slip of tongue
-
Lok Sabha Election 2024: నోరుజారె... పరువు పోయె..!
అసలే ఇది ఎన్నికల సీజన్. ప్రచారం దుమ్మురేగుతోంది. మైకు దొరికితే చాలు.. నేతల హామీలకు, విమర్శల ధాటికి అడ్డూఅదుపూ ఉండటం లేదు. ఆ క్రమంలో కొన్నిసార్లు తాము ఏ పారీ్టలో ఉన్నాం, ఎవరి తరఫున ప్రచారం చేస్తున్నామన్న స్పృహ లేకుండా నేతలు నోరు జారుతున్నారు. సొంత పార్టీ అభ్యరి్థనే చిత్తుచిత్తుగా ఓడించండనీ, ప్రత్యర్థి పారీ్టకి ఓటేయాలనీ పిలుపిస్తున్నారు! జరగాల్సిన నష్టం జరిగాక తీరిగ్గా నాలుక్కరుచుకుంటున్నారు. ఇలా టంగ్ స్లిప్పవుతున్న వారిలో కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టినవారే గాక కాకలుతీరిన నేతలు కూడా ఉండటం విశేషం. కుడిఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నారు గానీ, రాజకీయాల్లో మాత్రం నోరుజారితే నవ్వులపాలే...!! అధిర్.. అయ్యో రామా! బీజేపీకి ఓటేయడం మేలన్న కాంగ్రెస్ దిగ్గజం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే పశి్చమ బెంగాల్ కాంగ్రెస్ దిగ్గజం అధిర్ రంజన్ చౌదరి ఇటీవల ఎన్నికల ర్యాలీలో మళ్లీ నోరుజారారు. ‘బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు ఓటేసే కంటే బీజేపీకి వేయడం నయం’ అన్నారు! జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థి అయిన పారీ్టకి ఓటేయాలని పిలుపివ్వడం పట్ల సొంత నేతలే తీవ్రంగా మండిపడ్డారు. దాంతో తానలా అన్లేదంటూ అ«ధిర్ మాట మార్చారు. కానీ అధికార తృణమూల్ దీన్ని మంచి అస్త్రంగా అందిపుచ్చుకుంది. బెంగాల్లో అ«ధిర్ బీజేపీకి తొత్తుగా పనిచేస్తున్నారంటూ చెలరేగిపోయింది.లాలు కూతుర్ని ఓడించండి! సొంత పార్టీ ఎమ్మెల్సీ పిలుపు బిహార్ రాజకీయ దిగ్గజం లాలు ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య సరన్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమెను గెలిపించుకునేందుకు అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా లాలు స్వయంగా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా కూతురితో పాటు పాల్గొన్న తొలి సభలోనే హంసపాదు ఎదురైంది! సొంత పార్టీ ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ మాట్లాడుతూ ‘‘ఓటర్లు, పార్టీ కార్యకర్తలందరినీ ఒకటే కోరుతున్నా. రోహిణీ ఆచార్యను భారీ మెజారిటీతో ఓడించండి’ అంటూ పిలుపునిచ్చారు. దాంతో లాలుతో పాటు వేదికపై ఉన్న ఆర్జేడీ నేతలంతా అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న సునీల్ క్షమించాలంటూ వేడుకున్నారు.కంగనా... కన్ఫ్యూజన్! గురి తప్పిన ‘నాన్ వెజ్’ విసుర్లు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బీజేపీలో చేరి హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తుండటం తెలిసిందే. స్టార్ క్యాంపెయినర్ అయిన ఆమె బిహార్ ఎన్నికల ర్యాలీలో ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్‌కు బదులు పొరపాటున బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యను విమర్శించి నవ్వులపాలయ్యారు. ‘‘దారి తప్పిన యువరాజులున్న పారీ్టలకు మన దేశంలో కొదవ లేదు. చంద్రుడిపై బంగాళదుంపలు పండించాలకునే రాహుల్ గాంధీ కావచ్చు. నవరాత్రుల సందర్భంగా కూడా చేపలు తినే తేజస్వి సూర్య కావచ్చు. అంతా అదే బాపతు’ అంటూ కంగన విరుచుకుపడ్డారు. దాంతో భారీగా ట్రోలింగ్‌కు గురయ్యారు. తేజస్వీ యాదవ్ కూడా, ‘ఇంతకీ ఎవరీ అమ్మగారు?!’ అంటూ ఎద్దేవా చేశారు. దేశ తొలి ప్రధాని సుభాష్ చంద్ర బోస్ అన్న కంగనా వ్యాఖ్యల పైనా విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. శివపాల్.. శివ శివా! బీజేపీని గెలిపించాలన్న సమాజ్‌వాదీ నేత అది ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి ఒకప్పుడు గట్టి పట్టున్న ఇటావా లోక్‌సభ స్థానం. జస్వంత్ నగర్లో ఎన్నికల ప్రచార సభ. జనం భారీగా హాజరయ్యారు. పార్టీ చీఫ్ అఖిలేశ్ బాబాయి, సమాజ్‌వాదీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివపాల్ యాదవ్ మాట్లాడుతున్నారు. వేదికపై ఉన్న అఖిలేశ్, ఇటావా ఎస్పీ అభ్యర్థి జితేంద్ర దోహారే తదితరులు ఆసక్తిగా వింటున్నారు. ఇంతలో శివపాల్ ఉన్నట్టుండి, ‘అందుకే నేను కోరేదొక్కటే! బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించండి!!’ అంటూ పిలుపునిచ్చారు. అంతటితో ఆగలేదు. ‘ప్రజలంతా అఖిలేశ్ చెప్పినట్లు విని, భారతీయ జనతాపారీ్టకి భారీ మెజారిటీతో విజయాన్ని అందించండి’ అన్నారు. దాంతో అఖిలేశ్ బిత్తరపోగా ఇతర ఎస్పీ నేతలంతా గతుక్కుమన్నారు. నోరు జారానని గమనించిన శివపాల్ కాసేపు బీజేపీపై విరుచుకుపడ్డా జనమంతా గోలగోలగా నవ్వుకున్నారు! అందిపుచ్చుకున్న మోదీ...ఈ ఉదంతాన్ని తర్వాత ఇటావాలోనే జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రచారాస్త్రంగా మలచుకున్నారు. ‘చూశారా! స్వయంగా ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ బాబాయ్ కూడా బీజేపీని గెలిపించాలని కోరుతున్నారు’ అంటూ చెలరేగిపోయారు. 2019లో ములాయం కూడా బీజేపీని ఆశీర్వదించారని గుర్తు చేశారు. ‘‘2019 ఎన్నికలకు ముందు పార్లమెంట్ చివరి సెషన్లో ములాయం మాట్లాడుతూ, మీరు మళ్లీ విజయం సాధించబోతున్నారని నన్నుద్దేశించి నిండు సభలో అన్నారు. ఆ ఆశీర్వాదం ఫలించింది. ఇప్పుడు ములాయం మన మధ్య లేకున్నా ఆయన సోదరుడు బీజేపిని గెలిపించాలని కోరుతున్నారు. ఇది యాదృచి్ఛకమని నేననుకోవడం లేదు. శివపాల్ మనసులో ఉన్నదే బయటికొచి్చంది’’ అంటూ చెణుకులు విసిరారు!లోగుట్టు ‘బోరా’కే ఎరుక... స్వపక్ష ఎంపీనే ఓడించాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే!అసోంలోని నగావ్ లోక్‌సభ స్థానంలో ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే శిబమణి బోరా కూడా ఇలాగే నోరు జారారు. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారామె. జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నట్టుండి, ‘ప్రద్యుత్‌ను భారీ మెజారిటీతో ఓడించాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నా. ఓడిస్తారో లేదో చెప్పండి. ఈవీఎం బటన్‌ను నొక్కి నొక్కి ప్రద్యుత్ కచ్చితంగా ఓడేలా చూడండి’’ అంటూ పిలుపునివ్వడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. పొరపాటున అన్నారా, కావాలనే అన్నారా అంటూ దీనిపై తీవ్ర చర్చ కూడా జరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నోరు జారిన మమతా బెనర్జీ
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నోరు జారారు. ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం అందుకున్న అభిజిత్ బెనర్జీ పేరును తప్పుగా ఉచ్ఛరించారు. ఇలా ఒకటికి రెండుసార్లు ఆమె అభిజిత్ పేరును అభిషేక్ బాబు అని పలికారు. అయితే అభిషేక్ అనేది మమతా బెనర్జీ మేనల్లుడి పేరు అన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న వ్యక్తి పదేపదే తప్పుగా పలుకడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మమత మీడియాతో మాట్లాడుతూ.. ‘బెంగాల్ నుంచి అమర్త్యసేన్, మదర్‌థెరీసా నోబెల్ పురస్కారం అందుకున్నారు. తాజాగా అభిషేక్ బాబును నోబెల్ బహుమతి వరించింది. ఇది బెంగాల్‌కు గర్వకారణం. అభిషేక్ బాబు తల్లి కోల్‌కతాలోనే ఉంటారు. నేను ఈ రోజు ఆమెను కలవడానికి వెళ్తున్నాన’ని తెలిపారు. అలాగే బీసీసీఐ అధ్యక్షుడిగా నియామకం ఖాయమైన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని మమత ప్రశంసలతో ముంచెత్తారు. గంగూలీ తమ కుటుంబ సభ్యుడి లాంటి వాడని పేర్కొన్నారు. మంగళవారం రోజున గంగూలీతో మాట్లాడనని.. దుర్గా పూజకు ముందు అతను తనను కలవడానికి వచ్చాడని వెల్లడించారు. మరోవైపు బుధవారం సాయంత్రం మమత కోల్‌కతాలో ఉన్న అభిజిత్ కుటుంబ సభ్యులను కలిశారు. -
మనోళ్లు నోరు జారుతున్నారు.. జాగ్రత్త: చంద్రబాబు
పార్టీలో కొంతమంది నేతలు నోరు జారుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం అమరావతిలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నా, వాటిని ప్రజలకు వివరించి చెప్పడంలో నాయకులు విఫలం అవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంగళగిరిలో పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని ఆదేశించారు. జన్మభూమి కమిటీల తీరు బాగోలేదనే భావన కూడా వ్యక్తం అవుతోందని, తాగునీటి విషయంలో కూడా ప్రజల్లో అసంతృప్తి ఉందని, ఈ అసంతృప్తి ఇంకా పెరగకుండా జాగ్రత్త పడాలని నాయకులకు ఆయన సూచించినట్లు సమాచారం. -
నారా లోకేశ్ ప్రమాణం చూశారా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ ఎమ్మెల్సీగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన తీరు టీడీపీ నేతలను ఇరకాటంలో పెట్టింది. ఒక నాయకుడిగా లోకేశ్ ఇమేజి పెంచడానికి గడిచిన కొన్నేళ్లుగా ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ విఫలమవుతున్నాయి. శాసనమండలి చైర్మన్ చక్రపాణి కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పలువురు సభ్యులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. అందులో లోకేశ్ కూడా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి కుమారుడైన లోకేశ్ ప్రమాణం చేసిన తీరు మండలి చైర్మన్ తో పాటు అక్కడున్న నేతలందరినీ నివ్వెరపరిచింది. చిన్న చిన్న పదాలను కూడా ఉచ్ఛరించలేక లోకేశ్ తడబడ్డారు, మధ్యమధ్యలో పదాలకు పదాలనే మింగేసి... ప్రమాణ పత్రం చదివారు. పదాలను ఉచ్చరించలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో పలువురు పక్కనున్న వారు వాటిని అందించే ప్రయత్నం చేసిన ఆ పదాలను వదిలేసి, దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నానంటూ ముగించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో నిలిస్తే గెలుస్తారో లేదోనన్న అనుమానంతోనే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కోటాలో లోకేశ్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. అది కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్పించుకున్న తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో లోకేశ్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ రకంగా దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి చేపట్టిన లోకేశ్ తీరా ప్రమాణ స్వీకారం రోజున పత్రంలోని పదాలను పలకలేక తడబడ్డారు. పదాలను విడదీస్తూ ఉక్కిరి బిక్కిరయ్యారు. తెలుగులో ప్రమాణం చేసిన లోకేశ్ ''సార్వభౌమాధికారాన్ని'' అనే పదం పలకడానికి అష్టకష్టాలు పడ్డారు. 'సార్వభౌమ్... అధికారాన్ని' అని విడగొట్టేశారు. ఇక ''నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వర్తిస్తాను'' అని చెప్పేందుకు కూడా ఇబ్బంది పడిన లోకేశ్, దాన్ని సగంలోనే వదిలేశారు. స్వతంత్రత అన్న పదాన్ని కూడా చదవలేక తడబడ్డారు. ఈ రకంగా మొదటి నుంచి ప్రమాణ పత్రంలోని పదాలను వదిలేస్తూ 'నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధా.. శ్రద్ధా.. అని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను' అని ముగించేశారు. ఏడాది కిందట లోకేశ్ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పార్టీ నేతల సమావేశంలో ఇలాగే సొంత పార్టీ విషయాన్ని మనసులో మాట బయట పెట్టినట్టుగా చేసిన ప్రసంగంతో కూడా పార్టీ నేతలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పార్టీలో లోకేశ్ ఇమేజీని పెంచడానికి గడిచిన కొన్నేళ్లుగా అనేక ప్రయత్నాలు, శిక్షణలు ఇస్తున్నప్పటికీ ఏమాత్రం పురోగతి కనిపించకపోవడం సన్నిహితులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తరహాలోనే ఇమేజీ పెంచుకోవడానికి ఎమ్మెల్యేగా కాకపోయినా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి త్వరలోనే మంత్రి పదవి చేపడుతున్న లోకేశ్ వ్యవహారం ఇలా ఉంటే ఎలా అని టీడీపీ నేతలు ప్రైవేటు సంభాషణల్లో సణుగుతున్నారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద కాలు జారి.. ఇక ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వాళ్లంతా ముందుగా గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఉన్న ఎన్టీఆర్ నిలువెత్తు కాంస్య విగ్రహం వద్ద నివాళులు అర్పించేందుకు వెళ్లారు. ముందుగా నారా లోకేశ్ అక్కడకు వెళ్లడానికి ప్రయత్నిస్తూ.. మొదటి మెట్టు వద్ద కాలుజారి బోర్లా పడబోయారు. అయితే సమయానికి పక్కనే ఉన్న అనుచరులు ఆయనను రెండు భుజాలు పట్టుకుని ఆపడంతో కింద పడకుండా తమాయించుకున్నారు. ఆ తర్వాత విగ్రహం వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. లోకేశ్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఏ విధంగా తడబడ్డారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. -
మోదీ రాష్ట్రపతి అయ్యారా..?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రపతి అయ్యారా..? మనకైతే ఈ విషయం తెలియదు గానీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు మాత్రం తెలిసిపోయినట్లుంది. అందుకే ఆయన మోదీని 'ప్రెసిడెంట్ మోదీ' అన్నారు. సోమవారం నాడు తమ సమావేశం ముగిసిన తర్వాత ఓ ప్రకటన చేసే సందర్భంలో ఒబామా పొరపాటున ఈ మాట అనేశారు. వైట్ హౌస్ వెబ్సైట్ పోస్ట్ చేసిన వీడియోలో కూడా ఈ మాట ఉంది. ''ప్రెసిడెంట్ మోదీకి స్వచ్ఛ ఇంధనం విషయంలో ఉన్న నిబద్ధత మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోంది'' అని ఒబామా చెప్పారు. ఈ విషయం ఒక్కసారిగా మీడియాలో గుప్పుమంది. దాంతో ఆ తర్వాత వైట్‌హౌస్ సిబ్బంది నాలుక కరుచుకుని, దాని రాతప్రతిని విడుదల చేస్తూ.. అందులో 'ప్రెసిడెంట్' అనే పదాన్ని 'ప్రధానమంత్రి'గా మార్చారు.