Tayyip Erdogan
-
టర్కీ పర్యటన రద్దు చేసుకున్న మోదీ
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ తన టర్కీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఐకరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగా టర్కీ అధ్యక్షుడు తుయ్యిప్ ఎర్దోగన్ ఆర్టికల్ 370 రద్దును విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకోంది. అలాగే పారిస్‌లోని ఎఫ్ఏటీఎఫ్ సమావేశంలో కూడా ఎర్దోగన్ పాక్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ చివర్లో సౌదీ అరేబియాలో జరగనున్న పెట్టుబడుల సదస్సుల్లో పాల్గొన్నన మోదీ అక్కడి నుంచి టర్కీ రాజధాని అంకారా వెళ్లాల్సి ఉంది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన కేవలం సౌదీలో మాత్రమే పర్యటించనున్నారు. అయితే ఈ వార్తలపై విదేశాంగ శాఖ స్పందిస్తూ.. అసలు మోదీ టర్కీ పర్యటన ఖరారు కాలేదని, అలాంటప్పుడు రద్దయ్యే అవకాశమే లేదని తెలిపారు. కాగా, 2015లో మోదీ జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు టర్కీకి వెళ్లారు. ఈ ఏడాది ఒసాకాలో జరిగిన జీ20 సమావేశాల్లో పాల్గొన్న మోదీ.. అక్కడ ఎర్దోగన్‌తో చర్చలు జరిపారు. టర్కీ అధ్యక్షుడు 2018 జూలైలో రెండు రోజులపాటు భారత్‌లో పర్యటించారు. ఎర్దోగన్ యూఎన్‌జీఏలో మాట్లాడుతూ.. భారత్ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించారు. కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేయడం వల్ల అక్కడ 80 లక్షల మంది జీవనం స్తంభించిందని పేర్కొన్నారు. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ సమాఖ్య దృష్టి సారించడం లేదని అన్నారు. గతంలోనే ఎర్దోగన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్.. కశ్మీర్లో క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకోవాలని ఆయనకు సూచించారు. కశ్మీర్‌పై ప్రకటన చేసే ముందు అది పూర్తిగా భారత్ అంతర్గత అంశమని గుర్తుంచుకోవాలన్నారు. -
టర్కీ అధ్యక్షుడికి ఘనస్వాగతం
న్యూఢిల్లీ: టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌కు రాష్ట్రపతి భవన్లో సోమవారం ఉదయం ఘనస్వాగతం లభించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు స్వాగతం పలికారు. ఏప్రిల్ 16న రిఫరెండం తర్వాత అధ్యక్షుడిగా తనకు మరిన్ని అధికారాలు సంక్రమించిన నేపథ్యంలో ఆయన రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోడీతో కలిసి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. టెర్రరిజం అంశం ఇరువర్గాల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇరువురూ ఇండియా-టర్కీ వాణిజ్యం, ఇతర పలు అంశాలపై ఒప్పందాలు చేసుకోనున్నారు. ఎర్డోగన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 2008లో భారత దేశం వచ్చారు. 2013లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ టర్కీ సందర్శించగా 2015లో అంట్యాలలో జరిగిన జి-20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ, ఎర్డోగన్‌ను కలిశారు. -
టర్కీలో సైనిక తిరుగుబాటు, 90మంది మృతి
అంకారా : టర్కీలో సైన్యం తిరుగుబాటు చేసింది. దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా మార్షల్ చట్టం అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. దేశంలో నియంతృత్వ పాలన, ఉగ్రవాదం కారణంగానే ఈ తిరుగుబాటు చేసినట్లు టర్కీ సైన్యం వెల్లడించింది. తిరుగుబాటులో భాగంగా రాజధాని అంకారా గగనతలంలో సైనిక విమానాలు, హెలికాప్టర్లతో సైన్యం పహారా కాస్తుంది. ప్రభుత్వ టీవీ, రేడియోను టర్కీ సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే సైనిక తిరుగుబాటును విదేశీ పర్యటనలో ఉన్న టర్కీ దేశాధ్యక్షుడు ఎర్డోగన్ ఖండించారు. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి మద్దతు తెలపాలని ప్రజలకు ఎర్డోగన్ పిలుపు నిచ్చారు. ఈ తిరుగుబాటులో పాలుపంచుకున్న వారు త్వరలో భారీ ముల్యం చెల్లించక తప్పదని ఎర్డోగన్ హెచ్చరించారు. ఈ పరిస్థితిని త్వరలోనే అధిగమిస్తామని ఎర్డోగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్డోడన్కు మద్దతుగా ప్రజలు వీధుల్లోకి వచ్చి మద్దతు తెలిపారు. ఇస్తాంబుల్‌లోని ప్రఖ్యాత టక్మిమ్ కూడలి వద్ద సైనికులు, ప్రజల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా టర్కీ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌పై హెలికాప్టర్ గన్ షిప్పుతో సైనికులు కాల్పులు జరిపా రు. ఈ కాల్పుల్లో 90మంది మరణించారు. టర్కీ పార్లమెంట్‌పై సైన్యం మూడు బాంబులను ప్రయోగించింది. దాంతో ఎంపీలు పార్లమెంట్ షెల్టర్‌లో తల దాచుకున్నారు. కీలక అధికారులను సైన్యం తన నిర్బంధంలోకి తీసుకుంది. అంకారా, ఇస్తాంబుల్ నగరాల్లో పలు చోట్ల భారీ పేలుడు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఇస్తాంబుల్‌లోని స్థానిక ఎయిర్పోర్ట్ వద్ద భారీగా సైనికులు మోహరించారు. టర్కీ ఆర్మీ సీనియర్ అధికారి జనరల్ హుల్యుసి అకర్ను సైనికులు నిర్బంధించారు. టర్కీలో ఇప్పటి వరకు నాలుగు సార్లు 1960, 1971, 1980, 1993లో సైనిక తిరుగుబాటు జరిగింది. -
టర్కీలో సైనిక తిరుగుబాటు
-
ఆ ఆత్మాహుతి దాడి.. ఐఎస్ఐఎస్ పనే!
ఇస్తాంబుల్: ప్రపంచంలోని ప్రఖ్యాత పర్యాటక నగరమైన టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గూపేనని భావిస్తున్నారు. చారిత్రక పర్యాటక ప్రాంతమైన ఇస్లాంబుల్‌లోని సుల్తానామెట్‌లో సిరియాకు చెందిన సూసైడ్ బాంబర్ దాడికి పాల్పడ్డాడని, ఈ దాడిలో విదేశీ పర్యాటకులు సహా పది మంది చనిపోయారని టర్కీ అధ్యక్షుడు తయిపీ ఎర్డోగాన్ తెలిపారు. సుల్తానామెట్‌లోని బ్లూ మసీదు, హజియా సోఫియా వద్ద విదేశీ పర్యాటకులు లక్ష్యంగా జరిగిన ఈ ఆత్మాహుతి దాడి వెనుక ఉన్నది ఐఎస్ఐఎస్‌యేనని పోలీసులు భావిస్తున్నారు. ప్రపంచంలోనే ప్రముఖ పర్యాటక నగరాల్లో ఒకటి.. ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే యూరప్ నగరమైన ఇస్తాంబుల్‌లో ఆత్మాహుతి దాడితో భీతావహ పరిస్థితి నెలకొంది. పేలుడు జరిగిన సుల్తానామెట్ స్వ్కేర్ వద్ద మృతిచెందిన వారి శరీరభాగాలు చెల్లాచెదురుగా పడిఉండి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. ఈ ఘటనలో మృతిచెందిన, గాయపడిన వారిలో విదేశీ పర్యాటకులు కూడా ఉండటంతో పలు దేశాలు ఇప్పటికే అక్కడికి వెళ్లిన తమ దేశ పౌరులపై ఆరా తీస్తున్నాయి. జర్మనీ, నార్వే దేశాలు ఇస్తాంబుల్‌లోని తమ పర్యాటకుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నాయి. -
'రష్యా.. నిప్పుతో చెలగాటం వద్దు'
ఇస్తాంబుల్ : రష్యా, టర్కీ దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అలాగే కొనసాగుతోంది. టర్కీ అధ్యక్షుడు తాయిప్ ఎర్డోగన్ రష్యాకు తమ సూచనలు తెలుపుతూనే హెచ్చరికలు పంపారు. తమ దేశ యుద్దవిమానాన్ని టర్కీ కూల్చేయడంపై రష్యా తీవ్రంగా మండిపడుతుండటంతో, ఈ ఘటనలపై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఘాటుగా స్పందించారు. ఉత్తర టర్కీలోని బేబర్ట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 'నిప్పుతో చెలగాటం వద్దు' అంటూ రష్యాను ఆయన హెచ్చరించడం గమనార్హం. అంకారా ఆర్థిక సంబంధాలపై ప్రభావం చూపడంతో పాటు రష్యా ఆంక్షలు విధించడంతో టర్కీ ఆ దేశంపై మండిపడుతోంది. జెట్ విమానాన్ని కూల్చేయడంపై క్షమాపణలు చెప్పని కారణంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టర్కీ అధినేతను సంప్రదించే యత్నం చేయలేదు. అయితే, తమ అధికారులు ముందుగానే హెచ్చిరించినప్పటికీ రష్యా యుద్దవిమానం మా గగనతలంలో ఉన్న నేపథ్యంలోనే కూల్చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని టర్కీ ఇటీవలే వివరించిన విషయం విదితమే. ఈ సోమవారం తమ యుద్ద విమాన కూల్చివేతను 'ఉద్దేశపూర్వకంగానే మా సైనికులను చంపేశారు' అని రష్యా దిగువ సభ స్పీకర్ సెర్గేయ్ నారిష్కిన్ అన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో.. రష్యా ఈ విషయాన్ని మాములుగా తీసుకోవాలని, ఆ దేశంతో సంబంధాలు మాకు అవసరమేనని ఆయన పేర్కొన్నారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో వచ్చే వారం జరగనున్న వాతావరణ సదస్సుకు ఇరుదేశాల అధినేతలు పాల్గొనున్నారు. -
బొద్దింకలు ఓడిస్తాయా?
నేతల నాలుక పదును ఎంతటిదో ఎన్నికలలో తెలిసిపోతుంది. టర్కీ నేతలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఆ పార్లమెంటుకు ఇవాళ (జూన్ 7) ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్షుడు తాయిప్ ఎర్దోగన్ స్థాపించిన ఏకే పార్టీ, ప్రధాన ప్రతిపక్షం రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ (దీని నేత కెమాల్ కిలిక్దారోగ్లు) పోటీ పడుతున్నాయి. ఎర్దోగన్ గడచిన ఆగస్ట్‌లో అధ్యక్ష పదవికి ఎన్నికై కొత్తగా కట్టించిన అధ్యక్ష భవనంలో అడుగుపెట్టాడు. అదే ఇప్పుడు ఆయన కొంప ముంచేలా ఉంది. ప్రజాధనం నీళ్లలా వెచ్చించి 1,500 గదులతో భవనం కట్టించారని కెమాల్ విమర్శలకు దిగుతున్నాడు. అంతేకాదు, ఇందులో టాయిలెట్ సీట్లు కూడా బంగారంతో చేయించారని కెమాల్ దుమ్మెత్తాడు. దీనితో ఎర్దోగన్, ‘దమ్ముంటే అధ్యక్ష భవంతికి వచ్చి ఆ ఆరోపణను రుజువు చేయాలనీ, అవే కనిపిస్తే రాజీనామా చేస్తా’ననీ చెబుతున్నారు. ఎర్దోగన్ ప్రధాని పదవిలో ఉండగానే కొత్త భవనం కట్టించాడు. ‘పాత భవనం నిండా బొద్దింకలు, అందుకే కొత్తది అవసరమైంద’ని ఆయన మొన్ననే ఓ చానల్ వాళ్లకి చెప్పాడు. ఇంతకీ అధికార ఏకే పార్టీ గెలుపు సులభం కాదని సర్వేలు ఘోషిస్తున్నాయట. టర్కీ అధ్యక్షుడు బొద్దింకల చేతిలో ఓడిపోతాడో ఏమో!