ర్యాగింగ్‌కు పాల్పడితే జైలు శిక్ష తప్పదు
-
సీపీ సుధీర్ బాబు
-
యాంటీ ర్యాగింగ్ వాట్సప్ నంబర్ ప్రారంభం
కాజీపేట రూరల్ : ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులకు జైలు జీవితం తప్పదని పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు హెచ్చరించారు. కాజీపేటలోని నిట్ ఆడిటోరియంలో బుధవారం కాజీపేట పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీపీ సుధీర్‌బాబు హాజరై మాట్లాడారు. ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులకు భవిష్యత్ ఉండదని, యాంటీ ర్యాగింగ్ చట్టం 1997 ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ర్యాగింగ్ నిరోధానికి ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో గస్తీ నిర్వహిస్తామని తెలిపారు.
ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ విభాగం సెల్ నంబర్ 94910 89252, పోలీస్ కమిషనరేట్ వాట్సప్ నంబర్ 94910 89257లకు సమాచారం అందించాలని అన్నారు. అనంతరం నిట్ ప్రాంగణంలో సీపీ సుధీర్ బాబు విద్యార్థులతో కలిసి ర్యాగింVŠ కు వ్యతిరేకంగా ర్యాలీని నిర్వహించారు. సదస్సులో నిట్ ఇ¯Œæచార్జి డైరెక్టర్ ఆర్‌వీ.చలం, ఏసీపీ జనార్దన్, సీఐ రమేష్‌కుమార్, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, స్టూడెంట్ డీన్ ఆచార్య రమణారెడ్డి, సెక్యురిటీ ప్రొఫెసర్ సతీష్‌బాబు పాల్గొన్నారు.