
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం మరో అంతర్జాతీయ స్థాయి క్రీడా ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈనెల 20 నుంచి 30 వరకు ‘ఆసియా పురుషుల హ్యాండ్‌బాల్ టోర్నమెంట్’ జరుగనుంది. ఈ సందర్భంగా టోర్నీకి సంబంధించిన పోస్టర్‌ను సోమవారం ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ టోర్నీలో మొత్తం 9 దేశాలకు చెందిన 10 జట్లు పాల్గొంటున్నాయి.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కో ఆపరేషన్ చైర్మన్ విప్లవ్ కుమార్, హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షులు ఎ.జగన్మోహన్ రావు, కార్యదర్శి పవన్ కుమార్, కోచ్‌లు డా. రవి కుమార్, దీపక్ ప్రసాద్, ప్రవీణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.