డీఐజీకి శుభాకాంక్షలు తెలిపిన సీపీ, ఎస్పీ
Published Thu, Aug 18 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
వరంగల్ : రాష్ట్రపతి పోలీస్ (శౌర్యపతకం) గ్యాలంటరీ అవార్డుకు ఎంపికైన వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ ప్రభాకర్‌రావుకు వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు, రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు డీఐజీ కార్యాలయంలో ఆయనను కలిసి బొకే అందించారు. కాగా, తనను గ్యాలంటరీ అవార్డుకు ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, డీజీపీ, ఐజీ, పోలీస్ ఉన్నతాధికారులకు ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Advertisement