SATS
-
ఎల్బీ స్టేడియం ముందు కోచ్‌ల మెరుపు ధర్నా
సాక్షి, నాంపల్లి: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం ముందు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కాంట్రాక్ట్ కోచ్ శాట్స్ కోచ్‌లు శనివారం మెరుపు ధర్నాకు దిగారు. 27 ఏళ్లుగా ఒప్పంద కోచ్ లగా పని చేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలంటూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కాంట్రాక్ట్ కోచ్ శాట్స్ కోచ్ లు నిరసనకు దిగారు. రెగులరైజ్ చేయాలని ప్రభుత్వ పెద్దలని ఎన్ని సార్లు వేడుకున్నఎలాంటి స్పందన రాకపోవడంతోనే మెరుపు ధర్నాకు దిగినట్లు తెలిపారు. తెలంగాణ వచ్చాక అయిన తమ బతుకులు బాగుపడతాయి అనుకుంటే... సీన్ రివర్స్ అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తమకు జీతాలు కూడా టైమ్ కి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంట్రాక్ట్ కోచ్ నేత రవి శంకర్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కోచ్ లను క్రమబద్ధీకరించాలి. సమయానికి వేతనాలు ఇవ్వడం లేదని కోచ్‌లు ఆవేదన చెందుతున్నారు. క్రీడలు ఎంతో పవిత్రమైనది.. ఈ రంగంలో మేము 1993 నుంచి సేవలు అందిస్తున్నాం.. మమ్మల్ని రెగ్యులర్ చేయాలి.. ఈ విషయంలో ప్రభుత్వం న్యాయం చేస్తుందని భావిస్తున్నాం. మేము ఎవరిని విమర్శించటం లేదు.కోచింగ్ వల్ల సమాజం లో క్యారెక్టర్ అభివృద్ధి అవుతుంది. ఇప్పటివరకు 30 జాతీయ మల్ల యోధులను తయారు చేశాం. మా చైర్మన్ వెంకట్ రెడ్డి సమస్యలు పరిష్కరించాలి. అని డిమాండ్ చేశారు. -
మళ్లీ వెంకటేశ్వర్‌రెడ్డికే పగ్గాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్‌గా అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి కొనసాగనున్నారు. ఎల్బీ స్టేడియం లోని తన చాంబర్లో బుధవారం ఉదయం రెండోసారి చైర్మన్‌గా వెంకటేశ్వర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం శాట్స్ తొలి చైర్మన్‌గా పీఠమెక్కిన ఆయన ఇటీవలే తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే రెండో దఫా కూడా పగ్గాలు ఆయన చేతికే దక్కడం విశేషం. ఈ అవకాశాన్ని ఇచి్చన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శాట్స్ చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు తన శాయశక్తులా కృషిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో శాట్స్ ఎండీ దినకర్ బాబు, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, అంతర్జాతీయ బాక్సర్ నిజాముద్దీన్, జిమ్నాస్ట్ అరుణా రెడ్డి పాల్గొన్నారు. -
ప్రతిభగల వారికే పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తగిన ప్రోత్సాహం అందిస్తామని, ప్రతిభగల క్రీడాకారులకే పెద్దపీట వేస్తామని తెలంగాణ రాష్ట్ర అబ్కారీ, పర్యాటక, క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన శుక్రవారం లాల్‌బహదూర్ (ఎల్బీ) స్టేడియాన్ని సందర్శించారు. స్టేడియం స్థితిగతులు, మౌలిక వసతులు, క్రీడా ప్రాంగణాలను పరిశీలించారు. అనంతరం శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ దినకర్ బాబు, రాష్ట్ర క్రీడల కార్యదర్శి బుర్రా వెంకటేశంతో కలిసి శాట్స్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎందరో క్రీడాకారులను అందించిన ఎల్బీ స్టేడియాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. క్రీడాకారుల ఎంపికలో పైరవీలకు చోటు లేదని, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ క్రీడాకారులను వెలికి తీయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోన్న టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను కలిసి ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. -
ఏసీబీ విచారణకు సహకరిస్తున్నాం..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ స్పోర్ట్స్ కోటాలో గత సంవత్సరం మెడికల్ సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారుల ఇళ్లపై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఏసీబీ విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని సాట్స్ ఎండీ దినకర్ బాబు చెప్పారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. సాట్స్‌లో అక్రమాలు జరగలేదని పేర్కొన్నారు. కొంతమంది అధికారులు చేసిన తప్పులకు క్రీడాకారులు బలయ్యారని తెలిపారు. ‘ ఫెన్సింగ్‌ని 2016లోనే కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఫెన్సింగ్ బాండ్ కారణంగానే ఫెన్సింగ్ సర్టిఫికెట్లను పరిగణలోకి తీసుకోలేదు. ఏ విధమైన ప్రాక్టీస్ లేని వాళ్లను అసోసియేషన్‌లో ఎంపిక చేస్తున్నారు. ఏసీబీ వాళ్లు అడిగిన అన్ని వివరాలకి సమాధానం ఇచ్చాం. అసోసియేషన్‌లో ఉన్న లోపాల వల్ల క్రీడా విద్యార్థులకు న్యాయం జరగడం లేదు. అసోసియేషన్ లే బాక్ డోర్‌ను ప్రోత్సహిస్తున్నాయి. సాట్స్ ద్వారా ఒక్క క్రీడాకారునికి కూడా అన్యాయం జరగలేదు. ఇప్పటికీ ప్రభుత్వం రెండుసార్లు కమిటీలు వేసి విచారణ జరిపింది. వాటిలో కొన్ని లోపాలు బయటపడ్డాయని’ సాట్స్ ఎండీ పేర్కొన్నారు. ఇటాంటి ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా కొత్త విధానాన్ని రూపొందించబోతున్నామని ఎండీ చెప్పారు. ‘అసోసియేషన్ సెలెక్షన్ల ప్రాసెస్ పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు ఎంపిక చేసుకుని టీంలను పంపిస్తున్నారు. కొన్ని అసోసియేషన్లను ప్రభుత్వాలు నిషేధించినప్పటికీ అవి కొనసాగుతూ టీం సెలక్షన్ చేస్తున్నాయి. సాట్స్‌లో ఎవరు డబ్బులు తీసుకున్న శిక్షార్హులే. ప్రతి ఏడాది కొన్ని వందలమందిని సెలక్షన్ చేసి పంపిస్తున్నారు. ఏసీబీ విచారణ పూర్తికాగానే ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో నివేదిక సమర్పిస్తాం. తప్పుడు వ్యక్తులు టీమ్‌లోకి వచ్చినా వెంటనే వాళ్లను నిషేధిస్తున్నామని’ సాట్స్ ఎండీ తెలిపారు. ఆరోపణలు చేస్తున్న ఆ నలుగురు క్రీడా విద్యార్థుల వ్యవహారంలో నేను సరిగానే వ్యవహరించానన్నారు. వాళ్ళని అసోసియేషన్లు తప్పుదోవ పట్టించాయని ఆయన చెప్పారు. భాగ్యశ్రీతో పాటుగా మరికొందరి విషయంలో మాకు చాలా బాధాకరంగా ఉందని చెప్పారు. నిషేధించిన ఫెన్సింగ్ సర్టిఫికెట్ తీసుకువచ్చి మెరిట్ జాబితాలో పెట్టమంటే చాలా కష్టమని సాట్స్ ఎండీ దినకరన్ పేర్కొన్నారు. -
అర్జున్‌కు శాట్స్ చైర్మన్ అభినందన
సాక్షి, హైదరాబాద్: కోల్‌కతా ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో రాణించిన తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ను బుధవారం శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు. భవిష్యత్‌లో మరెన్నో గొప్ప విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. కోల్‌కతాలో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 9 పాయింట్లకుగానూ 7 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచాడు. ఇందులో భాగంగా తనకన్నా ఎంతో మెరుగైన ఆటగాళ్లపై విజయాలు సాధించి తొలి జీఎం నార్మ్‌ను సాధించాడు. ఈ సందర్భంగా శాట్స్ చైర్మన్‌ను కలిసిన అర్జున్... మెరుగైన టోర్నీల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం తరఫు నుంచి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు. అతని వినతిపై శాట్స్ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. -
జిమ్నాస్టిక్స్ కోచ్ రవీందర్‌కు సన్మానం
హైదరాబాద్: ‘శాట్స్’ జిమ్నాస్టిక్స్ కోచ్ ఆర్. రవీందర్ ఆదివారం రిటైరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కార్యదర్శి ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్, రంగారెడ్డి డీవైఎస్ఓ వెంకటేశ్వర్ రావు, తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం కార్యదర్శి మహేశ్వర్ పాల్గొన్నారు -
క్రీడా ప్రగతికి కృషి చేస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: గతంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో క్రీడా ప్రగతి చాలా జరిగిందని, క్రీడాభివద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం శాట్స్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మన రాష్ట్రంలో క్రీడాభివద్ధికి తీసుకుంటోన్న చర్యల గురించి వివరించారు. ‘ఖేలో ఇండియా’ పథకం ద్వారా కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాలతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ, హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. వేసవి శిక్షణా శిబిరాల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు లక్ష రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 15 నుంచి మే 31 వరకు ప్రభుత్వ వేసవి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తన సొంత గ్రామమైన చిన్న చింతకుంట మండలం (మహబూబ్‌నగర్)లో మినీ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ. 1.30 కోట్లు మంజూరు అయ్యేలా కషి చేశామని తెలిపారు. జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు రూ. 10,000 స్టయిఫెండ్, ఎల్బీ స్టేడియం పునర్నిర్మాణం, నూతనంగా 200 కోచ్‌ల నియామకం, ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ హాస్టల్స్ నిర్మాణానికి కషి చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార అభివద్ధి సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు కె. రంగారావు, కార్యదర్శి ప్రేమ్‌రాజ్, గన్‌ఫౌండ్రీ కార్పొరేటర్ మమత గుప్తా, కాచిగూడ కార్పొరేటర్ కన్నా, తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క పతకం మార్చేసింది!
సాక్షి, హైదరాబాద్: ‘ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది’ ఇది బాగా పాపులర్ అయిన టెలికామ్ యాడ్. ఇప్పుడు ఈ యాడ్‌కు సరిగ్గా సరిపోయేలా... ఒక్క పతకం ఓ జిమ్నాస్ట్‌ను ఆకాశానికి ఎత్తేసింది. కోటీశ్వరురాలిని చేసేసింది. ఆ జిమ్నాస్ట్ బుద్దా అరుణ రెడ్డి కాగా... ఆ పతకం మెల్బోర్న్లో నెగ్గిన కాంస్యం. ఆమె సాధించిన కాంస్యంతో కాసులు... రాశులు కురుస్తున్నాయి. 14 ఏళ్లుగా ఆమె పడుతున్న కష్టాలకు తగిన ప్రతిఫలాలు లభిస్తున్నాయి. తెలంగాణకు చెందిన యువ జిమ్నాస్ట్ అరుణ రెడ్డి ఇటీవలే ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో కాంస్య పతకం గెలిచింది. ఈ టోర్నమెంట్ చరిత్రలో పతకం నెగ్గిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా ఆమె గుర్తింపు పొందింది. కాంస్యంతో కొత్త చరిత్ర సృష్టించిన ఆమెను శనివారం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) లాల్‌బహదూర్ స్టేడియంలో ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ‘శాట్స్’ తరఫున ప్రోత్సాహకంగా అరుణకు రూ. 20 లక్షల చెక్‌ను తెలంగాణ క్రీడాశాఖ మంత్రి పద్మారావు అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హైదరాబాద్ జిమ్నాస్టిక్స్ సంఘం అధ్యక్షుడు, సువర్ణ అవనిస్ కంపెనీ యజమాని సురేందర్ ఆమెకు రూ. 50 లక్షల విలువైన విలాసవంతమైన విల్లాను బహుమతిగా ఇచ్చారు. తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. శనివారం జరిగిన మరో కార్యక్రమంలో కొన్నాళ్లుగా అరుణకు చేయూతనిస్తోన్న ఎథిక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ తమ వంతుగా రూ. 2 లక్షలు నగదు పురస్కారాన్ని అందజేసింది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఊహించనిరీతిలో ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఆదివారం ఆమె తన తల్లి సుభద్ర, సోదరి పావని రెడ్డిలతో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా అరుణ ఘనతను కొనియాడిన ఆయన రూ. 2 కోట్ల నజరానా ప్రకటించారు. ఆమె కోచ్ బ్రిజ్ కిశోర్‌కు కూడా ఆర్థిక సాయం చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడల మంత్రి పద్మారావు, శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోచ్ బ్రిజ్ కిషోర్‌కు శాట్స్ చేయూత
సాక్షి, హైదరాబాద్: శాట్స్ జిమ్నాస్టిక్స్ కోచ్ బ్రిజ్ కిషోర్‌ను సోమవారం శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి పరామర్శించారు. గత పది రోజులుగా అనారోగ్యంతో బ్రిజ్ కిషోర్ పంజగుట్టలోని ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన చికిత్స కోసం రూ. 2 లక్షల చెక్‌ను అందజేశారు. ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన అరుణ రెడ్డికి ఆయనే కోచ్‌గా ఉన్నారు. -
పవర్‌గ్రిడ్ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ పవర్ సెక్టార్ అండర్ టేకింగ్స్ (సీపీఎస్‌యూ) కబడ్డీ టోర్నమెంట్లో పవర్‌గ్రిడ్ జట్టు శుభారంభం చేసింది. పవర్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (పీఎస్‌సీబీ) ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ టోర్నీలో తొమ్మిది ‘సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ పవర్ యూనిట్’ జట్లు తలపడుతున్నాయి. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో పవర్‌గ్రిడ్ జట్టు 54–13తో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) జట్టుపై ఘన విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డ్ (బీబీఎంబీ) 50–14తో మినిస్ట్రీ ఆఫ్ పవర్ (ఎంఓపీ)పై, ఎస్‌జేవీఎన్ జట్టు 46–11తో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ)పై, నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) 52–21తో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)పై, ఎన్‌హెచ్‌పీసీ 102–20తో ఎంఓపీపై గెలుపొంది ముందంజ వేశాయి. అంతకుముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవర్‌గ్రిడ్ (ఎస్‌ఆర్‌టీఎస్–1) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. శేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పవర్‌గ్రిడ్ సంస్థ అధికారులు, ‘శాట్స్’ ప్రతినిధులు పాల్గొన్నారు. -
కేంద్ర క్రీడల మంత్రిని కలిసిన శాట్స్ చైర్మన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి మంగళవారం కేంద్ర కీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌ను కలిసి సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణ ప్రతిపాదన పత్రాలు అందజేశారు. గ్రేటర్ నోయిడాలో నిర్వహించిన నేషనల్ యూత్ ఫెస్టివల్– 2018 ముగింపు కార్యక్రమం సందర్భంగా కేంద్ర మంత్రిని కలిసిన వెంకటేశ్వర్ రెడ్డి వరంగల్ (అర్బన్), సరూర్‌నగర్ స్టేడియాలలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటుకు నిధులు మం జూరు చేయాలని కోరారు. ‘ఖేలో ఇండియా’ కింద ఉస్మానియా వర్సిటీలో క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నవించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్‌ను సందర్శించాలని కోరారు. -
31నుంచి జాతీయ కబడ్డీ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 31నుంచి జనవరి 5వ తేదీ వరకు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో టోర్నీకి సంబంధించిన వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్, ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి టోర్నమెంట్ ట్రోఫీలను ఆవిష్కరించారు. పురుషుల, మహిళల విభాగంలో జరిగే ఈ పోటీలకు 1500మంది క్రీడాకారులు హాజరవుతారని నిర్వాహకులు చెప్పారు. 29 రాష్ట్రాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ, ప్రొ కబడ్డీ లీగ్ క్రీడాకారులు ఈ మెగా ఈవెంట్లో తలపడతారని తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. తన తమ్ముడు కాసాని కృష్ణ ముదిరాజ్ స్మారకార్థం బాచుపల్లిలో ఏర్పాటు చేసిన కబడ్డీ అకాడమీని శనివారం ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. సర్వీసెస్, రైల్వేస్, బీఎస్ఎన్ఎల్ జట్లు కూడా ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. ఆరు రోజుల పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సింథటిక్ కబడ్డీ మ్యాట్లపై లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలను నిర్వహిస్తారు. బుధవారం నుంచి నాకౌట్ పోటీలు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయని నిర్వాహకులు వెల్లడించారు. ఆదివారం జరిగే టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి పద్మారావు గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించనున్నారు. -
ఆసియా హ్యాండ్‌బాల్ పోస్టర్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం మరో అంతర్జాతీయ స్థాయి క్రీడా ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈనెల 20 నుంచి 30 వరకు ‘ఆసియా పురుషుల హ్యాండ్‌బాల్ టోర్నమెంట్’ జరుగనుంది. ఈ సందర్భంగా టోర్నీకి సంబంధించిన పోస్టర్‌ను సోమవారం ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ టోర్నీలో మొత్తం 9 దేశాలకు చెందిన 10 జట్లు పాల్గొంటున్నాయి. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కో ఆపరేషన్ చైర్మన్ విప్లవ్ కుమార్, హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షులు ఎ.జగన్మోహన్ రావు, కార్యదర్శి పవన్ కుమార్, కోచ్‌లు డా. రవి కుమార్, దీపక్ ప్రసాద్, ప్రవీణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్పోర్ట్స్ ఫర్ ఆల్’ ఈవెంట్ షురూ
సాక్షి, హైదరాబాద్: స్కూల్ స్థాయి ఒలింపిక్స్‌గా భావించే ‘స్పోర్ట్స్ ఫర్ ఆల్’ క్రీడా ఈవెంట్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. గచ్చిబౌలిలో జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు బి. వెంకటేశం, ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. పోటీల సందర్భంగా బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్స్ షాన్, ప్రగ్యా జోషి సందడి చేశారు. ఏడు రోజులపాటు జరుగనున్న ఈ చాంపియన్‌షిప్‌లో 23 క్రీడా ఈవెంట్లలో 250 పాఠశాలలకు చెందిన 13,500 మంది విద్యార్థులు తలపడుతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఆర్చరీ ఫైనల్లో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. ఈ ఈవెంట్లో ఓవరాల్‌గా 6 పతకాలతో ఆకట్టుకున్నారు. భాష్యం బ్లూమ్స్ గ్లోబల్ స్కూల్ 4 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. అండర్–14 బాలుర కేటగిరీలో మిథుల్ కుమార్ (భాష్యం స్కూల్) స్వర్ణాన్ని కైవసం చేసుకోగా, షరాబ్ షేక్ (ఆల్ సెయింట్స్ హైస్కూల్) రజతాన్ని గెలుచుకున్నాడు. హాకీ ఈవెంట్లో హెచ్‌పీఎస్ బేగంపేట్ జట్టు 2 పతకాలను సాధించింది. మమతా హైస్కూల్, హెచ్‌పీఎస్ రామంతపూర్ జట్లకు ఒక్కో పతకం దక్కింది. స్విమ్మింగ్ పోటీల్లో సిల్వర్ ఓక్స్ స్కూల్ జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. -
స్విమ్మింగ్ కోచ్ కుటుంబానికి సహాయం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మరణించిన వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన స్విమ్మింగ్ కోచ్ కె. మల్లేశ్ కుటుంబానికి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) సహాయం అందించింది. బుధవారం ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ ఎ. దినకర్ బాబు 5 లక్షల రూపాయల చెక్‌ను ఆయన భార్య ధనలక్ష్మికి అందజేశారు. 2009 నుంచి వరంగల్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీలో స్విమ్మింగ్ కోచ్‌గా పనిచేస్తున్న మల్లేశ్ హఠాత్తుగా గుండెపోటుతో మే నెలలో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక సహాయంతో పాటు మల్లేశ్ భార్య ధనలక్ష్మి విద్యార్హతలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థలో ఉద్యోగం, వారి కుమారుడికి కరీంనగర్ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్ కూడా ఖరారు చేశామని చెప్పారు. -
రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కృషి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో రాణించే విధంగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ‘శాట్స్’ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఎల్బీ స్టేడియంలో పరిశ్రమల శాఖ కార్పొరేషన్ చైర్మన్ బాలమల్లు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... ∙గత పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో క్రీడలు అభివృద్ధికి నోచుకోలేదు. నేను శాట్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రీడల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నాను. రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదవలేదు. అయితే వారికి సరైన సదుపాయాలు కల్పిస్తే వారు జాతీయస్థాయిలో మరింతగా రాణిస్తారు. క్రీడలకు నిధుల కొరత ఉన్నమాట వాస్తవమే. నిధులను సమకూర్చేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ నియామకాలలో 2 శాతం స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ తీసుకువచ్చేందుకై రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపించాను. అదే విధంగా ప్రతి జిల్లాలో క్రీడా అకాడమీ ఏర్పాటు, నూతన కోచ్‌ల నియామకం వంటి ప్రతిపాదనలు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాను. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) రీజినల్ సెంటర్‌ను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్‌కు వినతి పత్రం ఇచ్చాను. లక్ష్మీబాయ్ జాతీయ వ్యాయామ విద్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు... గచ్చిబౌలి స్టేడియంలోని సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ పునర్నిర్మాణం చేయుటకు కృషి చేస్తున్నాను. క్రీడల అభివృద్ధికై తమతో పాటు క్రీడాశాఖ అధికారులు సైతం కలిసి వస్తే రాష్ట్రంలో క్రీడాకారులకు మరింత మేలు చేకూరుతుంది. టోక్యో ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం విశిష్ట క్రీడాకారులకు అందజేసే టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో మన రాష్ట్రం నుంచి 15 మంది క్రీడాకారులకు చోటు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను. -
‘శాట్స్’ హరితహారానికి విశేష స్పందన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) ఆధ్వర్యంలో సోమవారం జరిగిన హరితహారం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం నుంచి ఆద ర్శ్‌నగర్‌లోని రిడ్జ్ హోటల్ వరకు ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో శాట్స్ విద్యార్థులు, అధికారులు, టూరిజం శాఖ సిబ్బంది దాదాపు 700 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ బి. వెంకటేశం, శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ ఎ. దినకర్ బాబు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) చైర్మన్ పి. రాములు, ఎండీ క్రిస్టియానా చొంగ్తూ, సీనియర్ కోచ్ ఎస్ఎం ఆరిఫ్, అర్జున అవార్డు గ్రహీత జేజే శోభ, మాజీ అథ్లెట్ పి. శంకర్, టీటీ క్రీడాకారిణి నైనా జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
అనూప్, శివలకు ‘శాట్స్’ ఎండీ ప్రశంస
సాక్షి, హైదరాబాద్: ఇటీవల అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు గెలుపొందిన స్కేటర్ అనూప్ కుమార్ యామ, లిఫ్టర్ శివ కుమార్‌లను ‘శాట్స్’ మేనేజింగ్ డెరైక్టర్ ఎ. దినకర్‌బాబు అభినందించారు. అర్జున అవార్డీ అనూప్ కుమార్ ఆసియా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో సీనియర్ పురుషుల ఫిగర్ స్కేటింగ్, కంబైన్డ ఈవెంట్లలో రెండు బంగారు పతకాలు గెలిచాడు. దీంతో పాటు ఇన్లైన్ ఆర్టిస్టిక్ స్కేటింగ్, సోలో డాన్స ఈవెంట్లో చెరో రజతం నెగ్గాడు. వెరుుట్లిఫ్టర్ శివ కుమార్ అంతర్జాతీయ యూనివర్సిటీ పోటీల్లో 56 కేజీ కేటగిరీలో రజత పతకం గెలుపొందాడు. -
బంగారు పతకాల తెలంగాణ కావాలి
‘శాట్స్’ చైర్మన్ ఆకాంక్ష సాక్షి, హైదరాబాద్: దేశంలో తెలంగాణను క్రీడల్లో నంబర్ 1గా తీర్చిదిద్దేలా కృషిచేయాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ ఎ. వెంకటేశ్వర రెడ్డి క్రీడాసంఘాలకు పిలుపునిచ్చారు. బంగారు పతకాల తెలంగాణ అయ్యే విధంగా క్రీడాకారులను తయారు చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని క్రీడాసంఘాల అధికారులతో ఆయన గురువారం ఎల్బీ స్టేడియంలోని శాట్స్ మీటింగ్ హాల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్రీడా సంఘాలు తమ సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. సంఘాలకు రావాల్సిన నిధులు, మౌలిక వసతులు, సదుపాయాల గురించి ఆయన అధికారులతో చర్చించారు. త్వరలోనే క్రీడా సంఘాల సమస్యల్ని పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. వీటితో పాటు రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం సలహాలను, భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేయాలని ఆయన సూచించారు. అన్ని సంఘాలు కలిసి కట్టుగా కృషిచేస్తేనే రాష్ట్రంలో క్రీడాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. క్రీడా సంఘాల ఉమ్మడి లక్ష్యం తెలంగాణను క్రీడల్లో అగ్రస్థానంలో నిలిచేలా పనిచేయడమే కావాలని ఆయన కోరారు. శాట్స్ ఎండీ క్రిస్టినా చొంగ్తు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని క్రీడా సంఘాల అధికారులు, సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర రెడ్డి
శాట్స్ చైర్మన్‌గా నియామకం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్‌గా అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎల్బీ స్టేడియంలోని శాట్స్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు, శాట్స్ అధికారులు, క్రీడాభిమానులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర తొలి శాట్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర రెడ్డిని పలువురు ఘనంగా సన్మానించారు. గ్రామాల్లోని యువత క్రీడల్లో రాణించే విధంగా ఏర్పాట్లు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పంజాబ్, హరియాణా తరహాలో రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో క్రీడాకారుల కోసం హాస్టల్స్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జూపల్లి కృష్ణారావు, నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస రెడ్డి, పద్మారావు గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు బాల్క సుమన్, జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, గువ్వల బాలరాజు, ఎ. వెంకటేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీలు కాశిరెడ్డి నారాయణ రెడ్డి, శ్రీనివాస రెడ్డితో పాటు పలువురు శాట్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
రన్ ఫర్ రియో -ఖేలో ఔర్ జియో..
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు మద్దతు తెలుపుతూ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) ఆధ్వర్యంలో సోమవారం ‘రన్ ఫర్ రియో- ఖేలో ఔర్ జియో’ కార్యక్రమం జరగనుంది. నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఉదయం 7 గంటలకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి టి. పద్మారావు ప్రారంభిస్తారు. జల విహార్, పీవీ జ్ఞానభూమి మీదుగా సాగే ఈ రన్లో శాట్స్ ఎండీ దినకర్ బాబు, ఐఏఎస్ బి. వెంకటేశం పాల్గొంటారు. ఆసక్తి గల వారు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.