ప్రస్తుతం చాలామంది యాపిల్ ఐఫోన్స్ ఉపయోగిస్తున్నారు. ఇవి కొంత ఖరీదైనవే అయినప్పటికీ.. ఆసక్తి కారణంగానో లేదా ఇతర కారణాల వల్ల ఆండ్రాయిన్ ఫోన్ యూజర్స్ కూడా ఐఫోన్లకు మారిపోతున్నారు. అయితే అంత ఖరీదైన ఫోన్లు పొతే? ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మీ ఐఫోన్ పోగొట్టుకున్నా.. దొంగతనానికి గురైనా.. ఏ మాత్రం గాబరా పడకుండా? కొన్ని చర్యలు తీసుకుంటే మళ్ళీ పొందే అవకాశం ఉంటుంది.
'ఫైండ్ మై' యాప్ ఉపయోగించండి
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు 'ఫైండ్ మై' యాప్ ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఐఫోన్లో ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకుని సెట్ చేసుకోవాలి. ఇది మీ ఫోన్‌ను ట్రాక్ చేయడానికి అనుమతిస్తుంది. అంతే కాకుండా మీ మొబైల్ సైలెంట్ మోడ్‌లో ఉన్నప్పటికీ.. దగ్గరగా ఉన్నప్పుడు యాప్ ద్వారా సౌండ్ ప్లే చేయవచ్చు.
లాస్ట్ మోడ్‌ను యాక్టివేట్ చేసుకోండి
మీ ఫోన్ బయట పోయిందని లేదా దొంగతనానికి గురైంది మీరు విశ్వసిస్తే, లాస్ట్ మోడ్ ఉపయోగించుకోవాలి. దీనికోసం మీరు 'ఫైండ్ మై' యాప్‌ను ఓపెన్ చేసి లేదా iCloud.comలో సైన్ ఇన్ చేసిన తరువాత.. 'మార్క్ యాజ్ లాస్ట్' లేదా 'లాస్ట్ మోడ్' ఎంచుకోవాలి. ఇలా చేసుకున్న తరువాత ఏదైనా ఒక సందేశాన్ని లేదా కాంటాక్ట్ వివరాలను పంపించవచ్చు. అప్పుడు మీ ఫోన్ దొరికిన వారు మళ్ళీ మీకు తీసుకు వచ్చి ఇచ్చే అవకాశం ఉంటుంది.
మీ డేటాను సంరక్షించుకోవాలి
మొబైల్ ఫోన్లో మీ వ్యక్తిగత డేటా ఏదైనా ఉంటే.. దానిని సంరక్షించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఫోన్ డేటాను రిమోట్‌గా తొలగించడానికి 'ఫైండ్ మై' యాప్ లేదా iCloudని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇది ట్రాకింగ్‌ను నిలిపివేస్తుంది, డేటా రికవరీ కూడా సాధ్యం కాదు. మీ అకౌంట్స్ యాక్సిస్ ఇతరుల చేతుల్లోకి పోకుండా ఉండటానికి appleid.apple.comలో మీ Apple ID పాస్‌వర్డ్‌ను మార్చుకోవచ్చు.
సిమ్ బ్లాక్ చేయాలి
మీ ఫోన్ పోయిందని తెలుసుకున్న తరువాత.. మీ సిమ్ కార్డును బ్లాక్ చేసుకోవడం ఉత్తమం. దీనికోసం మీ సిమ్ కార్డుకు సంబంధించిన సంస్థను సంప్రదించాలి. మీ ఫోన్ పోయిందని సంస్థకు తెలియాజేస్తూ.. సిమ్ కార్డును బ్లాక్ చేయమని చెప్పాలి. అంతే కాకుండా డివైజ్‌ను కూడా బ్లాక్‌లిస్ట్ చేయొచ్చు. ఇలా చేస్తే.. ఎవరైనా ఫోన్ దొంగలించి ఉంటే, దానిని ఇతరులకు విక్రయించలేరు.
పోలీసులకు తెలియజేయండి
మీ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే.. వెంటనే పోలీసులకు తెలియజేయండి. మొబైల్ ఫోన్ IMEI నెంబర్ సాయంతో పోలీసులు పోయిన ఫోన్‌ను కనుగొనే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: మీ ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులున్నాయి? ఇలా తెలుసుకోండి
ముందుగానే కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలి
మీరు ఫోన్ కొనుగోలు చేసిన వెంటనే.. ఫైండ్ మై ఫోన్‌ను ఎనేబుల్ చేసుకోవడం మాత్రమే కాకుండా.. స్ట్రాంగ్ పాస్‌కోడ్ లేదా బయోమెట్రిక్ సెట్ చేసుకోవాలి. డేటాను కూడా ఎప్పటికప్పుడు ఐక్లౌడ్ లేదా కంప్యూటర్‌కు బ్యాకప్ చేయాలి. వీటితో పాటు AirTags వంటి ట్రాకింగ్ యాక్ససరీస్ ఉపయోగించడం కూడా ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment