
తెలంగాణ టెన్నిస్ క్రీడాకారిణి భవాని కేడియా వచ్చే నెలలో బ్రెజిల్ వేదికగా జరిగే బధిరుల ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. 2010 నుంచి టెన్నిస్ ఆడుతున్న భవాని ప్రస్తుతం హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్ కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. భవాని 2019లో చెన్నైలో జరిగిన బధిరుల జాతీయ క్రీడల్లో సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో రజత పతకాలను గెలుచుకుంది. బధిరుల ఒలింపిక్స్‌లో భవానితోపాటు షేక్ జాఫ్రీన్, పృథ్వీ శేఖర్, ధనంజయ్ దూబే భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment