పూర్తి బాధ్యత యజమానులదే | CC cameras to be set up | Sakshi
Sakshi News home page

పూర్తి బాధ్యత యజమానులదే

Published Tue, Mar 21 2017 12:52 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM

పూర్తి బాధ్యత యజమానులదే - Sakshi

పూర్తి బాధ్యత యజమానులదే

∙ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
∙ సీపీ సుధీర్‌బాబు


వరంగల్‌ : సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల భద్రత పూర్తిగా థియేటర్ల యాజమాన్యాలే వ హించాల్సి ఉంటుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ జి.సుధీర్‌బాబు అన్నారు. స్థానిక పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో సోమవారం కమిషనరేట్‌ పరిధిలోని సినిమా థియేటర్ల యా జమాన్యాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పబ్లిక్‌ సేఫ్టి యాక్టు – 2013 ప్రకారం 100కి పైగా ప్రజలు వచ్చిపోయే ప్రాంతాల్లో ప్రజలకు భద్రత కల్పించాల్సిన బా« ద్యత అయా సంస్థలపై ఉందన్నారు. ప్రతి థియేటర్‌లో   ప్రవేశమార్గంలో నాణ్యమైన డీఎఫ్‌ఎండీ (పేలుడు పదార్థాలను గుర్తించే యంత్రం)లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అన్ని ప్రవేశ మార్గాలు, పార్కింగ్‌ స్థలాలతో పాటు ముఖ్యమైన ప్రదేశాల్లో ఐపీసీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఈ దృశ్యాలను పర్యవేక్షించేందుకు  ప్రత్యేకంగా ఒకరి నియమించుకోవాలన్నారు. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాల నిఘాలో ఉన్నట్లు సైన్‌బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. థియేటర్లలో అనుకోకుండా ఏదైనా తొక్కిసలాట, అగ్ని ప్రమాదం లాంటివి జరిగితే ప్రేక్షకులు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు మార్గాలను సూచించే విధింగా ఓ లఘు చిత్రాన్ని  చిత్రం ప్రా రంభానికి ముందుగా ప్రదర్శించాలన్నారు. మహిళలను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ప్రతి థియేటర్‌లో 50కి పైగా టాయిలెట్స్‌ ఏర్పా టు చేయడంతో పాటు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.  

బ్లాక్‌ టిక్కెట్లు అమ్మకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పోలీసులకు సమాచారం అందించాలన్నారు. హాల్‌లో సిగరెట్లు, గుట్కాలు అమ్మకాలు జరగకుండా జాగ్రత్త పడా లి. పొగ త్రాగడం, గుట్కాలు తినడం చట్టరీత్యా నేరం అన్న బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వరంగల్‌లో సైతం ఒక ఫిల్మ్‌ సొసైటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీని ద్వారా  నగర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై చక్క టి చిత్రాలను చిత్రీకరించి జాతీయ, అంతర్జాతీ యంగా విడుదల చేయడం ద్వారా మరింత గు ర్తింపు వస్తుందన్నారు. డీసీపీలు వేణుగోపాలరా వు, ఇస్మాయిల్, వెంకన్న, ఏసీపీలు మురళీధర్, ఈశ్వర్‌రావు, సంజీవ్‌కుమార్, పద్మనాభరెడ్డి, చై తన్యకుమార్, మురళీధర్, సీఐలు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement