టర్కీ అధ్యక్షుడికి ఘనస్వాగతం
న్యూఢిల్లీ: టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌కు రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ఉదయం ఘనస్వాగతం లభించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు స్వాగతం పలికారు. ఏప్రిల్ 16న రిఫరెండం తర్వాత అధ్యక్షుడిగా తనకు మరిన్ని అధికారాలు సంక్రమించిన నేపథ్యంలో ఆయన రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు.
ప్రధాని మోడీతో కలిసి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. టెర్రరిజం అంశం ఇరువర్గాల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇరువురూ ఇండియా-టర్కీ వాణిజ్యం, ఇతర పలు అంశాలపై ఒప్పందాలు చేసుకోనున్నారు. ఎర్డోగన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 2008లో భారత దేశం వచ్చారు. 2013లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ టర్కీ సందర్శించగా 2015లో అంట్యాలలో జరిగిన జి-20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ, ఎర్డోగన్‌ను కలిశారు.