‘స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌’ ఈవెంట్‌ షురూ | Sports For All Event Started | Sakshi
Sakshi News home page

‘స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌’ ఈవెంట్‌ షురూ

Published Mon, Nov 13 2017 10:52 AM | Last Updated on Mon, Nov 13 2017 10:52 AM

Sports For All Event Started - Sakshi

టోర్నీ ప్రారంభోత్సవం సందర్బంగా మాట్లాడుతున్న శాట్స్ చైర్మన్ ఎం.వెంకటేశ్వర్ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: స్కూల్‌ స్థాయి ఒలింపిక్స్‌గా భావించే ‘స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌’ క్రీడా ఈవెంట్‌ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. గచ్చిబౌలిలో జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు బి. వెంకటేశం, ‘శాట్స్‌’ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. పోటీల సందర్భంగా బాలీవుడ్‌ ప్లేబ్యాక్‌ సింగర్స్‌ షాన్, ప్రగ్యా జోషి సందడి చేశారు. ఏడు రోజులపాటు జరుగనున్న ఈ చాంపియన్‌షిప్‌లో 23 క్రీడా ఈవెంట్లలో 250 పాఠశాలలకు చెందిన 13,500 మంది విద్యార్థులు తలపడుతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఆర్చరీ ఫైనల్లో తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌ విద్యార్థులు సత్తా చాటారు. ఈ ఈవెంట్‌లో ఓవరాల్‌గా 6 పతకాలతో ఆకట్టుకున్నారు.

భాష్యం బ్లూమ్స్‌ గ్లోబల్‌ స్కూల్‌ 4 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. అండర్‌–14 బాలుర కేటగిరీలో మిథుల్‌ కుమార్‌ (భాష్యం స్కూల్‌) స్వర్ణాన్ని కైవసం చేసుకోగా, షరాబ్‌ షేక్‌ (ఆల్‌ సెయింట్స్‌ హైస్కూల్‌) రజతాన్ని గెలుచుకున్నాడు. హాకీ ఈవెంట్‌లో హెచ్‌పీఎస్‌ బేగంపేట్‌ జట్టు 2 పతకాలను సాధించింది. మమతా హైస్కూల్, హెచ్‌పీఎస్‌ రామంతపూర్‌ జట్లకు ఒక్కో పతకం దక్కింది. స్విమ్మింగ్‌ పోటీల్లో సిల్వర్‌ ఓక్స్‌ స్కూల్‌ జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement