా, ఉన్న విద్యాలయాలను తొలగించింది. గ్రామీణ విద్యార్థులు ప్రాథమిక విద్యకే దూరమయ్యే పరిస్థితి కల్పించింది. ఈ దశలో స్థానిక నేతల ప్రతిపాదనలతో ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు చొరవతో మండలానికి గుర్తింపు వచ్చే కేంద్రీయ విద్యాలయం మంజూరు అయింది. సాక్షి, పెళ్లకూరు: దశాబ్దాల తర్వాత పెళ్లకూరు మండలానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయం మండలంలో ఏర్పాటు చేయనుంది. 2020–21 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. విద్యాలయం ప్రారంభించేందుకు అధికారులు ఇప్పటికే గ్రామ సమీపంలో పది ఎకరాల స్థలాన్ని సేకరించారు. రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేసి కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి త్వరలో స్థలాన్ని అందజేసేలా చర్యలు చేపట్టారు. విద్యాలయం ప్రారంభించేందుకు అధికారులు ఇప్పటికే గ్రామ సమీపంలో పది ఎకరాలు స్థలాన్ని సేకరించారు. ప్రస్తుతానికి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనంతో పాటు అద్దె భవనాల్లో కేంద్రీయ విద్యాలయం నిర్వహించేలా అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. పాలచ్చూరులో విద్యాలయం ఏర్పాటు చేస్తే అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలతో పాటు స్థానిక విద్యార్థులు సీబీఎస్ఈలో ఉన్నత చదువులు చదువుకొనే అవకాశం కలుగుతుంది. ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుకొనే అవకాశం ఉన్న కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశం కోసం ప్రతి ఏటా మార్చి నెలలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా ఎస్సీ, ఎస్టీలకు 15 శాతం, దివ్యాంగులకు 3 శాతం చొప్పున సీట్లు కేటాయించనునన్నారు. దీని వల్ల పేద కుటుంబాలకు చెందిన పిల్లలు మంచి అవకాశం లభిస్తుంది. చదువుతో పాటు వ్యాయామం, క్రీడలు, యోగా తదితర అంశాల్లో ప్రత్యేక తర్ఫీదు ఉంటుంది. ప్రతి క్షణం విద్యార్థులపై ప్రత్యేక నిఘా ఉంచడం, క్రమశిక్షణతో కూడిన సీబీఎస్ఈ సిలబస్‌లో విద్యా బోధన ఉంటుంది. నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లో గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్లు, మోడల్ స్కూళ్లు ఉన్నాయి. కానీ పెళ్లకూరు మండలంలో మాత్రం ఇప్పటి వరకు అలాంటి అవకాశం లేదు. వైఎస్సార్ పాలనలో.. మండలంలో 24 పంచాయతీలు ఉండగా గతంలో 16 పంచాయతీలు చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజక వర్గంలో, 6 పంచాయతీలు సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో ఉండేవి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 24 పంచాయతీలను సూళ్లూరుపేట నియోజక వర్గంలో విలీనం చేశారు. అప్పటి నుంచి పెళ్లకూరు, చెంబేడు, శిరసనంబేడు, రోసనూరు గ్రామాల్లో సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేసి పేద పిల్లలు చదువుకొనే అవకాశం కలిగించారు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో సంక్షేమ వసతి గృహాలు పూర్తిగా తొలగించడం వల్ల మళ్లీ ఇక్కడి విద్యార్థులకు ఇక్కట్లు తప్పలేదు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ పాలనలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు చొరవతో పాలచ్చూరులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. టీడీపీ హయాంలో.. మండలంలో 51 ప్రాథమిక, 7 ప్రాథమికోన్నత, 7 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 1,816 మంది ప్రాథమిక విద్యార్థులు, 972 మంది ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులు మొత్తం 2,788 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 73 ఏళ్లు పూర్తయినా మండలంలో కనీసం ఒక్క ప్రభుత్వ కళాశాల గానీ, గురుకుల పాఠశాల గానీ, మోడల్ స్కూల్ గానీ లేకపోవడం గమనార్హం. దీనికి తోడు గత టీడీపీ పాలనలో మండలంలోని మూడు సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మూసివేసింది. ఆయా ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన పలువురు విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. మరి కొందరు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మండలంలో ఎక్కువ మంది వ్యవసాయ కూలీల కుటుంబాలు ఉండడం వల్ల అక్షరాస్యత లేని తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువుల చదివించకుండా అర్ధాంతరంగా ఆపేస్తున్నారు. దీంతో కొందరు విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొనే అవకాశం లేక నివాసాలకే పరిమితమవుతున్నారు. ఎంపీ దుర్గాప్రసాద్‌రావు చొరవతో మండలంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు చదువుకొనే అవకాశం లేక ఇబ్బందులు పడుతున్న ఇక్కడి పరిస్థితిని తెలుసుకున్న తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు చొరవ తీసుకుని కేంద్ర విద్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపారు. పాలచ్చూరులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్సీపీ నేతలు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, డాక్టర్ వెడిచర్ల ప్రద్యుమ్నకుమార్‌రెడ్డి తదితరులు ఇక్కడి ఉన్నత విద్యపై నెలకొన్న సమస్యపై ఎంపీతో మాట్లాడారు. ఎంపీ చొరవతో పాలచ్చూరులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేలా కసరత్తు మొదలు పెట్టారు. పాలచ్చూరు పంచాయతీ పరిధిలోని జంగాలపల్లి కూడలి వద్ద ఇప్పటికే 10 ఎకరాల భూములను సేకరించి కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి ప్రాథమిక దశ పనులు చేపట్టేలా పాలకులు పనులు మొదలు పెట్టారు. -
ఒంగోలులో రెండో కేంద్రీయ విద్యాలయం!
ఒంగోలు వన్‌టౌన్ : కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలను ఒంగోలులో నెలకొల్పడంపై ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు ైవె వీ సుబ్బారెడ్డి దృష్టి సారించారు. ఒంగోలుకు రెండో కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయించేందుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. రెండో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు జిల్లా కలెక్టర్‌తో చర్చించి ఒక కొలిక్కి తెచ్చారు. కేంద్రీయ విద్యాలయ సమితి(కేవీఎస్) ఆధ్వర్యంలో ఇప్పటికే ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో కేంద్రీయ విద్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఒంగోలులో కేంద్రీయ విద్యాలయం సీట్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఒంగోలులో రెండో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు ప్రిన్సిపాల్ చెల్లి ప్రసాదరావు ప్రతిపాదించారు. వాటి ఆధారంగా ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రెండో కేంద్రీయ విద్యాలయంను మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నారు. కలెక్టర్‌తో మాట్లాడి విద్యాలయ నిర్వహణకు అవసరమైన 20 గదులను ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయం(ఓల్డ్ రిమ్స్)లో కేటాయింపజేశారు. రెండో కేంద్రీయ విద్యాలయం మంజూరు చేస్తే కొత్త భవనాల నిర్మాణం కోసం స్థానిక మంగమూరు రోడ్డులోని ఆశ్రమం సమీపంలో 4.38 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయింపజేశారు. ఈ మేరకు అన్ని వివరాలతో రెండో కేంద్రీయ విద్యాలయం మంజూరుకు జిల్లా కలెక్టర్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ ద్వారా ప్రతిపాదనలు పంపారు. వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో కేవీఎస్ కార్యదర్శి, కమిషనర్‌ను కలిసి ఒంగోలుకు రెండో కేంద్రీయ విద్యాలయం అవసరాన్ని వివరించారు. ఒంగోలులో ప్రస్తుతం నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయానికి స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 5 ఎకరాల స్థలం కేటాయించారు. ఈ స్థలంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో నూతన భవనాల నిర్మాణం చేపట్టారు. ఈ పాఠశాలలకు అనుబంధంగా విద్యార్థులకు హాస్టల్ మంజూరు చేయించేందుకు ఎంపీ ప్రయత్నిస్తున్నారు. కాగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మార్కాపురం, గిద్దలూరులో కూడా కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించాలని ఆయా ప్రాంతాల వాసులు డిమాండ్ చేస్తున్నారు.