CP sudhirbabu
-
పూర్తి బాధ్యత యజమానులదే
∙ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ∙ సీపీ సుధీర్‌బాబు వరంగల్ : సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల భద్రత పూర్తిగా థియేటర్ల యాజమాన్యాలే వ హించాల్సి ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు అన్నారు. స్థానిక పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం కమిషనరేట్ పరిధిలోని సినిమా థియేటర్ల యా జమాన్యాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పబ్లిక్ సేఫ్టి యాక్టు – 2013 ప్రకారం 100కి పైగా ప్రజలు వచ్చిపోయే ప్రాంతాల్లో ప్రజలకు భద్రత కల్పించాల్సిన బా« ద్యత అయా సంస్థలపై ఉందన్నారు. ప్రతి థియేటర్లో ప్రవేశమార్గంలో నాణ్యమైన డీఎఫ్ఎండీ (పేలుడు పదార్థాలను గుర్తించే యంత్రం)లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అన్ని ప్రవేశ మార్గాలు, పార్కింగ్ స్థలాలతో పాటు ముఖ్యమైన ప్రదేశాల్లో ఐపీసీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ దృశ్యాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒకరి నియమించుకోవాలన్నారు. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాల నిఘాలో ఉన్నట్లు సైన్బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. థియేటర్లలో అనుకోకుండా ఏదైనా తొక్కిసలాట, అగ్ని ప్రమాదం లాంటివి జరిగితే ప్రేక్షకులు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు మార్గాలను సూచించే విధింగా ఓ లఘు చిత్రాన్ని చిత్రం ప్రా రంభానికి ముందుగా ప్రదర్శించాలన్నారు. మహిళలను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ప్రతి థియేటర్లో 50కి పైగా టాయిలెట్స్ ఏర్పా టు చేయడంతో పాటు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. బ్లాక్ టిక్కెట్లు అమ్మకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పోలీసులకు సమాచారం అందించాలన్నారు. హాల్లో సిగరెట్లు, గుట్కాలు అమ్మకాలు జరగకుండా జాగ్రత్త పడా లి. పొగ త్రాగడం, గుట్కాలు తినడం చట్టరీత్యా నేరం అన్న బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వరంగల్‌లో సైతం ఒక ఫిల్మ్ సొసైటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీని ద్వారా నగర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై చక్క టి చిత్రాలను చిత్రీకరించి జాతీయ, అంతర్జాతీ యంగా విడుదల చేయడం ద్వారా మరింత గు ర్తింపు వస్తుందన్నారు. డీసీపీలు వేణుగోపాలరా వు, ఇస్మాయిల్, వెంకన్న, ఏసీపీలు మురళీధర్, ఈశ్వర్రావు, సంజీవ్‌కుమార్, పద్మనాభరెడ్డి, చై తన్యకుమార్, మురళీధర్, సీఐలు పాల్గొన్నారు. -
నగర ప్రజలకు ఆదర్శంగా నిలవాలి
మనం హెల్మెట్లు ధరిస్తేనే ప్రజల్లో అవగాహన పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వరంగల్ : నగర ప్రజలకు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు ఆదర్శంగా నిలవాలని వరంగల్ సీపీ జి.సుధీర్‌బాబు అన్నారు. నగరంలోని ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిం చేందుకు శుక్రవారం కమిషనరేట్ పరిధిలోని పోలీసులు భారీ మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తొలుత హన్మకొండ పోలీస్ పరేడ్ మైదానంలో సీపీ సుధీర్‌బాబు మాట్లాడారు. వారం రోజుల క్రితం వరంగల్ నాయుడుపెట్రోల్ పంపు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు చనిపోయిన సంఘటన కలచివేసిందన్నారు. బైక్‌పై వెళ్లేవారు హెల్మెట్లు ధరించి ఉంటే మృత్యువు నుంచి తప్పించుకునేవారని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ప్రతి పోలీస్ హెల్మెట్ ధరిస్తే ప్రజల్లో తప్పకుండా మార్పు వస్తుందనే లక్ష్యంతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చట్టాలను అమలు చేసే ముందు వాటిని అనుసరి ంచాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. కాగా, పోలీసులు తప్పకుండా హెల్మెట్లు ధరిస్తామని హామీ ఇస్తేనే తాను ర్యాలీని ప్రారంభిస్తానని సీపీ చెప్పడంతో వారు అందుకు ఒప్పుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ నుంచి వరంగల్ రైల్వేస్టేçÙన్ వరకు పోలీసులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు డీసీ యాదయ్య, ఏసీపీలు శోభన్‌కుమార్, మహేందర్, సురేంద్రనాథ్, రవీందర్రావు, ఈశ్వర్రావు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
ర్యాగింగ్‌కు పాల్పడితే జైలు శిక్ష తప్పదు
సీపీ సుధీర్ బాబు యాంటీ ర్యాగింగ్ వాట్సప్ నంబర్ ప్రారంభం కాజీపేట రూరల్ : ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులకు జైలు జీవితం తప్పదని పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు హెచ్చరించారు. కాజీపేటలోని నిట్ ఆడిటోరియంలో బుధవారం కాజీపేట పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీపీ సుధీర్‌బాబు హాజరై మాట్లాడారు. ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులకు భవిష్యత్ ఉండదని, యాంటీ ర్యాగింగ్ చట్టం 1997 ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ర్యాగింగ్ నిరోధానికి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో గస్తీ నిర్వహిస్తామని తెలిపారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ విభాగం సెల్ నంబర్ 94910 89252, పోలీస్ కమిషనరేట్ వాట్సప్ నంబర్ 94910 89257లకు సమాచారం అందించాలని అన్నారు. అనంతరం నిట్ ప్రాంగణంలో సీపీ సుధీర్ బాబు విద్యార్థులతో కలిసి ర్యాగింVŠ కు వ్యతిరేకంగా ర్యాలీని నిర్వహించారు. సదస్సులో నిట్ ఇ¯Œæచార్జి డైరెక్టర్ ఆర్వీ.చలం, ఏసీపీ జనార్దన్, సీఐ రమేష్‌కుమార్, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, స్టూడెంట్ డీన్ ఆచార్య రమణారెడ్డి, సెక్యురిటీ ప్రొఫెసర్ సతీష్‌బాబు పాల్గొన్నారు. -
డీఐజీకి శుభాకాంక్షలు తెలిపిన సీపీ, ఎస్పీ
వరంగల్ : రాష్ట్రపతి పోలీస్ (శౌర్యపతకం) గ్యాలంటరీ అవార్డుకు ఎంపికైన వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ ప్రభాకర్‌రావుకు వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు, రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు డీఐజీ కార్యాలయంలో ఆయనను కలిసి బొకే అందించారు. కాగా, తనను గ్యాలంటరీ అవార్డుకు ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, డీజీపీ, ఐజీ, పోలీస్ ఉన్నతాధికారులకు ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. -
రోడ్డు ప్రమాదాలతో కడుపుకోత మిగుల్చొద్దు
వాహనాలను జాగ్రత్తగా నడపాలి వరంగల్ సీపీ సుధీర్‌బాబు పోలీస్ కమిషనరేట్‌లో ‘మీ క్షేమం’ సదస్సు హెల్మెట్ల వినియోగంపై అవగాహన కన్నీటి పర్యంతమైన సీపీ, పలువురు తల్లిదండ్రులు వరంగల్: యువత రోడ్డు ప్రమాదాలకు గురై తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు కోరారు. పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో హెల్మెట్ల వినియోగం, ప్రాముఖ్యతపై వాహనాలు నడిపే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇటీవల రోడ్డు ప్రమాదాలకు గురై మృతిచెందిన కుటుంబసభ్యులకు గురువారం సీపీ కార్యాలయంలోని రాణిరుద్రమదేవి ప్రాంగణంలో ‘మీ క్షేమం’ పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిబ్బంది రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఛాయా చిత్రాలతో ప్రదర్శన చేపట్టారు. అనంతరం సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ యువకులు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతుండడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి అందివచ్చిన కొడుకులు ప్రమాదాల్లో విగతజీవులుగా మారుతుండడం బాధాకరమన్నారు. కాగా, కొందరు తల్లిదండ్రులు ప్రమాదాల్లో తమ కుమారులు చనిపోయిన సంఘటనలను గుర్తుకు చేసుకుని కన్నీటి పర్యంతమవుతుండగా సీపీ సుధీర్‌బాబు కూడా బోరున విలపించారు. ఈ సందర్భంగా సదస్సును కొనసాగించాలని అధికారులకు సూచించి సీపీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సదస్సులో అదనపు డీసీసీ యాదయ్య, ఏసీపీలు శోభన్‌కుమార్, సురేంద్రనాథ్, మహేందర్, ఈశ్వర్రావు, రవీందర్రావు, వెంకటేశ్వర్రావుతో పాటు కమిషనరేట్ పరిధిలోని సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, కాంగ్రెస్ నాయుడు ఈవీ.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల బాధ్యతను వివరించాం : సీపీ సుధీర్‌బాబు మీ క్షేమం సదస్సు ద్వారా ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు తల్లిదండ్రుల బాధ్యతను కూడా గుర్తు చేశామని సీసీ సుధీర్‌బాబు తెలిపారు. సదస్సు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం మన దేశంలో రోజుకు 384 మంది రోడ్డు ప్రమా దాల్లో మృతిచెందుతున్నారన్నారు. ఇందులో 25 శాతం మైనర్ బాలబాలికలు చనిపోతున్నారని, ఎక్కువ మరణాలు హెల్మెట్లు లేకుండా వాహనాలు నడిపినవే ఉంటున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించిప్పుడే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. హెల్మెట్ ధరించి ఉంటే బతికేవాడు పిల్లల ఆనందం కోసం లక్షలు ఖర్చు చేసి బైక్‌లను కొనుగోలు చేసి ఇస్తున్నాం. కానీ.. వారు హెల్మెట్లు పెట్టుకున్నారో లేదో అన్న విషయాలను గమనించకపోవడంతో కడుపుకోత మిగులుతోంది. నా కుమారుడు హెల్మెట్ ధరించి బైక్ నడిపి ఉంటే ఇప్పుడు జీవించి ఉండేవాడు. నాకు జరిగిన నష్టం ఇతర తల్లిదండ్రులకు జరగకూడదు. వరంగల్ పోలీసులు నిర్వహిస్తున్న మీక్షేమం కార్యక్రమం అభినందనీయం. నా కొడుకు విశాల్ జ్ఞాపకార్థం హెల్మెట్ల వాడకం కోసం చేసే ప్రచారానికి నావంతు సహాయ సహకారాలు అందిస్తాను. – నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నిర్లక్ష్యంతో మృతి ఇంజినీరింగ్‌లో జాయిన్ కావడంతో నా కొడుకు కోరిక మేరకు రూ.80 వేలతో బైక్ కొనివ్వడంతో పాటు రూ.16 వేలతో హెల్మెట్ కూడా కొనిచ్చాను. కొద్ది దూరం కదా అనే చిన్న నిర్లక్ష్యంతో హెల్మెట్ లేకుండా రోడ్డు పైకి వెళ్లి కేయూసీ రహదారిపై జరిగిన ప్రమాదంలో చనిపోయాడు. అదే హెల్మెట్ ధరించి ఉంటే నేను ఇక్కడకు రావాల్సిన అవసరం లేకుండా పోయేది. – ఆకుల నాగరాజు, కాంట్రాక్టర్ భర్తను కోల్పోయాను నేను, నా భర్త కూలీ పనిచేసుకునే వాళ్లం. ఒక రోజున నా భర్త హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ నడిపాడు. రోడ్డు ప్రమాదంలో తలకు గాయమై మృతి చెందాడు. నా భర్త మరణంతో నేను, ఇద్దరు పిల్లల పరిస్థితి ఆగమైంది. – గుడికందుల లావణ్య, హసన్‌పర్తి తండ్రిని కోల్పోయాను హన్మకొండ అశోకాటాకీస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నేను తండ్రిని కోల్పోయాను. హెల్మెట్ ధరించకపోవడంతోనే మా నాన్న చనిపోయాడు. కుటుంబ పెద్ద చనిపోవడంతో పోషణ భారం, ఇంటి బాధ్యత నాపై పడింది. మా మంచి చెడులు చూసే తండ్రి లేకపోవడం బాధకరం. – అల్వాల సుమంత్‌కుమార్, హన్మకొండ హెల్మెట్ ఇచ్చి ఉంటే నా భర్త ఉండేవాడు ప్రతి రోజు నా భర్త బయటకు పోతుంటే మోటార్ సైకిల్ తాళం ఇచ్చేదాన్ని. అదే హెల్మెట్ ఇచ్చి ఉంటే నేడు ఆయనను కోల్పోయేదాన్ని కాదు. నా భర్త ఎరువుల కొనుగోలు కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. పోలీసులు హెల్మెట్ల వినియోగంపై చేస్తున్న ప్రచారం అభినందనీయం. కాగితాల రమ్య, స్టేషన్‌ఘన్‌పూర్ -
బ్లాక్‌మెయిలింగ్ కేసులో కీలక వ్యక్తుల పరారీ
వారు దొరికితే అనేక విషయాలు వెలుగులోకి డబ్బులు రికవరీ లేనట్లేనా ? వరంగల్ క్రైం : మీడియా పేరుతో అక్రమ సం పాదనకు తెరతీసిన కేసులో కీలక వ్యక్తులుగాఉన్న కీసరాజు దేవేందర్, పిడమర్తి మనోహర్ పరారీలో ఉన్నారు. ఇందులో దేవేందర్ టీఎస్-9 టీవీకి సీఈఓగా వ్యవహరిస్తు దందాకు సూత్రధారిగా ఉండగా, మనోహర్ డబ్బులున్న వారి వివరాలు సేకరిస్తుంటాడు. ఈ ముఠాలో వీరిద్దరిదే ప్రముఖ పాత్ర అని తెలుస్తోంది. అన్ని వివరాలు సేకరించిన తర్వాత చేయాల్సిన పనిని ముఠాలోని మిగతావారు ముగిస్తారు. ఈ ముఠా టార్గెట్ చేసిన వారంతా సమాజంలోని ప్రముఖులు కావడం విశేషం. కేయూకు చెందిన రిటైర్డ ప్రొఫెసర్, ఆర్టీసీలో ఉన్నతాధికారి, పాలడైరీలో ఉన్నతాధికారి, ఎఫ్‌సీఐ అధికారి ఇలా అందరూ హైప్రొఫైల్కు చెందిన వారు కావడం విశేషం. కీలక వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసకుంటే వారు టార్గెట్ చేసిన వ్యక్తుల జాబితా మొత్తం బయటకు వచ్చే అవకాశముంది. అలాగే జెమిని న్యూస్ చానల్ లోగోను ఎందుకు వాడారనే విషయం కూడా బహిర్గతం కావాల్సి ఉంది. ఈ దందాలో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయాలు కూడా వెల్లడి కావాల్సి ఉంది. దీంతోపాటు వీరు అక్రమంగా సంపాదించిన రూ.12 లక్షలు కూడా నిందితుల వద్దనే ఉన్నాయా...? ఇంకా అంతకంటే భారీ మొత్తంలో సంపాదించారా? అనే విషయాలు వెలుగు చూడాల్సి ఉంది. ఆరుగురిని అరెస్టు చేసినప్పటికీ డబ్బులు మాత్రం రికవరీ కాకపోవడంతో డబ్బులు ఎక్కడ దాచారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వీరు జల్సాలకు ఖర్చు చేసినప్పటికీ ఆ సొత్తును పోలీసులు రికవరీ చేయాల్సి ఉంది. వారిని మళ్లీ కస్టడీకి తీసుకుని విచారిస్తాం : సీపీ సుధీర్‌బాబు సోమవారం కోర్టులో హాజరుపరిచిన నిందితులను మరోమారు కస్టడీలోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తాం. పరారీలో ఉన్న వారు దొరికితే అనేక కొత్తవిషయాలు బయటకు రావడంతోపాటు డబ్బులు కూడా రికవరీ అయ్యే అవకాశం ఉంది.