మోదీ రాష్ట్రపతి అయ్యారా..? | President Modi? Obama's slip of tongue | Sakshi
Sakshi News home page

మోదీ రాష్ట్రపతి అయ్యారా..?

Published Tue, Sep 29 2015 10:09 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మోదీ రాష్ట్రపతి అయ్యారా..? - Sakshi

మోదీ రాష్ట్రపతి అయ్యారా..?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రపతి అయ్యారా..? మనకైతే ఈ విషయం తెలియదు గానీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు మాత్రం తెలిసిపోయినట్లుంది. అందుకే ఆయన మోదీని 'ప్రెసిడెంట్ మోదీ' అన్నారు. సోమవారం నాడు తమ సమావేశం ముగిసిన తర్వాత ఓ ప్రకటన చేసే సందర్భంలో ఒబామా పొరపాటున ఈ మాట అనేశారు. వైట్ హౌస్ వెబ్సైట్ పోస్ట్ చేసిన వీడియోలో కూడా ఈ మాట ఉంది.

''ప్రెసిడెంట్ మోదీకి స్వచ్ఛ ఇంధనం విషయంలో ఉన్న నిబద్ధత మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోంది'' అని ఒబామా చెప్పారు. ఈ విషయం ఒక్కసారిగా మీడియాలో గుప్పుమంది. దాంతో ఆ తర్వాత వైట్హౌస్ సిబ్బంది నాలుక కరుచుకుని, దాని రాతప్రతిని విడుదల చేస్తూ.. అందులో 'ప్రెసిడెంట్' అనే పదాన్ని 'ప్రధానమంత్రి'గా మార్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement