Sarvepalli Radhakrishnan
-
ఆ పెద్దమనిషి మాకు భోజనం వడ్డించారు..!
-
సానపెడితే పిల్లలు జాతిరత్నాలే!
సాక్షి, హైదరాబాద్: సరైన రీతిలో సానబడితే ప్రతీ విద్యార్థి జాతిరత్నమేనని.. అది కేవలం ఉపాధ్యాయుల వల్లే సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో గురుపూజా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబిత మాట్లాడారు. లక్షల మంది విద్యార్థులు, లక్షకుపైగా టీచర్లున్న విద్యా శాఖ ఓ పెద్ద కుటుంబమని.. గురుపూజోత్సవం తమకు ఓ పెద్ద పండుగ అని పేర్కొన్నారు. ఎవరు, ఎంత ఎత్తుకు ఎదిగినా వారికి చదువు నేర్పిన మాస్టార్లు గుండెల్లో శాశ్వతంగా ముద్ర పడిపోతార న్నారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రతి టీచర్ అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నాం: కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద పీట వేస్తోందని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మనఊరు మనబడి ఓ విప్లవాత్మక పథకమని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. కాగా సాంకేతికపరంగా విద్యా రంగంలో వచ్చే సవాళ్లను ఎదుర్కొనే దిశగా అధ్యాపకులు అడు గులు వేయాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన 128 మంది టీచర్లను సత్కరించారు.ఎమ్మెల్సీలు కూర రఘో త్తమరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, సురభివాణి, వర్సిటీల వీసీలు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గురువు ‘లఘువు’ కాకూడదు!
‘తరగతి గది ప్రపంచానికి అద్దం వంటిది. విద్యార్థి అభివృద్ధి అక్కడ నుంచే మొదలవుతుంది. నిజమైన ఉపాధ్యాయుడు ప్రపంచాన్ని తన తరగతి గదిలోకి తీసుకురాగలడు’ అంటాడు ఓ ప్రముఖ తత్వవేత్త. ఉపాధ్యాయుని ‘గురు’తర బాధ్యతనూ, వృత్తి గౌరవాన్నీ వ్యక్తం చేసేందుకు ఈ ఒక్కమాట చాలు. అయితే చదువుకు కేంద్ర బిందువు అయిన ‘గురువు’ మాత్రం ‘లఘువు’గా మారాడన్న అపవాదు మోస్తున్నాడు. గురు భావన వేద కాలం నుంచి ప్రస్తావనలో ఉంది. తమ గురించి తాము బాగా తెలిసిన గురువులు మంచి శిష్యుల కోసం చూసేవారట. శిష్యులు కూడా అటువంటి గురువునే ఆశ్రయించి శుశ్రూష చేస్తూ జ్ఞానార్జన చేసేవారట. ‘నిజమైన గురువు జ్ఞాన రంగంలో నిష్ణాతుడు కావాలి. వేదాలు అభ్యసించిన వాడ వ్వాలి. అసూయ లేనివాడు, యోగం తెలిసినవాడు, సరళమైన జీవితాన్ని గడిపేవాడు, ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు అయివుండాలి’ అంటూ నాటి సమాజం గురు వుకు అత్యున్నత స్థానం కట్టబెట్టి గౌరవించింది. గురువు నైపుణ్యాల బోధకుడు. మానసిక విశ్లేషకుడు. విలువలు అలవర్చడం, అనుభవా లను వివరించడం అతని బాధ్యత. అన్ని విషయాలపై అవగాహనకల్పించి శిష్యుడిని సర్వసమగ్రంగా తీర్చేదిద్దే శిక్షకుడు గురువు. అక్షర జ్ఞానం నుంచి ఆధ్యాత్మిక అంశాల వరకు, యుద్ధ కళల నుంచి సంగీత, సాహిత్య, చిత్రకళల వరకు గురుకులాల్లో బోధన జరిగేది. ఊహ తెలిసిన తర్వాత గురు కులంలోకి ప్రవేశించిన విద్యార్థి యుక్తవయసు నాటికి అన్ని కళల్లో ఆరితేరి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరేవాడు. సూర్యు నిలా ప్రకాశించే గురువు అంతే ప్రకాశవంతంగా శిష్యుని తీర్చి దిద్దేవాడని వేదాలు చెప్పాయి.నేటి కాలానికి వస్తే – ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యా యులు తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించడం, లక్ష్యం మేరకు విధులు నిర్వహించడంలో పలు సవాళ్లు ఎదుర్కోవాల్సి రావడం వాస్తవమే అయినా... ఉన్నంతలో తమ విధులు నిర్వ హించడంలో చాలామంది ఉపాధ్యాయులు విఫలమవుతూ చిన్న చూపుకు గురవుతున్నారు. చదువుకోవడం ఒకప్పుడు గౌరవ ప్రదమైన కార్యక్రమం. ఇప్పుడు ప్రాథమిక హక్కు. ఉచిత నిర్బంధ విద్యతో మొదలైన ప్రభుత్వాల కృషి నేడు ‘హక్కు’ అమలుకు పటిష్టంగా కొనసాగుతోంది. కనీస సదుపాయాలు లేవనో, ఉపకరణాలు అందుబాటులో ఉండడం లేదనో, సరిపడే సిబ్బందిని నియ మించడం లేదనో చెప్పి ఉపాధ్యాయులు నిందను ప్రభుత్వం మీదకు తోసేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమ స్యలు లేవని చెప్పలేకున్నా గతకాలంతో పోల్చితే ఇప్పుడు విద్యపై ప్రభుత్వాల శ్రద్ధ పెరిగింది. నిధుల కేటాయింపు అధిక మయ్యింది. సదుపాయాలు, ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో విద్యాప్రమాణాల మెరుగుదలకుకృషి చేయాలని ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. మొక్కుబడి ఫలితాలపై కాకుండా వాస్తవ అభివృద్ధి సాధించాలని కోరుతోంది. ఆధునిక విద్య అందరికీ అందించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. కానీ పెట్టుబడి పెట్టడం వరకే ప్రభుత్వం చేయగలదు. క్షేత్ర స్థాయిలో అమలు బాధ్యత ఉపాధ్యా యులదే. ఉన్న వనరులను సద్విని యోగం చేసుకుంటూ విద్యార్థులను తీర్చి దిద్దినప్పుడు వారికి ఆత్మసంతృప్తితోపాటు ప్రజల నుంచి హర్షామో దాలు వ్యక్తమవుతాయి. ఇందుకు ఆధునిక బోధనా విధానాలు, మూల్యాంకనా విధానాలతో పాటు జాతి నిర్మాణానికి ఉపయుక్తమయ్యే తాజా కరికులంపై పూర్తిస్థాయి అవగాహన ఏర్పర్చుకుని లక్ష్య సాధనకు ఉపాధ్యా యులు సిద్ధపడాలి. ఉపాధ్యాయుడు నిరంతర అభ్యాసకుడు, పరిశోధకుడు అయినప్పుడు మాత్రమే మంచిఫలితాలు సాధ్యమవుతాయి. ఆధునిక అవసరాలు, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని తమను తాము అందుకు సన్నద్ధం చేసుకుంటూ భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు సిద్ధం కావాలి. క్షేత్ర స్థాయిలో ఇది కనిపించినప్పుడే ఉపాధ్యాయులకు గౌరవం. – బి.వి. రమణమూర్తి, టీచర్, విశాఖపట్నం (నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి; ఉపాధ్యాయ దినోత్సవం) -
పేదరికపు కష్టాల మధ్య.. విద్యార్థి నుంచి రాష్ట్రపతిగా.. సర్వేపల్లి ప్రస్థానం
పేదరికపు కష్టాల మధ్య,అవమానాల సుడిగుండాల నడుమ చదువుకోడానికి ఆయన ఎంత కష్టపడ్డారో ఆయనకే తెలుసు.ఉత్తమ విద్యార్థి దశ నుంచి ఉన్నత విద్యావంతుడుగా ఎదిగాడు,ఉన్నత విద్యావంతుడి స్థాయి నుంచి ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడిగా నిలిచారు.ఆ అజేయప్రస్థానం అంతటితో ఆగలేదు.అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి చేర్చింది. మహోన్నతమైన 'భారతరత్న' పురస్కారాన్ని అందించింది. సర్వోత్తమమైన 'భారతరత్న' సత్కారాన్ని ప్రకటించిన తొలినాళ్ళల్లోనే (1954) సాధించేలా చేసింది.సర్వేపల్లి రాధాకృష్ణ మన తెలుగువాడు,మన భారతీయుడు.ఆయన జన్మదినం 'జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం'. దేశంలో ఎందరో ఉన్నత విద్యావంతులు,ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు. వారెవ్వరికీ దక్కని విశిష్ట గౌరవాన్ని పొందిన భాగ్యశాలి. జ్ఞానమే తన ఐశ్వర్యం, ధైర్యమే తన దీపం, క్రమశిక్షణే తన మార్గం,పట్టుదలే తన సోపానం.రాధాకృష్ణ విజయగాథ సర్వ మానవాళికి సర్వజ్ఞాన ప్రబోధ.ప్రపంచంలోని అగ్రశ్రేణి తత్త్వశాస్త్ర ఆచార్యులలో ఆయన తొలివరుసలోని వారు. చదువు,అనుభవం రెండూ తన తోడునీడలు.జీవిత తత్త్వాన్ని, జీవన సారాన్ని,సారాంశాన్ని మధించుకుంటూ వెళ్లారు. పసిడికి తావి అబ్బినట్లు, తనను వరించి వచ్చిన ప్రతి పదవిలో,తనను తాను మరింతగా తీర్చిదిద్దుకున్నారు. జీవన సమరం బాగా ఎరిగినవాడు కనుక,తను గడించిన అనుభవాన్ని,పొందిన తాత్త్విక సారాన్ని దేశానికి అన్వయం చేసుకుంటూ అంకితమయ్యారు.అందుకే,ప్రతి క్లిష్ట సమయంలో దేశానికి అండగా నిలిచారు. క్లిష్ట సమయంలో దేశానికి అండగా.. చైనా,పాకిస్తాన్ తో భారత్ యుద్ధం చేయాల్సిన అత్యంత క్లిష్టమైన సమయాల్లో,ప్రధాన మంత్రులకు అత్యద్భుతంగా మార్గనిర్దేశం చేశారు.ప్రపంచ తత్వశాస్త్ర సిద్ధాంతాలన్నింటినీ ఆపోసన పట్టారు.భారతీయతను ఆణువణువునా నిలుపుకొన్నారు.బోధనలో,పరిపాలనలో ఆ అమృతకలశాలను పంచిపెట్టారు.ఎంత గొప్పగా మాట్లాడుతారో,అంత శ్రద్ధగా వింటారు. ఎంత బాగా రాస్తారో, అంత బాగా చదువుతారు.అందుకే ఆయనకు పాఠకుడి హృదయం,ప్రేక్షకుడి నాడి రెండూ తెలుసు. సర్వేపల్లివారి రచనలు,ఉపన్యాసాలు పరమ ఆకర్షణా శోభితాలు. యూనివర్సిటీలో క్లాస్‌లో 24నిముషాలసేపు మాత్రమే గంభీరంగా పాఠం చెప్పేవారు. అది ముగిసిన వెంటనే,సరదా కబుర్లు,ఛలోక్తులు విసిరి, విద్యార్థులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేవారు.24 నిముషాలకు మించి,ఏ విషయాన్నీమెదడు ఆసక్తిగా లోపలికి తీసుకోలేదని ఆయన సిద్ధాంతం. కేవలం 21 ఏళ్లకే... మానవ జీవ రసాయన చర్యలు,విద్యా మనస్తత్వశాస్త్రం (ఎడ్యుకేషనల్ సైకాలజీ) కూడా మధించినవాడు కాబట్టే,సర్వోన్నత ఉపాధ్యాయుడుగా ఖ్యాతి గడించారు.సర్వజన రంజిక ఉపన్యాసకుడిగా గొప్ప కీర్తినిఐశ్వర్యంగా పొందారు.ఆయన రాసిన'భారతీయ తత్త్వశాస్త్రం'ప్రపంచ పండితులకునిత్య పఠనీయ గ్రంథమైంది. ఈ సహజ ప్రతిభా భాస్వంతుడికి సాధన మరింత ప్రభను, ప్రభుత్వాన్ని చేకూర్చింది. కేవలం 21సంవత్సరాల వయస్సులోనే ఆచార్య పదవిని దక్కించుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్,అశుతోష్ ముఖర్జీ వంటి దిగ్దంతులు కలకత్తా విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పమని స్వాగతించారు. మన ఆంధ్రవిశ్వవిద్యాలయానికి ద్వితీయ వైస్ ఛాన్సలర్‌గా అలంకరించిన అద్వితీయుడు సర్వేపల్లి .హిరేన్ ముఖర్జీ,హుమయూన్ కబీర్ వంటి మేధాగ్రణులను ఆహ్వానించి, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పించారు. Rare Footage of our former President of India and World's renowned #philosopher Sarvepalli Radhakrishnan, when he visited Britain in 1963 ! A must watch ! Courtesy BFI & via Social Media #SarvepalliRadhakrishnan #TeachersDay pic.twitter.com/ZdB6GvZmjr — Sonmoni Borah IAS (@sonmonib5) September 6, 2020 ఆయన చదువంతా స్కాలర్ షిప్స్ మీదే.. మేధావుల విలువ తెలిసిన మేధాగ్రణి.దేశ,విదేశాలలోని అన్ని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో ఆయన అసంఖ్యాకంగా ప్రసంగాలు చేసి అందరినీ అలరించారు. భారతీయ విద్యా విధానంలో ఉన్నతమైన సంస్కరణలు జరగాలని కలలుకన్న తొలితరం మేధావి.జవహర్ లాల్ నెహ్రు ప్రభుత్వం నియమించిన ఆ కమిటీకి తొలి అధ్యక్షుడు కూడా ఆయనే. ఆయన చదువంతా స్కాలర్ షిప్స్ మీదే సాగింది. విద్యార్థి దశలో కటిక పేదరికాన్ని అనుభవించారు. భోజనం చేయడానికి అరిటాకు కూడా కొనలేక,నేలను శుభ్రం చేసుకొని,భోజనం చేసిన సందర్భాలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఈ ఉదంతం వింటే?హృదయం ద్రవించినా,జీవితాన్ని ఆయన పండించుకున్న తీరు ఆనందభాష్పాలు కురిపిస్తుంది,మెదడును కదిలిస్తుంది,గుండెను మరింత దృఢంగా మారుస్తుంది,కర్తవ్యం వైపు నడిపిస్తుంది.పేదవాడికికొండంత స్ఫూర్తిని అందిస్తుంది.డబ్బు విలువ,దేశం విలువ తెలిసినవాడు కనుక,రాష్ట్రపతి హోదాలో తనకు వచ్చే వేతనంలో కేవలం 25శాతం మాత్రమే తీసుకొని,మిగిలినది ప్రధానమంత్రి సహాయనిధికి తిరిగి ఇచ్చేవారు. "చదువది ఎంత కలిగిన..రసజ్ఞత ఇంచుక చాలకున్న..ఆ చదువు నిరర్ధకంబు...'' అన్నట్లు,జీవితాన్ని తెలుసుకోడానికి ఉపయోగపడని ఏ శాస్త్రమైనా నిరర్ధకమని ఆయన అభిప్రాయం.జీవితాన్ని అర్ధం చేసుకోడానికి తత్త్వం ఒక మార్గమన్నది ఆయన బోధన.వివేకం,తర్కం ఇమిడివున్న భారతీయ తాత్త్విక చింతనప్రపంచ తత్త్వశాస్త్రాలకే తలమానికమని చాటిచెప్పిన సర్వోన్నత ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణ. -మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
చరిత్రలో ప్రత్యేకం.. అప్పట్లో సర్వేపల్లి, నీలం సంజీవరెడ్డి.. మళ్లీ ద్రౌపది ముర్ము
సాక్షి, భద్రాచలం: భద్రాచలానికి వీఐపీల రాక ప్రత్యేకం కానప్పటికీ.. అత్యున్నతస్థాయి హోదా గల రాష్ట్రపతి రావడం భద్రాచల చరిత్రలో ఎంతో ప్రత్యేకం. ఇక్కడ జరిగే ఉత్సవాల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు హాజరవడం పరిపాటే. కానీ జాతీయ స్థాయిలో అధికార హోదాలో భద్రాచలంలో పర్యటించటం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత ఆ స్థానం ద్రౌపది ముర్ముకే దక్కింది. భద్రాచలం – సారపాక మధ్య గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జి ప్రారంభోత్సవానికి 1965 జూలై 13న అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వచ్చారు. ఇప్పుడు ప్రసాద్ పథకంలో భాగంగా రూ.41 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ద్రౌపదిముర్ము వస్తున్నారు. అయితే నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కూడా భద్రాచలం వచ్చినప్పటికీ.. ఆయన కేవలం స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్లారు. చదవండి: భద్రాచలంలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో నాటి అర్చకులు, తదితరులు (ఫైల్) -
భారత రాష్ట్రపతి స్వాగతం కోసం స్వయంగా బ్రిటన్ రాణి
క్వీన్ ఎలిజబెత్-2 జీవితం.. బ్రిటన్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం గుర్తుంచుకోదగిన ఒక అధ్యాయం. సుదీర్ఘకాలంగా ఒక రాజ్యాన్ని పాలించిన సామ్రాజ్ఞిగా ఆమె తనకంటూ ఓ చెరగని ముద్రవేసుకుని వెళ్లిపోయారు. అంతేకాదు.. తన హయాంలో పలు దేశాలపై ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచారామె. అందులో భారత్ కూడా ఉండగా.. ఆ ఆదరాభిమానాలకు అద్దం పట్టిన ఘటనే ఇది.. క్వీన్ ఎలిజబెత్-2 ప్రయాణంలో భారత ఆధ్యాయం కూడా ఎంతో ప్రత్యేకమైనదే. ఆమె భారత్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ఒకప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ లండన్ పర్యటన సందర్భంగా స్వయంగా ఆమె కదిలివచ్చి స్వాగతం పలికారు. 1962 నుంచి 1967 వరకు భారత రాష్ట్రపతిగా సేవలందించిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్.. 1963లో బ్రిటన్‌లో పర్యటించారు. ఉపాధ్యాయుడిగా, విద్యావేత్తగా, సంస్కరణల వాదిగా ఎంతో పేరున్న డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు మునుపెన్నడూ లేనంతగా బ్రిటన్‌లో రాయల్ స్వాగతం లభించింది. క్వీన్ ఎలిజబెత్-2 స్వయంగా విక్టోరియా రైల్వే స్టేషన్‌కు వచ్చి సర్వేపల్లికి స్వాగతం పలికింది. తనతో పాటు ప్రిన్సెస్ మెరీనా, ప్రిన్సెస్ మార్గరేట్‌ను కూడా స్టేషన్‌కు తోడ్కోని వచ్చింది. ప్రిన్సెస్ మెరీనా, ప్రిన్సెస్ మార్గరేట్లను పరిచయం చేసిన రాణి(photo credit : BFI) రాజకుటుంబ ప్రముఖులతో పాటు, దేశంలోని అత్యున్నత సైన్యాధికారులు వెంట రాగా సర్వేపల్లిని జాతీయ గీతం జనగణమన ఆలాపనతో రాజమర్యాదలు చేసి తన వెంట తీసుకెళ్లారు రాణి. సర్వేపల్లి రాధాకృష్ణన్ మొత్తం 11 రోజుల పాటు బ్రిటన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించారు. బ్రిటన్ సాధనసంపత్తికి అద్దం పట్టే పరిశ్రమలు, భవనాలు, వంతెనలతో పాటు పర్యాటక ప్రాంతాల్లో సర్వేపల్లి పర్యటించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ నాటి బ్రిటన్ సాంప్రదాయ గుర్రపు పందాలను చూడడానికి వచ్చినప్పుడు రాణి ఎలిజబెత్ స్వయంగా వెంట వచ్చారు. నాటి రాష్ట్రపతి సర్వేపల్లికి రాణి ఎలిజబెత్ ఆహ్వానం(photo credit : BFI) నాటి వీడియోలో ఎలిజబెత్ ఎంతో హుందాగా, మరెంతో అందంగా కనిపించారు. వీడియోలో మూడు వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు బ్రిటీష్ వస్త్రధారణలో రాణి కనిపించగా, చాలా మంది భారతీయ మహిళలు ఆనాటి సంప్రదాయ చీరలో కనిపించారు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఎలిజబెత్ కన్నుమూసిన సందర్భంగా బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వీడియో నాటి చరిత్రను కళ్ల ముందుంచింది. కర్టెసీ : BFI (బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నేషనల్ ఆర్కైవ్ నుంచి సేకరించిన వీడియో ఆధారంగా) -
సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ పాల్గొన్నారు. ‘‘చదువే తరగని ఆస్తి.. గురువే రూపశిల్పి.. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ టీచర్ డే శుభాకాంక్షలు’’ అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఇవీ చదవండి: సీఎం వైఎస్ జగన్‌కు అర్చక సమాఖ్య కృతజ్ఞతలు కోవిడ్ కట్టడిలో కేరళ కంటే.. ఏపీ చర్యలు భేష్ -
గురువు.. భవితకు ఆదరువు!
సాక్షి, జ్యోతినగర్(రామగుండం): మాతృ దేవోభవ.. పితృ దేవోభవ.. ఆచార్య దేవోభవ.. అంటూ తల్లిదండ్రుల తర్వాత మహోన్నత స్థానాన్ని గురువుకు ఇచ్చారు. విద్యాబుద్ధులు నేర్పి, సమాజంలో మనం సన్మార్గంలో నడవడంలో వారి పాత్ర కీలకం. భవిష్యత్‌లో ఏ స్థాయిలో ఉన్నా ఉపాధ్యాయులను గుర్తు చేసుకోవాలి. ఈ క్రమంలో భారత మాజీ రాష్ట్రపతి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటుకున్నాం. ఆయన ఉపాధ్యాయ వృత్తి నుంచి దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన మహనీయుడు. ఈ ఏడాది ఆ వేడుకల రోజు రానే వచ్చింది. నేడు ఉపాధ్యాయ దినోత్సవం. తప్పులు సరిచేస్తూ సన్మార్గ బోధన పాఠశాలల్లో విద్యార్థుల తప్పులు సరిచేస్తూ వారిని సన్మార్గంలో నడిచేలా ప్రోత్సహించడంలో ఉపాధ్యాయుల కృషి అంతా ఇంతా కాదు. క్లాసులో అల్లరి చేస్తున్నా ఎంతో ఓపికగా పిల్లల్ని కూర్చోబెట్టి చదువు చెబుతారు. తప్పు చేస్తే తప్పు అని చెప్పి, భవిష్యత్తులో మళ్లీ చేయవద్దని చెప్పే దయాగుణం గురువులది. అంతటి గొప్ప మనసున్న టీచర్లను ఏటా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మానించి, ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కరోనాతో వేడుకలు దూరం ఉపాధ్యాయ దినోత్సవం వస్తుందంటే ఏటా అన్ని పాఠశాలల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. విద్యార్థులు తమ గురువులను సన్మానించాలని, వారి ఆశీర్వాదం పొందాలని ముందే ప్లాన్ చేసుకుంటారు. సెప్టెంబర్ 5న ఆనందంతో వేడుకల్లో పాల్గొంటారు. కానీ ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా ఆ సందడి కనుమరుగైంది. పాఠశాలల్లో విద్యాబోధన జరగడం లేదు. విద్యార్థులు ఇళ్లకే పరి మితమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయ దినో త్సవం జరుపుకునే అవకాశం లేకుండా పోయిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేడుకలు వద్దని ఆదేశాలు వచ్చాయి కోవిడ్–19 నిబంధనలతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాప దినాల నేపథ్యంలో ఉపాధ్యాయ దినోత్సవం జరపవద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతం విద్యార్థులకు ఆన్లైన్లో విద్యాబోధన చేస్తున్నాం. పిల్లలు పాఠశాలలకు రావడం లేదు కాబట్టి ఇళ్లవద్ద తల్లిదండ్రులే గురువులుగా వ్యవహరించి, వారి భవిష్యత్తును కాపాడాలి. – బి.డేనియల్, ఎంఈవో, ఉమ్మడి రామగుండం -
బీజేపీలోకి సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు
బెంగళూరు : భారతదేశ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధకృష్ణన్ మనవడు సుబ్రమణ్యం శర్మ(44) నేడు బీజేపీలో చేరనున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యురప్ప సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న అసమానతలను తొలగించే ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు సుబ్రమణ్యం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ‘సమాజంలో పేద, ధనిక వర్గాల మధ్య అంతారాలు విపరీతంగా పెరిగిపోయాయి. వ్యవస్థలో ఉన్న వ్యక్తుల్లో ఎవరో ఒకరు దీన్ని తొలగించడానికి పూనుకోవాలి. ఈ అసమానతలను తొలగించడమే ధ్యేయంగా నేను రాజకీయాల్లోకి వచ్చాన’ని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహిళా ఎంపవర్మెంట్ పార్’టీ తరఫున మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి సుబ్రమణ్యం పోటీ చేశారు. -
తిట్లుకాదు, దీవెనలవి
ప్రముఖ తత్త్వశాస్త్ర నిపుణుడు, మాజీ రాష్ట్రపతి కీ.శే. సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు చాలా కష్టాల్లోంచి పైకొచ్చారు. తిరుపతిలో ఆయన చదువుకుంటున్న రోజులవి. ఆ రోజు పరీక్ష ఫీజు కట్టడానికి ఆఖరు రోజు. విద్యార్థిగా ఉన్న దశలో ఒకసారి పుస్తకం చదివితే మొత్తం ఆయనకు గుర్తుండిపోయేది. ఆయనకు ఒక అలవాటు ఉండేది. ఏదయినా చూడాలనిపిస్తే ఎన్ని మైళ్లయినా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. అలా ఒకసారి వెళ్ళి తిరిగి వస్తుండగా నిర్మానుష్యంగా ఉన్న దారిలో ఒక పాడుబడ్డ బావి వద్ద ఒక దొంగ పొంచి ఉండి, ఆయనమీద పడి పట్టుకున్నాడు. ఆయన చెవికున్న బంగారు పోగులకోసం పొదల్లోకి లాక్కెళ్ళి కొట్టడంతో ఆయన అర్భకుడు కావడాన స్పృహతప్పి పడిపోయాడు. చెవులకున్న పోగులు లాగేసుకుని దొంగ వెళ్ళిపోయాడు. స్పృహతప్పిన రాధాకృష్ణన్ గారికి కొద్దిసేపటి తరువాత తెలివి వచ్చి ఒళ్ళంతా దెబ్బలతో ఇంటికి చేరుకున్నాడు. ఫీజు కట్టడానికి అదే ఆఖరి రోజు, అయినా బాగా తెలివిగల పిల్లవాడయిన రాధాకృష్ణన్ ఇంకా రాలేదేమిటని ఆందోళన చెందిన ఆయన ఉపాధ్యాయుడు తానే స్వయంగా దరఖాస్తు నింపి తన సొంత డబ్బుతోనే ఫీజు కట్టేశాడు. పక్కరోజు రాధాకృష్ణన్ వెడితే విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడు తాను ఫీజు కట్టేశానని చెప్పి పరీక్ష రాయించాడు. ఆ పరీక్షలో ఆయన అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. రాధాకృష్ణన్ మైసూర్ విశ్వవిద్యాలయంలో తత్త్వ శాస్త్రానికి ఆచార్యుడిగా ఉండి తరువాత కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉన్నత పదవిలో చేరడానికి సిద్ధపడ్డారు. మైసూరునుంచి కలకత్తాకు వెళ్ళే రోజున సామానంతా వేరుగా స్టేషన్‌కు పంపించేసి, భార్యతో గుర్రపుబగ్గీలో పోవడానికి బయటికి వచ్చారు. ఆయన దగ్గర చదువుకున్న, చదువుకుంటున్న విద్యార్థులు వందల సంఖ్యలో ఆ సమయానికి అక్కడికి చేరుకున్నారు. ‘‘మాకింత గొప్పగా పాఠాలు చెప్పి తన ఊపిరిని మాకోసం వెచ్చించిన మా గురువుకు కృతజ్ఞతగా ...’’ అంటూ బండికి కట్టిన గుర్రాలను విడిపించి స్వయంగా విద్యార్థులే ఆ బండిని మైసూరు స్టేషన్ వరకు లాగుకుంటూ తీసుకెళ్ళారు. పూలు పరచి వాటిమీదుగా వారిని తీసుకెళ్ళి రైలెక్కించారు. రాధాకృష్ణ్ణన్ గారు కూడా బరువెక్కిన హృదయంతో చేతులూపుతూ వారినుంచి వీడ్కోలు తీసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తికే అత్యంత గౌరవం, గుర్తింపు తెచ్చిన ఆయన జీవితం ఆ వృత్తితో ఎంతగా పెనవేసుకుపోయిందంటే జన్మదినాన్ని ఆత్మీయులు, సన్నిహితుల మధ్య జరుపుకునే సంప్రదాయానికి స్వస్తి చెప్పి దానిని ‘టీచర్స్ డే’ గా జరుపుకోవాలని వాంఛించారు. తననే కాదు అది గురువులందరినీ స్మరించుకోవాలన్న. గౌరవించుకోవాలన్న సందేశాన్ని ఆయన దీని ద్వారా ఇచ్చారు. ఇక అప్పటినుంచీ సెప్టెంబరు 5వ తేదీని ‘ఉపాధ్యాయ దినోత్సవం’ గా జరుపుకుంటున్నాం. ఇదంతా కలాంగారు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే... అమ్మ తిట్టిందనో, నాన్న కోప్పడ్డాడనో, గురువు గారు మందలించారనో వారిపై అక్కసు పెంచుకోకుండా... ఎందుకు ఆగ్రహిస్తున్నారో దాని వెనుక ‘మిమ్మల్ని సంస్కరించాలన్న’ వారి ఆవేదనను అర్థం చేసుకుని మీకుటుంబ గౌరవం పెంచేలా, మీ స్నేహితులు, మీ చుట్టూ ఉన్న సమాజం గర్వపడేలా మీ వ్యక్తిత్వాన్ని దిద్దుకోండి’’ అని చెప్పడానికి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
భావి భారత విధాతలు
సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగానే కాకుండా స్వపరిపాలనా దినోత్సవంగా కూడా జరుపుకుంటాం!ఈ సందర్భంగా విజయవాడలోని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మెమొరియల్ స్కూల్లో పిల్లల్ని ‘సాక్షి’ కలిసింది! ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లలేక ఈ బంగారాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు! పేదరికం... ఒంటిమీదున్న బట్ట, కడుపులోని ఆకలితో కనబడుతుందేమో కానీ,ఈ పిల్లల కళ్లలో, మాటల్లో మాత్రం మహోన్నతమైన సంపద కనబడుతుంది. దేశానికి, సమాజానికి దిశను ఇవ్వగల నాయకుల్లా కనబడతారు. ఈ పిల్లల మాటలు విన్నాక ఇక వీసమెత్తు సంకోచం కూడా లేదు.. మన దేశ భవిష్యత్ నిజంగా బంగారమే! జైహింద్!! ‘‘అధ్యక్ష్యా..! మేము అధికారంలోకి వచ్చే ముందు ఏం హామీలు చేశామో.. అన్నీ నెరవేర్చాం అధ్యక్ష్యా! రైతు రుణాలు మాఫీ చేశాం. ఉద్యోగాలు ఇచ్చాం.. అనుకున్న రీతిలో రాజధాని నిర్మాణం పనులు కూడా వేగవంతం చేస్తున్నాం. అంతేకాదు అధ్యక్ష్యా..! రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల క్షేమమూ చూస్తున్నాం. మన రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం, విద్య, ఉపాధి మీదే దృష్టి పెట్టాం. హోం శాఖ కూడా శాంతి భద్రతలను అద్భుతంగా పరిరక్షిస్తోంది. అన్ని శాఖలూ సమర్థవంతంగా పనిచేస్తున్నాయి’’ అంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పుకుపోతుండగానే..ప్రతిపక్షనేత లేచి.. ‘‘ఏం అభివృద్ధి అధ్యక్ష్యా..! ప్రజల్లోకి వెళితే తెలుస్తుంది అసలు నిజాలేంటో? రుణాలు మాఫీ కాక.. భారం పెరిగి రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష్యా! ఇక.. భూములు ఇచ్చిన రైతులకు ఇంకో ఉపాధి అంటున్నారు.. అసలు సారవంతమైన ఆ నేలలను రాజధాని నిర్మాణం కోసమని కాంక్రీట్మయం చేస్తారా అధ్యక్ష్యా? ఎంత తప్పు! పర్యావరణానికి ఎంత హాని! అభివృద్ధి అంటే ఇదా అధ్యక్ష్యా?’’ అంటూ ముఖ్యమంత్రిని నిలదీశాడు. ‘‘అధ్యక్ష్యా..! ప్రతిపక్షనేతకు లెక్కలతో మా అభివృద్ధిని వివరిస్తాం’’ అంటూ ఆర్థిక మంత్రి ఇంకేదో చెప్పబోతుండగానే.. ప్రతిపక్షంలోని ఓ ఎమ్మేల్యే లేచి.. ‘‘లెక్కలు తెలియంది ఎవరికి అధ్యక్ష్యా! అన్నీ తెలుసు. అన్నీ చూస్తున్నాం..’’ అంటూ ఆర్థికమంత్రిని నిలువరించే ప్రయత్నం చేశాడు. ‘‘ఆడవాళ్ల భద్రత కోసం ఇది చేశాం.. వాళ్ల రక్షణ కోసం అది చేశాం.. అంటూ ముఖ్యమంత్రి సహా ఆయన మంత్రిగణమంతా ఊదరగొడ్తున్నారు అధ్యక్ష్యా! అంత చేస్తుంటే ఇన్ని నేరాలు ఎందుకు నమోదవుతున్నాయి అధ్యక్ష్యా..? మొన్నటికి మొన్న మా ఇంటి సందులోనే ఓ అమ్మాయి మీద దాడి జరిగింది. అంతకుముందు రాజధానిలోనే రెండు కేసులు నమోదయ్యాయి. ఇవి మన ముందు జరిగినవే.. మన వెనక, మనకు తెలియకుండా ఇంకా ఎన్ని జరుగుతున్నాయో? అధ్యక్ష్యా..! అధికార పార్టీ వాళ్లు చెప్తున్నదానికి.. బయట జరుగుతున్న దానికి ఏమన్నా పోలిక ఉందా అధ్యక్ష్యా?’’ అంటూ ఇంకో ఎమ్మెల్యే ప్రశ్నించాడు. ‘‘అవును అధ్యక్ష్యా..! ఒక్క భద్రత విషయమే కాదు ... మహిళల ఆరోగ్య విషయాన్నీ అటకెక్కించారు అధికార గణం వారు. రక్తహీనతతో బాధపడ్తున్న స్త్రీల విషయంలో మన రాష్ట్రం ముందు వరుసలో ఉంది. అమరావతి నిర్మాణంలో చాలా బిజీగా ఉన్న మన ప్రభుత్వాన్ని కాస్త వీలు చూసుకొని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైపు ఒక్క అడుగు వేయమనండి అధ్యక్ష్యా..! వాటి పనితీరు ఎలా ఉందో తెలుస్తుంది’’ అని ఇంకో ఎమ్మెల్యే ప్రభుత్వ పనితీరును వేలెత్తి చూపుతున్నంతలోనే మరో ఎమ్మెల్యే లేచి ‘‘అధ్యక్ష్యా..! మనకు స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లకు పైగా అవుతోంది. అయినా ఏం అభివృద్ధి సాధించాం అధ్యక్ష్యా? ఫ్లై ఓవర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లా అధ్యక్ష్యా? 70 ఏళ్లకు పూర్వం బాల్య వివాహాల రద్దు కోసం పోట్లాడాం. అయినా రద్దు చేయగలిగామా? లేదు. ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష్యా! ఆరో తరగతి చదువుతున్న అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించేస్తున్నారు. పదహారేళ్లు నిండకుండానే పిల్లల్ని కని రక్తహీనతకు లోనవుతున్నారు. అనారోగ్యాల పాలవుతున్నారు.దీనికి సంబంధించిన లెక్కలు మా దగ్గర కూడా ఉన్నాయి అధ్యక్ష్యా..! మేమూ ఇస్తాం’’ అని ఆయన పూర్తిచేసే లోపే మహిళా ఎమ్మెల్యే నిలబడి.. ‘‘అధ్యక్ష్యా..! బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాం అంటూ అధికార పార్టీ గట్టిగా చెప్తోంది. మన అసెంబ్లీ ముందున్న హోటల్‌కి వెళ్లి చూడండి.. ఎంత మంది పిల్లలు పనిచేస్తున్నారో? దీనికి మించిన ఎగ్జాంపుల్ ఏముంటుంది అధ్యక్ష్యా? ఎంతో మంది పిల్లలు బడి లేక పాచి పనులు చేసుకుంటూ బాల్యాన్ని ఈడుస్తున్నారు అధ్యక్ష్యా.. ఇంతకన్నా ఘోరం ఇంకెక్కడుంటుంది?’’ అని ప్రశ్నించింది. అధికార పక్షం తలవంచింది! గొడవలు, అరుచుకోవడాలు.. తిట్టుకోవడాలు లేకుండా ఇంత పద్ధతిగా.. హుందాగా ఎలా మారిందబ్బా మన అసెంబ్లీ అని ఆశ్చర్యం వేస్తోంది కదా! ఆవులించినంతలోనే ఆశ్చర్యం ఆవిరయ్యే మాట కూడా చదవండి.. అది నిజమైన అసెంబ్లీ కాదు.. మాక్ అసెంబ్లీ!విజయవాడ, సత్యనారాయణపురంలోని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మెమోరియల్ హై స్కూల్.. తొమ్మిదో తరగతి ‘బి’ సెక్షన్ పిల్లలు నిర్వహించిన మోడల్ అసెంబ్లీ. అసలు ఇది ఎక్కడ.. ఎలా మొదలైందీ అంటే...సెప్టెంబర్ 5.. తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఉపాధ్యాయుడిగా మొదలైన ఆయన ప్రస్థానం ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవుల దాకా సాగింది. అందుకే ఆయన పుట్టిన రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా.. స్వపరిపాలనా దినోత్సవంగా జరుపుతోంది ప్రభుత్వం. ఆ సందర్భంగా ఈ స్కూల్లోని పిల్లలను కలిసింది ‘సాక్షి ఫన్డే’. ‘‘మీరే ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, హోం మినిస్టర్, ఆర్థిక మంత్రి, స్త్రీశిశు సంక్షేమ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, ఎక్సైజ్ శాఖ, ఎడ్యుకేషన్ మినిస్టర్... ఇలా పాలనా బాధ్యతలు నిర్వహించాల్సి వస్తే .. మీరేం చేస్తారు?’’ అని ప్రశ్నించాం క్లాస్ అందరినీ. నేటి పిల్లల్లో సామాజిక స్పృహ ఏదీ అని పెదవి విరిచే వాళ్లకు దీటైన సమాధానాలు ఇచ్చారు ఆ పిల్లలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణను కలిపేస్తా..‘‘నేను ప్రైమ్‌మినిస్టర్ అయితే ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణను కలిపేస్తా. విడిపోతే ఏం బాగాలేదు. అందరం కలిసే ఉండాలి. తెలంగాణ డెవలప్మెంట్ ఆగిపోయిందనే కదా.. విడిపోయింది. ఇప్పుడు కలిసిపోయి పాత తప్పులు మళ్లీ జరగకుండా చూస్తా.. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ.. అంతా సమానంగా డెవలప్ అయ్యేలా చూస్తా’’ అన్నాడు యు. శశి కుమార్ అనే విద్యార్థి. రైతులకే ప్రత్యేకతలు అబ్దుల్ రహీమ్ అనే అబ్బాయి ‘‘నేను ప్రైమ్‌మినిస్టర్ అయితే రైతులందరూ క్షేమంగా.. హ్యాపీగా ఉండేలా చూస్తా. మనది వ్యవసాయ ఆధారిత దేశం. రైతలు లేనిదే మనం లేము. రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తా. వాళ్లకే అన్ని ప్రత్యేకతలిస్తా’’అంటూ చెప్పాడు. షోయబ్ అఖ్తర్ అనే ఇంకో స్టూడెంట్ ‘‘నేను ముఖ్యమంత్రి అయితే కూడా రైతులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. వ్యవసాయరంగం ఆధారంగానే అభివృద్ధికి ప్లాన్చేస్తా..’’ అని అంటున్న అతని వాగ్ధాటిని అడ్డుకోవాల్సి వచ్చింది ‘‘అంటే ఎలా?’’ అనే ప్రశ్నతో. ‘‘వ్యవసాయాధారిత పరిశ్రమలు పెట్టాలి. ఎగ్జాంపుల్ పత్తి పండిస్తే.. కాటన్ పరిశ్రమ బాగా అభివృద్ధి అయ్యేలా చూస్తా. లోకల్‌గా ఉన్న వాళ్లకు ఎక్కువ జాబ్స్ ఇప్పిస్తా. జ్యూట్, ఆయిల్ పరిశ్రమలు వంటివాటిని బాగా డెవలప్ చేస్తా. పర్యావరణాన్నీ కాపాడేలా చర్యలు తీసుకుంటా. అడవులు నరికేయకుండా చట్టాలను స్ట్రిక్ట్‌గా అమలు చేస్తా. ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ మొక్కలు నాటిస్తా’’ అని షోయబ్ చెప్పబోతుంటే నౌషీన్ అనే అమ్మాయి ‘‘అవును. నేను కూడా మినిస్టర్ అయితే బాగా మొక్కలు నాటిస్తా. వర్షాలు పడ్డానికి ఎలాంటి వాతావరణం ఉండాలో అలాంటి వాతావరణం నెలకొల్పేలా చూస్తా. సైంటిస్ట్‌లతో ప్రజలకు ఉపయోగపడే పరిశోధనలు చేయిస్తా.. ఇప్పుడు కేరళకు వచ్చినటువంటి వరద ప్రమాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటా. ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్‌ల సలహాలు తప్పకుండా వింటా’’ అని చెప్పుకొచ్చింది. క్యాస్ట్ లేకుండా చేస్తా.. ‘‘నేను ప్రధానమంత్రి అయితే.. దేశంలో కులం పోయేలా చేస్తా. చదువులో, ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు ఉండేలా చూస్తా. కులం వల్లనే మనకు ఇన్ని గొడవలు, ఇబ్బందులు. అవన్నీ పోవాలంటే కులం పోవాలి. డబ్బున్న వాళ్లు, లేని వాళ్లు సమానం కావాలి’’ అని చెప్పాడు జేవీఎస్ శ్రీకాంత్. అందరికీ చదువు.. ఆకతాయిలను పనిలో పెడతా‘‘నేను విమెన్ అండ్ చైల్డ్వెల్ఫేర్ మినిస్టర్ అవుతా. ఆడవాళ్ల సంక్షేమం కోసం పనిచేస్తా. ఆడవాళ్లు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు బాగుంటారు. పిల్లలు బాగుంటేనే దేశం ఫ్యూచర్ బాగుంటుంది’’ అంది ఆవేశంగా వాణిశ్రీ అనే విద్యార్థిని. ఫణిభూషణ్ అనే అబ్బాయి ‘‘నేను హోం మినిస్టర్ అయితే.. ఆడపిల్లల మీద దాడులు జరగకుండా ఆపుతా. పనీపాట లేకుండా ఎవరూ రోడ్ల మీద తిరగకుండా చూస్తా. ఖాళీగా.. రోడ్ల మీద తిరుగుతూ.. అమ్మాయిలను ఏడిపిస్తూ ఎవరైనా కనపడితే ముందు వాళ్లను జైల్లో పెట్టకుండా పనిలో పెడతా. అయితే వాళ్లకు ఇన్ని గంటలే పని అని కాకుండా.. పొద్దున్నుంచి రాత్రి వరకు పనిచేయిస్తా. అట్లా వాళ్లకు పనిష్మెంట్ ఇస్తా. దాంతో వాళ్ల కాన్సన్ట్రేషన్ పనిమీదకే మళ్లుతుంది’’ అని చెప్పాడు. ట్రాఫిక్ కంట్రోల్చేస్తా.. బాల్య వివాహాలు ఆపుతా ‘‘నేను చీఫ్ మినిస్టర్.. కనీసం మినిస్టర్ అయినా సరే.. ముందు మన రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేస్తా. ప్రైవేట్ వాహనాలను రద్దు చేసి గవర్నమెంట్ వెహికిల్సే నడిచేలా చూస్తా. స్టూడెంట్స్‌తో ట్రాఫిక్ రూల్స్ మీద అందరికీ అవేర్నెస్ క్లాసెస్ ఇప్పిస్తా. అలాగే బాల్య వివాహాలు రద్దు చేస్తా. మా ఇంటి దగ్గర నా ఫ్రెండ్‌కి పదమూడేళ్లకే పెళ్లి చేశారు. ఒక యేడాది అయ్యేసరికి ఆ అమ్మాయి భర్త చనిపోయాడు. ఆ పిల్ల ఇప్పుడు వాళ్లమ్మవాళ్లింటికి వచ్చేసింది. చదువు లేదు. ఏదో గుళ్లో పనిచేసుకుంటోంది. ఆ అమ్మాయి లైఫ్ అలా పాడైపోయింది. అది చూసైనా ఆమె పేరెంట్స్ మారాలి కదా! మారకపోగా.. ఇప్పుడు వాళ్ల చెల్లికీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. వాళ్ల చెల్లి వయసు ఇప్పుడు పన్నెండేళ్లు. నేను, నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వాళ్ల చెల్లికి చెప్పాం.. ‘‘పెళ్లిచేసుకోకు.. చదువుకో’’ అని. కాని వాళ్ల పేరెంట్స్ వినరని పెళ్లికి ఒప్పేసుకుంటోంది. అలాగే నా ఫ్రెండ్‌కీ చెప్పా.. ‘‘ఇప్పుడన్నా చదువుకో’’ అని. పని చేయకపోతే ఇంట్లో తిడతారు అని భయపడుతోంది. మా ఇంటి దగ్గరే నేను ఇలాంటి పరిస్థితులను చూస్తున్నానంటే దేశం మొత్తం మీద ఇంకా ఎన్ని ఉండొచ్చు? అందుకే ముందు ఆడపిల్లలందరికీ చదువు చెప్పిస్తా. బాల్యవివాహాలు రద్దు చేయిస్తా. దీనికోసం ఉన్న చట్టాలు స్ట్రిక్ట్‌గా అమలు అయ్యేలా చేస్తా’’ అని చెప్పింది వాణిశ్రీ. లంచం లేకుండా చేస్తా.. పేదలకు ఇల్లు కట్టిస్తా ‘‘నేను ఫైనాన్స్ మినిస్టర్ అవుతా. పేదలందరికీ ఇళ్లు కట్టిస్తా. మన దేశంలో ఇల్లు లేనివాళ్లు ఉండకూడదు. అందరికీ పని కూడా ఇప్పిస్తా. విజిలెన్స్ వాళ్లతో చెప్పి ప్రభుత్వ పథకాలు అన్నీ సక్రమంగా అమలవుతున్నాయో లేదో చెక్చేయిస్తా. అవినీతి శాఖ వాళ్లు ఎప్పటికప్పుడు అలెర్ట్‌గా ఉండేలా చేస్తా. లంచం అనేదే లేకుండా చేస్తా. లంచం లేకుండా పోతే గవర్నమెంట్ పనులన్నీ కరెక్ట్‌గా టైమ్ వేస్ట్ కాకుండా జరుగుతాయి’’ హుషారుగా చెప్పాడు మదుసూధన్. ‘‘ఫైనాన్స్ మినిస్టర్‌కి ఇవన్నీ అధికారాలు ఉండవు తెల్సా? బడ్జెట్ ఒక్కటే నీ పని’’దుర్గా సత్యనారాయణ అనే అబ్బాయి అంటుంటే ‘‘తెలుసు.. కానీ అన్ని శాఖలతో ఫ్రెండ్షిప్ చేసి .. వాళ్ల హెల్ప్ తీసుకుంటా. వాళ్లకు నేను హెల్ప్ చేస్తా’’జవాబిచ్చాడు మధుసూదన్. లిక్కర్, సిగరేట్ బ్యాన్ చేస్తా.. ‘‘నేను ఎక్సైజ్ మినిస్టర్ అయి లిక్కర్, సిగరేట్, డ్రగ్స్ అన్నిటినీ బ్యాన్ చేస్తా. మా ఇంటి దగ్గర ఒక అంకుల్ 24 గంటలు తాగుతూనే ఉంటాడు. ఏ పనీ చేయడు. ఆంటీ, వాళ్ల పిల్లలు... నా కన్నా చిన్నవాళ్లు వాళ్లు.. పని చేసి డబ్బులు తెస్తారు. గొడవపడి ఆ డబ్బులు లాక్కెళ్లి మళ్లీ తాగుతుంటాడు ఆ అంకుల్. అందుకే వాటన్నిటినీ బ్యాన్ చేస్తా’’ అని కృపాప్రసాద్ అంటున్న మాటలకు పొడిగింపుగా లక్ష్మీపావని మాట్లాడుతూ ‘‘అవును.. వాటిని బ్యాన్ చేయాలి. గుట్కాను కూడా బ్యాన్చేయాలి. ఆరోగ్యానికి హానికరం అని వాటిమీదే ప్రింట్ చేసి మళ్లీ వాటినే అమ్ముతారెందుకు? అంటే ప్రజల హెల్త్ పాడైపోవాలనా? ప్రజల కోసం ప్రజల చేత ప్రజలే పాలించే ప్రభుత్వం మనది అని పుస్తకాల్లో చెప్తారు. అదే ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పాడయ్యే వస్తువులను అమ్ముతోంది ఎందుకు? బ్యాన్ చేయాలి కదా?’’ అంది. ‘‘వాటి మీద వచ్చే ఇన్‌కమ్‌తో వెల్ఫేర్ ప్లాన్స్ చేస్తుందట గవర్నమెంట్. అందుకే వాటిని బ్యాన్ చేయరట. కృపాప్రసాద్ నువ్వు ప్రైమ్‌మినిస్టర్ అయినా వాటిని బ్యాన్ చేయడానికి లేదు’’ చెప్పింది మహాలక్ష్మి. ‘‘ఎందుకు? అప్పుడు టాక్సెస్ బాగా పెంచాలి’’ సలహా ఇచ్చింది గ్రేస్ మేరీ. ‘‘ధరలు పెరిగితే మామూలు వాళ్లకు కూడా ప్రాబ్లమ్స్ తెల్సా?’’ మళ్లీ మహాలక్ష్మి. ‘‘అయితే నేను బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తా. దాంతో పేదవాళ్లకు చాలా చేయొచ్చు కదా లిక్కర్, సిగరేట్లు లేకుండానే’’ వెలుగుతున్న మొహంతో కృపాప్రసాద్. అమ్మాయిలు గోల్డ్‌మెడల్స్ కొట్టేలా.. ‘‘నేను కబడ్డీ ప్లేయర్‌ని. నేషనల్స్ ఆడాను. నేను చీఫ్ మినిస్టర్ అయితే.. అమ్మాయిలు స్పోర్ట్స్ బాగా ఆడేలా చూస్తా. వాళ్లు గోల్డ్ మెడల్స్ కొట్టేలా చేస్తా. పేద ఆడపిల్లలకు ఫ్రీగా కోచింగ్ ఇప్పిస్తా. కేవలం అమ్మాయిలకే కాదు.. పేదవాళ్లందరూ ఆటల్లో ఫస్ట్ ఉండేలా చేస్తా. స్పోర్ట్స్ కోటాలో వాళ్లందరికీ జాబ్స్ కూడా ఇప్పిస్తా’’ అంది లహరి. స్మార్ట్ ఫోన్స్ బ్యాన్ చేస్తా.. ‘‘నేను వెల్ఫేర్ మినిస్టర్ అయితే పిల్లలు చూడని తల్లిదండ్రులందరి కోసం ఓల్డేజ్ హోమ్స్ కట్టిస్తా. ముందు వాళ్లను అందులో ఉంచాక.. వాళ్ల పిల్లను పిలిచి కౌన్సెలింగ్ ఇప్పిస్తా. ఆర్ఫనేజెస్ కూడా కట్టిస్తా’’ అని చెప్పాడు దుర్గా సత్యనారాయణ. ‘‘నేను ఏ మినిస్టర్ అయినా ఫస్ట్ స్మార్ట్ ఫోన్స్ బ్యాన్ చేయిస్తా. వాటిల్లో వచ్చే బ్లూవేల్ వంటి పిచ్చి గేమ్స్ వల్ల వాటికి అడిక్ట్ అయిపోయి పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాగే అమ్మాయిలంతా చదువుకునేలా చూస్తా. జాబ్స్‌లో వాళ్లకు రిజర్వేషన్స్ ఇప్పిస్తా’’ చెప్పింది ఆర్తీ. పావని అనే అమ్మాయి కంటిన్యూ చేస్తూ ‘‘అవును నేను కూడా చీఫ్ మినిస్టర్ అయినా, న్యాయశాఖ మంత్రి అయినా ఆడవాళ్లకు, పేదలకు న్యాయం జరిగేలా చూస్తా. అమ్మాయిలందరూ చదువుకునేలా చేస్తా’’ అని చెప్పింది. ప్రాజెక్ట్‌లు.. పక్కా ఇళ్లు కట్టిస్తా.. ‘‘నేను ఇరిగేషన్ మినిస్టర్ అయితే.. ముందు ప్రాజెక్ట్‌లు కట్టిస్తా. వాటర్ వేస్ట్ కాకుండా చూస్తా. ఒకవేళ చీఫ్ మినిస్టర్ అయితే.. మన దగ్గర ఇళ్లు లేనివాళ్లందరికీ ఇళ్లు కట్టిస్తా. అసలు ఇల్లు లేనివాళ్లు లేకుండా చూస్తా. ఇంకా ఆడపిల్లలు సేఫ్‌గా ఉండేలా చర్యలు తీసుకుంటా. ప్రతి ఒక్కరు చదువుకునేలా చేస్తా. అమ్మాయిలు, అబ్బాయిలు ఈక్వల్‌గా ఉండేలా చట్టాలు తెస్తాను. ఇంట్లో తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్స్ ఇప్పిస్తా. నాకు ఒక అక్కయ్య ఉంది. మా పేరెంట్స్‌కు కూడా చెప్తుంటా..‘‘ నేను, అక్క ఈక్వల్’’ అని. ఇంట్లో పనులకు మా అక్కతో పాటు నేనూ అమ్మకు హెల్ప్ చేస్తుంటా. అట్లాగే దేశంలో అబ్బాయిలందరూ ఇలాగే ఉండేలా చూస్తా’’ అంటాడు దుర్గా సత్యనారాయణ. ‘‘నేను కూడా మా ఇంట్లో మా అమ్మకు, చెల్లికి హెల్ప్ చేస్తా. కూరలు తరుగుతాను, గిన్నెలు కడుగుతాను.. అన్ని పనులు చేస్తా’’చెప్పాడు అనిల్.‘‘నేను అగ్రికల్చర్ మినిస్టర్ అవుతా. రైతులందరికీ భూమి ఇస్తా. రుణమాఫీలు చేస్తా. పంటలు పండే నేలను పంటలకే ఉపయోగించేలా చేస్తా. అక్కడ ఫ్యాక్టరీలు.. బిల్డింగ్స్ కట్టకుండా బ్యాన్ చేస్తా’’ కంటిన్యూ చేశాడు అనిల్. మనకు మనమే ఆహార కొరత సృష్టించుకున్నట్టు.. ‘‘అనిల్ చెప్పినట్టు.. పంటలు పండే నేలను పంటలకే ఉంచాలి. దాంట్లో బిల్డింగ్స్ కట్టడం వల్ల ఆ నేలలో పండే పంటనంతా నష్టపోయినట్టే కదా మనం? అలా ఆహార కొరతను మనకు మనమే సృష్టించుకుంటున్నట్టు కదా! దీనివల్ల రైతులకే కాదు మనకూ నష్టమే. అందుకే పంటలు పండే నేలను పంటలకే కేటాయించేలా చూడాలి. నేను చీఫ్ మినిస్టర్ అయితే.. మన రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలనూ డెవలప్‌చేస్తా. ఏ ఊరికి ఏ ప్రత్యేకత ఉంటే ఆ ప్రత్యేకత ఇంకా పెరిగేలా చూస్తా. నీటి వసతి అంతగాలేని ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు కట్టిస్తా. దీనివల్ల అక్కడి ప్రాంతంలోని వాళ్లకు ఉద్యోగాలు దొరుకుతాయి.పంటనేలా కాలుష్యం కాదు. ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఏరియా అంతా మొక్కలు నాటించి చిన్నసైజు అడవుల్లా పెంచుతా. దీనివల్ల ఫ్యాక్టరీ వల్ల వచ్చే వాతావరణ కాలుష్యమూ అంత హానిగా మారదు’’ చెప్పింది హిమబిందు. గవర్నమెంట్ స్కూల్స్.. హాస్పిటల్స్.. ‘‘నేనూ అంతే. చీఫ్ మినిస్టర్ అయితే.. గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్స్ బాగా నడిచేలా చూసుకుంటా. ప్రైవేట్ స్కూల్స్, హాస్పిటల్స్ చాలా కాస్టీ›్ల. అందుకే గవర్నమెంట్ వాటినే బాగా నడిపిస్తా. ధరలు పెరగకుండా చూసుకుంటా. డబ్బున్న వాళ్లు కరెక్ట్‌గా టాక్స్‌లు కట్టేలా చర్యలు తీసుకుంటా’’ తన అభిప్రాయాన్ని చెప్పింది అనిత. వరకట్నం తీసుకునే వాళ్లను.. ‘‘నేను చీఫ్ మినిస్టర్ అయితే.. ముందు వరకట్నం తీసుకునేవాళ్లను జైల్లో పెడ్తా. బయటకు రాకుండా చూస్తా. అలాగే యాసిడ్ అటాక్స్ చేసేవాళ్లను కూడా జైల్లో పెడ్తా. అమ్మాయిలను ఏడిపించడం ఎంత తప్పో.. స్కూల్లోనే లెసన్స్ చెప్పిస్తా. అమ్మాయిలు బాగా చదువుకునేలా.. వాళ్లను వాళ్లు రక్షించుకునేలా అందరికీ స్కూళ్లల్లో కరాటే క్లాసెస్ ఇప్పిస్తా’’ మనసులో మాట చెప్పాడు నర్సింహ. వీళ్ల అభిప్రాయాలు అన్నీ విన్న తర్వాత.. అసలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎలా నడుస్తుందో తెలుసా అని అడగాలనిపించి.. అడిగాం. ‘‘తెలుసు.. టీవీల్లో చూస్తాం. కాని చిన్నపిల్లల్లా కొట్టుకుంటారు అసహ్యంగా’’ అని ముక్త కంఠంతో జవాబిచ్చారు అంతా. మరి ఎలా ఉండాలో మీరు చూపిస్తారా? అని అంటే.. అదిగో పైన ఇంట్రడక్షన్లో ఇచ్చాం కదా.. అలా ప్రశాంతంగా అసెంబ్లీని నడిపించి చూపించారు. పిల్ల మాటలు.. పిల్ల చేష్టలు అని కొట్టిపారేయొద్దు. ఈ పిల్లలకు పెద్దల కన్నా గొప్ప పరిశీలన ఉందని.. సమాజాన్ని గమనిస్తూ ఉన్నారని వాళ్ల అభిప్రాయాలతో చెప్పారు! వాళ్ల అభిప్రాయాలకు విలువనిద్దాం. ప్రభుత్వాలు, మనం.. విస్మరించిన చాలా విషయాలను, వివరాలను చక్కగా... సూటిగా.. గుండెకు తగిలేలా చెప్పారు. రైతుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామని, కూడు, గుడ్డ, నీడ.. ఇంకా అందని ఫలాలేని, మహిళలను గౌరవించాలని, మద్యాన్ని పారించి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పథకాలను రూపొందించొద్దని.. బాలలందరికీ బడికి వెళ్లే హక్కుందని.. పర్యావరణ హితాన్ని మరచిపోవద్దనే సత్యాలనూ బోధించారు. పచ్చి గోడ మీద అచ్చులా పడ్డ ఆ బాలవాక్కుని మెదళ్లలో నిక్షిప్తం చేసుకుందాం. కార్యాచరణగా చూపిద్దాం!ఈ భవిష్యత్ పరిపాలనా దక్షులకు వాళ్ల భవిష్యత్ తరాల కోసం ఇంకేవైనా కొత్త పనులు చేసే అవకాశం ఇద్దాం! చర్విత చర్వణాలను ఇప్పటికైనా చరమగీతం పాడదాం! స్వయం పాలనలో ఈ భావి భారత విధాతలు నేర్పుతున్న పాఠం ఇదే! – సరస్వతి రమ -
సర్వేపల్లికి వైఎస్సార్సీపీ నివాళులు..
హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు. -
సగం మందికే 'ప్రమోషన్'!
ఉపరాష్ట్రపతి పదవి అలంకరించిన 12 మందిలో ఆరుగురు మాత్రమే రాష్ట్రపతులయ్యారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి మహ్మద్ హమీద్ అన్సారీ సహా మిగిలిన ఆరుగురికి అత్యున్నత రాజ్యాంగ పదవి చేపట్టే అవకాశం రాలేదు. మొదటి ముగ్గురుసర్వేపల్లి రాధాకృష్ణన్, జాకిర్ హుస్సేన్, వీవీ గిరి రాష్ట్రపతులయ్యాక, ఆ తర్వాత ముగ్గురికి (గోపాల్ స్వరూప్ పాఠక్, బసప్ప దానప్ప జట్టి, మహ్మద్ హిదాయతుల్లా) ఆ అదృష్టం దక్కలేదు. తర్వాత వరుసగా ఉపరాష్ట్రపతులైన ముగ్గురూ (ఆర్.వెంకట్రామన్, శంకర్‌దయాళ్ శర్మ, కేఆర్ నారాయణన్) రాష్ట్రపతి పదవిని అధిష్టించారు. కాని, ఇప్పటికి చివరి ముగ్గురుకె.కృష్ణకాంత్, భైరోసింగ్ షెఖావత్, మహ్మద్ హమీద్ అన్పారీ రాష్ట్రపతి భవన్లో ఐదేళ్ల చొప్పున నివాసముండే అవకాశం దక్కించుకోలేకపోయారు. ‘ప్రమోషన్’ పొందిన ‘మొదటి’ ముగ్గురు! మొదటి ఉపరాష్ట్రపతిగా పదేళ్లు చేపిన సర్వేపల్లి రాధాకృష్టన్ పదవీకాలం ముగిసిన వెంటనే 1962లో రాష్ట్రపతి అయ్యారు. తర్వాత ఉపరాష్ట్రపతిగా ఉన్న జాకిర్ హుస్సేన్ కూడా 1967లో కాంగ్రెస్ మద్దతుతో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసిన తెలుగువాడైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు నుంచి హుస్సేన్ గట్టి పోటీ ఎదుర్కున్నారు. హుస్సేన్ పదవి చేపట్టిన రెండేళ్లకే మరణించడంతో ఉపరాష్ట్రపతి వీవీ గిరీని అదృష్టం వరించింది. 1969 రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ ‘అధికార’ అభ్యర్థి, ఆంధ్రపదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిని ఓడించడానికి ప్రధాని ఇందిరాగాంధీ నడుం బిగించారు. ‘ఉప’ పదవికి గిరితో రాజీనామా చేయించాక రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయించి ‘అంతరాత్మ ప్రబోధం’ పేరుతో గెలిపించారు. ‘రెండో’ ముగ్గురికి దక్కని చాన్స్! తర్వాత ముగ్గురికి రాష్ట్రపతి అయ్యే భాగ్యం దక్కలేదు. నాలుగో ఉపరాష్ట్రపతి అయిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జీఎస్ పాఠక్, తర్వాత ఈ పదవి అధిష్టించిన బీడీ జట్టి, ఐదో వైస్‌ప్రెసిడెంట్ మహ్మద్ హిదాయతుల్లా(సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్)ను రాష్ట్రపతిని చేయాలనే ఆలోచన రాజకీయపార్టీలకు రాలేదు. పాఠక్, హిదయతుల్లా ‘ప్రమోషన్’కు ప్రయత్నించలేదు. మైసూరు మాజీ సీఎం అయిన జట్టికి 1977లో కాంగ్రెస్ ఓటమి ఆ అవకాశం ఇవ్వలేదు. ‘మూడో’ ముగ్గురూ ‘ప్రథమ పౌరులయ్యారు’! ఆ తర్వాత ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన ముగ్గురూ కేంద్ర మంత్రులుగా పనిచేసినవారే. 1982లో ఇందిర ప్రధానిగా ఉండగా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన కేంద్ర మాజీ మంత్రి ఆర్. వెంకట్రామన్ మూడేళ్లకే 1987లో ప్రధాని రాజీవ్‌గాంధీ నిర్ణయంతో రాష్ట్రపతి అయ్యారు. ఆయన తర్వాత ఉపరాష్ట్రపతిగా ఉన్న మాజీ గవర్నర్ ఎస్డీ శర్మ పదవీ కాలం ముగిసే సమయానికి 1992లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీచేసి గెలిచారు. తర్వాతి ఉపరాష్ట్రపతి కేఆర్ నారాయణన్ కూడా 1997లో దాదాపు అన్ని పారీ్టల మద్దతుతో తొలి ‘దళిత’ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ‘నాలుగో’ ముగ్గురికీ అందని అదృష్టం! యునైటెడ్ ఫ్రంట్ ప్రధాని ఐకే గుజ్రాల్ హయాంలో(1997లో) ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ కృష్ణకాంత్ ఉపరాష్ట్రపతి అయ్యారు. 2002లో అప్పటి ఏపీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు మద్దతుతో రాష్ట్రపతి పదవికి అభ్యర్థి అయ్యే అవకాశం మొదట కనిపించింది. తర్వాత కొన్ని పరిణామాల వల్ల పదవి ఆయనకు అందినట్టే అంది జారిపోయింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్ పీసీ అలెగ్జాండర్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వ్యతిరేకించడంతో ఏపీజే అబ్దుల్ కలాం పేరు చివరకు ఖాయమైంది. కృష్ణకాంత్ తర్వాత పదవిలోకి వచ్చిన షెఖావత్ 2007 రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతిభా పాటిల్‌పై పోటీచేసి ఓడిపోయారు. తర్వాత యూపీఏ, వామపక్షాల మద్దతుతో ఉపరాష్ట్రపతి అయిన మాజీ గవర్నర్ ఎంహెచ్ అన్పారీని 2012లో సోనియా రాష్ట్రపతిగా చేయాలని భావించినా చివరికి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీకి అవకాశమిచ్చారు. అన్సారీ నొచ్చుకోకుండా రెండోసారి ఆయనను ఉపరాష్ట్రపతిని చేశారని అంటారు. పైన చెప్పిన 12 మంది ఉపరాష్ట్రపతుల్లో ముగ్గురు ముగ్గురు చొప్పున ఆరుగురు రెండు విడతలుగా రాష్ట్రపతులయ్యారు. మరి ఈ ‘ఆనవాయితీ’ కొనసాగితే ఆగస్ట్ ఐదున జరిగే ఎన్నికలో గెలుపు ఖాయమనుకుంటున్న ఎం. వెంకయ్యనాయుడికి ప్రమోషన్ లభిస్తుందా? అన్నది భవిష్యత్ కాలమే నిర్ణయిస్తుంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
బోధన వృత్తి.. తాత ఇచ్చిన ఆస్తి
చిరునవ్వుల స్నేహశీలి సర్వేపల్లి ఏయూ క్యాంపస్(విశాఖ తూర్పు): పరిచయం అవసరం లేని వ్యక్తిత్వం.. అధ్యాపక వృత్తికే వన్నె తెచ్చిన ప్రతిభ.. భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన గొప్ప తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఆయన పనిచేశారు. సర్వేపల్లి మనుమడు గౌతమ్ రాధాకృష్ణన్ గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. తాతతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ విశేషాలను ఆయన మాటల్లోనే విందాం. బోధన వృత్తి.. తాత ఇచ్చిన ఆస్తి తాత అధ్యాపకుడిగా ప్రపంచానికి పరిచయం అయ్యారు. మాలో 12 మంది వేర్వేరు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. నేనొక్కడినే అధ్యాపక వృత్తిలోకి వచ్చాను. ఆయన నుంచి నాకు వచ్చిన ఆస్తి అధ్యాపక వృత్తే. వ్యక్తిగత జీవితం వేరు మా తాతకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. మొత్తం 13 మంది మనుమలం. ఒకరు చనిపోగా ప్రస్తుతం 12 మంది ఉన్నాం. నేను చిన్న కుమార్తె కుమారుడిని. తాత వ్యక్తిగత జీవితానికి, వృత్తి పరమైన జీవితానికి వ్యత్యాసం ఉండేది. రెండింటికీ తగిన సమయం కేటాయించేవారు. ఆడంబరాలకు దూరం తాత ఎక్కువగా మాకు దగ్గరవడానికే ప్రయత్నించే వారు. ఎప్పుడూ మీరు అని సంభోదించడానికి ఇష్టపడే వారు కాదు. నువ్వు అని పిలవమనే వారు. సాధారణంగా ఉండాలని కోరుకునేవారు. ఏనాడూ ఆడంబరాలకు పోలేదు. రూపాయి వేతనం తీసుకునే వారు తాత రాష్ట్రపతిగా పనిచేసిన సమయంలో కేవలం ఒక రూపాయి వేతనంగా తీసుకునేవారు. రాష్ట్రపతి భవన్ లో ఒక పాత కారు ఉండేది. మా కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరు వచ్చినా స్టేషన్ నుంచి ఆ పాత కారులోనే తీసుకువచ్చేవారు. కారు తరచూ మరమ్మత్తులకు గురవుతున్నప్పటికీ.. అధికారిక వాహనాలను కుటుంబ అవసరాలకు ఎప్పుడూ వాడలేదు. ప్రత్యేకంగా వంటగది, వ్యక్తిగత వంట మనిషి ఉండేవారు. తాత వాడిన పాత కారు డ్రైవర్‌కు సొంతంగా వేతనం ఇచ్చేవారు. తాతలో చిరునవ్వే చూశాను ఆయనలో ఎప్పుడూ కోపం చూడలేదు. హాస్యంతో అందరినీ ఆనంద పరిచేవారు. గంభీరమైన సందర్భాలను సైతం ఆయన ఎంతో నవ్వుతూ స్వీకరించేవారు. ఆయనను నేను చాలా దగ్గరగా చూశాను. కుటుంబసభ్యుల పైనే కాదు.. ఎవ్వరిపైనా కోపగించుకోవడం నా జీవితంలో చూడలేదు. నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో మూడు దశాబ్దాల పైగా పనిచేశాను. దశాబ్ద కాలం వరకు నేను సర్వేపల్లి మనవడిననే విషయం ఎవ్వరికి తెలియదు. అన్నం, చారు, అప్పడం నేను చూసిన రోజుల్లో తాత ఎప్పుడూ భోజన ప్రియుడిగా కనిపించలేదు. ఎక్కడికైనా పార్టీలకు వెళ్లాల్సి ఉన్నా ఇంటిలో వండిన అన్నం, చారు, అప్పడం వంటి వాటితో భోజనం ముగించేవారు. సభా మర్యాద కోసం అందిరితో కలసి భోజనం వద్ద కూర్చునేవారు. ఎన్ని ఆహార పదార్థాలు ఉన్నా.. ఆయన మాత్రం పరిమితంగానే తినేవారు. ఎక్కువగా గడిపా..తాతతో చిన్నతనంలో ఎక్కువ సమయం తాతతో గడిపే అవకాశం వచ్చింది. నాకు ఊహ తెలిసిన నాటి నుంచి సుమారు 15 ఏళ్ల కాలం తాతను దగ్గరగా చూశాను. తాత వాస్తవిక దృక్పథం ఉన్న వ్యక్తి. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ప్రసంగ పాఠాన్ని ఆయనే తయారు చేసుకునేవారు. ఒక రోజు గుండె సంబంధిత ప్రసంగం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. నేను అనుకోకుండా తాత గదిలోనికి వెళ్లాను. వెంటనే గుండె జబ్బులు ఎందుకు వస్తాయి అంటూ ప్రశ్నించారు. గుండె ఎలా పని చేస్తుంది, గుండె సమస్యలు ఎలా వస్తాయి అనే విషయాలు తెలియజేశారు. ఆయన పరిశోధన ఆసక్తికి ఈ సంఘటన నిదర్శనం. -
వశం చేసుకోవడం కాదు... వశవర్తులు కావడం నేర్చుకోవాలి..!
డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు-అన్నదానితో సంబంధం లేకుండా, సంపాదిస్తున్నాడా లేదా అదొక్కటే ప్రమాణంగా... అతి తక్కువకాలంలో ఎంత ఎక్కువ సంపాదించవచ్చన్న లక్ష్యంగా వెడుతున్నాడనుకోండి. వాడంత ప్రమాదకరమైన మనిషి మరొకడుండడు. అందుకే... మీరేం చేస్తున్నారన్నది కాదు, ఎలా చేస్తున్నారన్నది ప్రధానం. మన ఆర్షవాఙ్మయం అంతా ధర్మం గురించే మాట్లాడుతుంది. ధర్మం అంటే... నీవల్ల ఎంతమందికి ఉపయోగముంటున్నది, నీ బతుకు ఎంతమందిని బతికిస్తున్నదన్నది ఇందులో ముఖ్యం. ఇది సాధించాలంటే గురువు దగ్గర ఎప్పుడూ బుద్ధి శిక్షింపబడడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే శిష్యుడు’ అని అంటారు. బుద్ధి శిక్షింపబడడమంటే... గురువుకి వశవర్తి కావాలి. నేనుగా గురువుగారికి లొంగిపోతున్నాను - అని సంకల్పం చేసుకుని గురువుగా ఏ మాట చెబితే ఆ మాట శిరసా వహిస్తాను’ అన్నాడనుకోండి. అప్పుడతడు సమాజానికి పనికివచ్చేవాడవుతాడు. ‘నేను ఎవ్వరికీ లొంగను. నేననుకుంటే నా మాట నేనే వినను’ అన్నాడనుకోండి. వాడంత పనికిమాలినవాడు ఇంకొకడు ఉండడు. వాడిమాట వాడే వినకపోతే ఎవడికి పనికొస్తాడు? అంతకన్నా దౌర్భాగ్యమైన మాట మరొకంటుంటుందా? ఉండదు. ఒక గుర్రం ఉంది. గొప్పగా దౌడు తీయగలదు. కొండలు, గుట్టలు కూడా ఎక్కగలదు. అది తనమీద ఎక్కి స్వారీ చేస్తున్న వ్యక్తిని క్షేమంగా తీసుకెడుతుంది. అలా తీసుకెళ్లగలిగిన దానినే ఉత్తమాశ్వం అంటారు. అది తన యజమానికి వశమైపోతుంది. ఏనుగు చాలా బలంగా ఉంటే, మావటివాడేమో బలహీనంగా ఉంటాడు. అది కట్టుకొయ్య దగ్గరకెళ్లి అక్కడ ఉన్న ఇనుప గొలుసులను తొండంతో తీసి మావటికి ఇచ్చి కట్టవలసిందని కాలు చాపుతుంది. నిజానికి ఏనుగు కదలకుండా ఉండలేదు. అది కదలకపోయినా కనీసం తొండమన్నా కదిలిస్తూనే ఉంటుంది. అరుణాచలం, వేంకటాచలం వంటి క్షేత్రాలకు వెళ్లి చూడండి. మావటి తన చేతిలో ఉన్న అంకుశాన్ని దాని రెండు ముంగాళ్ల వద్ద పెడతాడు. అంతే. అది దాటదు. కాలు ఎత్తుతుంది, కానీ వెనక్కి తీసుకుంటుంది తప్పితే అడుగు ముందుకు వేయదు. ‘నేను దాటను’ అని దానికది పెట్టుకుందా నియమం. నిజానికి అంకుశం సంగతి సరే, తొండంతో మావటిని తిప్పి విసిరివేయగల శక్తి ఉన్నా మావటికి తనకు తానుగా లొంగిపోయింది. కాబట్టే వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవమూర్తిని ఉరేగింపుగా తీసుకెడుతుంది. పండితులకు పెద్ద సత్కారం - గజారోహణం. దాని అంబారీ మీద కూర్చోబెడతారు. గాడిద వెనుక ఎవరైనా నిలబడితే కాళ్లతో తంతుంది. అలాంటిది అది దాని యజమానికి వశమైపోయిన తరువాత ఎంత బరువయినా మోస్తూ ఉపయోగపడుతుంది. కుక్కకు ఒక లక్షణం ఉంటుంది. పట్టెడన్నం పెడితే చాలు ఎంతగా వశమైపోతుందంటే యజమాని ఇంట్లో ఉన్నా లేకపోయినా, ఊరెళ్లినా ఇంటికి దొంగల బారి నుంచి కాపలా కాస్తుంది. కర్ర పెట్టి కొట్టినా, రాళ్లు విసిరినా మొరుగుతూనే ఉంటుంది. దూరంగా తరిమినా మొరగడం ఆపదు. యజమానికి వశవర్తి అయిపోయింది. ఎద్దు-దానికేమీ తెలియదు. బండి తెచ్చి కాడి పెకైత్తి దాని కిందకు రమ్మంటే మొదట మొరాయిస్తుంది. నాలుగు రోజులు బండికి కట్టిన తర్వాత రైతు ఎద్దులను తీసుకురాడు. అవి అటొకటి, ఇటొకటి పడుకుని ఉంటాయి. కాడి ఎత్తి పట్టుకుని వాటివంక చూస్తూ నోటితో చిన్న శబ్దం చేస్తాడు. అంతే! రెండూ లేచి వచ్చి మెడ దానికింద పెట్టేస్తాయి. ఎద్దు వశవర్తి అయింది. కాబట్టే రైతు దానిని కుటుంబసభ్యులలాగా ఆదరిస్తాడు. ఏరువాక పౌర్ణమి వస్తే పసుపు కుంకుమలతో పూజించి ప్రత్యేకంగా దానికి పాయసాన్ని వండి పెడతాడు. లోకంలో నోరులేని ప్రాణులు కూడా వశవర్తులయ్యాయి కాబట్టే, సమాజానికి ఉపయోగపడుతున్నాయి. అటువంటిది ఒక మనిషి ‘నేను ఎవరి మాటా వినను, నామాట నేనే వినను’ అంటున్నాడంటే వాడు మనుష్య జన్మకు పనికొచ్చేవాడేనా? అందుకే తనంతటతానుగా వశపడాలి. ఎవరికి? ఎవరు తనకు హితైషులో, ఎప్పుడూ తన హితాన్ని కోరుతారో వారికి వశవర్తి కావాలని వేదం చెప్పింది. తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురికీ వశవర్తి కావాలి. అంటే ‘వాళ్లు చెప్పింది నాకు శిలాశాసనం’ అనుకోవాలి. వాళ్లేం చెప్పారో అది చేయాలి. అలా చేయాలంటే ఉండాల్సింది వినయం. అదెలా వస్తుందంటే ‘నాకు వీళ్లు దైవసమానులు. వాళ్లు నా హితం కోరి చెబుతారు. కాబట్టి నేను వాళ్ల మాట వినాలి’ అన్న సంకల్పంతో! మీకు పాఠాలు చెప్పే గురువు కూడా మీ కుటుంబసభ్యుడే అని గుర్తించండి. నేను, నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులతో పాటూ నా గురువుగారు కూడా కలిస్తేనే అది నా కుటుంబం అని భావన చేసుకోండి. గురువుగారంటే కేవలం నాకు పాఠం చెప్పడం వరకే కాదు. ‘‘దీని తరువాత నా స్థాయిబట్టి నేనేం చేస్తే బాగుంటుంది, నేను ఏం చదవవచ్చు, నా మనస్తత్వం దేనికి సరిపోతుంది, గురువుగారూ, దయచేసి నాకు సలహా చెప్పండి’’ అనో, ‘‘సార్ ! నేను బాగా చదువుకోలేకపోతున్నాను. నాకు పాఠం అర్థం కావడం లేదు. దయచేసి నాకు ఇంకొక్కసారి చెప్పండి’’ అని మనసువిప్పి గురువుగారితోటి మీ కుటుంబసభ్యునిలా గౌరవించి మాట్లాడడం నేర్చుకోండి. ఆ వినయం అలవాటు పడిన నాడు, గురువుకి వశవర్తి అయిన నాడు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు. మహాజ్ఞాని, తత్త్వవేత్త, రాజనీతిజ్ఞుడు, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారి పుట్టినరోజున అంటే సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం కదా.. ఆ రోజున ఎవరో బయటివాళ్లను తీసుకువచ్చి ఉపన్యాసాలు చెప్పించి, పూలదండలు వేయించాలని ఆయన చెప్పలేదు. ఆయన ప్రసంగాలు శ్రద్ధగా చదివితే ఆయన మనస్సేమిటో తెలుస్తుంది. ఆయన కోరుకున్నదేమిటంటే... ‘‘ఆ రోజున నాకు పూలదండ వేయవద్దు. మీకు పాఠాలు చెప్పే గురువుగారు కూడా మీ కుటుంబసభ్యుడే అని గుర్తించండి. -
ఆచారం-అపచారం
జీవన కాలమ్ నాకేమో చక్రవర్తి రాజగోపా లాచార్యులుగారు, ఎం.జి. ఆర్., కరుణానిధిగారు ఎల్ల ప్పుడూ నల్లకళ్లద్దాలు పెట్టుకో వడం ఎబ్బెట్టుగా అనిపిస్తుం ది. అయితే వారికి ఏ కంటి జబ్బులో, మరేవో కారణాలు ఉండవచ్చు. కాగా, ఈ ముగ్గు రు నాయకులూ తమిళనాడు వారే కావడం మరో విశేషం. ఒకే రకం జబ్బున్న లేదా అలవాటున్న ముగ్గురు గొప్ప నాయకుల రాష్ట్రమది. ఏది చేసినా చేయకపోయినా కన్ను ఎదుటి వ్యక్తి పట్ల మన మర్యాదనీ, గౌర వాన్నీ, అభిమానాన్ని - ఇన్నింటిని సూచి స్తుంది. కన్ను మన వ్యక్తిత్వాన్ని, శీలాన్ని ఆవిష్కరించే కిటికీ. కనుక కళ్లను దాచిపెట్టి ఎదుటి వ్యక్తిని పలకరించడం కాస్త అపచా రమే. ఇలాంటి అపచారాన్ని మొన్న ఛత్తీస్ గఢ్కి ప్రధాని వచ్చినప్పుడు ఇద్దరు కలెక్టర్లు చేశారు. వీరు మర్యాదల గురించీ, విధుల గురించీ, సంప్రదాయాల గురించీ సశాస్త్రీ యంగా తర్ఫీదు పొందినవారు. అయినా మొన్న బస్తర్ కలెక్టరు సతీష్ కటారియాగారు, దంతెవాడ కలెక్టరు దేవ సేనాపతిగారు - ఇద్దరూ ప్రధాని పర్యటనలో ఒకే రక మయిన సంప్రదాయ ఉల్లంఘన చేశారు. పాపం, తొడు క్కోడానికి వారిద్దరూ బంద్గాలాలు తెచ్చుకున్నారు. ఆ కారణంగానే టైలు తెచ్చుకోలేదు. ఎండ ఎక్కువగా ఉం డటంవల్లనూ, హుటాహుటిన ప్రధాని రావడం వల్లనూ- వారు బంద్గాలాని ధరించలేదు. ముఖ్యంగా నల్లకళ్లద్దాలను తీసేయలేదు. ఆ దృశ్యం- సినీమాకు భార్యతో వెళ్తూ దారిలో కనిపించిన పెద్ద మనిషి - ప్రధానిని - వారు సరదాగా పలకరించినట్టు కని పించింది. ఇది అపచారమని రాష్ట్ర ప్రభుత్వం వారిని హెచ్చరించింది. అలనాడు- కొలువుల్లో పనిచేసిన వారూ, ప్రజా జీవితాన్ని గడిపిన వారూ చాలా మంది పెద్దలు తల పాగాలతో కనిపించడం చూస్తూనే ఉంటాం. సర్వేపల్లి రాధాకృష్ణన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సి.పి.రామ స్వామి అయ్యర్, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, ముట్నూరి కృష్ణారావు, పారుపల్లి రామకృష్ణయ్య, వీణ వెంకట రమణదాసు, బాలగంగాధర తిలక్, లాలా లజ పతిరాయ్, మదనమోహన్ మాలవ్యా, స్వామి వివేకా నంద, నాటకాలకి కాక ప్రజల మధ్యకి వచ్చేటప్పుడు అద్దంకి శ్రీరామమూర్తిగారు తలపాగా చుట్టుకునేవారు. ఒక సంప్రదాయానికి కట్టుబడిన తరమది. తాను ప్రజలకు ప్రధాన సేవకుడినని మోదీగారు పదే పదే చెప్పుకుంటూంటారు. ఆ లెక్కన ప్రజాసేవకు ఉద్యోగం చేస్తున్నవారు వీరిద్దరూ. పైగా ఇలాంటి మర్యా దలు ఆలిండియా సర్వీసు నిబంధనలలో ఒక భాగం. నాకెప్పుడూ పెద్దపెద్ద సభల్లో ప్రసంగిస్తున్న ప్రధాని, ముఖ్యమంత్రి వెనుక నల్లకళ్లద్దాలు పెట్టుకుని నిలబడే ఇద్దరు ఆఫీసర్లు అపశ్రుతిలాగ కనిపిస్తూంటారు. అయితే రహస్య పరిశోధకశాఖకు చెందిన వారి పని -తామెటు, ఎవరిని చూస్తున్నారో తెలియకుండా అందరినీ కనిపెట్ట డమేనని జ్ఞప్తికి వచ్చినప్పుడు రాజీపడతాను. ఒక ముఖ్యమైన సంఘటన. 1982 ఏప్రిల్‌లో నటుడినయ్యాను. నా రెండో సినీమా క్రాంతికుమార్ ‘ఇది పెళ్లంటారా?’. ఆ సినీమాలో నా పాత్రకి మాసిన గెడ్డం ఉండాలి. పెంచమన్నాడు క్రాంతికుమార్. నేను కడప రేడియో స్టేషన్‌కి ఇన్చార్జిని. ఆ రెండు మూడు నెలల్లో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిగారు అనంత పూర్ వచ్చారు. ఆ సందర్భంలో స్థానిక సంస్థల అధిప తులు అక్కడ నిలవడం మర్యాద. నేనూ వెళ్లాను. ప్రొటో కాల్ ఆఫీసరు నన్ను చూసి, నా మాసిన గెడ్డం చూసి ఇబ్బంది పడిపోయాడు. నా కారణాలు చెప్పాను. ఆయ న అంగీకరించలేకపోయాడు. నన్ను రెండో వరసలో నిల బెట్టాడు. అదృష్టవశాత్తూ ఆ పర్యటనలో నా ప్రమే యం- కేవలం లాంఛనం తప్ప ఏమీలేదు. తీరా సంజీ వరెడ్డిగారు హెలికాప్టర్ దిగి సరాసరి కారు దగ్గరికి వెళ్లి ఎక్కేశారు. అది ప్రైవేట్ రాక అని గుర్తు. అలాంటి పర్యటనకి ప్రొటోకాల్ పట్టింపు ఎక్కువ ఉండదేమో. ఏమయినా ప్రభుత్వపరంగా సేవా ధర్మం నీచమయిన మాటకాదు. ఈ దేశపు ప్రధాని ముందు నిలిచినప్పుడు- బాధ్య తాయుతమైన జిల్లా అధికారి - పది మం దికి మార్గదర్శకం కావలసిన అధికారి- లాంఛనాలను పాటించకపోవడం అప శ్రుతి. కొన్ని లాంఛనాలు వ్యవస్థకి ఒక గౌరవాన్నీ, గాం భీర్యాన్నీ ఇస్తాయి. కొన్నింటిని పాటించడం ఆయా స్థాయిలలో తప్పనిసరి. ఒక ప్రముఖ వ్యక్తి వచ్చినప్పుడు లేచి నమస్కరిం చడం మర్యాద. నమస్కరించకపోతే? ఒక విలువ దెబ్బ తింటుంది. అంతే. అయితే ఒక అధికారికి మరో అధికారి ఇవ్వాల్సిన మర్యాద - కేవలం మర్యాద మాత్రమే కాదు. ఒక సంప్రదాయ పరిరక్షణ. బాధ్యత. ఇవ్వకపోతే? ఒక వ్యవస్థ గాంభీర్యం దెబ్బతింటుంది. తర్వాత ఏం జరుగు తుందన్నది వేరే విషయం. అది అరాచకం. గొల్లపూడి మారుతీరావు -
శ్రీ విద్యానికేతన్ వద్ద ఉపాధ్యాయ దినోత్సవ సంబరాలు
-
ఫేస్బుక్లో సర్వేపల్లి అరుదైన చిత్రం
కొత్తపేట: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భం గా సర్వేపల్లి రాధాకృష్ణన్ అరుదైన చిత్రాన్ని శుక్రవారం ఫేస్బుక్లో పెట్టినట్లు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన అద్దంకి బుద్ధచంద్రదేవ్(ఏబీసీ దేవ్) తెలిపారు. ప్రి యదర్శినీ బాలవిహార్ వ్యవస్థాపకుడు అద్దం కి కేశవరావు ఎన్నో అరుదైన చిత్రాలు, గ్రంథా లను సేకరించి తన లైబ్రరీలో భద్రపరిచారు. వాటిల్లో 1962లో రాధాకృష్ణన్ శాలువా కప్పుకుని కుర్చీలో కూర్చున్న ఒరిజినల్ ఫొటోను ఫేస్బుక్ ఫాలోవర్ల కోసం పోస్టు చేసినట్టు కేశవరావు తనయుడు ప్రియదర్శినీ బాలవిహార్ సెక్రటరీ, కరస్పాండెంట్ దేవ్ తెలిపారు. -
పెను మార్పులు అవసరం
గురుపూజోత్సవంలో విద్యా విధానంపై సీఎం చంద్రబాబు పరిశీలన, సృజనతో కూడిన చదువులు కావాలి రాష్ట్రాన్ని నాలెడ్జి సొసైటీగా మార్చాలి ఏటా మండలానికో విద్యార్థికి సీఎం ఫెలోషిప్ టీచర్లందరికీ బోధనకు దోహదపడే ఐపాడ్స్ ఎయిడెడ్, వర్సిటీ టీచర్లకు ఉద్యోగ విరమణ వయసు త్వరలోనే 62కు పెంపు సాక్షి, గుంటూరు/ విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో అమల్లో ఉన్న విద్యావిధానంలో పెనుమార్పులు అనివార్యమనీ, ప్రస్తుతం.. పరిశీలన, సృజనాత్మకత, సరికొత్త ఆలోచనలతో కూడిన చదువులు విద్యార్థులకు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇందులో భాగస్వాములు కావాలన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుని దేశం డిజిటల్ ఇండియాగా మారేందుకు పరుగులు తీస్తున్న క్రమంలో రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి పరిచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో చంద్రబాబు ఉపాధ్యాయులు, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. విద్యా సంస్థలన్నింటిలోనూ వినూత్న ఆలోచనలు, విస్తృత పరిశోధనలకు పెద్దపీట వేస్తూ బోధన జరగాలన్నారు. సంస్కారవంతమైన చదువులు విద్యార్థుల ఉజ్వల భవితకు దోహదపడతాయన్న విషయాన్ని గుర్తెరిగి ఉపాధ్యాయులందరూ బోధనా పరమైన అవకాశాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. సమగ్ర విద్యావిధానానికి చక్కగా దోహదపడే ఉపాధ్యాయులందరికీ బోధనకు ఉపయుక్తంగా ఉండే ఐపాడ్లను అందజేస్తామన్నారు. త్వరలో ఎయిడెడ్, యూనివర్సిటీ టీచర్ల ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ జీవో విడుదల చేయనున్నట్లు తెలిపారు. 177 మంది టీచర్లకు అవార్డులు 177 మంది ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థినులు పూర్ణ, ఆనంద్‌లను సీఎం సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. వారికి ల్యాప్‌టాప్‌లను బహూకరించారు. చదరంగంలో అత్యంత ప్రతిభ కనబర్చిన తెనాలికి చెందిన బి.మౌనిక అక్షయను సత్కరించారు. షార్ డెరైక్టర్ డాక్టర్ ఎన్.వి.ప్రసాద్, సాహితీవేత్త గరికపాటి నరసింహారావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యూరు. అధ్యాపకుల వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్టుగా సీఎం చేసిన ప్రకటనను పురస్కరించుకుని ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు చంద్రబాబును సత్కరించారు. -
'వారి వల్లే నేనీ స్థాయిలో ఉన్నా'
-
గురువులకు.. వందనం
-
గత వైభవానికి పునరంకితం
తత్వశాస్త్ర ఆచార్యుడిగా విద్యార్థులను పరవశింపజేసిన అత్యుత్తమ గురువు ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా... అంకితభావంతో, నైతిక విలువలతో, స్వీయ కర్తవ్యోన్ముఖులై విద్యారంగాన్ని తీర్చిదిద్దుతామని ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేయాలి. వృత్తులన్నింటికీ మూలమైనది బోధనావృత్తి, సమాజంలో డాక్టర్లు, ఇంజనీర్లు, పాలనారంగ ప్రముఖులైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, న్యాయవాదులు, మంత్రులు, ప్రధాన మంత్రులు అందరినీ తీర్చిదిద్దే గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఒక సందర్భం లో, జాతీయోద్యమ నేత బాలగంగాధర తిలక్ ‘‘నేను ప్రధాని కావాలని కోరుకోవడం లేదు. అవకాశం ఉంటే అధ్యాపకుడిగా కొనసాగాలని అనుకుంటున్నాను. ఎందరో ప్రధానులను తీర్చిదిద్దగల అవకాశం అధ్యాపకుడికి మాత్రమే ఉంటుంది’’ అని చెప్పిన అభిప్రాయం అధ్యాపక వృత్తి ఔన్నత్యాన్ని చాటిచెబుతుంది. ‘‘ఉపాధ్యాయులు ఉన్నత పదవుల్లో ఉన్న విద్యార్థులను గూర్చి గర్వంతో ఉప్పొంగడం కన్నా తమ నిర్లక్ష్యానికి గురై అగమ్యంగా రోడ్లపై తిరిగే వారిని గూర్చి ఆలోచించి, సంస్కరించే ప్రయత్నం చేయుట కర్తవ్యం’’ అంటారు మదర్ థెరిస్సా. ‘‘ఉపాధ్యాయుల కర్తవ్యాన్ని గుర్తు చేయవలసిన స్థితి శోచనీయం. వారు తమ బోధనా నైపుణ్యాలను పెంపొందించుకొని సమాజానికి న్యాయం చేయాలి’’ అంటారు అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్ ఉపాధ్యాయులు.ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్ గురువులకే గురువు. విజ్ఞాన కల్పతరువు. ఆయన 1888 సెప్టెంబర్ 5వ తేదీన తిరుత్తణిలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన ఏక సంథాగ్రాహి. మైసూర్ విశ్వవిద్యాలయం ప్రధాన ఆచార్యులుగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతిగా (1931-36) బెనారస్ విశ్వవిద్యాలయ ఉప కులపతిగా (1936-39) బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి విద్యావేత్తల ప్రశంసలందుకున్నారు. యూజీసీ చైర్మన్‌గా భారతదేశంలో ఉన్నత విద్యకు సంబంధించి, ఎన్నో సంస్కరణాత్మక సూచనలు చేశారు. తత్వవేత్తగా ‘భారతీయ తత్వశాస్త్రం’, ‘ఎతిక్స్ ఆఫ్ వేదాంత’, ‘ఈస్ట్రన్ రెలిజియన్’, ‘వెస్ట్రన్ థాట్’ వంటి గ్రంథాలు వ్రాసి, పాశ్చాత్యుల ప్రశంసలు పొందారు. భారత రాజ్యాం గ పరిషత్ సభ్యులుగా, రష్యా రాయబారిగా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా గొప్ప రాజ నీతిజ్ఞులు అనిపించుకున్నారు. ఉపాధ్యాయ వృత్తి నుండి అమేయమైన ప్రతిభతో, అపారమైన మేధస్సుతో భారత రాష్ట్రపతి పదవి అలంకరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఉపాధ్యాయ లోకానికే ఆయన గర్వకారణం. అందుకే భారత ప్రభుత్వం ఆయన జన్మదినోత్సవాన్ని 1962 నుంచి గురుపూజా మహోత్సవంగా నిర్వహిస్తోంది. నేడు విద్యారంగం కలుషితమైపోయిం ది. ఒకనాటి పవిత్రమైన గురుశిష్య సంబంధం విచ్ఛిన్నమైపోయింది. కార్పొరేట్ విద్యా విధానంలో ధనపు గురువులు, మదపు శిష్యులు ఉన్నారు. మనకిప్పుడు గురు బ్రహ్మలు, గురు విష్ణువులు, గురు మహేశ్వరులు లేరు. విద్యాసంస్థల్లో కొట్టే బెల్కు, నెల మొదట్లో వచ్చే జీతపు బిల్లుకు నిరీక్షించే నైజం ఉన్న గురువులే ఉన్నారు. నైతిక విలువలు నశించి, విద్యార్థినులను, సహోపాధ్యాయినులను లైంగిక వేధిం పులకు గురిచేసే కీచకోపాధ్యాయులున్నారు. విద్యార్థుల మనస్తత్వాన్ని అవగాహన చేసుకోలేక అసహనంతో, కోపంతో అమానుషంగా దండించి, భౌతికంగా గాయపరిచే ఉపాధ్యాయులున్నారు. ఇది విద్యారంగం దురదృష్టం. ఈ సందర్భంలో స్వామి వివేకానంద మాట లు స్మరించుకోవడం సముచితంగా ఉంటుం ది. ‘‘ప్రాథమిక దశలో విద్యార్థులు ఉద్యానవనంలో పూలమొక్కల వంటి వారు. ఉపాధ్యాయులు తోటమాలుల్లా ప్రేమతో వారిని పరిరక్షించాలం’’టారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా... ఉపాధ్యాయులు అంకితభావంతో, నైతిక విలువలతో, స్వీయ కర్తవ్యోన్ముఖులై విద్యారంగాన్ని తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేయాలి. ఉపాధ్యాయ సంఘాలు హక్కుల కోసం ఉద్యమించటంతో పాటు ఉపాధ్యాయుల కర్తవ్యాన్ని, బాధ్యతలను గుర్తించి ఆదర్శంగా పనిచేసేట్లు దిశానిర్దేశం చేయాలి. సాధారణ ఉపాధ్యాయులంతా ఉత్తమ ఉపాధ్యాయులుగా రూపొందిన నాడే గురుపూజా మహోత్సవాలు సార్థకమౌతాయి. (వ్యాసకర్త రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత) -
ఇది ప్రజా ఉద్యమం
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: సీమాంధ్రలో జరుగుతున్నది ప్రజా ఉద్యమమని విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ చిత్తశుద్ధితో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేస్తే అసెంబ్లీతోపాటు పార్లమెంటుకు కూడా తాళాలు పడతాయని, అప్పుడు కేంద్రం దిగివస్తుందన్నారు. ప్రొద్దుటూరులోని అనిబిసెంట్ క్రీడా మైదానంలో గురువారం సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ప్రొద్దుటూరు పొలికేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి.. దీనినే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.. సర్వేపల్లి ఆంధ్రమహాసభ అధ్యక్షులుగా కూడా పనిచేశారు.. 1920లో తెలుగు మాట్లాడే ప్రజలు ఒక్కటిగా ఉండాలని మహాత్మాగాంధీ సర్వేపల్లికి లేఖ రాశారన్నారు. స్వాతంత్య్రం అనంతరం భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రకారం తెలుగు మాట్లాడే ప్రజలందరినీ ఒకే గొడుగు కిందికి తేవాలని కోరారన్నారు. అసలైన గాంధీ తెలుగు ప్రజలందరూ ఒక్కటిగా ఉండాలని కోరుకోగా నేటి నకిలీ గాంధీ రాష్ట్రాన్ని విడదీయాలని కుట్రపన్నుతోందని సోనియాగాంధీని ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమాలు చేస్తున్నారని, ఈ తీవ్రతను చూస్తుంటే రాష్ట్ర విభజన జరగదనే విశ్వాసం తనలో కలుగుతోందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడ ంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు రాజకీయ పక్షాలన్నీ విఫలమయ్యాయన్నారు. మరో మాటలో చెప్పాలంటే వీరు సమైక్యాంధ్రకు వెన్నుపోటు పొడిచారన్నారు. మహారాష్ట్రలోని విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని అక్కడి వారు 15 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారన్నారు. దక్షిణ తమిళనాడులో, గుజరాత్లో కూడా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని అసెంబ్లీలో మాయావతి తీర్మానం కూడా చేశారన్నారు. ఇన్ని చోట్ల డిమాండ్ చేస్తున్నా పట్టించుకోని కేంద్రం ఐక్యంగా ఉన్న తెలుగుప్రజలను విడదీసేందుకు కుట్రపన్నిందన్నారు. తెలంగాణ ప్రజలు సైతం ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని, తాను స్వయంగా ఈ విషయాన్ని గ్రహించానన్నారు. 1969లో, 1972లో రాష్ట్ర విభజనకు సంబంధించి సంఘర్షణ జరిగిందని తెలిపారు. అయితే రెండు మార్లు సమైక్యవాదమే గెలిచిందన్నారు. సీమాంధ్ర నేతలు రాజీనామా పత్రాలను స్పీకర్ ఫార్మాట్లో పంపకుండా రాజీ డ్రామాలు ఆడుతున్నారన్నారు. సీమాంధ్రలో ప్రజా ఉద్యమం జరుగుతుంటే తెలంగాణ వారు నానా దుర్భాషలాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రిని సైతం ఇడ్లీ బండి పెట్టుకుంటే తమకు అభ్యంతరం లేదని అన్నారంటే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం మరొకటి ఉందా అని ప్రశ్నించారు.తాను రాష్ట్రంలో 5వేల కిలోమీటర్లు పర్యటించానన్నారు. తెలంగాణ ప్రజలంతా సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని, వాస్తవానికి తెలంగాణ సమాజం అంటూ లేదని తెలిపారు. కొంతమంది స్వార్థపరులు మాత్రమే తెలంగాణవాదం అంటున్నారన్నారు. ప్రధమ ముద్దాయిలు రాజకీయ నేతలే ఆర్టీపీపీ (ఎర్రగుంట్ల),న్యూస్లైన్ః రాష్ట్ర విభజన జరిగితే ప్రధమ ముద్దాయిలుగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు మిగిలిపోతారని విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ తెలిపారు. గురువారం సాయంత్రం ఆర్టీపీపీలో సమైక్యాంధ్ర సాధన కోసం చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి నిమ్మరసం ఇచ్చి దీక్షాపరులను విరమింప చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తెలుగు జాతిని విభజించడానికి సోనియా ఎవరన్నారు. మనం నమ్మిన ప్రజాప్రతినిధులు ద్రోహం చేయడంతోనే రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేపట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రం విడిపోతే రైతాంగం పంట కాలువలను నీటితో కాక కన్నీళ్లతో నింపుకోవాల్సి వస్తుందన్నారు. అనంతరం ఆర్టీపీపీ జేఏసీ నాయకులు ప్రతాప్‌రెడ్డి, శంకర్రావు తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. ఎస్ఈలు రమణారెడ్డి, శేషారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, నాగరాజు, రామసుబ్బారెడ్డి, డీజీఎం నాగేశ్వర్రావు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యాలయంలో సర్వేపల్లి జయంతి
సాక్షి, హైదరాబాద్: గురుపూజోత్సవం సందర్భంగా డా. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి 126వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు డి.ఎ. సోమయాజులు, పి.ఎన్.వి. ప్రసాద్, చల్లా మధుసూదన్‌రెడ్డి, గట్టు రామచంద్రరావు, కె. శివకుమార్, డా.ప్రపుల్లారెడ్డి పాల్గొన్నారు.