వారు దొరికితే అనేక విషయాలు వెలుగులోకి డబ్బులు రికవరీ లేనట్లేనా ?
వరంగల్ క్రైం : మీడియా పేరుతో అక్రమ సం పాదనకు తెరతీసిన కేసులో కీలక వ్యక్తులుగాఉన్న కీసరాజు దేవేందర్, పిడమర్తి మనోహర్ పరారీలో ఉన్నారు. ఇందులో దేవేందర్ టీఎస్-9 టీవీకి సీఈఓగా వ్యవహరిస్తు దందాకు సూత్రధారిగా ఉండగా, మనోహర్ డబ్బులున్న వారి వివరాలు సేకరిస్తుంటాడు. ఈ ముఠాలో వీరిద్దరిదే ప్రముఖ పాత్ర అని తెలుస్తోంది. అన్ని వివరాలు సేకరించిన తర్వాత చేయాల్సిన పనిని ముఠాలోని మిగతావారు ముగిస్తారు. ఈ ముఠా టార్గెట్ చేసిన వారంతా సమాజంలోని ప్రముఖులు కావడం విశేషం. కేయూకు చెందిన రిటైర్‌డ ప్రొఫెసర్, ఆర్టీసీలో ఉన్నతాధికారి, పాలడైరీలో ఉన్నతాధికారి, ఎఫ్‌సీఐ అధికారి ఇలా అందరూ హైప్రొఫైల్‌కు చెందిన వారు కావడం విశేషం. కీలక వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసకుంటే వారు టార్గెట్ చేసిన వ్యక్తుల జాబితా మొత్తం బయటకు వచ్చే అవకాశముంది. అలాగే జెమిని న్యూస్ చానల్ లోగోను ఎందుకు వాడారనే విషయం కూడా బహిర్గతం కావాల్సి ఉంది.
ఈ దందాలో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయాలు కూడా వెల్లడి కావాల్సి ఉంది. దీంతోపాటు వీరు అక్రమంగా సంపాదించిన రూ.12 లక్షలు కూడా నిందితుల వద్దనే ఉన్నాయా...? ఇంకా అంతకంటే భారీ మొత్తంలో సంపాదించారా? అనే విషయాలు వెలుగు చూడాల్సి ఉంది. ఆరుగురిని అరెస్టు చేసినప్పటికీ డబ్బులు మాత్రం రికవరీ కాకపోవడంతో డబ్బులు ఎక్కడ దాచారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వీరు జల్సాలకు ఖర్చు చేసినప్పటికీ ఆ సొత్తును పోలీసులు రికవరీ చేయాల్సి ఉంది.
వారిని మళ్లీ కస్టడీకి తీసుకుని విచారిస్తాం : సీపీ సుధీర్‌బాబు
సోమవారం కోర్టులో హాజరుపరిచిన నిందితులను మరోమారు కస్టడీలోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తాం. పరారీలో ఉన్న వారు దొరికితే అనేక కొత్తవిషయాలు బయటకు రావడంతోపాటు డబ్బులు కూడా రికవరీ అయ్యే అవకాశం ఉంది.
బ్లాక్‌మెయిలింగ్ కేసులో కీలక వ్యక్తుల పరారీ
Published Tue, Jul 7 2015 12:43 AM | Last Updated on Sun, Sep 3 2017 5:01 AM
Advertisement