తండ్రి విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన సితార | Mahesh Babus Daughter Sitara Is Happy To Assist Him In The Green Challenge | Sakshi
Sakshi News home page

తండ్రి విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన సితార

Published Wed, Aug 1 2018 4:05 PM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

సెలబ్రెటీలకే కాదు వారి పిల్లలకు ఫాలోయింగ్‌ ఉంటుంది. కానీ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూతురు సితారకు ఉండే ఫ్యాన్‌ ఫాలోయింగే వేరు. సోషల్‌ మీడియాలో తన ఫోటోలు, తనకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. మొన్న జరిగిన సితార బర్త్‌డే కూడా ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది. తాజాగా తన తండ్రి విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన సితార ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. టాలీవుడ్‌లో గ్రీన్‌ చాలెంజ్‌ ఏ రేంజ్‌లో పాపులర్‌ అవుతుందో వేరే చెప్పనక్కర్లేదు. రాజకీయ ప్రముఖుల నుంచి సినీ సెలబ్రెటీలు ఈ చాలెంజ్‌లో భాగమవుతున్నారు. మహేష్‌ బాబు విసరిన చాలెంజ్‌ను సితార స్వీకరించి.. ఓ మొక్కను నాటిన వీడియోను పోస్ట్‌ చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారుతోంది. మరోపక్క టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి విసిరిన ఈ గ్రీన్‌ చాలెంజ్‌ను మాస్‌ డైరెక్టర్‌ వివి వినాయక్‌ స్వీకరించారు. అలాగే మహేష్‌ బాబు విసిరిన చాలెంజ్‌ను డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి స్వీకరించి సమంత, కాజల్‌, దేవి శ్రీ ప్రసాద్‌లకు సవాల్‌ విసిరారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement