నగర ప్రజలకు ఆదర్శంగా నిలవాలి
-
మనం హెల్మెట్లు ధరిస్తేనే ప్రజల్లో అవగాహన
-
పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు
వరంగల్ : నగర ప్రజలకు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు ఆదర్శంగా నిలవాలని వరంగల్ సీపీ జి.సుధీర్‌బాబు అన్నారు. నగరంలోని ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిం చేందుకు శుక్రవారం కమిషనరేట్ పరిధిలోని పోలీసులు భారీ మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తొలుత హన్మకొండ పోలీస్ పరేడ్ మైదానంలో సీపీ సుధీర్‌బాబు మాట్లాడారు. వారం రోజుల క్రితం వరంగల్ నాయుడుపెట్రోల్ పంపు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు చనిపోయిన సంఘటన కలచివేసిందన్నారు. బైక్‌పై వెళ్లేవారు హెల్మెట్లు ధరించి ఉంటే మృత్యువు నుంచి తప్పించుకునేవారని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ప్రతి పోలీస్ హెల్మెట్ ధరిస్తే ప్రజల్లో తప్పకుండా మార్పు వస్తుందనే లక్ష్యంతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చట్టాలను అమలు చేసే ముందు వాటిని అనుసరి ంచాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. కాగా, పోలీసులు తప్పకుండా హెల్మెట్లు ధరిస్తామని హామీ ఇస్తేనే తాను ర్యాలీని ప్రారంభిస్తానని సీపీ చెప్పడంతో వారు అందుకు ఒప్పుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ నుంచి వరంగల్ రైల్వేస్టేçÙన్ వరకు పోలీసులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు డీసీ యాదయ్య, ఏసీపీలు శోభన్‌కుమార్, మహేందర్, సురేంద్రనాథ్, రవీందర్‌రావు, ఈశ్వర్‌రావు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.