Indian president
-
టీచరమ్మగా రాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము టీచర్‌గా మారారు. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లయిన సందర్భంగా గురువారం ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. భూతాపం పర్యవసానాలు, తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు. ప్రెసిడెంట్ ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయలో 9వ తరగతి చదువుకునే 53 మంది విద్యార్థులతో ఆమె సంభాషించారు. మొక్కల పెంపకం, వాననీటి సంరక్షణ అవసరాన్ని తెలియజెప్పారు. ముఖాముఖి సందర్భంగా వారి ఆకాంక్షలు, లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. చదువుకుని వైద్యులు, శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఉందంటూ వారు చెప్పిన లక్ష్యాలను విని సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా నేడు శాస్త్రవేత్తలు, పాలనాధికారులు, పాలకులు సభలు, చర్చాగోషు్టలు, సమావేశాలు చేపట్టి ఓ పెద్ద సమస్యపై చర్చలు జరుపుతున్నారు. అదేమిటో మీకు తెలుసా?’అని వారినడిగారు. వాతావరణ మార్పులు, భూతాపం, పర్యావరణ కాలుష్యం..అంటూ విద్యార్థులు బదులిచ్చారు. రాష్ట్రపతి ముర్ము బదులిస్తూ..‘ఇది వరకు ఏడాదిలో ఆరు రుతువులుండేవి కానీ, నేడు నాలుగే ఉన్నాయి. వీటిలో అత్యధిక కాలం కొనసాగుతూ మనల్ని ఇబ్బంది పెట్టే రుతువు ఎండాకాలం. రోజురోజుకూ ఎండలు మండిపోతుండటంతో మనుషులే కాదు, జంతువులు, మొక్కలు, పక్షులూ ఇబ్బంది పడుతున్నాయి. కరువులు కూడా ఏర్పడుతున్నాయి. భూతాపమే వీటికి కారణం’అని ఆమె వివరించారు. ‘భూతాపాన్ని ఎదుర్కోవాలంటే నీటిని పొదుపుగా వాడాలి. వర్షం నీటిని సంరక్షించాలి. చెట్లను విరివిగా పెంచాలి’అని వారికి సూచించారు. -
G20 Summit: 78 భిన్న వాయిద్యాలతో సంగీత సౌరభం!
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం విచ్చేసిన ప్రపంచ నేతలకు వీనుల విందైన సంగీతం వినిపించేందుకు వాయిద్యకారులు సిద్ధమయ్యారు. భారతీయ సంగీత వారసత్వ సంపద ఎంతటి గొప్పదో ప్రత్యక్షంగా చూపేందుకు సమాయత్తమయ్యారు. శాస్త్రీయ సంగీతంతోపాటు సమకాలీన సంగీతంలో వినియోగించే భిన్న వాద్య పరికరాలతో సంగీత విభావరి అతిథులను ఆకట్టుకోనుంది. గాంధర్వ ఆతిథ్యం బృందం ‘భారత వాద్య దర్శనం’ పేరిట గొప్ప ప్రదర్శన ఇవ్వనుంది. జీ20 దేశాధినేతలకు సెప్టెంబర్ తొమ్మిదో తేదీన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చే విందులో ఈ సంగీత కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సంతూర్, సారంగీ, జల్ తరంగ్, షెహనాయ్ ఇలా దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల్లో ప్రఖ్యాతిగాంచిన మొత్తం 78 రకాల వాద్య పరికరాల నుంచి ఉద్భవించే అద్భుతమైన సంగీతం ఆహుతులను అలరించనుంది. ‘సంగీత మార్గంలో భారత్ సాగించిన సామరస్య ప్రయాణం తాలూకు అపురూప జ్ఞాపకాలను ఇప్పుడు మరోసారి గుర్తుచేస్తాం’ అని ఆహా్వన ప్రతి సంబంధ బ్రోచర్ కాన్సెప్ట్ నోట్లో పేర్కొన్నారు. ఈ ప్రదర్శన విలాంబిత్ లయతో మొదలై మధ్య లయలో కొనసాగి ధృత లయతో ముగుస్తుంది. ఈ వాయిద్య పరికరాల సమ్మేళనంలో 34 హిందుస్తానీ సంగీతం తాలూకు వాద్య పరికరాలు, 18 కర్ణాటక సంగీత సంబంధ పరికరాలు, 26 జానపద సంబంధ పరికరాలు వినియోగిస్తున్నారు. 11 మంది చిన్నారులు, 13 మంది మహిళలు, ఆరుగురు దివ్యాంగులు, 26 మంది యువకులు, 22 మంది నిష్ణాతులుసహా 78 మంది కళాకారులు ఈ వాద్య పరికరాలను వాయిస్తారు. తమ ప్రాంత విశిష్ట వారసత్వ సంగీత సంపదను ఘనంగా చాటుతూ భిన్న ప్రాంతాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయక వేషధారణలో వేదకాలంనాటి పరికరాలు, గిరిజనుల, జానపదుల పరికరాలతోపాటు లలిత సంగీతం తాలూకు పరికరాలు వాయిస్తారు. -
అధికారంలో ఔన్నత్యం చాటుకోవాలి
షెడ్యూల్డ్ ఏరియాల్లో జరుగుతున్న సంక్షేమ విధానాలకు సంబంధించి రాష్ట్రపతి ఎప్పుడు అడిగినా, ఆయా రాష్ట్రాల గవర్నర్లు వెంటనే నివేదికలు అంద జేయాల్సి ఉంటుంది. అంటే ఆదివాసీలు నివసించే ప్రాంతాలలో జరుగుతున్న ఎటువంటి కార్యక్రమాలనైనా రాష్ట్రపతి పర్యవేక్షించవచ్చు. రోజురోజుకీ పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ఆదివాసీలను కుంగుబాటుకు గురిచేస్తున్నాయి. అందుకే ఒక ఆదివాసీ బిడ్డగా, ఒక నాయకురాలిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారాలను సంపూర్ణంగా వినియోగిస్తే ఆదివాసుల జీవితాల్లో కొంతైన వెలుగు రాకపోతుందా అన్న ఆశ ఆదివాసీలు, ప్రగతిశీల వాదుల్లో ఉంది. అలా జరిగితే ఓ మూలవాసీ మహిళ రాష్ట్రపతిగా ఎంపికవడమనే విషయానికి ఓ ఔన్నత్యాన్ని తీసుకొస్తుంది. ‘ఈ ఆర్టికల్ రాజ్యాంగంలోని అన్నింటి కన్నా ముఖ్యమైనది. అణగారిన వర్గాలకు సంబంధించి మనం కేవలం రిజర్వేషన్ల వరకే పరిమితమయ్యాం. కానీ అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను పరిష్క రించడానికి ఈ ఆర్టికల్ అవకాశం ఇస్తుంది. దీనిని సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్రపతికి శక్తి మంతమైన అధికారాలిచ్చే విధంగా ఈ ఆర్టికల్‌ను పొందుపరచాలి’’ అంటూ రాజ్యాంగ సభ సభ్యుడు పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ చేసిన వ్యాఖ్యలివి. భారత రాజ్యాంగ సభలో జూన్ 16, 1949న బాబాసాహెబ్ అంబేడ్కర్ ముసాయిదా రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా పండిట్ భార్గవ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాజ్యాంగ ముసాయిదాలో 301 నంబర్‌తో ఉన్న ఆర్టికల్ రాజ్యాంగ సభ ఆమోదం పొందిన రాజ్యాంగంలో 340గా పొందు పరి చారు. ‘‘భారత దేశంలో ఉన్న వెనుకబడిన తరగతులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక విద్యా విషయాలను పరిశోధించడానికి, పరిశీ లించడానికి రాష్ట్రపతి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయవచ్చును.’’ ఇది ఆర్టికల్ 340 సారం. అయితే ఇప్పటి వరకూ రాష్ట్రపతి పదవిని పొందిన చాలామంది ఇటువంటి ప్రయత్నాలు చేయలేదు. పదవ రాష్ట్రపతిగా పనిచేసిన డా.కె.ఆర్.నారాయణన్ మినహాయింపు. 2000 జూలై 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగిన గవర్నర్ల సదస్సులో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రత్యేకించి బడ్జెట్ కేటాయింపులు, విని యోగం, దారిమళ్ళింపు సమస్యలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచా రాల నిరోధక చట్టం అమలును గురించి అధ్యయనం చేయడానికి ఏడుగురు గవర్నర్లతో ఒక కమిటీని నియమించారు. అప్పటి మహా రాష్ట్ర గవర్నర్ పి.సి. అలెగ్జాండర్ అధ్యక్షతన, మేఘాలయ గవర్నర్ ఎం.ఎం. జాకబ్, కేరళ గవర్నర్ ఎస్.ఎస్. కాంగ్, కర్ణాటక గవర్నర్ వీఎస్ రమాదేవి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ సూరజ్ భాను, ఒడిషా గవర్నర్ ఎం.ఎం. రాజేంద్రన్, హరియాణా గవర్నర్ బాబు పరమా నంద్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 2000 ఆగస్టు 8న ఏర్పడిన కమిటీ, 2001 ఏప్రిల్ 28న తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. ఈ నివేదికలో భూ పంపిణీ, విద్య, గృహ వసతి, ప్రజారోగ్యం, వృత్తి, వ్యాపార అభివృద్ధి పథ కాలు, వీటన్నింటితో పాటు ఈశాన్య రాష్ట్రాల ప్రగతిపైనా ఎన్నో సిఫారసులు చేసింది. నిజానికి స్వాతంత్య్రానంతరం ఎస్సీ, ఎస్టీల సమస్యలపై అత్యున్నతమైన స్థానంలో ఉన్న గవర్నర్లు అన్ని రాష్ట్రాలు తిరిగి, సంబంధిత మంత్రులు, అధికారులు, సామాజిక వర్గాల సంస్థలు, సంఘాలతో సమావేశం కావడం విశేషం. అయితే అప్పటి ఎన్డీయే ప్రభుత్వం ఈ నివేదికను పట్టించుకోలేదు. కానీ ఈ కమిటీ ప్రయత్నం ఊరికేపోలేదు. ఎస్సీ, ఎస్టీల సమస్య పరిష్కారం కోసం పనిచేసే సంస్థలకు ఒక ఆయుధమై నిలిచింది. ఎన్నో రాష్ట్ర ప్రభు త్వాలు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్నాయి. ఈ విషయాలను ప్రస్తావించడానికి ఇప్పుడొక సందర్భం వచ్చింది. 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు కావస్తోంది. దక్షిణ భారతదేశ విడిది హైదరాబాద్‌లో ప్రస్తుతం రాష్ట్రపతి మొదటిసారి ఉంటున్నారు. రాష్ట్రపతికి ప్రభుత్వా లను కాదని, మార్పులు చేయగలిగే అధికారం లేకపోయి ఉండవచ్చు. కానీ 339, 340 ఆర్టికల్స్ ప్రకారం, అదేవిధంగా 5వ షెడ్యూల్లో షెడ్యూల్ తెగల కమిటీల రక్షణ విషయంలో రాష్ట్రపతి అధికారాలను, చొరవను రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. రాజ్యాంగ పరిధిలో, అది అందించిన అధికారాలను ఉపయోగించి ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం రాష్ట్రపతికి ఉంటుంది. దేశంలోని ఒక ప్రధాన ఆదివాసీ తెగౖయెన సంథాల్ సమూహానికి చెందిన మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ విషయంలో నారాయణన్ చూపిన చొరవను చూపాలనే ఆకాంక్షతోనే వీటన్నింటినీ ప్రస్తావిం చాల్సి వస్తోంది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 339 ప్రకారం, క్లాజు ఒకటి చెపుతున్న ఒక చట్టబద్ధమైన కమిషన్ ఇప్పటికే అమలులో ఉంది. ఆర్టికల్ 339 క్లాజు–2 కూడా రాష్ట్రపతికి ఎస్టీల సంక్షేమ కార్య క్రమాల రూపకల్పన, సమీక్ష విషయాలలో అధికారాలను ఇచ్చింది. ‘‘రాష్ట్రాల్లో ఎస్టీ సంక్షేమ కార్యక్రమాలను రూపొందిస్తున్న తీరును పరిశీలించి, వారికి తగు నిర్దేశకత్వం ఇవ్వవచ్చు’’ అనే క్లాజు ఒక ముఖ్యమైన అంశం. అదేవిధంగా 5వ షెడ్యూల్ కేవలం ఆదివాసీల రక్షణకు ఉద్దే శించిన హక్కుల పత్రం. ఐదవ షెడ్యూల్లో పేర్కొన్న హక్కుల రక్షణలో రాష్ట్రపతి పర్యవేక్షణ ప్రధానమైనది. ఐదవ షెడ్యూల్ పార్ట్ (ఎ)లో పేర్కొన్న మూడవ అంశం గురించి ప్రస్తావించుకుందాం. ఆదివాసీలు నివసించే ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాగా గుర్తించాలి. అక్కడ అమలు జరుగుతున్న సంక్షేమ విధానాలకు సంబంధించి ప్రతి సంవత్సరం లేదా రాష్ట్రపతి ఎప్పుడు అడిగినా, దేన్ని గురించి అడిగినా ఆయా రాష్ట్రాల గవర్నర్లు వెంటనే నివేదికలు అందజేయాలని నిర్దేశించారు. అంటే ఆదివాసీలు నివసించే ప్రాంతాలలో జరుగుతున్న ఎటువంటి కార్యక్రమాలనైనా రాష్ట్రపతి పర్యవేక్షించవచ్చు. తగు సూచ నలు, సలహాలు చేయవచ్చు. అదేవిధంగా పార్ట్(బి)లో 4వ అంశం ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్(టీఏసీ)కు విస్తృతమైన అధికారాలున్నాయి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా లన్నా, ఆదివాసీలకు సంబంధించి ఎటువంటి చట్టాలు చేయాలన్నా, ఆ ప్రాంతాల్లో ఏదైనా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలన్నా, ట్రైబల్ అడ్వై జరీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పా టుకు సంబంధించి కూడా నిర్దిష్టమైన విధానాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. టీఏసీలో 20 మంది సభ్యులకు మించి ఉండ కూడదనీ, వీరిలో 3/4వ వంతు ఆ రాష్ట్ర ఎస్టీ ఎమ్మెల్యేలు ఉండాలనీ నిబంధన కూడా ఉంది. ఆదివాసుల హక్కుల కోసం అన్ని రకాల చట్టాల అమలును పర్యవేక్షించడం, రాజ్యాంగ హక్కులను కాపాడడం టీఏసీ బాధ్యత. అయితే ప్రస్తుతం చాలా రాష్ట్రాలలో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అస్తిత్వం నామమాత్రంగానే మిగిలిపోవడవం బాధాకరం. చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ సలహా మండలిని పట్టించుకున్న పాపానపోలేదు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న ఆర్థిక, సామాజిక స్థితిగతులు, ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు ఆదివాసీ ప్రాంతాల్లో చేపడుతున్న ప్రాజెక్టుల తీరుచూస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సలహా మండళ్లను సంప్రదిస్తున్న దాఖలాలే లేవు. ఇటువంటి సందర్భంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాత్ర కీలకమౌతోంది. ఒక మహిళగా, ఆదివాసీ బిడ్డగా, అడవిబిడ్డల పేగు తెంచుకొని పుట్టిన ఒక నాయకురాలిగా రాజ్యాంగంలో పొందుపరిచిన రాజ్యాంగ అధికారాలను సంపూర్ణంగా వినియోగిస్తే ఆదివాసుల జీవితాల్లో కొంతైన వెలుగు రాకపోతుందా అన్న ఆశ ఆదివాసీలు, ప్రగతిశీల వాదుల్లో ఉంది. రోజు రోజుకీ పెరుగుతున్న ఆర్థిక అసమా నతలు, సామాజిక వ్యత్యాసాలు ఆదివాసీలను మరింత వెనుకబాటు తనానికి గురిచేస్తున్నాయి. ఆదివాసీల స్థితి గతులపై ఒక అధ్యయనం జరిపి, వారి సమస్యలకు ఒక సమగ్ర పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తే, ద్రౌపది ముర్ములాంటి ఓ మూలవాసీ మహిళ రాష్ట్రపతిగా ఎంపికవడమనే విషయానికి ఓ ఔన్నత్యాన్ని తీసుకొస్తుంది. అణచి వేతకు గురౌతున్న ఆయా వర్గాల ప్రాతినిధ్యం అక్షరాలా సరైనదని రుజువవుతుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 81063 22077 -
రాష్ట్రపతి పై బెంగాల్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ నేతలు ఫైర్
-
భారత రాష్ట్రపతి స్వాగతం కోసం స్వయంగా బ్రిటన్ రాణి
క్వీన్ ఎలిజబెత్-2 జీవితం.. బ్రిటన్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం గుర్తుంచుకోదగిన ఒక అధ్యాయం. సుదీర్ఘకాలంగా ఒక రాజ్యాన్ని పాలించిన సామ్రాజ్ఞిగా ఆమె తనకంటూ ఓ చెరగని ముద్రవేసుకుని వెళ్లిపోయారు. అంతేకాదు.. తన హయాంలో పలు దేశాలపై ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచారామె. అందులో భారత్ కూడా ఉండగా.. ఆ ఆదరాభిమానాలకు అద్దం పట్టిన ఘటనే ఇది.. క్వీన్ ఎలిజబెత్-2 ప్రయాణంలో భారత ఆధ్యాయం కూడా ఎంతో ప్రత్యేకమైనదే. ఆమె భారత్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ఒకప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ లండన్ పర్యటన సందర్భంగా స్వయంగా ఆమె కదిలివచ్చి స్వాగతం పలికారు. 1962 నుంచి 1967 వరకు భారత రాష్ట్రపతిగా సేవలందించిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్.. 1963లో బ్రిటన్‌లో పర్యటించారు. ఉపాధ్యాయుడిగా, విద్యావేత్తగా, సంస్కరణల వాదిగా ఎంతో పేరున్న డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు మునుపెన్నడూ లేనంతగా బ్రిటన్‌లో రాయల్ స్వాగతం లభించింది. క్వీన్ ఎలిజబెత్-2 స్వయంగా విక్టోరియా రైల్వే స్టేషన్‌కు వచ్చి సర్వేపల్లికి స్వాగతం పలికింది. తనతో పాటు ప్రిన్సెస్ మెరీనా, ప్రిన్సెస్ మార్గరేట్‌ను కూడా స్టేషన్‌కు తోడ్కోని వచ్చింది. ప్రిన్సెస్ మెరీనా, ప్రిన్సెస్ మార్గరేట్లను పరిచయం చేసిన రాణి(photo credit : BFI) రాజకుటుంబ ప్రముఖులతో పాటు, దేశంలోని అత్యున్నత సైన్యాధికారులు వెంట రాగా సర్వేపల్లిని జాతీయ గీతం జనగణమన ఆలాపనతో రాజమర్యాదలు చేసి తన వెంట తీసుకెళ్లారు రాణి. సర్వేపల్లి రాధాకృష్ణన్ మొత్తం 11 రోజుల పాటు బ్రిటన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించారు. బ్రిటన్ సాధనసంపత్తికి అద్దం పట్టే పరిశ్రమలు, భవనాలు, వంతెనలతో పాటు పర్యాటక ప్రాంతాల్లో సర్వేపల్లి పర్యటించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ నాటి బ్రిటన్ సాంప్రదాయ గుర్రపు పందాలను చూడడానికి వచ్చినప్పుడు రాణి ఎలిజబెత్ స్వయంగా వెంట వచ్చారు. నాటి రాష్ట్రపతి సర్వేపల్లికి రాణి ఎలిజబెత్ ఆహ్వానం(photo credit : BFI) నాటి వీడియోలో ఎలిజబెత్ ఎంతో హుందాగా, మరెంతో అందంగా కనిపించారు. వీడియోలో మూడు వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు బ్రిటీష్ వస్త్రధారణలో రాణి కనిపించగా, చాలా మంది భారతీయ మహిళలు ఆనాటి సంప్రదాయ చీరలో కనిపించారు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఎలిజబెత్ కన్నుమూసిన సందర్భంగా బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వీడియో నాటి చరిత్రను కళ్ల ముందుంచింది. కర్టెసీ : BFI (బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నేషనల్ ఆర్కైవ్ నుంచి సేకరించిన వీడియో ఆధారంగా) -
బీజేపీలోకి సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు
బెంగళూరు : భారతదేశ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధకృష్ణన్ మనవడు సుబ్రమణ్యం శర్మ(44) నేడు బీజేపీలో చేరనున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యురప్ప సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న అసమానతలను తొలగించే ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు సుబ్రమణ్యం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ‘సమాజంలో పేద, ధనిక వర్గాల మధ్య అంతారాలు విపరీతంగా పెరిగిపోయాయి. వ్యవస్థలో ఉన్న వ్యక్తుల్లో ఎవరో ఒకరు దీన్ని తొలగించడానికి పూనుకోవాలి. ఈ అసమానతలను తొలగించడమే ధ్యేయంగా నేను రాజకీయాల్లోకి వచ్చాన’ని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహిళా ఎంపవర్మెంట్ పార్’టీ తరఫున మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి సుబ్రమణ్యం పోటీ చేశారు. -
నవభారతంలో పేదరికానికి తావు లేదు
-
టర్కీ అధ్యక్షుడికి ఘనస్వాగతం
న్యూఢిల్లీ: టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌కు రాష్ట్రపతి భవన్లో సోమవారం ఉదయం ఘనస్వాగతం లభించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు స్వాగతం పలికారు. ఏప్రిల్ 16న రిఫరెండం తర్వాత అధ్యక్షుడిగా తనకు మరిన్ని అధికారాలు సంక్రమించిన నేపథ్యంలో ఆయన రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోడీతో కలిసి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. టెర్రరిజం అంశం ఇరువర్గాల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇరువురూ ఇండియా-టర్కీ వాణిజ్యం, ఇతర పలు అంశాలపై ఒప్పందాలు చేసుకోనున్నారు. ఎర్డోగన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 2008లో భారత దేశం వచ్చారు. 2013లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ టర్కీ సందర్శించగా 2015లో అంట్యాలలో జరిగిన జి-20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ, ఎర్డోగన్‌ను కలిశారు. -
రాష్ట్రపతి రేసులో సుష్మ, జోషి?
-
రాష్ట్రపతి రేసులో సుష్మ, జోషి?
- సుమిత్రా మహాజన్, ఝార్ఖండ్ గవర్నర్ ద్రౌపది పేర్లు కూడా పరిశీలనలో - అద్వానీకి అందని ద్రాక్షే.. ఎన్నికల ఫలితాల తర్వాతే స్పష్టత న్యూఢిల్లీ: ప్రణబ్‌ముఖర్జీ తర్వాత రాష్ట్రపతి పదవి... ఎవరిని వరించనున్నదనే అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ పదవికి సంబంధించి ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి కాగా మరొకరు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్. మహిళా అభ్యర్థులకు సంబంధించి మరికొంతమంది పేర్లుకూడా వినవస్తున్నాయి. వారిలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఝార్ఖండ్ గవర్నర్ ద్రౌపది మర్ములు కూడా ఉన్నారు. జూలైలో ఖాళీ అయ్యే ఈ పదవి కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒకనాడు గట్టి మద్దతుదారుడిగా నిలబడిన బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ పేరు మాత్రం పరిశీలనలో కూడా లేదు. ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చాక మాత్రమే ఇందుకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. పదేళ్ల వయసులో ఉండగా అంటే 1944లో మనోహర్ జోషి ఆర్ఎస్ఎస్లో అడుగుపెట్టారు. 1991లో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ప్రధానమంత్రి అటల్‌బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో 1996, 1998, 1999లలో ఏర్పడిన ప్రభుత్వాల్లో ఆయన పనిచేశారు. తన సుదీర్ఘ రాజకీయ యాత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ ఆయన ఏక్తా యాత్రను నిర్వహించారు. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ చేరుకున్న అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయోధ్య ఉద్యమం సమయంలో జోషి...కీలకపాత్ర పోషించారు. 1992, డిసెంబర్లో బాబ్రీ మసీదు ధ్వంసం కాగా ఈ కేసుకు సంబంధించి ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. 1975, జూన్‌లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించి అనేకమందిని కారాగారం పాలుచేశారు. అందులో జోషి కూడా ఉన్నారు. ఆయన 19 నెలలపాటు శిక్ష అనుభవించారు. ఇదిలాఉంచితే ఈ పదవి రేసులో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మోదీ కేబినెట్లో మంచి మంత్రిగా పేరు తెచ్చుకోవడమే ఇందుకు కారణం. దీంతో మహిళా వ్యతిరేకి అనే భావన ఆర్ఎస్ఎస్ కేడర్‌లో ఉన్నా మంచి మంత్రి అనే పేరు రావడం ఆమెకు సానుకూల వాతావరణం నెలకొనేందుకు దోహదం చేసింది. సొంత పార్టీతోపాటు ఇతర పార్టీ నాయకులతో ఆమెకు సత్సంబంధాలున్నాయి. ఇది ఆమెను రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టేందుకు ఓ వరంగా మారే అవకాశం కూడా లేకపోలేదు. అదే సమయంలో ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇది ఆమెకు ఓ రకంగా ఇబ్బందికరమైన పరిస్థితే. అయితే ఈ కారణంగానే ఆమెకు ఈ పదవి లభించొచ్చనేది కొంతమంది వాదన. -
దాద్రి ఘటనపై స్పందించిన ప్రణబ్
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో చోటు చేసుకున్న సంఘటనపై భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందించారు. మూల విలువలు ఉన్న సమాజంలో ఇలాంటి సంఘటనలకు చోటు లేదన్నారు.సహనంతో ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. బుధవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ సభలో రాష్ట్రపతి ప్రణబ్ మాట్లాడుతూ... పురాతన నాగరికతల్లో శతృత్వ ధోరణిలు ప్రబలి అంతరించినా.. విలువలు మాత్రం ఇంకా నిలిచే ఉన్నాయని అందుకు కారణం మూల విలువలేనని ఆయన స్పష్టం చేశారు. వాటిని మదిలో భద్రపరుచుకుని ప్రజాస్వామ్య దేశంలో మసులు కోవాలని సూచించారు. దాద్రి సంఘటన నేపథ్యంలో ఈ అంశంపై దాదాపు 15 నిమిషాల పాటు ప్రణబ్ అనర్గళంగా ప్రసంగించారు. దాద్రి సమీపంలోని బిసడ గ్రామంలో గోవధ వదంతుల నేపథ్యంలో గత సోమవారం రాత్రి సుమారు వంద మంది స్థానికులు ఓ ముస్లిం కుటుంబంపై దాడి చేశారు. మహ్మద్ అక్లాఖ్ (50) ను రాళ్లతో కొట్టి హత్యచేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడి కుమారుడు డానిష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి యూపీ పోలీసులు పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. -
మోదీ రాష్ట్రపతి అయ్యారా..?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రపతి అయ్యారా..? మనకైతే ఈ విషయం తెలియదు గానీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు మాత్రం తెలిసిపోయినట్లుంది. అందుకే ఆయన మోదీని 'ప్రెసిడెంట్ మోదీ' అన్నారు. సోమవారం నాడు తమ సమావేశం ముగిసిన తర్వాత ఓ ప్రకటన చేసే సందర్భంలో ఒబామా పొరపాటున ఈ మాట అనేశారు. వైట్ హౌస్ వెబ్సైట్ పోస్ట్ చేసిన వీడియోలో కూడా ఈ మాట ఉంది. ''ప్రెసిడెంట్ మోదీకి స్వచ్ఛ ఇంధనం విషయంలో ఉన్న నిబద్ధత మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోంది'' అని ఒబామా చెప్పారు. ఈ విషయం ఒక్కసారిగా మీడియాలో గుప్పుమంది. దాంతో ఆ తర్వాత వైట్‌హౌస్ సిబ్బంది నాలుక కరుచుకుని, దాని రాతప్రతిని విడుదల చేస్తూ.. అందులో 'ప్రెసిడెంట్' అనే పదాన్ని 'ప్రధానమంత్రి'గా మార్చారు. -
భూటాన్ బయలుదేరిన ప్రణబ్
న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం భూటాన్ బయలుదేరి వెళ్లారు. పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రణబ్‌కు వీడ్కోలు పలికారు. రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా, బీజేపీ సీనియర్ నాయకుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీతోపాటు నలుగురు ఎంపీలు ప్రణబ్ వెంట భూటాన్ పయనమైనవారిలో ఉన్నారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గ్యెల్ వాంగ్‌చుక్ ఆహ్వానంపై ప్రణబ్ ఆ దేశం వెళ్లారు. దాదాపు 26 ఏళ్లలో తొలిసారిగా ప్రణబ్ భూటన్లో పర్యటిస్తున్నారు. భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ మొట్టమొదటిగా భూటన్లో పర్యటించిన సంగతి తెలిసిందే.