‘శాట్స్‌’ హరితహారానికి విశేష స్పందన | SATS haritha haram | Sakshi
Sakshi News home page

‘శాట్స్‌’ హరితహారానికి విశేష స్పందన

Published Tue, Aug 1 2017 10:49 AM | Last Updated on Sun, Sep 17 2017 5:03 PM

‘శాట్స్‌’ హరితహారానికి విశేష స్పందన

‘శాట్స్‌’ హరితహారానికి విశేష స్పందన

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) ఆధ్వర్యంలో సోమవారం జరిగిన హరితహారం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం నుంచి ఆద ర్శ్‌నగర్‌లోని రిడ్జ్‌ హోటల్‌ వరకు ర్యాలీని నిర్వహించారు.

 

ర్యాలీలో శాట్స్‌ విద్యార్థులు, అధికారులు, టూరిజం శాఖ సిబ్బంది దాదాపు 700 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్‌ బి. వెంకటేశం, శాట్స్‌ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎండీ ఎ. దినకర్‌ బాబు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ (టీఎస్‌టీడీసీ) చైర్మన్‌ పి. రాములు, ఎండీ క్రిస్టియానా చొంగ్తూ, సీనియర్‌ కోచ్‌ ఎస్‌ఎం ఆరిఫ్, అర్జున అవార్డు గ్రహీత జేజే శోభ, మాజీ అథ్లెట్‌ పి. శంకర్, టీటీ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement