బీజేపీలోకి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మనవడు | Former President Sarvepalli Radhakrishnan Grandson To Join BJP | Sakshi
Sakshi News home page

నేడు చేరనున్నట్లు ప్రకటన

Published Sat, Jan 26 2019 11:28 AM | Last Updated on Sat, Jan 26 2019 1:37 PM

Former President Sarvepalli Radhakrishnan Grandson To Join BJP - Sakshi

బెంగళూరు : భారతదేశ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధకృష్ణన్‌ మనవడు సుబ్రమణ్యం శర్మ(44) నేడు బీజేపీలో చేరనున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యురప్ప సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న అసమానతలను తొలగించే ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు సుబ్రమణ్యం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన ‘సమాజంలో పేద, ధనిక వర్గాల మధ్య అంతారాలు విపరీతంగా పెరిగిపోయాయి. వ్యవస్థలో ఉన్న వ్యక్తుల్లో ఎవరో ఒకరు దీన్ని తొలగించడానికి పూనుకోవాలి. ఈ అసమానతలను తొలగించడమే ధ్యేయంగా నేను రాజకీయాల్లోకి వచ్చాన’ని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహిళా ఎంపవర్‌మెంట్‌ పార్’టీ తరఫున మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి సుబ్రమణ్యం పోటీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement