bhavani
-
కీచక ఎస్సై పాపం పండింది
-
కర్ణాటక హైకోర్టులో ప్రజ్వల్ తల్లి భవానికి ముందస్తు బెయిల్
బెంగళూరు: లైంగిక వేధింపు కేసులో నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న ఆర్కే.నగర్‌కు చెందిన బాధితురాలి కిడ్నాప్ కేసులో మంగళవారం హైకోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. భవానీ రేవణ్ణ ఇప్పటికే సిట్ అడిగిన 85 ప్రశ్నలకు సమాధానమిచ్చారని కోర్టు తెలిపింది. ఆమె విచారణకు సహకరించడం లేదని సిట్ చెప్పడం సరికాదని కోర్టు పేర్కొంది.Karnataka High Court grants anticipatory bail to Bhavani Revanna, mother of suspended JD(S) leader Prajwal Revanna. The bail has been granted to her on the condition that she is not allowed to enter Mysuru and Hassan. Court says that when she has already answered 85 questions…— ANI (@ANI) June 18, 2024 తన ఇంట్లో పనిచేసే ఆర్కే నగర్‌కు చెందిన మహిళ కిడ్నాప్ కేసులో భవానీ రేవణ్ణ నిందితురాలు. ఆ మహిళ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి కేసులో కర్ణాటక ప్రభుత్వం విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మే 31న జర్మనీ నుంచి వచ్చిన ప్రజ్వల్‌ను సిట్ అధికారులు బెంగళూరు ఎయిర్‌పోర్టులోనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రజ్వల్‌పై సిట్ విచారణ కొనసాగుతోంది. -
కర్ణాటకలో కొత్త ట్విస్ట్.. ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణకు సిట్ నోటీసులు
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపులు, దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లికి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణను విచారించేందుకు శుక్రవారం ఐపీసీ సెక్షన్లు 64(A), 365, 109, 120(B) కింద సిట్ నోటీసులు ఇచ్చింది. తమ విచారణ కోసం భావానీ రేవణ్ణ హోలెనర్సీపూర్‌లోని వారి నివాసంలోనే జూన్ 1న సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో సిట్ పేర్కొంది. #BreakingS.I.T issues another notice to #PrajwalRevanna's mother #BhavaniRevanna in the kidnapping case.Prajwal Revanna will shortly be taken for a medical examination, and after that, he will be brought to the City Civil Court Complex for further questioning...: @dpkBopanna… pic.twitter.com/G9croxFBP6— TIMES NOW (@TimesNow) May 31, 2024 ఇక.. శుక్రవారం తెల్లవారుజామున జర్మనీ నుంచి భారత్‌కు వచ్చిన ప్రజ్వల్ రేవణ్ణను సిట్ పోలీసులు బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. ఇక.. అక్కడి నుంచి ఆయన్ను విచారణ కోసం సీఐడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. విచారణలో భాగంగా ప్రజ్వల్‌కు పొటెన్సీ పరీక్షలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఛత్రపతి శేఖర్.. పెద్దలను ఎదురించి పెళ్లి.. కానీ తర్వాతే!
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమా గుర్తుందా?.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ప్రభాస్‌కు ఫ్రెండ్‌గా మెప్పించిన నటుడు చంద్రశేఖర్. టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే చంద్రశేఖర్ ఆర్ఆర్ఆర్లోనూ కీలక పాత్ర పోషించారు. ఛత్రిపతి సినిమాతోనే అతన్నిఅందరూ ఛత్రపతి శేఖర్ అని పిలుస్తుంటారు. కానీ ఆయన గురించి చాలామందికి తెలియని ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదేంటో తెలుసుకుందాం పదండి. చంద్రశేఖర్ మాజీ భార్య నీల్యా భవానీ కూడా నటి అన్నసంగతి చాలామందికి తెలియదు. ఆమె చాలా సినిమాల్లో నటించినప్పటికీ.. చంద్రశేఖర్ భార్య అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన భార్య కూడా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్. పండగ చేస్కో, కిక్2, సైరా నరసింహారెడ్డి, జెంటిల్మెన్.. లాంటి చాలా సినిమాల్లో ఆమె నటించింది. కోలీవుడ్‌లోనూ అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో మెరిసింది. చంద్రశేఖర్‌తో ప్రేమ పెళ్లి.. ఖమ్మం జిల్లాకు చెందిన నీల్యా భవానీ చంద్రశేఖర్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది. పెద్దలు అంగీకరించకపోవడంతో ఎదురించి మరీ వివాహాబంధంతో ఒక్కటయ్యారు. కానీ ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా.. ప్రస్తుతం నీల్యా భవాని ప్రస్తుతం సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తోంది. ఆ సమయంలో చంద్రశేఖర్ నటుడిగా నిలదొక్కుకోకపోవడంతో భవానీ తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. -
ఆంధ్రప్రదేశ్ అమ్మాయి భగవతి భవానికి కాంస్యం
చెంగ్డూ (చైనా): ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో బుధవారం భారత్‌కు రెండు పతకాలు లభించాయి. షూటింగ్లో ఇలవేనిల్ వలారివరన్–దివ్యాంశ్ సింగ్ పన్వర్ జోడీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో రజతం సాధించారు. అథ్లెటిక్స్‌లో మహిళల లాంగ్‌జంప్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భగవతి భవాని యాదవ్ కాంస్య పతకాన్ని గెల్చుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఫైనల్లో ఇలవేనిల్–దివ్యాంశ్ ద్వయం 13–17తో యు జాంగ్–బుహాన్ సాంగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. ఇక లాంగ్‌జంప్ ఫైనల్లో విజయవాడకు చెందిన భవాని యాదవ్ 6.32 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం భారత్ 11 స్వర్ణాలు, 5 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. -
రష్మీ, భవానిలకు కాంస్యాలు
భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు రష్మీ, భవాని యాదవ్ జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలతో మెరిశారు. ఒడిశాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఇద్దరు కాంస్య పతకాలు సాధించారు. జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల జావెలిన్ త్రో ఈవెంట్లో రష్మీ ఈటెను 50.95 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచింది. నాలుగో ప్రయత్నంలో ఈ మెరుగైన ప్రదర్శన ద్వారా ఆమె కాంస్య పతకం నెగ్గింది. ఇందులో అన్ను రాణి (ఉత్తరప్రదేశ్; 58.22 మీ.) స్వర్ణం, ప్రియాంక (హరియాణా; 51.94 మీ.) రజతం గెలుపొందారు. అంతకుముందు జరిగిన లాంగ్‌జంప్ పోటీలో భవాని 6.44 మీటర్ల దూరం దూకి కాంస్యంతో తృప్తిపడింది. అన్సీ సోజన్ (కేరళ; 6.51 మీ.), శైలీసింగ్ (ఉత్తరప్రదేశ్; 6.49 మీ.) వరుసగా పసిడి, రజత పతకాలు సాధించారు. భారత స్టార్ అథ్లెట్, షాట్‌పుటర్ తజీందర్ పాల్ తూర్ తన రికార్డును తానే సవరించి కొత్త ‘ఆసియా’ రికార్డు నెలకొల్పాడు. అతను గుండును 21.77 మీటర్ల దూరం విసిరాడు. దీంతో 28 ఏళ్ల పంజాబ్ అథ్లెట్ తజీందర్ 2021లో 21.49 మీటర్లతో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. అతను విసిరిన దూరం ఈ సీజన్లో ప్రపంచంలోనే తొమ్మిదో మెరుగైన ప్రదర్శనగా నిలిచింది. 21.40 మీటర్ల క్వాలిఫయింగ్ మార్క్‌ను దాటడంతో ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడలకూ తజీందర్ పాల్ అర్హత సంపాదించాడు. సోమవారం ముగిసిన ఈ పోటీల్లో ఏపీ అమ్మాయి యెర్రా జ్యోతి ఉత్తమ మహిళా అథ్లెట్‌గా ఎంపికైంది. తమిళనాడు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. -
దేశంలో దొంగలు పడ్డారు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా’ అనే సామెత టీడీపీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. ఆర్థిక నేరాల్లో తెలుగు తమ్ముళ్లది అందె వేసిన చెయ్యేనన్న విషయం ఆదిరెడ్డి అండ్ సన్ అరెస్టుతో మరోసారి చర్చల్లోకి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నుంచి ద్వితీయ శ్రేణి నేతల వరకూ అందరిదీ ఒకటే మాట ఒకటే బాటగా అవినీతి రాజ్యమేలింది. జన్మభూమి కమిటీల పేరుతో తెలుగు తమ్ముళ్లు అడుగడుగునా ప్రజలను నిలువునా దోచుకున్నారు. ఇది చాలదా అన్నట్టు ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టి కోట్లకు కోట్ల రూపాయలు వసూలు చేసి పలాయనం చిత్తగించిన వారూ ఉన్నారు. వెంటాడుతున్న పాపాలు చిట్టీలు, ఫైనాన్స్‌ల పేరుతో ప్రజలను జలగల్లా పీక్కుతిన్న నేతలు ఒక్కొక్కరినీ రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం కటకటాల్లో వేస్తోంది. తాజాగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసు, ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్సీ అప్పారావులను సీఐడీ అధికారులు ఆదివారం అరెస్టు చేసి, రిమాండుకు తరలించిన విషయం తెలిసిందే. చిట్‌ఫండ్ చట్టాన్ని తుంగలోకి తొక్కి, ఆర్థిక లావాదేవీల్లో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్న అభియోగాలపై వీరిని అరెస్టు చేశారు. చేసిన పాపాలు వెంటాడుతూనే ఉంటాయని పెద్దలు అంటారు. ఇప్పుడు ఆదిరెడ్డి విషయంలోనూ అదే జరిగిందని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. చిట్టీల పేరుతో చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి లావాదేవీలన్నింటినీ నగదు రూపంలో నిర్వహించడం.. ఒకచోట కార్యాలయం రిజిస్టర్ చేసి, మరోచోట నిర్వహించడం.. అసలు అనుమతి లేకుండానే కాకినాడలో ప్రాంతీయ కార్యా లయం నిర్వహించడం వంటి అనేక అవకతవకలకు పాల్పడి, ప్రజలను మోసగించారని సీఐడీ ప్రాథమికంగా నిగ్గు తేల్చింది. లోతైన విచారణ జరుపుతున్న సీఐడీ.. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో తండ్రీకొడుకులకు ఉచ్చు బిగుస్తుందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఇంకా ఎన్నో.. ► తెలుగు తమ్ముళ్ల అక్రమాల్లో కొన్ని బయట పడగా, వెలుగులోకి రానివి చాలానే ఉన్నాయని అంటున్నారు. ప్రజలను మోసగించి బాధితులు, పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న తెలుగు తమ్ముళ్లు చాలా మందే ఉన్నారు. ► తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు రెండో వార్డు టీడీపీ ఇన్చార్జి అక్కాబత్తుల చిన్నారావు ఇలానే చిట్టీల పేరుతో ప్రజలను నిలువునా ముంచేసి పరారైపోయాడు. ఏసీఆర్ చిట్స్ పేరుతో ప్రజల నుంచి డబ్బులు కొల్లగొట్టి, రెండేళ్ల క్రితం బోర్డు తిప్పేశాడు. ఈ తెలుగు తమ్ముడి చేతిలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని సుమారు 5 వేల మంది మోసపోయారు. చిన్నారావు ఏకంగా ఐదారు కోట్ల రూపాయలు కొల్లగొట్టేశాడు. అతడి మోసాలపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ► కోనసీమలో 1996 తుపాను అనంతరం బాధితులకు వచ్చిన రేషన్ బియ్యాన్ని నాటి ఎమ్మెల్యే దివంగత పులపర్తి నారాయణమూర్తి అడ్డంగా బొక్కేసినట్టు వచ్చిన ఆరోపణలు అప్పట్లో పెను సంచలనమే అయ్యాయి. ► ఉప్పలగుప్తం మండలానికి చెందిన మిల్లర్, అప్పటి జెడ్పీటీసీ సభ్యుడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ టీడీపీ అధికారంలో ఉండగా పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం దారి మళ్లించాడు. టీడీపీ నేతలు గట్టి ఒత్తిడి తీసుకువచ్చినా ముక్కుసూటిగా పోయిన అప్పటి సీఐ వైఆర్కే శ్రీనివాస్ అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయినప్పటికీ ఆ తెలుగు తమ్ముడి అక్రమాల దందాలో మార్పు రాలేదు. మరోసారి రేషన్ బియ్యాన్ని దారి మళ్లించిన వ్యవహారంలో అతడిపై ఉప్పలగుప్తం పోలీసులు తాజాగా మరో కేసు నమోదు చేయడం గమనార్హం. ఈవిధంగా నాటి నుంచి నేటి వరకూ టీడీపీలో చిన్నాచితకా నాయకుల నుంచి బడా నేతల వరకూ ఇదే పంథాలో అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. ‘సహకారం’తో అక్రమాలు ఇప్పుడంటే ఆదిరెడ్డి జగజ్జనని చిట్‌ఫండ్స్ బండారం బయటపడింది కాబట్టి సీఐడీ పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్టు చేశారు. ఇంతకంటే ముందే టీడీపీ ఏలుబడిలో తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)లో జరిగిన కోట్లాది రూపాయల ఆర్థిక కుంభకోణం ఉమ్మడి జిల్లా ప్రజలకు తెలియంది కాదు. నాటి చైర్మన్‌గా ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి దివంగత వరుపుల రాజాపై సీఐడీ కేసు నమోదు చేయడం, ఆయన అరెస్టుకు ప్రయత్నించడం తెలిసిందే. ఆ సమయంలోనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, లంపకలోవ, లింగంపర్తి, కిర్లంపూడి, గండేపల్లి, కానవరం, భూపాలపట్నం, మొల్లేరు, రావుపాలెం, వద్దిపర్రు తదితర ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన సొసైటీల అధ్యక్షులు కోట్లాది రూపాయలు దారి మళ్లించేసి రైతుల నోట మట్టి కొట్టారు. నాడు కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అక్రమార్కులపై వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక సీఐడీ విచారణ జరిపిస్తోంది. వైరివర్గం ఖుషీ ఆదిరెడ్డి తండ్రీ తనయుల అరెస్టు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. నిత్యం ఎదుటి వారిపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న ఆ పార్టీ అగ్రనేతలకు వీరి అరెస్టులతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది. చిట్టీల పేరుతో చేసిన మోసాన్ని ఆధారాలతో సహా సీఐడీ బయట పెట్టడం వారికి మింగుడు పడటం లేదు. మొదటి నుంచీ రాజకీయంగా ఆదిరెడ్డిని వ్యతిరేకిస్తున్న వర్గం మాత్రం ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఎక్కడా బయట పడకుండా అంతర్గతంగా సంబరాలు చేసుకుంటోంది. రాజమహేంద్రవరం సిటీపై ఆధిపత్యం కోసం ఇటు ఆదిరెడ్డి, అటు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వర్గాలు చాలాకాలం నుంచి నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడుతున్నాయి. పార్టీపై గుత్తాధిపత్యాన్ని అధిష్టానం తమ కుటుంబానికే రాసి ఇచ్చేసినట్టు ఏకపక్షంగా వ్యవహరిస్తూ వచ్చిన ఆదిరెడ్డికి తగిన శాస్తే జరిగిందని ఆయన వైరి వర్గంగా ముద్రపడిన గోరంట్ల అనుయాయులు అంటున్నారు. అలాగని ఆదిరెడ్డి అరెస్టులపై పెదవి విప్పడానికి ఆ పార్టీ నేతలెవరూ ముందుకు రావడం లేదు. -
రాజమహేంద్రవరంలో మరో మార్గదర్శి
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం: మార్గదర్శి తరహాలో మరో భారీ మోసం వెలుగుచూసింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జగజ్జనని చిట్స్ పేరుతో టీడీపీ నేతలు ఆర్థిక నేరానికి పాల్పడిన విషయం బట్టబయలైంది. 1982 చిట్‌ఫండ్స్ చట్టం నిబంధనలు ఉల్లంఘించి, ఇష్టానుసారం డిపాజిట్లు సేకరించి, వాటిని ఇతర వ్యాపారాలకు, వడ్డీలకు మళ్లించి అక్రమాలకు తెరతీసిన విషయం సీఐడీ దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ చిట్‌ఫండ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు–ఏ1, డైరెక్టర్‌గా ఉన్న ఆయన కుమారుడు ఆదిరెడ్డి శ్రీనివాస్–ఏ2 (రాజమహేంద్రవరం సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త)లను సీఐడీ అధికారులు రాజమహేంద్రవరంలో ఆదివారం అరెస్టుచేశారు. వీరితోపాటు మరో డైరెక్టర్ అయిన ఆదిరెడ్డి అప్పారావు కుమార్తె ఆదిరెడ్డి వెంకట జ్యోత్స్నలపై ఐపీసీ సెక్షన్లు 420, 409, 120బి, 477 (ఎ) రెడ్‌విత్ 34, రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్–5, కేంద్ర చిట్‌ఫండ్ చట్టం–1982 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జగజ్జనని చిట్‌ఫండ్స్ అక్రమాలకు పాల్పడుతున్నట్టు సీఐడీ విభాగానికి కొన్నినెలల క్రితమే ఫిర్యాదులొచ్చాయి. అక్రమాలు వాస్తవమేనని నిర్ధారణ కావడంతో చిట్ రిజిస్ట్రార్ ఈ విషయంపై సీఐడీకి ఫిర్యాదు చేశారు. దాంతో సీఐడీ అధికారులు ఈ ఏడాది మార్చిలో జగజ్జనని చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో భారీగా ఆర్థిక అక్రమాలు వెలుగుచూశాయి. వీటిపై సంస్థ బ్రాంచి మేనేజర్లు (ఫోర్‌మెన్) సరైన వివరణ కూడా ఇవ్వలేకపోవడంతో సీఐడీ అధికారులు కేసును లోతుగా విచారించి అవకతవకలను నిర్ధారించారు. యథేచ్చగా ఆర్థిక అక్రమాలు.. జగజ్జనని చిట్ ఫండ్స్ కంపెనీ కొన్నేళ్లుగా ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు సీఐడీ తనిఖీల్లో బట్టబయలైంది. ఆ కంపెనీ ఎండీ, డైరెక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా చందాదారుల సొమ్మును మళ్లించి సొంత ఆస్తులు భారీగా కూడబెట్టుకున్నట్లుగా ఆధారాలను గుర్తించారు. సీఐడీ అధికారులు గుర్తించిన కొన్ని అంశాలివీ.. ► చిట్‌ఫండ్స్ కంపెనీలు ఇతర వ్యాపారాలు చేయడం చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధం. కానీ, జగజ్జనని సంస్థ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణ, అక్రమంగా రుణాలు మంజూరు చేస్తూ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తోంది. 2018 నుంచి 2023 వరకు భారీగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు.. వాటిపై వడ్డీలు చెల్లించినట్లు గణాంకాలతో సహా వెల్లడైంది. అదే రీతిలో చందాదారుల సొమ్ముతో భారీగా వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. తద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించినట్లు వెల్లడైంది. ► చిట్టీల నిర్వహణలో జగజ్జనని చిట్‌ఫండ్స్ అక్రమాలకు పాల్పడుతోంది. ప్రతి చిట్టీలోనూ యాజమాన్య వాటా టికెట్లతోపాటు మరికొన్ని టికెట్లను కూడా కంపెనీ తమ పేరిట ఉంచుతోంది. కానీ, ఆ టికెట్లపై ప్రతినెలా చెల్లించాల్సిన చందాను చెల్లించడంలేదు. ఇతర చందాదారులు పాడిన చిట్టీ పాటల ద్వారా వచ్చే డివిడెండ్‌ను తమ ఖాతాలో జమ చేసుకుంటోంది. ఇక ఆ టికెట్ల చిట్టీ పాటల ప్రైజ్‌మనీని కూడా జమచేసుకుంటోంది. ఒక చిట్టీ గ్రూప్‌లోని చందా సొమ్మును మరో చిట్టీ గ్రూప్‌లో బుక్ అడ్జస్ట్మెంట్ల ద్వారా కనికట్టు చేస్తోంది. అంటే ఒక్క రూపాయి కూడా చందా చెల్లించకుండా అక్రమంగా ఆర్థిక ప్రయోజనం పొందుతోంది. ► చిట్టీ పాటల నిర్వహణలో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు. 2022 మే నుంచి ఆగస్టు వరకు సంస్థ నిర్వహించిన చిట్టీ పాటల వేలం రికార్డులను పరిశీలించగా ఈ వ్యవహారం వెలుగుచూసింది. చిట్టీ పాట పాడిన వారికి ఇచ్చే మొత్తాన్ని (ప్రైజ్‌మనీ) వాస్తవానికి చిట్టీ పాట నిర్వహించిన తేదీ కంటే ముందే చెల్లించినట్లు బ్యాంకు రికార్డులు వెల్లడించాయి. అంటే చిట్టీ పాటల నిర్వహణ కంటే ముందే ఆ మొత్తాన్ని కొందరికి చెల్లిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. జగజ్జనని చిట్‌ఫండ్స్ నిర్వహిస్తున్న చిట్టీ పాటలు పూర్తిగా బోగస్ అని నిరూపితమైంది. ► ప్రతినెలా 41 చిట్ గ్రూపులను నిర్వహిస్తూ రూ.7,61,50,000 వార్షిక టర్నోవర్‌తో వ్యాపారం చేస్తున్నట్లుగా రికార్డుల్లో సంస్థ చూపిస్తోంది. కానీ, ఆ సంస్థ కాకినాడలోని అసిస్టెంట్ చిట్స్ రిజిస్ట్రార్‌కు సమర్పించిన చిట్ వేలం రికార్డులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఆ సంస్థ ప్రతినెలా క్రమం తప్పకుండా చిట్ వేలాన్ని నిర్వహించడంలేదన్నది వెల్లడైంది. 2022, జనవరి నుంచి 2023 జనవరి వరకు రికార్డులను పరిశీలిస్తే ఒక్కనెల తప్ప మిగిలిన అన్ని నెలల్లోనూ తక్కువ చిట్ వేలమే నిర్వహించింది. ► ఈ కంపెనీ టర్నోవర్‌కు బ్యాంకులో జమచేస్తున్న చందా మొత్తాలు భిన్నంగా ఉన్నాయి. ప్రతినెలా రూ.7.61 కోట్ల టర్నోవర్ అని కంపెనీ చెబుతోంది. అంటే.. డివిడెండ్ మొత్తం మినహాయించుకుంటే ప్రతినెలా రూ.5కోట్లు చొప్పున ఏడాదికి చందా మొత్తాలే రూ.60కోట్లు జమచేయాలి. కానీ, జమచేస్తున్న మొత్తం ఆ దరిదాపుల్లో కూడా లేదు. ► చిట్టీల వేలం సొమ్ము చెల్లింపు ముసుగులో జగజ్జనని చిట్‌ఫండ్స్ నల్లధనాన్ని చలామణిలోకి తెస్తోంది. 49 చిట్టీ పాటల ప్రైజ్‌మనీ మొత్తం రూ.11,76,82,000 చెల్లింపులను పరిశీలించారు. వాటిలో 21 చిట్టీ పాటల ప్రైజ్‌మనీ రూ.4,68,45,753ను బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. మిగిలిన 28 చిట్టీల వేలం పాటల ప్రైజ్‌మనీ రూ.7,08,36,247ను నగదు రూపంలో చెల్లించినట్లు చెప్పారు. నగదు రూపంలో చెల్లించడం నిబంధనలకు విరుద్ధం. అంటే.. నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చినట్లు వెల్లడైంది. ► చిట్‌ఫండ్ కంపెనీ అన్ని వ్యవహారాలు నగదులోనే నిర్వహిస్తోంది. అంటే చందాల వసూళ్లు, చిట్ పాట మొత్తం చెల్లింపులన్నీ నగదులోనే నిర్వహిస్తోంది. ఇది ఆదాయపన్ను చట్టానికి విరుద్ధం. ► బ్యాంకు ఖాతాల్లో సంస్థ భారీగా నగదు డిపాజిట్లు కూడా చేస్తోంది. చిట్ వసూళ్లతో ఆ డిపాజిట్లు సరిపోలడంలేదు. ఎక్కువగా బ్యాంకు డిపాజిట్లు నగదు రూపంలోనే చేస్తున్నారు. ► చందా చెల్లించడంలేదని చెబుతున్న చిట్ల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా నిర్వహించడంలేదు. ► మరోవైపు.. జగజ్జనని చిట్‌ఫండ్స్ వేలానికి సంబంధించిన మినిట్స్ రికార్డులకు బ్యాంకు లావాదేవీలు భిన్నంగా ఉన్నాయి. మచ్చుక్కి 11 చిట్టీ పాటల మినిట్స్‌ను సీఐడీ అధికారులు పరిశీలించారు. అందులో పేర్కొన్న మొత్తం కంటే వాస్తవంగా బ్యాంకు ద్వారా చెల్లించిన మొత్తం తక్కువగా ఉంది. అంటే.. చందాదారులను ఆ చిట్‌ఫండ్స్ సంస్థ మోసం చేస్తోందని వెల్లడైంది. ► చిట్‌ఫండ్ చట్టంలో పేర్కొన్న రికార్డులను జగజ్జనని చిట్‌ఫండ్స్ నిర్వహించడంలేదు. అలాగే, చట్టంలో పేర్కొన్న వార్షిక బ్యాలన్స్ షీట్ పార్ట్–1, పార్ట్–2లనూ సమర్పించడంలేదు. సీఐడీ కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే భవానీ అడ్డం తిరిగిన అప్పారావు.. తనను అరెస్టు చేసేందుకు వీల్లేదంటూ సీఐడీ అధికారులతో ఆదిరెడ్డి అప్పారావు వాదనకు దిగారు. జీఎస్టీ ఎగవేత విషయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చర్యలను నియంత్రిస్తూ గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను చూపుతూ తనను అరెస్టుచేయడం అన్యాయమని వాదించారు. దీంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ఆయనకు సీఐడీ అధికారులు స్పష్టతనిచ్చి అరెస్టుచేశారు. సీఐడీ కార్యాలయం వద్ద హైడ్రామా టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్‌ల అరెస్టు నేపథ్యంలో రాజమహేంద్రవరం సీఐడీ కార్యాలయం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా పెద్దఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. రాజమహేంద్రవరంలో జరగబోయే మహానాడును అడ్డుకునేందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని మాజీమంత్రి జవహర్ విమర్శించారు. అప్పారావు, శ్రీనివాస్‌ను అన్యాయంగా అరెస్టుచేశారని మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. సీఐడీ కార్యాలయంలో భర్త, మామను ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పరామర్శించారు. అనుమతి లేకుండా ఆఫీసులు రాజమహేంద్రవరంలోని వీఎల్ పురం, తిలక్ రోడ్డులోని డోర్ నంబర్ 79/2–4/3 చిరునామాతో చిట్‌ఫండ్ కార్యాలయం నిర్వహించేందుకు జగజ్జనని చిట్‌ఫండ్స్ అనుమతి తీసుకుంది. కానీ, అనుమతి లేకుండా 86–26–13/1 తిలక్ రోడ్డు చిరునామాతో ఉన్న భవనంలో కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. దీనిపై చిట్ రిజిస్ట్రార్‌కు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. అలాగే, జగజ్జనని చిట్‌ఫండ్స్ రాజమహేంద్రవరంలో చిట్‌ఫండ్ వ్యాపారం నిర్వహించేందుకు అనుమతి తీసుకుంది. అందుకు విరుద్ధంగా కాకినాడ జగన్నాథపురంలో అనధికారికంగా మరో బ్రాంచి కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. ఇది ఖాతాదారులను మోసం చేయడమే అవుతుంది. -
విడుదల సినిమా టీమ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ
-
విజయవాడ భవానీ ఐలాండ్‌లో సంక్రాంతి సంబరాలు.. కళాకారుల సందడి
-
భవాని దీక్షలు మొదటి రోజు: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు (ఫొటోలు)
-
అమ్మకు చేదోడుగా..
విశాఖపట్నం: అమ్మ అనునిత్యం పిల్లల కోసం పరితపిస్తుంది... ఉదయం లేచింది మొదలు ప్రతి నిమిషం పనిలోనే.. పిల్లలను తయారు చేసి బడికి పంపి తిరిగి ఇంటికి చేరే వరకు వారి మీదే ధ్యాస. స్కూల్లో ఎలా ఉన్నారో..? బాగా చదువుతున్నారా..? వారిని మంచి ప్రయోజకులను చేయాలని ఆరాటం. అనుక్షణం తమ కోసం తపన పడుతున్న అమ్మకు సాయం చేసే అవకాశం వచ్చింది. ఆర్కే బీచ్‌లో మొక్కజొన్నలు అమ్మే ఓ అమ్మకు పని పడింది. కచ్చితంగా వెళ్లాలి...వెళితే వ్యాపారం పోతుంది...ఇటువంటి సమయంలో అమ్మా నేనున్నా...నువ్వెళ్లిరా...అంటూ కన్నపేగు మాటలకు ఆ తల్లి ధనలక్ష్మి మురిసిపోయింది. స్కూల్లో ఇచ్చిన హోంవర్కు చేసుకుంటూ మొక్క జొన్న కంకులు అమ్ముతూ ఇలా కనిపించింది ఆరో తరగతి చదువుతున్న భవాని భార్గవి. తండ్రి కూలి పనులు చేస్తుండగా..తల్లి పాచి పనులు చేసుకుంటూ సాయంత్రం వేళ బీచ్‌లో మొక్కజొన్న కంకులు అమ్ముతోంది. తనకు జగనన్న అమ్మ ఒడి అందుతోందని భార్గవి చెప్పింది. ఈ చదువుల సిరిని చూసి బీచ్కొచ్చినవాళ్లు అభినందించారు. -
గోరంట్ల వెర్సెస్ ఆదిరెడ్డి.. సిటీ సీట్ హాట్ గురూ..!
సాక్షి, రాజమహేంద్రవరం: ఇది మల్లెల వేళయని...వెన్నెల మాసమని...తొందరపడి ఒక కోయిల ముందే కూసింది ..విందులు చేసింది...సుఖదుఃఖాలు సినిమాలో దేవులపల్లి రాసిన పాట ఇది.. టీడీపీలో యువ నాయకుడొకరు ఇదే పల్లవి అందుకున్నారు. దీనిపై రాజకీయంగా రసవత్తరమైన చర్చ సాగుతోంది. ఫలితంగా చాలా కాలంగా పార్టీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు మరోసారి తెర లేచింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది. ఆ పార్టీలో ఎప్పుడూ హాట్ సీట్‌గా పేరున్న రాజమహేంద్రవరం సిటీ కోసం ఇప్పటి నుంచే పోరు మొదలైనట్టుగా కనిపిస్తోంది. కొన్నేళ్లుగా ఈ విషయంలో సిటింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మామ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పొరుగున అదే పార్టీకి చెందిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోన్న సంగతి బహిరంగ రహస్యమే. ప్రతి ఎన్నికల సందర్భంలో సిటీ నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈయనకు పోటీగా ఆదిరెడ్డి అప్పారావు వర్గం టిక్కెట్టు కోసం పోటీ పడుతూ ఉంటుంది. ఇది పార్టీలో సహజ పరిణామంగానే చెప్పుకుంటారు. అటువంటిది సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా రాజమహేంద్రవరం సిటీ నుంచి తానే పోటీ చేస్తానని సిటింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త.. ఆ పార్టీ నాయకుడు వాసు బుధవారం హఠాత్తుగా ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక కారణమేమై ఉంటుందనే చర్చ జరుగుతోంది. అంటే ఇప్పటి నుంచే టీడీపీలో సీట్ల సిగపట్లు మొదలయ్యాయంటున్నారు. చదవండి: (Atmakur Byelection: బీజేపీ బేజార్.. అభ్యర్థి ఎంపికే మైనస్) ఆధిపత్య పోరు రాజమహేంద్రవరం జేకే గార్డెన్స్‌లో సిటీ నియోజకవర్గ పార్టీ సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే భర్త వాసు బయటకు వచ్చి మీడియాకు ఈ విషయాన్ని తెలియజేశారు. గత కొంతకాలంగా ఆ పార్టీలో పరిణామాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఎమ్మెల్యే గోరంట్ల, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేయకుండానే భగ్గుమనే వాతావరణం ఈ ప్రకటనతో కనిపిస్తోంది. గోరంట్ల రూరల్‌కు వెళ్లిపోయినా సిటీపైనే ఆయన దృష్టి ఉంది. పార్టీలో సీనియర్ అయిన తనను కాదని వేరేవారిని ప్రోత్సహించారనే ఆవేదన ఆయనలో మొదటి నుంచి ఉంది. ఈ విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో వెళ్లగక్కుతూనే ఉంటారు. ఏడాదిన్నర క్రితం సిటీలో తమ వర్గానికి చెందిన వారికి పదవుల్లో ప్రాతినిధ్యం లేకుండా చేశారనే ఆవేదనతో పార్టీ, రాజకీయాలకు దూరమవుతున్నట్టు మీడియాకు తెలియచేసి హైడ్రామా సృష్టించారు. చివరకు పార్టీ పదవులు తమ వారికి సాధించుకుని ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. చదవండి: (జనసేన వారు 62 మంది.. టీడీపీ వారు 21 మంది) టీడీపీలో అంతర్యుద్ధం సిటీ నియోజకవర్గంలో తనకంటూ ఉన్న మాజీ కార్పొరేటర్లతో ఆదిరెడ్డి వర్గానికి పోటీగా గోరంట్ల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇవన్నీ నడుస్తోన్న క్రమంలోనే తన రాజకీయ వారసుడిగా సోదరుడు శాంతారామ్ తనయుడు రవిరామ్‌ను తెరమీదకు తీసుకువచ్చారు. అంతటితోనే ఆగకుండా సిటీలో తన పుట్టిన రోజు వేడుకలను విస్తృతంగా నిర్వహించి రాజకీయాలకు తానేమీ దూరం కాలేదని స్పష్టం చేశారు. ఇంతకంటే ముందుగానే గోరంట్ల వైరి పక్షమైన మాజీ ఎమ్మెల్సీ అప్పారావు కూడా రాజకీయ వారసుడిగా తనయుడు వాసును ప్రకటించడంతో టీడీపీలో అంతర్యుద్ధం మొదలైంది. నాటి నుంచి చాపకింద నీరులా సాగుతోన్న ఈ రెండు వర్గాల అంతర్గత పోరు వాసు తాజా ప్రకటనతో మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రకటన వెనుక వ్యూహం వాసు ప్రకటన వెనుక రాజకీయ దూరాలోచన ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. భవిష్యత్ రాజకీయ వ్యూహం ఉందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానానికి ఆదిరెడ్డి కుటుంబం నుంచి పోటీకి పెడతారని ఇటీవల ఆ పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిని గోరంట్ల వర్గం భుజానకెత్తుకుని చేస్తోందని ఆదిరెడ్డి వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది. సిటీ కోసం ఆరాటపడుతోన్న గోరంట్ల వర్గం పనిగట్టుకుని చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే వ్యూహంలో భాగంగానే వాసు తాజా ప్రకటన అంతరార్థమని తెలుస్తోంది. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సిటీ నుంచే పోటీ చేస్తామని, ఎంపీగా వెళ్లే ప్రసక్తే లేదని వాసు తేల్చి చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే భవాని ఉండగా ఆమెను కాదని భర్త వాసు పోటీ చేస్తాననడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆమె పనితీరు సమర్థవంతంగా లేదనా, లేక రాజకీయాల్లో రాణించలేక పోతున్నారనా.. వీటిలో ఏ కారణంతో వాసు పోటీకి సై అంటున్నారని నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఆమెను బలపరిచాను, వచ్చే సారి ఆమె నన్ను బలపరుస్తుంది అని వాసు మీడియా వద్ద ముక్తాయించడం గమనార్హం. దీనిపై గోరంట్ల వర్గం ఏ రకమైన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతుందో వేచి చూడాల్సిందే. -
బధిరుల ఒలింపిక్స్‌కు తెలంగాణ అమ్మాయి భవాని
తెలంగాణ టెన్నిస్ క్రీడాకారిణి భవాని కేడియా వచ్చే నెలలో బ్రెజిల్ వేదికగా జరిగే బధిరుల ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. 2010 నుంచి టెన్నిస్ ఆడుతున్న భవాని ప్రస్తుతం హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్ కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. భవాని 2019లో చెన్నైలో జరిగిన బధిరుల జాతీయ క్రీడల్లో సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో రజత పతకాలను గెలుచుకుంది. బధిరుల ఒలింపిక్స్‌లో భవానితోపాటు షేక్ జాఫ్రీన్, పృథ్వీ శేఖర్, ధనంజయ్ దూబే భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
Visakhapatnam: భవానిని చంపిందెవరు?
సింహాచలం(పెందుర్తి): అడవివరం నుంచి శొంఠ్యాం వెళ్లే ప్రధాన రహదారిలో భైరవవాక వద్ద సింహాచలం దేవస్థానం స్థలంలోని బావిలో ఆదివారం ఓ యువతి మృతదేహం బయటపడింది. రోజూ ఆమెను తీసుకెళ్లే ఆటోడ్రైవరే హత్య చేశాడని కుటంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని వెస్ట్ ఏసీపీ శ్రీపాదరావు వెల్లడించారు. యువతి తల్లిదండ్రులు బంధువులు, శొంఠ్యాం గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలివీ.. ఆనందపురం మండలం శొంఠ్యాంనకు చెందిన సిమ్మ సత్యం, లక్ష్మి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె భవాని(22) ఉన్నారు. భవాని రెండేళ్ల నుంచి సింహాచలం కొండపై ఓ షాపులో పనిచేస్తోంది. శొంఠ్యాం సమీపంలోని కణమాం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ ఎన్ని రాజు రోజూ భవానిని సింహాచలం తీసుకెళ్లి.. తిరిగి ఇంటికి తీసుకొస్తుంటాడు. అలానే ఈ నెల 3వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటలకు తన ఆటోలో భవానిని శొంఠ్యాం నుంచి తీసుకెళ్లాడు. అదే రోజు ఉదయం 11.30 గంటలకు యువతి ఇంటికి వచ్చాడు. మీ అమ్మాయి ఇంటికి వచ్చిందా అని ఆమె తల్లిదండ్రులను అడిగాడు. నువ్వే కదా ఆటోలో తీసుకెళ్లావు అని వారు సమాధానం ఇవ్వగా.. మీ అమ్మాయి ఫొటో ఉందా అని రాజు వారిని అడిగాడు. ఏంటి కొత్తగా ఫొటో అడుగుతున్నావు? అని గట్టిగా అడగ్గా.. అక్కడి నుంచి అతను వెళ్లిపోయాడు. వెంటనే వారు రాజుకు ఫోన్ చేయగా.. పొంతనలేని సమాధానాలిచ్చాడు. దీంతో వారు భవాని పనిచేసే షాపు యజమానికి ఫోన్ చేశారు. ఆమె రాలేదని యజమాని చెప్పడంతో అనుమానం వచ్చి మళ్లీ రాజుకు ఫోన్ చేయగా స్పందించలేదు. 4న ఉదయం 6 గంటల సమయంలో యువతి తల్లిదండ్రులకు రాజే స్వయంగా ఫోన్ చేసి.. భైరవవాకలోని బావి వద్ద భవాని చెప్పులు, పర్సు, మొబైల్ ఫోన్ ఉన్నాయని, తాను అక్కడే ఉన్నానని చెప్పాడు. వెంటనే ఆమె తల్లిదండ్రులు, బంధువులు భైరవవాకకు చేరుకుని.. బావి దగ్గర ఉన్న భవాని వస్తువులను చూశారు. ఇవన్నీ భావి దగ్గర ఉన్నాయని నీకెలా తెలుసని.. మా అమ్మాయి ఎక్కడని రాజును ప్రశ్నించారు. నా స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడని పొంతన లేని సమాధానాలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత భవాని తల్లిదండ్రులు ఆనందపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రాజును అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు, భవాని బంధువులు బావి దగ్గర వెతకగా.. ఆమె ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం బావిలో భవాని మృతదేహం బయటపడింది. సమాచారం అందుకున్న భవాని బంధువులు, గ్రామస్తులు భైరవవాక వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న నార్త్ ఏసీపీ శ్రీపాదరావు, గోపాలపట్నం లా అండ్ ఆర్డర్ సీఐ మళ్ల అప్పారావు, పెందుర్తి సీఐ అశోక్ మృతదేహాన్ని పరిశీలించారు. డాక్ స్క్వాడ్, క్లూస్‌టీంలు వివరాలు సేకరించాయి. భవాని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాలెన్నో.. భవాని మృతి మిస్టరీగా మారింది. ఆమె ముఖంపై గాయాలు ఉండటంతో కచ్చితంగా ఇది హత్యేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజు, భవాని ప్రేమించుకున్నారని, రాజు తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని సంఘటన స్థలంలో పలువురు మీడియాకు తెలిపారు. ఈ నెల 3న తన ఆటోలోనే భవానిని తీసుకెళ్లిన రాజు కొన్ని గంటల్లోపే తిరిగి ఆమె ఇంటికి వెళ్లడం, ఆమె ఫొటో అడగడం, ఆ తర్వాత పొంతన లేని సమాధానాలు, తర్వాత రోజు తానే స్వయంగా ఫోన్ చేసి బావి వద్ద భవాని వస్తువులు ఉన్నాయని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. 4న పోలీసుల సమక్షంలో బావిలో అణువణువూ గాలించినా భవాని ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం ఉదయం మాత్రం బావిలో మృతదేహం కనిపించింది. తన కూతురిని ఎక్కడో చంపేసి.. ఆదివారం ఉదయం బావిలో పడేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే భవానిని హత్య చేశారని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. -
మహిళా ఎస్ఐ ఆత్మహత్య
విజయనగరం క్రైమ్/సఖినేటిపల్లి/కోడూరు: విజయనగరం పోలీసు శిక్షణ కళాశాల (పీటీసీ)లో మహిళా ఎస్ఐ కొప్పనాతి భవాని (27) ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి ఎస్ఐగా పనిచేస్తున్న భవాని శిక్షణ కోసం పీటీసీకి వచ్చారు. ఆదివారం తెల్లవారేసరికి ఆమె గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించి ఉండటాన్ని గుర్తించారు. విజయనగరం వన్‌టౌన్ సీఐ జి.మురళి తెలిపిన మేరకు.. పీటీసీలో ఐదురోజుల శిక్షణ శనివారం సాయంత్రం పూర్తయింది. అనంతరం శిక్షణకు వచ్చినవారంతా వెళ్లిపోయారు. తాను ఆదివారం వెళతానని సహచరులకు తెలిపిన భవాని శనివారం సాయంత్రం 6 గంటలకు తన సోదరుడు శివశంకర్‌తో ఫోన్లో మాట్లాడి తాను వైజాగ్ వస్తానని, కలుస్తానని చెప్పారు. ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో పీటీసీలో విధి నిర్వహణకు వచ్చిన స్వీపర్లు తలుపు కొట్టినా తీయకపోవడంతో కిటికీ తెరిచి చూశారు. గదిలో ఫ్యాన్‌కి ఉరేసుకుని భవాని మృతిచెంది ఉండటాన్ని గమనించి డ్యూటీ అధికారులకు సమాచారమందించారు. అక్కడికి చేరుకున్న వన్‌టౌన్ పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యులకు సమాచారమందించి విచారణ చేపట్టారు. పీటీసీ డ్యూటీ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ మురళి ఆధ్వర్యంలో ఎస్ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. వ్యక్తిగత కారణాలతోనే ఎస్ఐ భవాని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక పేర్కొన్నారు. కూలి పనులకు వెళ్లి.. కష్టపడి చదివి.. కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెంలో కొప్పనాతి శ్రీనివాసరావు, నాగేశ్వరమ్మ దంపతులకు కుమారుడు శివశంకరరావు, కుమార్తె భవాని సంతానం. పిల్లల చిన్నప్పుడే శ్రీనివాసరావు మృతిచెందారు. తల్లి కూలి పనులకు వెళ్లి పిల్లల్ని పోషించింది. తల్లి కష్టాన్ని పంచుకోవాలనే తపనతో భవాని చిన్నప్పటినుంచే ఆమెతోపాటు కూలి పనులకు వెళ్లేది. పనులకు వెళుతూనే గ్రామంలో పదోతరగతి వరకు చదువుకుంది. చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించిన భవాని అవనిగడ్డలో ఇంటర్, డిగ్రీ పూర్తిచేసింది. 2018లో తొలి ప్రయత్నంలోనే ఎస్ఐగా ఎంపికైన భవాని రాజోలు పోలీస్ స్టేషన్లో శిక్షణ అనంతరం సఖినేటిపల్లిలో పనిచేస్తున్నారు. తల్లి, ఉద్యోగాన్వేషణలో ఉన్న సోదరుడితో కలిసి సఖినేటిపల్లిలో నివాసం ఉంటున్నారు. స్వగ్రామంలో ఉన్న తాతయ్య కొప్పనాతి కృష్ణ, నాయనమ్మ చంద్రలంకమ్మల బాధ్యతలను కూడా చూసుకుంటున్నారు. భవానీకి ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టాలు ఏమీ లేవని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సాలెంపాలెం తీసుకురానున్నారు. -
మహిళల హాకీలో భారత్‌కు రెండో ఓటమి.. జర్మనీ చేతిలో 0-2తో పరాజయం
కొనసాగుతున్న భారత పరాజయాల పరంపర.. మహిళల హాకీలోనూ ఓటమి టోక్యో ఒలింపిక్స్‌లో మూడో రోజు భారత పరాజయాల పరంపర కొనసాగింది. ఇవాళ జర్మనీతో జరిగిన రెండో పూల్ మ్యాచ్‌లో భారత్ 0-2తేడాతో ఓటమిపాలైంది. జర్మనీ క్రీడాకారిణలు అన్నె ష్క్రోడర్, జెట్ ఫ్లెష్చుడ్చ్ చెరో గోల్ సాధించి ఆ జట్టును గెలిపించారు. దీంతో వరుసగా రెండో రోజు భారత్ ఖాతాలో ఒక్క పతకం కూడా చేరలేదు. ఇదిలా ఉంటే భారత ఖాతాలో ఇప్పటివరకు ఒక్క పతకం మాత్రమే ఉంది. మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజత పతకాన్ని సాధించింది. హీట్స్‌లోనే స్విమ్మర్ సజన్ ప్రకాశ్ ఔట్ టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల నిరాశాజనకమైన ప్రదర్శన కొనసాగుతూ ఉంది. తాజాగా స్విమ్మర్ సజన్ ప్రకాశ్ కూడా హీట్స్‌లోనే ఇంటిదారి పట్టాడు. 200 మీటర్ల బటర్‌ఫ్లై హీట్ 2లో పోటీ పడిన సజన్.. నిమిషం 57.22 సెకన్లలో రేస్ పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. మొత్తంగా 5 హీట్స్ నుంచి 16 మంది సెమీఫైనల్‌కు క్వాలిఫై కాగా.. సజన్ మాత్రం 24వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 75 కేజీల విభాగంలో భారత బాక్సర్ ఆశిష్ కుమార్ ఓటమి టోక్యో ఒలింపిక్స్‌లో మరో భారత బాక్సర్ ఇంటిదారి పట్టాడు. పురుషుల 69-75 కేజీల మిడిల్ వెయిట్ విభాగంలో ఆశిష్ కుమార్ రౌండ్ ఆఫ్ 32 కూడా దాటలేకపోయాడు. చైనా బాక్సర్ ఎర్బీకె తౌహెటా చేతిలో 0-5తో ఓడిపోయాడు. తొలి రెండు రౌండ్లలో ఐదుగురు జడ్జ్‌లు చైనా బాక్సర్ వైపే మొగ్గు చూపారు. మూడో రౌండ్లో ఆశిష్ కాస్త కోలుకొని పైచేయి సాధించినా విజయం మాత్రం తౌహెటానే వరించింది. ఆశిష్ తన ప్రత్యర్థిపై పంచ్‌లు బాగానే విసిరానా.. చైనా బాక్సర్ టెక్నికల్ గేమ్‌తో ఆశిష్‌ను బోల్తా కొట్టించాడు. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో మనిక బత్రా ఓటమి టోక్యో ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో మనిక బత్రా ఓటమిపాలైంది. మూడో రౌండ్లో మనిక బత్రా ఆస్టియాకి చెందిన సోఫియా పాల్కనోవా చేతిలో 4-0 తేడాతో ఓడి టోర్నీ నుంచి వైదొలిగింది. మొదటి సెట్ నుంచి ఆధిక్యం ప్రదర్శంచిన సోఫియా జోరు ముందు మనిక బత్రా నిలవలేకపోయింది. మానికా 8-11, 2-11, 5-11, 7-11 తేడాతో ఓటమి చెందింది. పోరాడి ఓడిన సుమిత్ నగల్ టోక్యో ఒలింపిక్స్‌లో సుమిత్ నగల్ పోరాటం ముగిసింది. టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో సుమిత్ నగల్ ఓటిమి చెందాడు. రెండో రౌండ్లో వరల్డ్ నెం.1 డానిల్ మెడెదేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-6, 1-6 తేడాతో ఓడిపోయాడు. బ్యాడ్మింటన్ లో సాత్విక్ - చిరాగ్ శెట్టి ఓటమి టోక్యో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ఈవెంట్లో భారత్ తరపున బరిలోకి దిగిన సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడి ఓటమి చెందింది. భారత్ పై ఇండోనేషియా జోడీ 21-13, 21-12తేడాతో విజయం సాధించింది. రెండో రౌండ్లో ఓడినా భారత జట్టుకి ఇంకా నాకౌట్స్‌కి చేరేందుకు అవకాశం ఉంది. తర్వాతి మ్యాచ్‌లో బ్రిటీష్ జోడితో సాత్విక్-చిరాగ్ శెట్టి జోడి గెలిస్తే క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధిస్తారు. క్వార్టర్స్‌లో ఆర్చరీ భారత పురుషుల జట్టు ఓటమి టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆర్చరీ టీమ్ కథ ముగిసింది. క్వార్టర్ ఫైనల్ లో భారత ఆర్చరీ పురుషుల జట్టు కొరియా చేతిలో 6-0 తేడాతో ఓటమి చెందింది. వరల్డ్ నెం.1 ఆర్చర్ దీపికా కుమారితో పాటు అథాను దాస్, అభిషేక్ వర్మ, ప్రవీణ్ జాదవ్ అందరూ ఫెయిల్ అయ్యారు. టేబుల్ టెన్నిస్‌లో సుతీర్థ ముఖర్జీ ఓటమి టోక్యో ఒలింపిక్స్‌లో సుతీర్థ ముఖర్జీ పోరాటం ముగిసింది. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో పోర్చుగల్ ప్లేయర్ చేతిలో సుతీర్థ ముఖర్జీ 4-0 తేడాతో ఓటమిపాలైంది. ఫెన్సింగ్‌లో భవానీ దేవి పరాజయం ఒలింపిక్స్ అరంగేట్రంలోనే మెదటి మ్యాచ్‌లో శుభారంభం చేసిన భవానీ దేవి రౌండ్ 32 మ్యాచ్‌లో 15-7 తేడాతో ఓడిపోయింది. ప్రపంచ నంబర్ 3 మనోన్ బ్రూనెట్‌తో జరిగిన ఈ మ్యాచులో 15-7 తేడాతో ఓడిపోయి ఫైనల్ చేరకుండానే వెనుదిరిగింది. టేబుల్ టెన్నిస్ లో శరత్ కమల్ విజయం టోక్యో ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ విభాగంలో అచంత్ శరత్ కమల్ రెండో రౌండ్లో 4-2తో పోర్చుగల్‌కు చెందిన టియాగోను ఓడించి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో శరత్ 2-11, 11-8, 11-5, 9-11, 11-6, 11-9తో విజయం సాధించాడు. ఒలింపిక్స్‌లో భారత మరో కేటగిరీపై ఆశలు పెంచుతోంది. నాలుగో రోజైన సోమవారం ఫెన్సింగ్(కత్తిసాము’, ఆర్చరీలో జయకేతనం ఎగరేసింది. చెన్నైకి చెందిన భవానీ(2) ఫెన్సింగ్‌లో శుభారంభం చేయగా, మరోవైపు మెన్స్ ఆర్చరీ టీం విభాగంలో భారత్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మరో వైపు టేబుల్ టెన్నిస్ రెండో రౌండ్లో అచంత్ శరత్ కమల్ విజయం సాధించి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. చరిత్ర సృష్టించిన భవానీ ఇండియన్ ఫెన్సర్ భవానీ చరిత్ర సృష్టించింది. సోమవారం ట్యూనిషియా క్రీడాకారిణి నదియా బెన్ అజిజ్తో జరిగిన పోరులో 15-3తో విజయం సొంతం చేసుకుంది. ఒలింపిక్స్ డెబ్యూలో కేవలం ఆరు నిమిషాల 14 సెకండ్లలోనే మ్యాచ్ ముగించడం విశేషం. దీంతో తర్వాతి రౌండ్‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే ఇండియా నుంచి ఫెన్సింగ్ విభాగానికి అర్హత సాధించిన మొదటి క్రీడాకారిణి భవానీనే కావడం విశేషం. తర్వాతి రౌండ్లో వరల్డ్ 3 ర్యాంకర్, ఫ్రెంచ్ ఫెన్సర్ బ్రునెట్‌తో తలపడనుంది. It's a great start for #TeamIndia today as @IamBhavaniDevi wins her first match 15-3 and advances to the Table of 32. She will face French M. Brunet in the next match at 7:40 am (IST) Let's send in our best wishes with #Cheer4India#Tokyo2020 pic.twitter.com/hC1fU9VCSu — SAIMedia (@Media_SAI) July 26, 2021 క్వార్టర్స్‌కు ఆర్చరీ టీం పురుషుల ఆర్చరీ టీమ్ విభాగంలో అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్‌లతో కూడిన భారత బృందం తొలి రౌండ్లో కజకిస్తాన్‌పై విజయం సాధించింది. 6-2 తేడాతో విజయం సాధించింది. దీంతో క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా జట్టుతో టీమిండియా తలపడనుంది. ముఖ్యంగా అతాను దాస్ మంచి ఫర్ఫార్మెన్స్ కనబరిచాడు. Indian men’s recurve archery team of Atanu Das, Pravin Jadhav, and Tarundeep Rai advance to quarterfinals after 6-2 win over Kazakhstan. They will play South Korea at 10:15 AM#Cheer4India #Tokyo2020 pic.twitter.com/RjwsM6smaK — SAIMedia (@Media_SAI) July 26, 2021 ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఉ.5:30కి మహిళల ఫెన్సింగ్ ఈవెంట్ క్వాలిఫికేషన్(భవానీ దేవి) ఉ.6:00కి పురుషుల ఆర్చరీ ఎలిమినేషన్(అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్) ఉ.6:30కి షూటింగ్ పురుషుల స్కీట్ క్వాలిఫికేషన్ (బజ్వా, మీరజ్) ఉ.6:30కి టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్(శరత్ కమల్ ) ఉ.8:30కి టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్(సుతీర్థ ముఖర్జీ) ఉ.9:30కి టెన్నిస్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్(సుమిత్ నగాల్) మ.12:20కి షూటింగ్ పురుషుల స్కీట్ ఫైనల్ మ.1:00కి టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ మూడో రౌండ్ (మనికా బాత్రా) మ.3:06 కి బాక్సింగ్ పురుషుల ఫ్లైవెయిట్(ఆశీష్ కూమార్ రౌండ్ఆఫ్ 32) మ.3:50కి స్విమ్మింగ్ పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లై హీట్స్-2(సాజన్ ప్రకాష్) సా.5:45కి భారత్ Vs జెర్మనీ మహిళల హాకీ మ్యాచ్ -
క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియాగా భవానీ
సాక్షి, అగనంపూడి(గాజువాక): క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియా కిరీటాన్ని విశాఖ జిల్లా కూర్మన్నపాలేనికి చెందిన అమ్మాయి దక్కించుకుంది. ఇండియన్ మీడియా వర్క్స్ సీఈవో జాన్ అమలాన్ సారథ్యంలో ఈ ఏడాది జూన్ 28 నుంచి ఆగస్టు 25 వరకు చెన్నై కేంద్రంగా కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియా 2020 ఆన్లైన్ పోటీలు నిర్వహించారు. మూడు రౌండ్లలో జరిగిన ఈ పోటీల్లో గాజువాక మండలం కూర్మన్నపాలేనికి చెందిన కె.భవానీ దుర్గ క్వీన్ కిరీటం సాధించింది. ఈ పోటీల్లో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళా రాష్ట్రాలకు చెందిన మగువలు పాల్గొన్నారు. మొదటి రౌండ్లో గ్రీన్ ఇండియా చాలెంజ్, రెండో రౌండ్లో ర్యాంప్ వాక్, మూడో రౌండ్లో వివిధ సామాజిక, సమకాలిన అంశాలపై ప్రశ్నలు సందించారు. పోటీల ఫలితాలు గత నెల 30న వెలువడ్డాయి. మూడు విభాగాల్లో భవానీదుర్గా ప్రతిభ చూపి క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియాగా ఎంపికైంది. భవానీ నగరంలోని ఆదిత్యా డిగ్రీ కళాశాలలో చదువుతోంది. తండ్రి సత్యనారాయణ, తల్లి వరలక్ష్మిల ప్రోత్సాహంతో తనకు ఈ అరుదైన గుర్తింపు లభించిందని భవానీదుర్గా చెప్పింది. -
‘దిశ’ తప్పిన ‘పచ్చ’ రాజకీయం
సాక్షి, మహేంద్రవరం : ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అనే సామెతను తు.చ. తప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు పై నుంచి కింది స్థాయి వరకూ పాటిస్తున్నట్టుంది. మహిళలకు భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 18 దిశ పోలీసు స్టేషన్లను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సమాయత్తమైంది. ఇందులో భాగంగా ‘దిశ’ తొలి పోలీసు స్టేషన్‌ను రాజమహేంద్రవరం కేంద్రంగా శనివారం సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రయత్నాన్ని పార్టీలకతీతంగా అన్ని వర్గాలూ స్వాగతించాయి. కానీ ప్రచారం కోసం టీడీపీ రాజకీయ రంగు పులమడాన్ని ఆ పార్టీ శ్రేణులే ఛీ కొడుతున్నాయి. ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గ’న్నట్టుగా రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని సోమవారం ఫిర్యాదు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే భవాని ఫిర్యాదు ఇలా... గత డిసెంబరు 16న అసెంబ్లీలో మద్యం పాలసీపై జరిగిన చర్చలో మద్యం బ్రాండ్ల గురించి ఆమె ప్రస్తావించారు. దీనిపై హేళన చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అదే నెల 17న స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, తనకు న్యాయం చేసి ‘దిశ’ చట్టంపై ప్రజలకు నమ్మకం కల్పించాలని రాజమహేంద్రవరంలోని ‘దిశ’ పోలీసు స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని సోమవారం ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లూ ఎందుకు మౌనం...? గత ఏడాది డిసెంబరు 17న అసెంబ్లీ స్పీకర్‌కు ఎమ్మెల్యే భవాని ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లూ సైబర్ పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయకుండా మౌనం వహించి ఇప్పుడు ‘దిశ’ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంలో ఔచిత్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. శనివారం దిశ పోలీసు స్టేషన్ ప్రారంభమైతే 48 గంటలు కూడా తిరగకుండానే ఇంత హఠాత్తుగా ఫిర్యాదు చేయడంలో ఆంతర్యమేమిటంటున్నారు. అసెంబ్లీలో ఈ అంశంపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేసి 53 రోజులవుతోంది. ఆ చర్యలు ఏ దశలో ఉన్నాయో తెలుసుకోకుండా పార్టీ కార్యకర్తలతో దిశ పోలీసు స్టేషన్‌కు రావడమేమిటని అక్కడున్నవారే విసవిసలాడారు. మహిళా ఎమ్మెల్యేగా గైర్హాజరవుతూ... మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దిశ పోలీసు స్టేషన్‌ను తన నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నప్పుడు నియోజకవర్గ ప్రజాప్రతినిధిగానే కాకుండా ఒక మహిళా ప్రతినిధి అయి ఉండి గైర్హాజరవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోనీ ఎమ్మెల్యేను ఆహ్వానించకుండా ప్రభుత్వం ఏమైనా పార్టీ కోణంలో చూసిందా అంటే అదీ లేదు. పోలీసు శాఖ నుంచి మిగిలిన ప్రజాప్రతినిధులకు పంపించినట్టుగానే ఈ ఎమ్మెల్యేకు కూడా ఆహ్వానం పంపించినా డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు చేస్తూ...న్యాయం జరిగేలా చూసి... దిశ చట్టంపై మహిళల్లో నమ్మకం కలిగించాలని ఎలా కోరతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వెనుకబడ్డ రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకూ రాష్ట్ర నలుమూలల నుంచి మహిళా ప్రజాప్రతినిధులు ఈ ప్రతిష్టాత్మక సభకు హాజరయ్యారు. సమావేశానికి హాజరై చట్టంపై తన అభిప్రాయాన్ని తెలియజేసి ఉంటే మరింత హుందాగా ఉండేదంటున్నారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నాయకులు దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. 53 రోజుల కిందట జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఫిర్యాదు చేశారు. ఇది అసెంబ్లీ సెక్రటేరియట్ పరిధిలో ఉంది. దీనిపై ఎలా చర్యలు తీసుకోవాలో న్యాయ సలహా తీసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఉండవల్లి అనూష ఆరు నెలలుగా ఫేస్ బుక్‌లో అసభ్యంగా పోస్టులు పెట్టారని ఫిర్యాదు వచ్చింది. పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన మద్దుల రాజేశ్వరి 2018 డిసెంబర్ నుంచి 2019 డిసెంబర్ వరకూ పోస్టింగ్‌లు ఉన్నాయంటున్నారు. ఫేస్ బుక్‌లలో 18 అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టినట్లు ఫిర్యాదు చేశారు. ఏడాది కిందట జరిగిన సంఘటనపై ఒకటి, నెల కిందట జరిగిన సంఘటనపై మరొకటి ఫిర్యాదు చేశారు. ఈ మూడు ఫిర్యాదులు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోనివి కావు. అయినా న్యాయ సలహా తీసుకొని చర్యలు తీసుకుంటాం. జీరో ఎఫ్ఐఆర్ అనేది అత్యవసర సంఘటనలో మహిళల రక్షణ కోసం తీసుకుంటాం. మూడు సంఘటనలు ఇప్పటికిప్పుడు జరిగినవి కావు. భారత దేశం మొత్తం దిశ చట్టం కోసం అభినందిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఇలా చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు, ప్రజలు, చట్టం అమలు చేసేందుకు పోలీసులకు సహకరించాలి. – లతామాధురి, అదనపు ఎస్పీ, రాజమహేంద్రవరం. -
ఎమ్మెల్యే భవాని ఇచ్చిన ఫిర్యాదు రాజకీయ ఉద్ధేశమే: లతమాధురి
-
మర మనిషి కష్టం
ఇంట్లో ఎన్ని మెషీన్లు ఉన్నా ఇంట్లో మనిషి మెషీన్లా పని చేయడం తప్పదని భావని అనుభవం చెబుతోంది. భావని లేని ఇల్లు, భావని లేందే ఇల్లు లేకపోవచ్చు. అయితే ఇంట్లో ఉండేది ఒక్క భావనియే కాదు కదా! తలా ఒక చెయ్యి వెయ్యమెందుకని?! భావని వయసు నలభైల చివరికి వచ్చేసింది. నాలుగిళ్లలో పని చేస్తుంది ఆవిడ. ఇంట్లోంచి వెళ్లే ముందు ఇంటి పని మొత్తం చేసి వెళుతుంది. ఇంటికి వచ్చాక ఇంట్లో మిగిలి ఉన్న పనిని చక్కబెడుతుంది. ‘చక్కబెట్టడం’అనే మాటలో ఒడుపుగా చేసేయడం అనే అర్థం ధ్వనించవచ్చు. కానీ అది ఎంత శ్రమతో కూడిన పనో ఆమెకు మాత్రమే తెలుస్తుంది. భర్త, వాళ్ల ఐదుగురు పిల్లల పని కూడా ఇంట్లో ఆమెదే కనుక.. ఆమె పడే శ్రమ గురించి వారికి తెలియదు. పిల్లలైతే చదువుల చివరికి వచ్చేస్తున్నారు కానీ.. భర్త రామ్‌కుమార్ చేపల వ్యాపారం ఎక్కడ మొదలైందో అక్కడే ఉంది. వ్యాపారం అంటే పెద్ద వ్యాపారం కాదు. చెరువు దగ్గర చేపల్ని కొని తెచ్చి చుట్టుపక్కల అమ్మడం. భార్యాభర్తలకు బయట వచ్చేది తక్కువ. ఇంట్లో ఖర్చయ్యేది ఎక్కువ. భావనికి అదనంగా ఒంట్లో శక్తి కూడా ఖర్చవుతుంటుంది. భర్తకు, పిల్లలకు వండిపెట్టడం; వాళ్ల బట్టల్ని ఉతికి, ఇస్త్రీ చేసి ఉంచడం. తిన్నాక మళ్లీ గిన్నెల్ని కడిగి సర్దడం.. ఇవన్నీ తను కష్టం అనుకోదు కానీ, కొన్నిసార్లు కష్టం అవుతుంది. ‘చేయలేకపోతున్నాను’ అని ఒక్కరోజు కూడా భర్తతో గానీ, పిల్లలతో గానీ అనలేదు భావని. ఆర్నెల్ల క్రితం ఓరోజు రామ్‌కుమార్ చెప్పా పెట్టకుండా సెకండ్ హ్యాండ్ వాషింగ్ మెషీన్ తీసుకొచ్చాడు! ఒక కబడ్డీ ప్లేయర్ దగ్గర దానిని మూడు వేలకు కొన్నాడు. దాన్ని తెచ్చిన రోజున భావని కళ్లు మెరిశాయి. కళ్లు మెరిసింది భర్త తెచ్చిన వాషింగ్ మెషీన్‌ని చూసి కాదు. ‘నీ కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను’ అనే భావం భర్త కళ్లల్లో కనిపించి! వాషింగ్ మెషీన్‌ని ఆపరేట్ చేయడం భావనికి కష్టం కాలేదు. తను పని చేసే మధ్యతరగతి ఇళ్లల్లో తను రోజూ చేసే పనే. బట్టలు వెయ్యడం, వాషింగ్ పౌడర్ చల్లడం. మెషీన్ బటన్ని నొక్కడం. అంతే. గుర్‌గ్రామ్ (హరియాణా)లోని 15వ సెక్టార్లో ఉండే ఝుగ్గీ ప్రాంతంలో ఓ చిన్న ఇంట్లో ఉంటోంది భావని కుటుంబం. వాషింగ్మెషీన్కి ఇంట్లో చోటు లేక ఇంటి బయట గుమ్మం పక్కనే పెట్టుకున్నారు. ఆ పక్కనే రెండు మూడు బక్కెట్లు, డ్రమ్ముల నీళ్లు ఉంటాయి. ఆ బక్కెట్లు, డ్రమ్ములకు కూడా ఇంట్లో చోటు లేదు. ఎప్పుడు నీళ్లు రాకుండా పోతాయోనని ముందు జాగ్రత్తగా వాటినెప్పుడూ నింపి ఉంచుకుంటారు. వాషింగ్ మెషీన్.. బట్టల్ని ఎంతసేపట్లో ఉతికేస్తుందో, భావని కూడా అంతే సమయంలో ఉతికేయగలదు కానీ.. వాషింగ్ మెషీన్‌తో ఆ గంట కాస్త శారీరక శ్రమ తగ్గింది. అలాగని ఆమె జీవితమేమీ పూర్తిగా మారిపోలేదు. ‘‘ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి వెళ్తాను. నేను పని చేసే ఇళ్లలో గిన్నెలు తోమి, బట్టలు ఉతికి, ఇల్లు తుడిచి.. అన్ని ఇళ్ల పనీ పూర్తి చేసుకుని మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటికి చేరుకుంటాను. ఇంట్లోనూ మళ్లీ అదే పని. ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం, వంట చేయడం. సాయంత్రం 5 గంటలకు మళ్లీ బయటి ఇళ్లలో పని. పూర్తయ్యేసరికి రాత్రి ఎనిమిది అవుతుంది. ఇంటికి రాగానే మళ్లీ వంట..’’ అని ముఖంపై చిరునవ్వును చెరగనీయకుండా చెబుతుంది భావని. -
సుఖాంతమైన భవానీ కథ!
సాక్షి, విజయవాడ : నాలుగేళ్ల వయసులో తప్పిపోయిన భవానీ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. 13 ఏళ్ల తర్వాత కన్నతల్లిదండ్రుల చెంతకు భవానీ చేరింది. ఆదివారం మీడియా సమక్షంలో పెంచిన తల్లిదండ్రులు భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా భవానీ మాట్లాడుతూ తనకూ ఇద్దరూ తల్లులు ఇష్టమేనని, పదిరోజులు పెంచిన అమ్మ దగ్గర ఉంటే, మరో పది రోజులు కన్న తల్లి వద్ద ఉంటానని తెలిపింది. తనకు ఇప్పటివరకు కన్ఫ్యూజన్ ఉండేదని, ఇకనుంచి ఇద్దరి వద్ద ఉంటానని చెప్పింది. ప్రస్తుతానికి కన్న తల్లి వద్దకు వెళుతున్నట్టు తెలిపింది. కన్నవాళ్ళ వద్దకు వెళుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది. భవానీ కనిపించడం సంతోషంగా ఉందని కన్నతల్లి తెలిపారు. తనను ఇన్నాళ్లు పెంచినందుకు జయమ్మ-జీవరత్నం దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. కన్నబిడ్డలా పెంచాం! భవానీని కన్నబిడ్డలా పెంచాం కానీ, ఆమె కన్న తల్లి వద్దకే వెళతానని చెబుతోందని పెంచిన తల్లి జయమ్మ తెలిపారు. ఆమె వెళుతున్నందుకు బాధగా ఉందన్నారు. అయినా పది రోజులకోసారి వస్తననడం సంతోషం కలిగిస్తోందన్నారు. పాప భద్రత కోసమే తాము డీఎన్ఏ టెస్ట్ కోరినట్టు తెలిపారు. పాప సంతోషమే తమకు ముఖ్యమన్నారు. భవానీ తమ కూతురని మళ్లీ వస్తారేమోనని టెన్షన్‌గా ఉందని, పాపను బాగా చూసుకోవాలని కోరుతున్నామని పెంచిన తండ్రి జీవరత్నం తెలిపారు. 13 ఏళ్ల క్రితం తప్పిపోయింది! నాలుగేళ్ల వయసులో తప్పిపోయి అమ్మానాన్నలకు దూరమైంది భవానీ. అయినా చిన్ననాటి జ్ఞాపకాలను పదిలపర్చుకుని.. పదమూడేళ్ల తర్వాత వారి జాడ తెలుసుకుంది. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామానికి చెందిన కోడిపెంట్ల మాధవరావు, వరలక్ష్మి దంపతులు బతుకుదెరువు కోసం 14 ఏళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లారు. ఆ దంపతులకు ముగ్గురు సంతానం. వారు 2006 నవంబర్‌లో ముగ్గురు బిడ్డల్ని ఇంటివద్దే ఉంచి కూలి పనులకు వెళ్లారు. వారి కుమార్తె భవానీ తన అన్నయ్యలు సంతోష్, గోపీతో ఆడుకుంటూ తప్పిపోయింది. రోడ్డుపై బిక్కుబిక్కుమంటూ రోదిస్తున్న భవానీని జయరాణి (జయమ్మ) అనే మహిళ చేరదీసి ఆమె తల్లిదండ్రుల కోసం చుట్టుపక్కల వాకబు చేసింది. ఫలితం లేకపోవడంతో అప్పట్లోనే సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసి.. భవానీ సంబంధీకులు వచ్చేవరకు ఆమెను తానే సాకేందుకు ముందుకొచ్చింది. భవానీని పెంచి ఇంటర్మీడియెట్ వరకు చదివించింది. భవానీకి ప్రస్తుతం 17 ఏళ్లు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన జయరాణి (జయమ్మ) గతంలో హైదరాబాద్‌లో ఉంటూ అక్కడి ఇళ్లల్లో పని చేస్తుండేది. కొంతకాలం క్రితం కుటుంబ సభ్యులు, భవానీతో కలిసి విజయవాడ వచ్చి ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తాను పని చేస్తున్న ఇంట్లోనే భవానీని కూడా పనిలో పెట్టాలనే ఉద్దేశంతో ఇంటి యజమాని వంశీ, భార్య కృష్ణకుమారి వద్దకు భవానీని తీసుకెళ్లింది. భవానీ వివరాలను ఇంటి యజమాని వంశీ ఆరా తీశారు. తాను చిన్నతనంలోనే తప్పిపోయానని తెలిపిన భవానీ తల్లిదండ్రుల పేర్లు, అన్నల పేర్లను, గుర్తున్న చిన్ననాటి సంగతులను చెప్పింది. ఆ వివరాలను, భవానీ ఫొటోను వంశీ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. శనివారం ఆ పోస్ట్‌ను చూసిన భవానీ అన్న.. వంశీకి వీడియో కాల్ చేశాడు. డీఎన్ఏ టెస్ట్.. ట్విస్ట్! అయితే, భవానీని తల్లిదండ్రుల వద్దకు పంపించేందుకు పెంచిన తల్లిదండ్రులు జయమ్మ-జీవరత్నం అభ్యంతరం తెలిపారు. వచ్చినవారు అసలైన తల్లిదండ్రులని నిర్ధారణ కావాలని.. అప్పుడే తనను వారి వద్దకు పంపుతామని జయమ్మ చెప్పారు. అందుకోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. భవానీ అభీష్టంతోనే తల్లిదండ్రుల వద్దకు పంపిస్తామని వెల్లడించారు. భవానీని అప్పగించే విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని అన్నారు. పోలీసుల సూచనల మేరకు నడుచుకుంటామని చెప్పారు. వచ్చినవారే నిజమైన తల్లిదండ్రులని నిర్ధారణ అయ్యాకే అప్పగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు భవానీ మాత్రం తన తల్లిదండ్రుల వద్దకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇందుకోసం ఏ పరీక్షలకైనా సిద్ధమేనని వెల్లడించారు. దీంతో ఈ వివాదం పటమట పోలీస్ స్టేషన్‌కు చేరింది. దీంతో పోలీసులు ఓ వైపు కన్న తల్లిదండ్రులు, మరోవైపు పెంచిన తల్లిదండ్రుల సమక్షంలో వివాదాన్ని పోలీసులు పరిష్కరించారు. -
భవానీని అప్పగించడంలో ట్విస్ట్..
సాక్షి, విజయవాడ : నాలుగేళ్ల వయసులో తప్పిపోయిన భవానీని తల్లిదండ్రులకు అప్పగించడంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. భవానీని తల్లిదండ్రుల వద్దకు పంపించేందుకు పెంచిన తల్లిదండ్రులు జయమ్మ-జీవరత్నం అభ్యంతరం తెలిపారు. వచ్చినవారు అసలైన తల్లిదండ్రులని నిర్ధారణ కావాలని.. అప్పుడే తనను వారి వద్దకు పంపుతామని జయమ్మ చెప్పారు. అందుకోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. భవానీ అభీష్టంతోనే తల్లిదండ్రుల వద్దకు పంపిస్తామని వెల్లడించారు. భవానీని అప్పగించే విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని అన్నారు. పోలీసుల సూచనల మేరకు నడుచుకుంటామని చెప్పారు. వచ్చినవారే నిజమైన తల్లిదండ్రులని నిర్ధారణ అయ్యాకే అప్పగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు భవానీ మాత్రం తన తల్లిదండ్రుల వద్దకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇందుకోసం ఏ పరీక్షలకైనా సిద్ధమేనని వెల్లడించారు. అప్పుడప్పుడు జయమ్మ వద్దకు కూడా వస్తానని చెప్పారు. కాగా, వంశీ, కృష్ణకుమారి దంపతుల ఇంట్లో భవానీని పనిలో పెట్టాలనే ఉద్దేశంలో జయమ్మ ఆమెను వారివద్దకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఇంటి యజమాని వంశీ.. భవానీ వివరాలను ఆరా తీశారు. తాను చిన్నతనంలోనే తప్పిపోయానని తెలిపిన భవానీ తల్లిదండ్రుల పేర్లు, అన్నల పేర్లను, గుర్తున్న చిన్ననాటి సంగతులను చెప్పారు. ఆ వివరాలను, భవానీ ఫొటోను వంశీ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. శనివారం ఆ పోస్ట్‌ను చూసిన భవానీ అన్న.. వంశీని సంప్రదించాడు. 13 ఏళ్ల తరువాత తమ బిడ్డ ఆచూకీ తెలిసి భవానీ తల్లిదండ్రులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. పడమట పోలీస్ స్టేషన్‌కు చేరిన భవానీ వివాదం.. భవానీని అప్పగించడానికి పెంచిన తల్లిదండ్రులు జయమ్మ-జీవరత్నం అభ్యంతరం తెలుపడంతో ఈ వివాదం పటమట పోలీస్ స్టేషన్‌కు చేరింది. దీంతో పోలీసులు ఓ వైపు కన్న తల్లిదండ్రులు, మరోవైపు పెంచిన తల్లిదండ్రుల సమక్షంలో వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తాము డీఎన్ఏ పరీక్షలకు సిద్ధంగా ఉన్నట్టు భవానీ సోదరుడు గోపి తెలిపారు. చదవండి : కన్నవారిని కలిపిన ఫేస్బుక్ -
కన్నవారిని కలిపిన ఫేస్బుక్
పాతపట్నం (శ్రీకాకుళం): నాలుగేళ్ల వయసులో తప్పిపోయి అమ్మానాన్నలకు దూరమైంది. చిన్ననాటి జ్ఞాపకాలను పదిలపర్చుకుని.. పదమూడేళ్ల అనంతరం వారి జాడ తెలుసుకుంది. కన్నవారిని కలుసుకోబోతున్నాననే ఆనందం ఒకవైపు.. 13 ఏళ్లపాటు సొంత బిడ్డలా పెంచి.. చదువు చెప్పించిన తల్లి దూరమవుతోందనే బాధ మరోవైపు ఆమెను చుట్టుముట్టాయి. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామానికి చెందిన కోడిపెంట్ల మాధవరావు, వరలక్ష్మి దంపతులు బతుకుదెరువు కోసం 14 ఏళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లారు. ఆ దంపతులకు ముగ్గురు సంతానం. మాధవరావు, వరలక్ష్మి దంపతులు 2006 నవంబర్‌లో ముగ్గురు బిడ్డల్ని ఇంటివద్దే ఉంచి కూలి పనులకు వెళ్లారు. వారి కుమార్తె భవానీ తన అన్నయ్యలు సంతోష్, గోపీతో ఆడుకుంటూ తప్పిపోయింది. రోడ్డుపై బిక్కుబిక్కుమంటూ రోదిస్తున్న భవానీని జయరాణి (జయమ్మ) అనే మహిళ చేరదీసి ఆమె తల్లిదండ్రుల కోసం చుట్టుపక్కల వాకబు చేసింది. ఫలితం లేకపోవడంతో అప్పట్లోనే సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసి.. భవానీ సంబంధీకులు వచ్చేవరకు ఆమెను తానే సాకేందుకు ముందుకొచ్చింది. భవానీని పెంచి ఇంటర్మీడియెట్ వరకు చదివించింది. భవానీకి ప్రస్తుతం 17 ఏళ్లు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన జయరాణి (జయమ్మ) గతంలో హైదరాబాద్‌లో ఉంటూ అక్కడి ఇళ్లల్లో పని చేస్తుండేది. కొంతకాలం క్రితం కుటుంబ సభ్యులు, భవానీతో కలిసి విజయవాడ వచ్చి ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తాను పని చేస్తున్న ఇంట్లోనే భవానీని కూడా పనిలో పెట్టాలనే ఉద్దేశంతో ఇంటి యజమాని వంశీ, భార్య కృష్ణకుమారి వద్దకు భవానీని తీసుకెళ్లింది. భవానీ వివరాలను ఇంటి యజమాని వంశీ ఆరా తీశారు. తాను చిన్నతనంలోనే తప్పిపోయానని తెలిపిన భవానీ తల్లిదండ్రుల పేర్లు, అన్నల పేర్లను, గుర్తున్న చిన్ననాటి సంగతులను చెప్పింది. ఆ వివరాలను, భవానీ ఫొటోను వంశీ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. శనివారం ఆ పోస్ట్‌ను చూసిన భవానీ అన్న.. వంశీకి వీడియో కాల్ చేశాడు. అన్నయ్యను భవానీ గుర్తు పట్టింది. ఆ తరువాత ఆమె తల్లిదండ్రులు కూడా భవానీతో వీడియో కాల్ మాట్లాడారు. కుమార్తెను తీసుకెళ్లడానికి చీపురుపల్లి నుంచి తల్లిదండ్రులు మాధవరావు, వరలక్ష్మి, సోదరులు సంతోష్, గోపీ విజయవాడ బయలుదేరారు. ఇదిలావుంటే.. గతంలో హైదరాబాద్‌లో జీవనోపాధి పొందిన భవానీ తల్లిదండ్రులు ప్రస్తుతం చీపురుపల్లిలోనే ఉంటున్నారు. తమ బిడ్డ ఆచూకీ తెలిసి భవానీ తల్లిదండ్రులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. ఇంత కాలం తల్లిగా మారి భవానీని కంటికి రెప్పలా చూసుకుంటూ చదువు చెప్పించిన జయమ్మకు రుణపడి ఉంటామని చెప్పారు. ఇన్నాళ్లకు భవానీ అమ్మా నాన్నలకు దగ్గరవుతుండటంతో చీపురుపల్లి గ్రామమంతా సంతోషం వ్యక్తం చేసింది. -
రణసింగంగా మారిన విజయ్‌సేతుపతి
చేతి నిండా చిత్రాలతో పాటు విజయపథంలో దూసుకుపోతున్న నటుడు విజయ్ సేతుపతి. ఈయన తమిళంతో పాటు, తెలుగు, మలయాళం భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. కాగా విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ప్రారంభమైంది. దీనికి కపే. రణసింగం అనే పేరును నిర్ణయించారు.ఈ మూవీని కేజేఆర్ స్టూడియోస్ పతాకంపై కేజే.రాజేశ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇంతకుముందు పలు చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేసిన ఈయన నటి నయనతార నటించిన అరమ్, ఐరా చిత్రాలతో పాటు ప్రభుదేవా హీరోగా నటించన గులేభాకావళి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అంతేకాదు ప్రస్తుతం శివకార్తికేయన్, నయనతార జంటగా నటిస్తున్న హీరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విజయ్ సేతుపతి, నటి ఐశ్వర్యరాజేశ్ హీరోహీరోయిన్లుగా రణసింగం పేరుతో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా విరుమాండి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈయన దర్శకుడు సెల్వ వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. నయనతార నటించిన అరమ్ చిత్రానికి కోడైరెక్టర్‌గా చేశారు. ఈ సినిమాలో సముద్రకని, యోగిబాబు, వేలా రామమూర్తి, పూరాం ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా జీవి. ప్రకాశ్‌కుమార్ చెల్లెలు భవాని నటిగా కీలక పాత్రలో పరిచయం అవుతున్నారు.జిబ్రాన్ సంగీతాన్ని, సుదర్శన్ ఛాయాగ్రహణం అంది స్తున్న ఈ చిత్రం ఇటీవల రామనాథపురంలో ప్రారంభమైనట్లు చిత్ర వర్గాలు తెలిపారు. తదుపరి చెన్నై, హైదరాబాద్, దుబాయ్‌లలో చిత్రీకరించనున్నట్లు తెలిపారు. -
ఎట్టకేలకు యర్రంశెట్టి రమణగౌతం అరెస్ట్
హైదరాబాద్ : ప్రేమించి సహజీవనం చేసి పెళ్లి చేసుకుని రాత్రికిరాత్రే ఉడాయించిన నిందితుడిని బాధితురాలు పక్కా పథకం ప్రకారం పోలీసులకు పట్టించిన సంఘటన మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... వైజాగ్‌కు చెందిన యర్రంశెట్టి రమణగౌతం కూకట్‌పల్లిలో ఉంటూ టీవీ, సినిమా రచయితగా పని చేస్తున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఎన్బీటీ నగర్‌కు చెందిన భవానీ అనే యువతిని ప్రేమించాడు. నాలుగగేళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తూ, ఆమె సంపాదన మొత్తం కాజేశాడు. పెళ్లి చేసుకోవాలని ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా ఇవాళ రేపు అంటూ తప్పించుకునేవాడు. దీంతో బాధితురాలు రమణగౌతంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్ పోలీసులు అతడిని స్టేషన్‌కు పిలిపించి పెళ్లి చేసుకోవాలని సూచించారు. అదే రోజు బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్న అతను అదే రాత్రి ఉడాయించాడు. ఈ నెల 2న భవానీకి ఫోన్ చేసి నువ్వంటే ఇష్టంలేదు, విడాకులు తీసుకుందామని కోరాడు. దీంతో ఆమె షాక్‌కు గురైంది. దాదాపు రూ. 8 లక్షలు దండుకొని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిన నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్న రమణగౌతం పరారీలో ఉన్నాడు. ఇటీవల ఓ లాయర్‌ను ఆశ్రయించి విడాకులు ఇప్పించాలని కోరడంతో సదరు లాయర్ బాధితురాలికి ఫోన్ చేసి విడాకులకు అంగీకరిస్తావా అంటూ అడిగాడు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో నిందితుడిని పట్టుకోవాలంటే విడాకులు అనే ఎర వేయాలంటూ సూచించాడు. విడాకులు ఇస్తానని నమ్మించి కాసేపు అక్కడే ఉంచాలని చెప్పారు. ఆమె మంగళవారం ఉదయం 12 గంటల సమయంలో నారాయణగూడలోని న్యాయవాది ఇంటికి వెళ్లి రమణ గౌంతంతో మాట్లాడుతుండగా బంజారాహిల్స్ కానిస్టేబుళ్లు అక్కడికి వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు. -
వివాహిత అదృశ్యం
విశాఖపట్నం , సీతమ్మధార(విశాఖ ఉత్తర): ఒక వివాహిత అదృశ్యమైన సంఘటనకు సంబంధించి ఫోర్తుటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముస్లిం తాటిచెట్లపాలెంకు చెందిన ఎ.భవాని(22)కి నగరానికి చెందిన జగదీష్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం భర్తతో గొడవ పడి ఇంటిలో నుంచి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లిందనుకొని భర్త ఆమె సోదరుడికి ఫోన్ చేశాడు. అక్కడికి రాలేదని చెప్పడంతో బంధువుల ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఫోర్తుటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సినీ రచయిత రమణగౌతంపై చీటింగ్ కేసు
సాక్షి, హైదరాబాద్ : ప్రేమించి సహజీవనం చేసి పెళ్ళి చేసుకొని రాత్రికి రాత్రే ఉడాయించిన సినీ రచయితపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... విశాఖకు చెందిన యర్రంశెట్టి రమణగౌతం కూకట్‌పల్లిలో అద్దెకుంటూ బుల్లితెర, వెండితెరకు సినీ రచయితగా పని చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీ నగర్‌కు చెందిన భవానీ అనే యువతితో నాలుగేళ్ళ క్రితం ప్రేమలో పడ్డాడు. ఆమె సంపాదించినదంతా దండుకుంటూ పెళ్ళి చేసుకుంటానని నమ్మించి సహ జీవనం చేశాడు. పెళ్ళి చేసుకోవాలని ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా ఇవాళ రేపు అంటూ తప్పించుకోసాగాడు. ఆమె తనను పెళ్ళి చేసుకుంటానని మోసగిస్తున్న రమణగౌతంపై చర్యలు తీసుకోవాలంటూ నాలుగు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రమణగౌతంను బంజారాహిల్స్ పోలీసులు పిలిపించి పెళ్ళి చేసుకోవాలంటూ సూచించడంతో అదే రోజు బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఓ గుడిలో పెళ్ళి చేసుకొని అదే రాత్రి ఉడాయించాడు. శుక్రవారం ఉదయం ఆమెకు ఫోన్ చేసి నువ్వంటే ఇష్టంలేదు, విడాకులు తీసుకుందామంటూ వెల్లడించాడు. దీంతో ఆమె షాక్ తింది. శనివారం మోసగాడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ బచ్చు శ్రీనివాస్ నిందితుడిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కరాటే క్వీన్
‘‘నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులకు చెక్ పెట్టాలంటే ఆడపల్లలకు కరాటే ఎంతో దోహద పడుతుంది. మా అమ్మానాన్నలు కరాటే నేర్చుకోవాలన్నప్పుడు భయపడ్డా. ఇప్పుడు శిక్షణ పొందాక ఆ గొప్పతనం తెలుస్తోంది. అందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు కరాటే నేర్పేందుకు ముందుకు రావాలి’’ – భవాని చాంద్రాయణగుట్ట: మహానగరంలో మహిళలు అర్ధరాత్రి కాదు.. పట్టపగలే నిర్భయంగా తిరలేని రోజులివి. ఏ మానవ మృగం ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందో చెప్పలేని పరిస్థితి. పాతికేళ్ల క్రితమైతే తల్లిదండ్రులు బాలికలను చదువు మాన్పించి ఇంట్లోనే ఉంచేవారు. వయసు రాగానే పెళ్లి చేసి బరువు దించుకునేవారు. ఇప్పుడు రోజులు మారాయి.. ఆడపిల్లలను కన్నవారు తమ బిడ్డలకు మృగాళ్లను ఎదిరించడం నేర్పిస్తున్నారు. ఇంటిపట్టునే ఉంటే లోకజ్ఞానం ఎప్పుడు అబ్బుతుందని.. కట్టుకున్నవాడే బరితెగిస్తే అప్పుడు బేల చూపులు చూస్తూ కన్నీరు పెట్టుకోకూడదని చిన్నప్పుడే ధైర్యాన్ని నింపుతున్నారు. అక్షరభ్యాసంతో పాటే ఆత్మరక్షణ విద్యను నేర్పిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు అంబటి భాస్కర్, శోభ దంపతులు. రోజూ ఎక్కడోచోట మహిళలపై జరుగుతున్న దాడులను పత్రికల్లో చూసిన వీరు.. అలాంటి దుర్ఘటనలు ఎదురైతే ఎదిరించేలా తమ కూతురు భవానీకి కరాటే నేర్పిస్తున్నారు. ఇప్పుడామె జాతీయ స్థాయిలో రాణిస్తూ కన్నవారికి పేరు తెస్తోంది. ‘నిర్భయ’ దుర్ఘటనతో.. ఢిల్లీలో ‘నిర్భయ’ దుర్ఘఘటనతో దేశంలో చాలామంది తల్లిదండ్రులు తల్లడిల్లారు. భాస్కర్, శోభ మాత్రం భవానీకి కరాటేలో శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం నగరంలోని అరోరా కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న భవానీని నాలుగేళ్ల క్రితం జంగమ్మెట్‌లోని నాయక్ బూడోఖాన్ కరాటే అకాడమీలో చేర్పించారు. చదువుకుంటూనే మాస్టర్ గణేష్ నాయక్ వద్ద శిక్షణ పొందింది. అక్కడి నుంచే పలు పోటీలకు సైతం హాజరైంది. జిల్లాస్థాయి పోటీలతో ప్రయాణం మొదలెట్టిన ఆమె అంతర్జాతీయ పోటీల్లో సైతం విజేతగా నిలిచింది. ఇప్పటి దాకా 13 జాతీయ, మూడు రాష్ట్ర, ఒక అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సొంతం చేసుకుంది. ఇటీవల బళ్లారిలో గ్రాండ్ చాంపియన్‌షిప్ సాధించిన భవాని త్వరలో మలేసియాలో జరిగే పోటీలకు ఎంపికైంది. తల్లిదండ్రులతో భవానీ బాలికలకు ఉచితంగా.. ప్రతి వేసవిలో బాలికలకు ఉచితంగా కరాటే నేర్పిస్తున్నాం. పాతబస్తీలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో కరాటేలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. భవానీ కరాటేలో చక్కగా రాణిస్తోంది. త్వరలో మలేసియా కూడా వెళ్లనుంది. ఆమె శిక్షణ పొందుతూనే ఎన్సీసీ క్యాంప్‌లో తోటి విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. ఎన్సీసీలో కూడా ఆమె ప్రత్యేక ర్యాంక్ సాధించడం గొప్ప విషయం.– పి.గణేష్ నాయక్, కరాటే మాస్టర్ -
ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన భవానీ దీక్షలు
-
గొంతు కూడా ఒక డిక్షనరీయే
‘‘రేయ్! నీ అన్న గురించే నీకు తెలుసురా! నా అన్న గురించి నీకు తెలియదు! నా అన్న తలుచుకుంటే ట్విన్ సిటీస్ రెండూ ఉండవు. పులి పంజాలో బలముంటుంది, సింహం కళ్లల్లో పొగరుంటుంది, మా అన్న గుండెల్లో పవరుంటుంది, నడిచే నరసింహస్వామిరా మా అన్నంటే’’ అంటూ ‘లక్ష్మీ’ చిత్రంలో వెంకటేశ్ చెల్లెలి పాత్రకు చెప్పిన డబ్బింగ్‌తో అందరికీ ఆ గొంతు పరిచితమైంది. అది ఆ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ డైలాగ్. ‘‘ఇది నాకు నచ్చిన డైలాగు’’ అంటారు డబ్బింగ్ కళాకారిణి భవాని. తండ్రి మురళీధరరావు, తల్లి విజయలక్ష్మి కూడా డబ్బింగ్ కళాకారులే. ‘‘మా నాన్నగారు డబ్బింగ్ యూనియన్ వ్యవస్థాపకులలో ఒకరు. సినిమాలకి డబ్బింగ్ ఇన్చార్జ్గా పనిచేశారు’’ అంటారు భవాని. గోకులంలో సీత, నవ్వులాట, మా ఆయన బంగారం, రథయాత్ర... వంటి చిత్రాలకు మురళీధరరావు ఇన్చార్జ్గా ఉండటంతో, తల్లి విజయలక్ష్మి కూడా డబ్బింగ్ చెప్పేవారు. ‘‘నాన్నగారు ఇన్చార్జ్గా చేసిన సినిమాలలో చిన్న పిల్లలకు నాతో డబ్బింగ్ చెప్పించేవారు. అలా చైల్డ్ ఆర్టిస్టుగా నేను డబ్బింగ్లోకి ప్రవేశించాను. మా తమ్ముడు కూడా చైల్డ్ డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రవేశించడంతో మాది డబ్బింగ్ కుటుంబం అయింది’’ అంటారు భవాని. మొదటి సినిమా... ‘అయ్యప్ప కరుణ’ చిత్రంతో చైల్డ్ డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాను. ‘శ్రీకారం’లో బేబి శ్రేష్ఠకు డబ్బింగ్ చెప్పాను. శుభాకాంక్షలు, ఆస్తా, అమ్మా దుర్గమ్మా, అమ్మా నాగమ్మా చిత్రాలలో చిన్నపిల్లలకు డబ్బింగ్ చెప్పాను. ‘అమ్మా దుర్గమ్మా’ చిన్న పాపకు డబ్బింగ్ చెబుతున్న సమయంలో బ్రహ్మానందం గారు కూడా డబ్బింగ్‌కి వచ్చారు. నా గొంతు విని ‘డబ్బింగ్ చాలా బాగా చెబుతున్నావు’ అని ప్రశంసించారు. అది నా జీవితంలో నేను మర్చిపోలేను. కొంచెం పెద్దయ్యాక ‘కలిసుందాం రా’ సినిమాలో వెంకటేశ్ చెల్లి పాత్రకు డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమాతోనే యంగ్ గర్ల్స్‌కి డబ్బింగ్ ప్రారంభించాను. అయితే ఆ వయసు అటు చిన్నపిల్లలకు, ఇటు యువతరానికి కూడా సరిపోదు. పాత సినిమాలు చూశాను... డైలాగ్ మాడ్యులేషన్, భావాలు పలికించడం తెలుసుకోవడం కోసం పాత సినిమాలు చూశారు భవాని. హీరోయిన్స్ భావాలు, మాడ్యులేషన్ ప్రాక్టీసు చేయడం ప్రారంభించారు. డైలాగుతో భావాన్ని పలికించడం నేర్చుకున్నారు. ‘‘నా డైలాగులో మెచ్యూరిటీ లేదు అన్నవారితోనే ‘చాలా బాగా చెప్పావు’ అనిపించుకున్నాను’’ అంటారు భవాని. రవితేజ నటించిన ‘చంటి’ సినిమాలో రవితేజ చెల్లెలు పాత్రకు డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చింది. ‘‘డైరెక్టర్ శోభన్ నా గొంతు విని డబ్బిం గ్ అవకాశం ఇచ్చారు. అందులో ‘ఇలా ఎందుకు చేశావు అన్నయ్యా’ అని అన్నయ్యను నిలదీసే ఇమోషనల్ సీన్ ఒకటి ఉంది. డబ్బింగ్ చెప్ప వలసిన రోజున నా గొంతు నొప్పిగా ఉండటంతో, మరుసటి రోజు చెప్పించారు. అయితే ఆ రోజు డైరెక్టర్ రాలేదు. ఆయన తరవాత వచ్చి వింటానన్నారని చెప్పారు డబ్బింగ్ ఇన్చార్జి. నేను సీన్ అంతా చెప్పేశాను’’ అంటున్న భవానికి రెండు రోజుల తరవాత ‘కరెక్షన్స్ ఉన్నాయి, స్టూడియోకి రావాలి’ అని పిలుపు వచ్చింది. అసలే పెద్ద సీను, మళ్లీ చెప్పాలేమో అనుకుంటూ స్టూడియోకి వెళ్లారు భవాని. ‘‘లోపల అడుగు పెడుతుండగానే, ‘ఆ సీన్ అలా చెప్పారేంటి’ అని సీరియస్‌గా అన్నారు శోభన్. నాకు భయం వేసింది. ఆయన చిలిపిగా నవ్వుతూ, ‘ఎంత అద్భుతంగా చెప్పావో తెలుసా! ఆ సీన్ చూసేటప్పుడు నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. నిన్ను అభినందించడానికే పిలిచాను’ అనడంతో నాకు పట్టరాని ఆనందం కలిగింది. ఆర్. నారాయణమూర్తి సినిమాలో... ఆర్. నారాయణమూర్తి దర్శకత్వంలో ‘వేగు చుక్కలు’ చిత్రంలో డబ్బింగ్ చెప్పడానికి వెళ్లాను. అది ఇమోషనల్ సీన్. ఆయన సమక్షంలో ఆయన ముఖం చూస్తూ, ఏడుస్తూ ఆ డైలాగు చెప్పమన్నారు. సినిమా చూడకుండా, ఆయన ఎదురుగా నిలబడి చెప్పాలంటే బిడియంగా అనిపించింది. అంతలోనే, ఎంతమంది ఉన్నా భయపడకుండా డైలాగు చెప్పాలి అని నిశ్చయించుకున్నాను. నేనే నటిస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ, ఏడుస్తూ డైలాగు చెప్పేశాను. ఆయన సంతోషంతో ‘పాపగారు చాలా అద్భుతంగా చెప్పారు’ అని మెచ్చుకోవడం నేను మర్చిపోలేను. ‘డిక్షనరీలో చాలా పదాలుంటాయి. వాటి అర్థాలుంటాయి. ప్రయత్నిస్తే గొంతులో కూడా ఎన్నో అర్థాలు వ్యక్తీకరణలు ఉంటాయి. గొంతు కూడా ఒక డిక్షనరీయే’ అంటారామె. ఈ సినిమాలలో... నీ స్నేహం (సెకండ్ లీడ్), నువ్వు నేను (హీరోయిన్ స్నేహితురాలి పాత్ర), నీ మనసు నాకు తెలుసు (తరుణ్ చెల్లి పాత్ర), లవ్‌టుడే ‘సునీల్ భార్య), ఖుషీ (శివాజీ భార్య), అన్నవరం (పవన్‌కల్యాణ్ చెల్లి సంధ్య), షిరిడీ సాయిబాబా (హీరోయిన్), నా ఊపిరి (హీరోయిన్), సరదాసరదా (శివబాలాజీ పక్కన వేసిన పాత్ర), అమ్మో ఒకటోతారీకు (ఎల్.బి. శ్రీరామ్ కూతురు), ఆ నలుగురు (రాజేంద్రప్రసాద్ కూతురు), నిన్ను చూడాలని (ఎన్టీఆర్ చెల్లెలు) చిత్రాలలో ప్రముఖంగా డబ్బింగ్ చెప్పిన భవాని ఇప్పటివరకు 700 చిత్రాలకు చెప్పారు. సీరియల్స్‌కి కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ‘కుంకుమపువ్వు’ సీరియల్ హీరోయిన్ అమృత పాత్రకు, ‘భార్య’ సీరియల్ హీరోయిన్ ఆనంది పాత్రకు, ‘ప్రతిఘటన’ సీరియల్ పవిత్ర పాత్ర సుదీపకు చెబుతున్నారు. ‘రాములమ్మ’ సీరియల్లో రుద్రమ్మ పాత్రకు 2016లో అవార్డు అందుకున్నారు. ‘‘డెయిలీ సీరియల్స్ అయితే ప్రతిరోజూ చెప్పాలి. అందువల్ల ఫంక్షన్లకి హాజరుకాలేకపోతున్నాను. అటువంటి సమయంలో మా వారు రాజేశ్ నాకు బాగా సహకరిస్తున్నారు. మా అత్తమామల సహకారం లేకుండా నేను ఇంతస్థాయికి రాలేను’ అన్నారామె.‘‘నాకు తెలియకుండానే ఇది నా వృత్తి అయిపోయింది. డబ్బింగ్ యూనియన్ నా కుటుంబం అయిపోయింది. ఇంత పెద్ద కుటుంబంలో నేను సభ్యురాలిని కావడం నాకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తాను’’ అంటూ సంభాషణ ముగించారు. – సంభాషణ: వైజయంతి పురాణపండ సాయికుమార్ తమ్ముడు అయ్యప్ప డైరెక్ట్ చేసిన ‘హైదరాబాద్’ సినిమాలో హీరోయిన్ రవళికి డబ్బింగ్ టెస్ట్‌కి పిలిచారు. వాయిస్ టెస్ట్ చేసి ‘చిన్నపిల్ల గొంతులా ఉంది’ అన్నారు. ఒకటికి పదిసార్లు చెప్పించినా నా గొంతులో మెచ్యూరిటీ రాకపోవడంతో బాధపడుతుంటే, అయ్యప్పగారు, ‘పది అపజయాలు ఒక గొప్ప విజయాన్ని ఇస్తాయి’ అని ప్రోత్సహించారు. ఆ మాటతో నాలో పట్టుదల, ఉత్సాహం పెరిగాయి. – భవాని డబ్బింగ్ కళాకారిణి -
ఫెన్సర్ భవానికి రజతం
చెన్నై: భారత ఫెన్సర్ భవాని దేవి రెక్జావిక్ వరల్డ్ కప్ శాటిలైట్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించింది. ఐస్లాండ్లో జరిగిన ఈ టోర్నీలో ఆమె సాబ్రే ఈవెంట్లో రెండో స్థానాన్ని సంపాదించింది. తమిళనాడుకు చెందిన భవాని దేవి ఫైనల్లో 10–15తో అలెక్సిస్ బ్రౌన్ (అమెరికా) చేతిలో ఓటమి పాలైంది. గతేడాది జరిగిన ఈ టోర్నీలో భవాని స్వర్ణ పతకం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఫెన్సర్‌గా రికార్డు సృష్టించింది -
నకిలీ భార్యతో విదేశాలకు చెక్కేశాడు
మర్రిపాలెం(విశాఖ ఉత్తరం): పెళ్లయ్యి 37 ఏళ్లు.. ముగ్గురు పిల్లలకు తండ్రి. కానీ భార్య, బిడ్డల్ని వదిలేసి మరో మహిళతో కలసి అడ్డదారిలో పాస్‌పోర్టు తీసుకొని విదేశాలకు చెక్కేశాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసింది. విశాఖ పాస్‌పోర్టు అధికారులను కలసి తన గోడు చెప్పుకుంది. వివరాలు.. గుంటూరు జిల్లా ఆర్.అగ్రహారానికి చెందిన దాసరి భవానికి 1980లో ఈశ్వర ప్రసాద్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే ఈశ్వరప్రసాద్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇందుకు భార్య అడ్డుగా ఉండటంతో.. ఆ మహిళతో కలసి విదేశాలకు వెళ్లిపోవాలకున్నాడు. 2015లో హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో దరఖాస్తు చేయగా అధికారులు తిరస్కరించారు. 2017లో మళ్లీ విశాఖ పాస్‌పోర్ట్ కార్యాలయంలో దరఖాస్తు చేసినా.. వివరాలు తప్పుగా ఉండటంతో పాస్‌పోర్ట్ మంజూరు కాలేదు. మళ్లీ పున:పరిశీలన కోసం దరఖాస్తు చేయగా విశాఖ పాస్‌పోర్టు కార్యాలయం ఆదేశాల మేరకు గుంటూరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విచారణ జరిపారు. విచారణలో ఈశ్వరప్రసాద్ అసలు విషయం బయటపడటంతో పోలీసులు పాస్‌పోర్ట్ ఇవ్వొద్దని నివేదిక ఇచ్చారు. అయినా అడ్డదారిలో పాస్‌పోర్ట్ సంపాదించిన ఈశ్వరప్రసాద్ గతేడాది సదరు మహిళతో కలసి బ్రిటన్ వెళ్లిపోయి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భవాని.. ఇటీవల పాస్‌పోర్ట్ అధికారి ఎన్వీఎస్ చౌదరిని కలసి ఫిర్యాదు చేసింది. పాస్‌పోర్ట్ ఎలా మంజూరు అయ్యిందని ఆరా తీసింది. పెళ్లి ఫొటోలు, శుభలేఖ, ధ్రువపత్రాలు చూపించగా.. పరిశీలిస్తామని పాస్‌పోర్ట్ అధికారి చెప్పడంతో ఆమె తిరిగి గుంటూరుకు వెళ్లిపోయింది. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బాధితురాలు ‘సాక్షి’ని ఆశ్రయించింది. -
భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిట
సాక్షి, విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. భవానీ దీక్షల విరమణ బుధవారం నాలుగో రోజుకు చేరుకుంది. భవానీ దీక్షల విరమణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు విజయవాడకు చేరుకుంటుండడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడిపోతోంది. అలాగే అమ్మవారి దర్శనానికి తెల్లవారుజామునుంచే భక్తులు బారులుతీరారు. -
ప్రేమ మధురం...ప్రియుడు కఠినం
♦ ప్రియుడి చేతిలో ప్రియురాలి హతం! ♦ పండావీధిలో దారుణం ♦ అన్ని కోణాల్లోనూ పోలీసుల దర్యాప్తు డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణం) : ప్రియుడే సర్వస్వం అనుకుంది. అనుమానిస్తున్నా.. ఆగ్రహిస్తున్నా అతనితోనే జీవితం పంచుకోవాలనుకుంది. అందుకోసం అందివచ్చిన ఉద్యోగాన్నీ వదులుకుంది... అయినప్పటికీ ప్రియుడి కాఠిన్యం ముందు ఆమె ప్రేమ నిలవలేకపోయింది. దారుణ హత్యకు గురై తనువు చాలించింది. నగర పరిధి పండావీధిలో శనివారం మధ్యాహ్నం ప్రియుడి చేతిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ 26వ వార్డు పరిధి పండావీధికి చెందిన బొందలపూడి సతీష్(23), రంగిరీజువీధికి చెందిన బురళి భవానీ(19) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ డాక్టర్ వీఎస్ కృష్ణా కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి ప్రేమికులు. వీరిద్దరి ప్రేమకు కుటుంబ సభ్యులు అడ్డుచెప్పకపోవడంతో సతీష్ ఇంటికి భవానీ, భవానీ ఇంటికి సతీష్ తరచూ రాకపోకలు సాగిస్తుండేవారు. రెండేళ్ల కిందట సతీష్ స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై అరకు వెళ్లాడు. అప్పుడు జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లి కొంత కాలం మంచానికే పరిమితమయ్యాడు. అయినప్పటికీ భవానీ మాత్రం సతీష్‌తో ప్రేమను కొనసాగిస్తూనే ఉంది. సతీష్ కోమా నుంచి తేరుకున్న తర్వాత కూడా వీరిద్దరి ప్రేమాయణం బాగానే సాగిం ది. ఎప్పటిలానే సతీష్ తల్లిదండ్రులిద్దరూ శనివారం ఉదయం కూలి పనికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో రంగిరీజువీధిలో ఉంటున్న భవానీ పండావీధిలోని సతీష్ ఇంటికి వచ్చింది. వీరిద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నట్టు స్థానికులు తెలిపారు. 2.30 గంటల ప్రాంతంలో సతీష్ ఉంటున్న ఇంటి నుంచి స్థానికులకు రక్తధార కనిపించడంతో పరిశీలించారు. రక్తపు మడుగులో భవానీ నిర్జీవంగా కనిపించడంతో సతీష్‌ను నిలదీశారు. సమాధానం చెప్పకపోవడంతో చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించారు. తీవ్ర గాయాలతో ఉన్న సతీష్‌ను పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. సంఘటన జరిగిన ప్రాంతానికి పోలీసులు వచ్చి అన్ని కోణాల్లో ఆరా తీశారు. క్లూస్ టీం వివరాలు సేకరించింది. హత్య చేశాడా? పెళ్లి చేసుకోనని చెబితే ఆ అమ్మాయే ఆత్మహత్య చేసుకుందా? వీరిద్దరి మధ్య ఏమైనా తగదా జరిగిందా? తదితర వివరాలు సేకరిస్తున్నారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానంతోనే హత్య..! నాలుగేళ్లుగా ప్రేమాయణం సాగుతున్నప్పటికీ సతీష్‌కు భవానీపై అనుమానం పెరిగింది. భవానీతో పాటు ఆమె తల్లిదండ్రులతోనూ తరచూ గొడవకు దిగుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగం వచ్చినప్పటికీ సతీష్ ఎక్కడ దూరమైపోతాడో అన్న భయంతో చేరకుండా వదులుకుంది. మరోవైపు సతీష్ మానసిక స్థితిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్ల కిందట జరిగిన ప్రమాదంతో కోమాలోకి వెళ్లిపోయిన సతీష్ అనంతరం తేరుకున్నాడు. అయితే నిత్యం ప్రతివారితోనూ గొడవలు పడేవాడని, మానసిక పరిస్థితి బాగులేదని స్థానికులు తెలిపారు. మరోవైపు కూతురు ఇంటికి వచ్చేస్తుందని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు మధ్యాహ్నం 2.30గంటలకు భవానీ చనిపోయనట్లు ఫోన్ రావడంతో షాక్‌కు గురయ్యారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న కుమార్తెను చూసి గుండెలవిసేలా రోదించారు. భవానీ తండ్రి ఢిల్లీరావు డాక్‌యార్డ్‌లో వర్కర్. తల్లి వెంకటలక్ష్మి గృహిణి. అక్క దేవిశ్రీ ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. తమ్ముడు మనోజ్ చదువుతున్నాడు. సతీష్ ఇలా ఎందుకు చేశాడో తమకు తెలి యడం లేదని అతని తల్లిదండ్రులు సత్యవతి, నూకరాజు వాపోయారు. -
బ్యాంక్ ఉద్యోగిని బలవన్మరణం
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): ఎన్ఏడీ ఎస్బీఐ ఆర్‌ఏసీపీసీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న చిట్టాజీ గంగా భవాని(28) బుధవారం బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మరణానికి గల కారణాలు తెలియరాలేదు. స్థానికులు, ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని చీడిగకు చెందిన గంగాభవాని మర్రిపాలెం వుడా లేఅవుట్లోని సాంబశివ అపార్ట్మెంట్లో ఏడాదిగా నివాసం ఉంటోంది. బుధవారం విధులు నిర్వర్తించేందుకు బ్యాంక్‌కు వెళ్లింది. మధ్యాహ్నం భోజన విరామం çసమయంలో ఇంటికి వచ్చి తిరిగి బ్యాంక్‌కు వెళ్లలేదు. సాయంత్రం 4.30 సమయంలో బ్యాంక్‌లోని ఆమె స్నేహితురాలు రమాదేవికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, గంగాభవాని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలి పాడు. ఇంటికి వెళ్లి చూడాలని కోరాడు. దీంతో బ్యాంక్ ఉన్నతాధికారులు అనుమతి పొంది ఆమె ఇంటికి వెళ్లి చూసింది. తలుపులు మూసి ఉండటంతో ఇంటికి వచ్చిందా.. లేదా బయటకు వెళ్లిందా అన్న విషయాలు నిర్ధారించుకోవడానికి సీసీ టీవీ ఫుటేజ్‌లు పరిశీలించినట్టు ఆమె తెలిపింది. గంగా భవాని ఇంట్లోకి వెళ్లిందని గుర్తించిన ఆమె బ్యాంక్ అధికా రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గది తలుపులు తెరచి చూడగా ఫ్యాన్‌కు చున్ని కట్టి గంగాభవాని ఉరి వేసుకుని ఉంది. ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులకు తెలియజేసింది. గంగా భవానికి వివాహమై మూడు నెలలు అయింది. ప్రస్తుతం ఆమె ఒంటరిగా నివసిస్తోంది. వెస్ట్‌జోన్ ఏసీపీ భీమారావు, ఎయిర్పోర్ట్ జోన్ సీఐ ప్రభాకర్, ఎస్ఐ నాగేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గురువారం తహసీల్దార్, కుటుంబ సభ్యుల సమక్షంలో శవ పంచనామా నిర్వహిస్తామని ఏసీపీ తెలిపారు. -
అల్లరి చేస్తున్నాడని చిన్నారికి వాతలు
-
అల్లరి చేస్తున్నాడని చిన్నారికి వాతలు
కృష్ణా: అల్లరి చేస్తున్నాడన్న కోపంతో వాళ్ల పెద్దమ్మ ఓ చిన్నారికి వాతలు పెట్టింది. యనమనలకుదురు ప్రియదర్శినినగర్‌కు చెందిన కోవెల ప్రభు, శైలజ దంపతులకు రాజ్‌కుమార్(6), శివకుమార్(4) ఉన్నారు. నాలుగురోజుల క్రితం ఊరెళుతూ రాజ్‌కుమార్‌ను ఇంటి పక్కనే ఉండే మేడే భవానికి అప్పజెప్పి వెళ్లింది. మంగళవారం రాజ్‌కుమార్ అల్లరి ఎక్కువగా చేస్తుండటంతో విసుగు చెందిన భవాని గరిట కాల్చి చేతులు, కాళ్లపై వాతలు పెట్టింది. ఊరు నుంచి వచ్చిన తర్వాత బిడ్డకు గాయాలైనా పట్టించుకోకుండా వదిలేసింది శైలజ. కాగా, కాలిన గాయాలతో స్ధానిక అంగన్వాడీ కేంద్రానికి మంగళవారం ఉదయం బాలుడు వచ్చాడు. బాలుడి శరీరంపై ఉన్న గాయాలను చూసిన అంగన్వాటీ కార్యకర్త ఏమైందని ప్రశ్నించగా.. జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో బాలుడిని హింసించిన ఘటనను నవజీవన్ బాల భవన్ కార్యకర్తల దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే అంగన్వాడీ కేంద్రానికి చేరుకున్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. బాలుడి తల్లి శైలజ, పెద్దమ్మ భవానీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలపై ప్రేమలేని శైలజ వారి ఆలనాపాలనలను చూడటం మానేసింది. గతంలో ఓ సారి పిల్లలను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది శైలజ. దీంతో విజయవాడ చైల్డ్‌లైన్ నిర్వాహకులు పిల్లల్ని తీసుకువెళ్లి సంరక్షించారు. కొంతకాలం తర్వాత తిరిగి వచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్లినట్లు తెలిసింది. కేసును విచారించిన పోలీసులు శైలజ, భవానీలను అదుపులోకి తీసుకున్నారు. -
చేయని నేరానికి బలి
దొంగతనం అంటగట్టి చితకబాదిన ప్రిన్సిపల్ అవమానభారంతో విద్యార్థిని ఆత్మహత్య సిద్దిపేట అర్బన్: ఓ కాలేజీ ప్రిన్సిపల్ బాధ్యతా రాహిత్యంతో ఓ విద్యార్థినిపై చేయని దొంగతనం మోపటం, తోటి విద్యార్థుల ముందే చితకబాదటంతో ఆ విద్యార్థిని అదే కాలేజీ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సాయి చైతన్య జూనియర్ కాలేజీలో చోటు చేసుకుంది. ఇంత జరిగినా జిల్లా ఇంటర్ విద్యాధికారి ఘటనా స్థలానికి రాకపోవటం గమనార్హం. దొంగతనం చేశావంటూ:సిద్దిపేట మండలం పుల్లూరుకు చెందిన భవాని సిద్దిపేట పట్టణంలోని సాయి చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ రెండోసంవత్సరం చదువుతోంది. ఆమె చెల్లి శివాని కూడా ఇదే కాలేజీలో చదువు తోంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ప్రతి రోజూ బస్సులో కాలేజీకి వచ్చి చదువుకుంటున్నారు. బుధవారం కళాశాలలో ఓ అమ్మాయి తన రూ.100 నోటు పోయిందని, భవానే తీసి ఉండొచ్చని ప్రిన్సిపల్ బ్రహ్మానందరెడ్డికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన భవానిని తన చాంబర్‌కు పిలిచి తీవ్రంగా కొట్టారు. తోటి విద్యార్థుల ముందు దొంగగా చిత్రీకరించి రూ.100 ఆమెతో ఇప్పిం చారు. ఆ డబ్బులు తనవే అని, బస్ పాస్ కోసం తెచ్చుకున్నానని భవాని ఎంతగా చెప్పినా ప్రిన్సిపల్ వినలేదు. భవాని ఇంటికి వెళ్లాక జరిగిన విషయం తన తల్లిదండ్రులతో చెప్పి ప్రిన్సిపల్‌ను నిలదీయా లని కోరింది. తండ్రి వెంకటి కూతురికి సర్దిచెప్పి బస్‌పాస్ కోసం మరో రూ.100 ఇచ్చి గురువారం కాలేజీకి పంపించాడు. ప్రిన్సిపల్ మరోసారి తన చాంబర్లోకి పిలిపించుకొని భవానిని మందలించడంతో అదే కాలేజీ భవనం నాలుగో అంతస్థుకు ఎక్కి దూకింది. ఆమెను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందింది. భవాని మృతదేహా న్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రిన్సిపల్ మాత్రం భవాని బిల్డింగ్‌పై నుంచి జారిపడిందని తండ్రికి సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకు నేటప్పటికే భవాని మరణించడంతో వారి రోదనలు మిన్నంటాయి. బాలికకు ‘లవ్ ఎఫైర్’ అంటగట్టేం దుకు ప్రిన్సిపల్ ఒడిగట్టారు. విద్యార్థులు తిరగబ డటంతో రాజీ ప్రయత్నాలు మొదలెట్టారు. బాలిక ప్రాణానికి యాజమాన్యం రూ.7 ల క్షల నష్టపరిహారమిచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. యాజమాన్యం, ప్రిన్సిపల్ వేధింపులే భవాని మృతికి కారణమంటూ విద్యార్థి సంఘాలు డీఐఈ వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాయి. నందూ సార్ కొట్టడం వల్లే.. ‘‘దొంగతనం నేరం మోపి నందూసార్ (ప్రిన్సిపల్) అక్కను కొట్టిండు. అక్క ఎలాంటి తప్పు చేయలేదు. నందూ సార్ కొట్టడంతోనే కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకింది’’ అని మృతు రాలి సోదరి శివాని కన్నీళ్లు పెట్టుకుంది. -
విద్యార్థినిని చితకబాదిన ప్రిన్సిపాల్, ఆత్మహత్య
-
విద్యార్థినిని చితకబాదిన ప్రిన్సిపాల్, ఆత్మహత్య
సిద్దిపేట: తోటి విద్యార్థిని డబ్బులు తీసుకుందనే నెపంతో అందరి ముందు ఓ విద్యార్థినిని ప్రిన్సిపల్ చితకబాదడంతో.. మనస్తాపానికి గురైన విద్యార్థిని కళాశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన భవాని(17) పట్టణంలోని సాయి చైతన్య కళాశాలలో ఇంటర్ సీఈసీ) చదువుతోంది. రోజులాగే ఈ రోజు కళాశాలకు వచ్చిన భవానికి తరగతి గదిలో అవమానం జరిగింది. తోటి విద్యార్థిని పోగొట్టుకున్న వంద రూపాయలు భవాని బ్యాగులో లభించడంతో.. కళాశాల ప్రిన్సిపల్ బ్రహ్మానందరెడ్డి(నందు) ఆమెను తీవ్రంగా కొట్టాడు. తరగతి గదిలోని విద్యార్థులంతా చూస్తుండగా ఆమెను దండించడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన భవాని కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గుర్తించిన తోటి విద్యార్థినులు ఆమెను ఆస్పత్రికి తరలించడానికి యత్నిస్తుండగా.. మార్గ మధ్యలో మృతిచెందింది. -
వేధింపులతో దంపతుల ఆత్మహత్య
నా అనుకున్నవారే శత్రువుల్లా మారి వేధించడంతో మనస్థాపంచెందిన దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా హుజూర్నగర్ రూరల్ మండలం కందికొండ కాలువ గట్టు వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ విషాద సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మేళ్లచెరువు గ్రామానికి చెందిన వి. వీరారెడ్డి(24), భవానీ(22)కు రెండేళ్లక్రితం వివాహమైంది. వీరారెడ్డి వ్యవసాయం చేసి జీవనం సాగించేవాడు. వీరికి పిల్లలు లేరు. అయితే వీరారెడ్డి తమ్ముడు, అతని భార్య, తల్లి కామేశ్వరమ్మ అకారణంగా తమను సూటిపోటిమాటలు అంటూ వేధిస్తుండేవారని వీరారెడ్డి దంపతులు రాసిన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తాను, తన భార్య ఎలాంటి తప్పు చేయకపోయినా రోజూ గొడవపడుతూ తమను మానసికంగా వేధించేవారని అందులో రాశారు. కారణంగా తమను పలు విధాలుగా బాధపెడుతుండడంతో తమకు మరణం తప్ప మరో మార్గం లేక పురుగుల మందు తాగి ఇద్దరం మరణిస్తున్నామని, తమ అనంతరం తనకు చెందిన ఆస్తి మొత్తం తన భార్య భవానీ తల్లిదండ్రులకు చెందాలని వీరారెడ్డి లేఖలో పేర్కొన్నాడు. మోటార్‌బైక్‌లో వచ్చిన వీరారెడ్డి, భవానీ దంపతులు హుజూర్నగర్ రూరల్ మండలం వేపలసింగారం వద్ద కందికొండ కాలువ గట్టుపై చెట్టుకింద పురుగుల మందు తాగారు. మంగళవారం ఉదయం మృతదేహాలను గమనించిన స్థానికులు హుజూర్నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం
-
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం
గుంటూరు: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వివరాలు..గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెంనకు చెందిన భవానీ(23) కాన్పు కోసం మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. ఆరున్నర గంటలకు సాధారణ డెలివరీ అయింది. పురిటిలోనే బాబు చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది తండ్రి చేతిలో బాబును పెట్టారు. శవాన్ని ఇంటికి తీసుకెళ్లి పూడ్చి పెట్టండి అని తండ్రికి చెప్పారు. దీంతో తండ్రి జగన్నాధం శిశువును సొంతూరికి తీసుకెళ్లి పూడ్చుతుండగా బాబులో కదలిక కనపడింది. కొద్దిసేపటి తర్వాత ఏడవటం మొదలుపెట్టాడు. కాసింత ఆలస్యం చేసి ఉంటే డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణంపోయేది. దీంతో జగన్నాధం కుటుంబసభ్యులు నిర్లక్ష్యానికి పాల్పడిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూపరిండెంట్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. -
కులం తక్కువని గెంటేశారు..
అనంతపురంలో దారుణ సంఘటన వెలుగుచూసింది. నిమ్న కులానికి చెందిన యువతి ఆలయం ముందు కూర్చుందని గ్రామస్థులు ఆమె పై ఆగ్రహం వ్యక్తం చేసి ఘోరంగా అవమానించారు. విధి నిర్వహణలో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగురాలని కూడా చూడకుండా.. ఆలయ ప్రాంగణంలో ఎందుకు కూర్చున్నావని అవమానించి అక్కడ నుంచి గెంటేశారు. దీంతో ప్రభుత్వోద్యోగిని పోలీసులను ఆశ్రయించింది. దేశానికి స్వతంత్య్రం వచ్చి డైబ్భై ఏళ్లు దాటిన ఇంకా అంటరానితనం పోలేదని.. కుల వివక్ష రూపుమాపలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దారుణ సంఘటన జిల్లాలోని బ్రహ్మసముద్రం మండలం ముప్పాలకుంట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. బ్రహ్మసముద్రం మండలం ముప్పాలకుంటకు చెందిన పంచాయతి సెక్రటరీ గత కొన్ని రోజులుగా సెలవు మీద ఉండటంతో.. సమీప గ్రామమైన బైరసముద్రం సెక్రెటరీ భవానికి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమె రెండు గ్రామాల బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో ప్రజాసాధికారిక సర్వేలో పాల్గొనడానికి ముప్పాలకుంటకు వచ్చిన భవానికి గ్రామంలో చేదు అనుభవం ఎదురైంది. గ్రామంలో సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో.. నల్లాలమ్మ దేవాలయం ఎదుటకు వచ్చింది. అక్కడ సిగ్నల్స్ అందుబాటులో ఉండటంతో.. ఆలయ ప్రాంగణంలోని రచ్చబండపై కూర్చొని ట్యాబ్ ద్వారా వివరాలు తీసుకుంటుండగా.. గ్రామానికి చెందిన కొందరు అక్కడికి చేరుకొని నీది ఏ కులమని ప్రశ్నించారు. అనంతరం నువ్వు అంటరానిదానివి, దళిత జాతికి చెందిన దానివి ఇక్కడ కూర్చోవద్దు అని ఘోరంగా అవమానించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె పోలీసులను ఆశ్రయించింది. -
సందడి... అంతంతే
విజయవాడ (భవానీపురం) : తొలి రోజు లెక్కకుమిక్కిలి భక్తులు వస్తారన్న కారణంగానో, లేదంటే శ్రావణ శుక్రవారం కావడం వలనో తెలియదుగానీ ఊహించినంతగా భక్తులు రాలేదు. భవానీఘాట్‌లో ఒక్కచోటే ఎక్కువ మంది స్నానాలు చేయటంతో మిగతా భాగంలో భక్తులు అక్కడక్కడా పలుచగా కనిపించారు. భవానీఘాట్ కంటేS పున్నమిఘాట్లో మరీ తక్కువ మంది కనిపించారు. ఇది వీఐపీ ఘాట్‌గా అధికారులు ప్రకటించడంతో భక్తులు ఇటువైపుగా పెద్దగా రాలేదు. అయితే భవానీఘాట్ నుంచి నడుచుకుంటూ వచ్చినవారిందరినీ స్నానాలు చేసేందుకు అనుమతించారు. మొత్తంమీద ఈ రెండు ఘాట్లలో భక్తులు పలుచగా ఉన్నా వందలాది మంది పారిశుద్య సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సందడిగా కనిపించాయి. కాగా వేకువ జామునే పున్నమిఘాట్లో పలువురు న్యాయమూర్తులు, స్వామీజీలు స్నానాలు ఆచరించారు. ఆకర్షించిన డ్రోన్ కెమెరా భవానీ, పున్నమిఘాట్‌లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసినప్పటికీ డ్రోన్ కెమేరాతో కూడా నిఘా ఏర్పాటు చేశారు. నదిపై చక్కర్లు కొడుతుంటే భక్తులు ఆసక్తిగా తిలకించారు. కొంచం కిందకు దిగినప్పుడు చిన్నపిల్ల లు కేరింతలు కొడుతూ దానిని చేతితో అందుకునేందుకు ప్రయత్నించారు. -
పెళ్లైన ఏడాదికే...
గుడికి వెళ్దామని బైక్ పై తీసుకెళ్లిన భర్త కొద్ది దూరం వెళ్లాక నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ఆపి భార్యను అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం బ్రిడ్జి సమీపంలో బుధవారం వెలుగు చూసింది. కోస్గి మండలం జంపాపురం గ్రామానికి చెంది పురుషోత్తంరెడ్డికి బాసారం గ్రామానికి చెందిన భవాని(21)తో ఏడాది క్రితం వివాహమైంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి. భర్త వివాహేతర సంబంధం గురించి భవాని నిలదీయడంతోనె ఈ దారుణం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. -
కన్నకూతుర్ని అమ్మకానికి పెట్టాడు
కన్న కూతురినే అమ్మకానికి పెట్టాడో తండ్రి. అయితే, ఆ బాలిక తండ్రి ప్రయత్నం నుంచి తప్పించుకుంది. ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలంలోని పొన్కల్ గ్రామంలో చోటు చేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నాయి. దండేపల్లి మండలానికి చెందిన సాయిలు కొన్ని రోజులుగా జన్నారంలోని పొన్క్ల్ శ్రీలంక కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతడికి కూతురు భవాని(7) ఉంది. సాయిలు ఇనుప సామాను, ప్లాస్టిక్ వస్తువులు ఏరుకుంటూ జీవిస్తుండగా.. కూతురు భిక్షాటన చేస్తోంది. శనివారం రాత్రి సాయిలు తన కూతురిని అమ్మడం కోసం కొందరిని పిలిపించాడు. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు భవానిని తీసుకెళ్లేందుకు వచ్చారు. ఇది గమనించిన భవాని వారి కళ్లు గప్పి తప్పించుకుని పారిపోయింది. పొన్కల్ పంచాయతీ కార్యాలయం వెనుకాల 12గంటల ప్రాంతంలో కేకలు వేయగా... అది విని లింగంపల్లి రాజలింగు అనే వ్యక్తి ఆమెను కాపాడారు. తర్వాత పోలీసులు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు బాలిక తండ్రిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఐసీడీఎస్ అధికారులు రాకపోగా... మంగళవారం వస్తామని చెప్పడం గమనార్హం. దీంతో భవానిప్రస్తుతం రాజలింగు ఇంట్లోనే ఉంది. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
రంగంపేట మండలం పెద్దరాయవరం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందారు. సామర్లకోట నుంచి రాజానగరం వైపు బైక్‌పై వెళ్తున్న దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సామర్లకోట పట్టణానికి చెందిన కటారి శ్రీనివాసరావు(40), భవాని(28) అనే దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం 108 వాహనంలో పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వరకట్న వేధింపులకు వైద్యురాలు బలి
- అత్తింటివారే హత్య చేశారంటూ తల్లిదండ్రుల ఆరోపణ - పోలీసుల అదుపులో భర్త, అత్త హైదరాబాద్: అత్తింటివారి వరకట్న వేధిం పులు భరించలేక ఓ వైద్యురాలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. మృతురాలు కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమార్తెను హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నాగయ్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వరంగల్ జిల్లా శివనగర్‌కు చెం దిన గజ్జెల లింగమూర్తి, కళావతిల రెండో కుమార్తె భవానికి హసన్‌పర్తి మండలం చింతగట్టుకు చెందిన దోమల సత్యరాజు, శ్రీవాణి కుమారుడు పృధ్వీరాజుతో 2014, ఫిబ్రవరి 21న వివాహం జరిగింది. వీరు మేడిపల్లి పీఅండ్‌టీ కాలనీలోని ఎస్ఆర్ రెసిడెన్సీలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ఎంబీ బీఎస్ పూర్తి చేయడంతో ఉప్పల్‌లోని ఆదిత్య హాస్పిటల్లో వైద్యులుగా పనిచేసేవారు. నాలు గు నెలల క్రితం వీరికి ఒక బాబు జన్మిం చాడు. దీంతో భవాని హాస్పిటల్ మానేసి ఇంట్లోనే వుండగా, పృధ్వీరాజు మాత్రం మరోచోట ఉ ద్యోగం చేస్తున్నాడు. ఇటీవల సత్యరాజు తమ కుమార్తెల వద్ద కుటుంబ అవసరాలు నిమిత్తంగా డబ్బులు తీసుకున్నారు. అవి చెల్లిం చడం కోసం తరుచుగా కోడలిని అదనపు కట్నం కోసం వేధించేవారు. భవాని పీజీ చదువుకోవడానికి భర్త, అత్తమామలు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం భవాని చెల్లెలు దేవి వివాహం జరిగింది. ఈ వివాహంలో సత్యరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అక్కడ మర్యాదలు సరిగా జరుగలేదన్న కారణం పై భవాని, పృధ్వీరాజుల మధ్య చిన్న గొడవ జరిగింది. మేడిపల్లికి వచ్చిన తరువాత మరలా గొడవ జరగడంతో తీవ్ర మనస్థాపం చెందిన భవాని సోమవారం రాత్రి 9 గం.కు బెడ్రూం లోకి వెళ్లింది. ఎంత సేపటికి తలుపు తీయకపోవడంతో.. గడియ విరగకొట్టి చూడగా ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించింది. అత్తింటివారు భవాని ఆత్మహత్య విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి వివరాలు సేకరించారు. అయితే తమ కూతురుది ఆత్మహత్యకాదని.. అత్తింటివారే హత్య చేశారంటూ భవాని తల్లిదండ్రులు.. సత్యరాజు, శ్రీవాణి, పృధ్వీరాజుతో పాటు అతని అక్క చెల్లెలు రేవతి, సుచరిత, బావలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పృధ్వీరాజు, శ్రీవాణిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన... భవాని మృతికి కారణమైన అత్తింటివారిని కఠినంగా శిక్షించాలని.. భవాని తల్లిదండ్రులు, బంధువులు పోలీసుస్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. లింగమూర్తి, కళావతి మాట్లాడుతూ వివాహం సమయంలో రూ.5 లక్షల కట్నం, 10 తులాలు బంగారం, 50 తులాలు వెండి, రూ.2 లక్షలు పెళ్లి ఖర్చులకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
వైద్య విద్యార్థిని ఆత్మహత్య
ఉప్పల్ పరిధిలోని మేడిపల్లి పీ అండ్ టీ కాలనీలో నివాసముంటున్న భవాని(22) అనే వివాహిత సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మనస్తాపం చెంది .. రాత్రి అందరూ నిద్రపోతున్న సమంయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వరంగల్ జిల్లాకు చెందిన భవాని అదే జిల్లాకు చెందిన దోమల పృద్వీరాజుతో 2014లో వివాహం జరిగింది. భవాని నగరంలోని ఓ వైద్య కళాశాలలో విద్యార్థిని. కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
టీచర్ కొట్టిందని విద్యార్థిని ఆత్మహత్య
చింతపల్లి: టీచర్ కొట్టిందని మనస్తాపానికి గురై రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్వెంకటేశ్వర నగర్ గ్రామానికి చెందిన సురిగి భవాని(15) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చాయని టీచర్ భవానిని కొట్టడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. -
నచ్చని సినిమా చూడొద్దు!
ఆత్మబంధువు ‘‘ఏంటక్కా అలా ఉన్నావ్?’’ అడిగింది రేఖ ఇంట్లోకి అడుగు పెడుతూనే. ‘‘ఏం లేదురా..’’ అంది భవాని. రేఖ నమ్మలేదు. ‘‘ఏమీ లేకుంటే ఎందుకంత డల్‌గా కనిపిస్తున్నావేం?’’ అంటూ మళ్లీ ప్రశ్నించింది. ‘‘ఏదో గుర్తొచ్చిందిలే’’ అంది భవాని. ‘‘నీకు అభ్యంతరం లేకపోతే అదేంటో చెప్పక్కా’’ అంటూ ఒత్తిడి చేసింది రేఖ. భవాని చెప్పడం మొదలు పెట్టింది. ‘‘నేను డిగ్రీ చదివేటప్పుడు ఒక సంఘటన జరిగిందిరా. అది ఎప్పుడు గుర్తొచ్చినా బాధగా ఉంటుంది. నేను మా ఊర్నుంచి కాలేజీకి బస్సులో వెళ్లి వచ్చేదాన్ని. అప్పుడొకడు రోజూ నా వెంట పడేవాడు. వద్దని ఎంత చెప్పినా వినేవాడు కాదు. విసుగొచ్చి ఓ రోజు మన ఇంట్లో చెప్పేశా. వాడు అది మనసులో పెట్టుకుని నాపై దాడి చేశాడు. ఎలాగో తప్పించుకున్నాను కానీ, ఆ విషయం ఎప్పుడు గుర్తొచ్చినా మనసు కలుక్కుమంటుంది.’’ నిట్టూర్చింది రేఖ. ‘‘కొందరు అంతే అక్కా. అవునూ... నాకెప్పుడూ ఈ విషయం చెప్పలేదేం?’’ ‘‘చెప్పుకోవడానికి అదేం గొప్ప విషయమో, మంచి విషయమో కాదుగా రేఖా!’’ ‘‘అవుననుకో. కానీ అది ఇప్పుడెందుకు గుర్తొచ్చింది?’’ అంది రేఖ అక్క ముఖంలో దిగులును గమనిస్తూ. ‘‘ఇప్పుడనే కాదురా. పేపర్లో, టీవీలో అలాంటి వార్త చూసినా, చదివినా గుర్తొస్తుంది. ఇక ఆ రోజంతా నా మనసు మనసులో ఉండదు. అప్పుడు బాగా బాధ పడ్డానేమో, ఎంత కాలమైనా మర్చిపోలేక పోతున్నాను.’’ ‘‘అవునా. సరేలే. ఓ విషయం చెప్పు. నీకు నచ్చిన సినిమా ఏంటి?’’ తాను తన బాధ గురించి మాట్లాడు తుంటే, రేఖ సినిమా గురించి అడుగుతుందేమిటా అని అయోమయంగా చూసింది భవాని. భవానీ డౌట్ రేఖకు అర్థమైంది. ‘‘ముందు జవాబివ్వు, ఎందుకో తర్వాత చెప్తాను’’ అంది. ‘‘ఏం మాయ చేసావె.’’ ‘‘ఎన్నిసార్లు చూశావేం?’’ అడిగింది. ‘‘ఓ పాతిక ముప్ఫైసార్లు’’ నవ్వుతూ చెప్పింది భవాని. ‘‘మరి నీకు నచ్చని సినిమా ఏంటి?’’ ‘‘బోలెడున్నాయి.’’ ‘‘నీకు నచ్చని ఆ బోలెడు సినిమాల్లో ఒక సినిమాని పదిసార్లు చూడమంటే ఏం చేస్తావ్?’’ ‘‘లక్ష రూపాయలిచ్చినా చూడను.’’ ‘‘ఎందుకలా?’’ ‘‘చెత్త సినిమా కాబట్టి. నాకు నచ్చలేదు కాబట్టి.’’ ‘‘మరయితే నీకు నచ్చని నీ డిగ్రీ సినిమాను పదేపదే ఎందుకు చూస్తున్నావ్ అక్కా?’’ అర్థం కానట్టుగా చూసింది భవాని. ‘‘డిగ్రీ సినిమా చూడటమేంటి? నాకేం అర్థం కాలేదు.’’ ‘‘ఓకే, నీకు అర్థమయ్యేలా చెప్తా. డిగ్రీలో జరిగిన విషయం నీకెలా గుర్తొస్తోంది?’’ ‘‘నేను కావాలని గుర్తుచేసుకోన్రా. అలాంటి వార్తలు చదివినప్పుడు లేదా చూసినప్పుడు గుర్తొస్తుంది.’’ ‘‘గుర్తొచ్చింది సరే. కానీ ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు బాధపడటం ఎందుకు?’’ ‘‘అది నాకు తెలీదురా. బాధ కలుగుతుందంతే.’’ ‘‘కదా... దీన్నే అసోసియేషన్ అంటారక్కా. అంటే ఆ విషయం జరిగినప్పుడు ఎంత బాధపడ్డామో, అది గుర్తొచ్చినప్పుడు కూడా దాదాపు అంతే బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆ జ్ఞాపకానికి ఆ బాధ అలా లింక్ అయి ఉంటుందన్నమాట.’’ ‘‘అలాగా... దాన్ని తప్పించుకునే మార్గం లేదా?’’ ‘‘ఎందుకు లేదూ! ఎంచక్కా ఉంది. దాన్ని డిసోసియేట్ చేస్తే సరి.’’ ‘‘అంటే?’’ మళ్లీ అయోమయంగా ముఖం పెట్టింది భవాని. ‘‘అంటే ఆ విషయాన్ని గుర్తు చేసుకోక పోవడం. దాన్ని నీ మనసు నుంచి దూరం చేయడం.’’ ‘‘అదెలా?’’ ‘‘ఎలా అంటే... ఆ సంఘటనను నీ మనసులో గుర్తు చేసుకుంటున్నప్పుడు అందులో నువ్వూ కనిపిస్తావ్ కదా?’’ ‘‘నేను లేకపోతే ఆ సంఘటనే లేదుగా’’ అంది భవాని. ‘‘అవును. అందుకే ఇప్పుడో పని చెయ్. నువ్వు హాల్లో సోఫాలో కూర్చొని, టీవీలో సినిమా ఎలా చూస్తావో, నీ మనసునే టీవీ అనుకుని ఆ సంఘటనను టీవీలో చూస్తున్నట్లు మనసులో చూడు. అది చూడటం నీకు ఇష్టం ఉండదు కాబట్టి టీవీని చిన్నది చేసుకో. నీకూ టీవీకి మధ్య దూరం పెంచుకో. టీవీని బ్లాక్ అండ్ వైట్‌గా మార్చుకో. మ్యూట్‌లో పెట్టుకో. డల్ చేసుకో. బ్లర్ చేసుకో. డూ వాటెవర్ యూ వాంట్. తర్వాతెలా ఉందో చెప్పు.’’ ‘‘ఊ... టీవీని చిన్నది చేశా, దూరం పెంచా. బ్లాక్ అండ్ వైట్‌గా మార్చేశా. మ్యూట్‌లో పెట్టేశా. నౌ ఫీలింగ్ గుడ్.’’ ‘‘కదా. దీన్నే డిసోసియేట్ అంటారు. అంటే మనసుకు బాధ కలిగించే సంఘటనల నుంచి మనల్ని మనం దూరం చేసుకోవడం అన్నమాట. అప్పుడా ఇన్సిడెంట్ గుర్తొచ్చినా బాధ ఉండదు.’’ భవాని ముఖం వెలిగింది.‘‘ఇన్నేళ్ల బాధను దూరం చేశావ్. థాంక్స్ రా’’ అంది తృప్తిగా. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
'భవానికి న్యాయం చేయాలి'
నల్గొండ : లెక్చరర్ వేధింపులు తాళలేక నల్లొండ జిల్లా ఆత్మహత్య చేసుకున్న భవాని(16) కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఎస్పీ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లిన విద్యార్థులు అనంతరం ఏస్పీ ఆఫీసు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. లెక్చరర్ ను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. -
అమ్మాయిలంటే బొమ్మలా చూస్తాడు..
►లెక్చరర్ వేధింపులపై విద్యార్థిని సూసైడ్‌నోట్ ► ఉరివేసుకుని విద్యార్థిని బలవన్మరణం.. ► ఆలస్యంగా వెలుగులోకి..తల్లిదండ్రుల ఆందోళన ► లెక్చరర్ శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ‘‘కాలేజీలో అమ్మాయిలంటే ఆ సార్ బొమ్మలు అనుకుంటాడు. ఆ సారు సంగతి కొంచెం చూడండి’’ అని విద్యార్థి భవాని సూసైడ్ నోట్లో పేర్కొనడం అతని వికృత చేష్టలకు నిదర్శనం. విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయడంతోపాటు వారికి విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఫిజిక్స్ అధ్యాపకుడు శ్రీనివాస్ వక్రబుద్ధిని అమలు చేశాడు. ఫలితంగా తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చాడు. నల్లగొండ క్రైం విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన అధ్యాపకుడే కామాంధుడిగా మారాడు... వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన కళాశాల తరగతి గదుల్లో...కోరిక తీర్చాలంటూ... వేధించాడు.. అవకాశం నీకే ఇస్తున్నా అంటూ మానసిక క్షోభకు గురిచేశాడు.. అధ్యాపకుడి సూటీపోటీ మాటలు భరించలేక చివరకు ఆ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు... పట్టణ సమీపంలోని గంధంవారి గూడేనికి చెందిన పొమ్మనబోయిన సూరయ్య - మణెమ్మలకు భవాని(16), శోభ కుమార్తెలు. వీరిద్దరు స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. కొద్ది రోజులుగా అధ్యాపకుడు శ్రీనివాస్ భవానిని మానసికంగా వేధించడంతో విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. కేసు పెడదామని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నా విద్యార్థిని అందుకు అంగీకరించలేదు. గ్రామంలో మరోలా అనుకుంటారని ఏమి అనవద్దని నచ్చజెప్పింది. ఫిజిక్స్ బోధించే అధ్యాపకుడు శ్రీనివాస్ వేధింపులు అధికం కావడంతో అమ్మాయి అవమానానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ నోట్‌తో వెలుగులోకి .. బాలిక తల్లిదండ్రులు సూరయ్య - మణెమ్మలది నిరుపేద కుటుంబం. తండ్రి హమాలి పని చేస్తుండగా తల్లి మేకలు కాస్తుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు భవాని, శోభలు ఒకే కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఈ నెల 1న భవాని ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలవకపోవడం, కుటుంబ సభ్యులు లోతుగా ఆలోచించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే దహన సంస్కరణలు నిర్వహించారు. చెల్లెలు శోభ మేకప్ బాక్సును ఓపెన్ చేయడంతో అందులో సూసైడ్ నోట్ లభించింది. దీంతో అధ్యాపకుని వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టమైంది. కామాంధుడిగా మారిన అధ్యాపకుడు... ఫిజిక్స్ బోధిస్తున్న అధ్యాపకుడు శ్రీనివాస్ కామాంధుడిగా మారి విద్యార్థినులను వేధిస్తున్నాడు. విద్యాబుద్ధులు చెప్పకుండా నీకే అవకాశమిస్తున్నా అంటే భవానిని వేధించాడు. విద్యార్థినిపైన చేయి వేయడం, నువ్వు చాలా హుషారు గల అమ్మాయి వంటూ తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. గ్రామస్తులు ధర్నా... సూసైడ్ నోట్ లభించడంతో గ్రామస్తులంతా బాధిత కుటుంబానికి బాసటగా నిలిచారు. అధ్యాపకుడిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులందరూ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చి ధర్నా నిర్వహించారు. దీంతో స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కూడా గ్రామస్తులకు నచ్చజెబుతూ బాదితున్ని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. గ్రామస్తులకు అండగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కూడా బాసటగా నిలిచాయి. కేసు నమోదు.. మృతురాలి తండ్రి సూరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధ్యాపకుడు శ్రీనివాస్‌పై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదైంది. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. నాన్న..చెల్లి జాగ్రత్త.. - శ్రీనివాస్‌సార్ మంచోడు కాదు - ఈ లోకం తీరు మారాలి భవాని ఇంట్లో లభించిన సూసైడ్ నోట్ (యథాతధంగా) నేను చనిపోయిన టైమ్ 1 పీఎం అమ్మ..నాన్న చెల్లి జాగ్రత్త. చెల్లిని మంచిగా చదివించండి..చెల్లికి ఏది కావాలంటే అది ఇవ్వండి..అమ్మా..నిన్ను ఏడిపిస్తున్నందుకు నన్ను క్షమించు..నాన్న శోభ జాగ్రత్త. శోభ అంటే నాకు ప్రాణం. దానికి ఏ కష్టం రాకుండా చూసుకో. శ్రీవాణి బాగా చదువుకో. మనం చదివిన క్లాస్ వాళ్లను అడిగిన అని చెప్పు. రాజన్నా..బాలన్న, నర్సింహ, వంశీ, జగదీశ్, సురేష్ రేణుక, భారతి, శ్వేత అందరూ బాగా చదువుకోండి. అలాగే నా చిట్టి చెల్లెలు అందరూ బాగా చదువుకోండి. మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రీకాంత్ బావా ఐ మిస్‌యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ నిన్ను వదిలి వెళ్తున్నాను. మంచి అమ్మాయిని పెండ్లి చేసుకో. నాన్నా బావ జాగ్రత్త. నేను మళ్లీరాను. అమ్మ..నాన్న, చెల్లి మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఈ లోకం ఆడపిల్ల బయటికి వెళ్తే, ఆడపిల్ల క్లాస్‌మేట్‌తో కానీ అన్నయ్యతోకానీ మాట్లాడితే వేరేతీరుగా అర్థం చేసుకుంటుంది. అలాంటి లోకంలో నేడు బతకడం కష్టం. ఈ లోకం మారాలి. అమ్మ..నాన్న ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, నాన్న నువ్వు కూడా మాటిమాటికి అనుమానించడం మానుకో. తాగడం బంజేయ్. సరేనా. నాన్న నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. మా కాలేజీలో శ్రీనివాస్‌సార్ మంచోడు కాదు. ఆ సార్‌ను కొంచెం చూడండి. అమ్మాయి అంటే ఒక బొమ్మ అని అనుకుంటాడు. రాము అన్నయ్య ఇన్ని రోజులు నవ్వించినందుకు నీకు చాలా థ్యాంకు. ఐ లవ్ యూ అమ్మ..నాన్న.. మిమ్ముల్ని వదిలి వెళ్తున్నాను. -
మా మిక్కీ మౌస్ అత్తగారు...
ఆత్మబంధువు ‘‘భవానీ... భవానీ... కాఫీ కావాలని చెప్పి ఎంతసేపైంది?’’ అరిచింది రత్నమాంబ. ‘‘తెస్తున్నా అత్తమ్మా.’’ ‘‘తెస్తున్నా, తెస్తున్నా... అని అరగంట నుంచి చెప్తున్నావ్... తెచ్చిస్తే కదా!’’ ‘‘ఇదిగోండి అత్తమ్మా కాఫీ. ఐదు నిమిషాల్లో తెచ్చేశా.’’ ‘‘అంటే... అరగంటని నేను అబద్ధం చెప్తున్నానా?’’ ‘‘అయ్యో... నేనలా అన్లేదు అత్తమ్మా’’ నవ్వుతూ చెప్పింది భవాని. ‘‘ఏంటే నవ్వుతున్నావ్. అంత ఎగ తాళిగా ఉందా?’’ అరిచింది రత్నమాంబ. ‘‘అదేంటత్తమ్మా... మిమ్మల్ని అలా ఎందుకనుకుంటాను!’’ ‘‘మరెందుకే నేను మాట్లాడుతుంటే నవ్వుతున్నావ్?’’ ‘‘అలాంటిదేంలేదత్తమ్మా’’ అని ముసిముసిగా నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్లింది భవాని. ‘‘భవానీ... ఏంటిది ఇల్లు ఇలా ఉంది? నీపాటికి నువ్వు నీటుగా రెడీ అయ్యి ఆఫీసుకు వెళ్తే సరిపోతుందా? ఇల్లెలా ఉందో చూసుకునే పన్లేదా?’’... అరిచింది రత్నమాంబ. ‘‘పొద్దున్నే ఇల్లు సర్దాకే మిగతా పనులు చేశానత్తమ్మా.’’ ‘‘అంటే... నువ్వు ఇల్లు సర్దినా సర్దలేదని నేనంటున్నానా?’’ అని రాగం తీసింది రత్నమాంబ. ఇక ఆవిడతో మాట్లాడటం అనవసరమని ఆఫీసుకు వెళ్లిపోయింది భవాని. ఇవి మచ్చుకు రెండు సంఘటనలు మాత్రమే. కానీ ఈ ఆర్నెల్లలో ఇలాంటివి ఎన్నో. రత్నమాంబకు ఇద్దరు కుమారులు... రమేష్, సురేష్. రమేష్‌కు ఓ పెద్దింటి అమ్మాయితో పెళ్లి చేసింది. సురేష్ తన కొలీగ్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వారిది కులాంతర వివాహం. రత్న మాంబకు బొత్తిగా ఇష్టం లేని పని అది. కానీ కొడుకు పట్టుపట్టడంతో చేసేదేంలేక అంగీకరించింది. కొత్తకోడలు భవాని ఇంటిలో అడుగు పెట్టినప్పటినుంచీ ఇలా సూటిపోటి మాటలతో హింసిస్తోంది. కానీ భవాని నవ్వుతూ తన పని తాను చేసుకు పోతుంది. అత్తగారలా చీటికీ మాటికీ సూటిపోటి మాటలంటున్నా భవాని నవ్వుతూ ఎలా ఉండగలుగుతుందో పెద్దకోడలు మాధవికి అర్థం కాలేదు. వింటున్న తనకే కోపమొస్తుంది, ఈ అమ్మాయెలా నవ్వ గలుగుతుందని ఆశ్చర్యం. ఒకసారి కాక పోతే మరోసారైనా అత్తగారికి భవాని ఎదురు మాట్లాడుతుందని ఎదురు చూసింది. కానీ భవాని ముసిముసి నవ్వులతోనే సరిపెడుతోంది. ఇక ఉండబట్టలేక ఓ రోజు అడిగేసింది. ‘‘భవానీ... అత్తగారు రోజూ నిన్ను అన్ని మాటలంటున్నా నువ్వు మాట్లాడవేం?’’ నవ్వింది భవాని. ‘‘ఇదిగో ఇలాగే ముసిముసిగా నవ్వుకుంటావ్. నీకు కోపం రాదా?’’ అడిగింది మాధవి. ‘‘మిక్కీ మౌస్ మాట్లాడుతుంటే ఎవరికైనా కోపమొస్తుందా అక్కా?’’ ‘‘మిక్కీ మౌసా? నేను మాట్లాడు తోంది కార్టూన్ చానల్ గురించి కాదు భవానీ, మన అత్తగారి గురించి.’’ ‘‘అక్కా... అత్తగారు మాట్లాడుతుంటే నీకెందుకు కోపమొస్తుందో చెప్పు?’’ అడిగింది భవాని. ‘‘ఆవిడలా లేనిపోని దానికి వంకలు పెడుతుంటే కోపం రాదా మరి.’’ ‘‘వస్తుందనుకో. మరి అదే పని మిక్కీమౌస్ చేస్తే?’’ ‘‘మధ్యలో ఈ మిక్కీమౌస్ ఏంటి భవానీ? నాకు అర్థం కావడంలేదు.’’ ‘‘అక్కా... అత్తగారు అలా తప్పులు పడతారనీ, గట్టిగా అరుస్తారనే కదా నీకు కోపం. అదే పని మిక్కీమౌస్ చేసిం దనుకో... నువ్వు కోప్పడతావా? నవ్వు కుంటావా? మిక్కీమౌస్ ఏం చేసినా నవ్వే వస్తుంది కదా. నేను రోజూ నవ్వుతున్నది అందుకే. అంటే... నేను అత్తగారిని మిక్కీమౌస్‌లా చూస్తున్నా నన్నమాట’’... ‘‘అత్తగారిని మిక్కీమౌస్‌లా చూడ్డ మేంటి భవానీ? అర్థమయ్యేలా చెప్పవా?’’ ‘‘చెప్పినా నీకు అర్థం కాదక్కా. ఓ సారి చేసి చూస్తావా?’’ ‘‘ఓకే.’’ ‘‘సరే.. కళ్లు మూసుకుని ఓసారి మన అత్తగారిని ఊహించుకో. ఆవిడెలా కనిపిస్తుందో, వినిపిస్తుందో, నీకేం అనిపిస్తుందో చెప్పు.’’ కళ్లు మూసుకుని అంది మాధవి. ‘‘రాక్షసిలా కనిపిస్తుంది భవానీ, గట్టిగా అరుస్తోంది. నాకైతే పీక నొక్కేయాలని పిస్తోంది తెలుసా!’’ ‘‘కదా... ఇప్పుడు ఆ రాక్షసిని మిక్కీ మౌస్లా మార్చెయ్.’’ ‘‘ఓకే... యా... నౌ షి ఈజ్ లైక్ ఎ మిక్కీమౌస్. హహహ... భలే ఫన్నీగా ఉంది భవానీ. ఆమె అరుపుల్ని ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.’’ ‘‘కదా... ఓ నాలుగు రోజులు ఇలా ప్రాక్టీస్ చెయ్. ఐదో రోజు నుంచి ఆవిడెలా అరిచినా నీకు మిక్కీమౌస్ అరిచినట్లే వినిపిస్తుంది. నేను రోజూ చేస్తుంది అదే’’ అని పకపకా నవ్వింది భవాని. ‘‘అంటే.. రోజూ నువ్వు అత్తగారిని మిక్కీమౌస్‌లా చూస్తున్నావా? ఎక్కడ నేర్చుకున్నావ్ ఈ టెక్నిక్?’’ ‘‘ఎక్కడ నేర్చుకుంటేనేం.. బావుంది కదా. ఆవిడ అరుస్తున్నకొద్దీ మనకు ఎంటర్టైన్మెంట్.’’ ‘‘హహహ... నిజమే. ఇవ్వాల్టి నుంచి నేను కూడా నీ టెక్నిక్‌నే ఫాలో అవుతా’’... అని నవ్వుతూ చెప్పింది మాధవి. - డాక్టర్ విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
భవాని.. మరో ‘ప్రత్యూష’
-
భవాని.. మరో ‘ప్రత్యూష’
వేధింపులకు గురిచేస్తున్న అన్నావదినలు బాలల హక్కుల సంఘం చొరవతో విముక్తి హైదరాబాద్: సవతితల్లి చేతిలో తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష ఘటనను ఇంకా మరవక ముందే హైదరాబాద్ నేరేడ్మెట్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగు చూసింది. అన్న, వదినల దాష్టీకానికి చిత్రహింసలకు గురైన యువతికి చివరకు బాలల హక్కుల సంఘం చొరవ తీసుకోవడంతో విముక్తి లభించింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఉప్పులూరి ఏసు, తిరుపతమ్మ దంపతుల ఏకైక సంతానం భవాని (18). తల్లిదండ్రులిద్దరూ ఎనిమిదేళ్ల కిందట చనిపోయారు. దీంతో ఎవరూ పోషించలేని స్థితిలో యువతి మహబూబ్‌నగర్‌లోనే ఓ హాస్టల్లో చేరింది. కాగా, సైనిక్‌పురిలోని టెలికం కాలనీలో నివాసముంటున్న భవాని పెద్దనాన్న కుమారుడు (వరసకు అన్న) శ్రీనివాస్, వదిన లక్షీ్ష్మలు తాము పోషించుకుంటామని చెప్పి యువతిని హాస్టల్ నుంచి తీసుకొచ్చారు. ఇంటికి రాగానే భవానికి ఇంటిపని అప్పజెప్పారు. సమయానికి కడుపునిండా భోజనం పెట్టకుండా చిత్రహింసలకు గురిచేసేవారు. కాల్చిన గరిటెతో ఒంటిపై వాతలు కూడా పెట్టేవారు. కొన్నాళ్లుగా భవాని అనుభవిస్తున్న బాధలు చూడలేక స్థానికులు కొందరు బాలల హక్కుల సంఘానికి సమాచారం అందజేశారు. వెంటనే స్పందించిన బాలల హక్కుల సంఘం ప్రతినిధులు అచ్యుతరావు, అనురాధారావు పోలీసుల సహాయంతో భవానికి ఆ ఇంటి నుంచి విముక్తి కల్పించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న అన్న, వదినలపై పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స కోసం యువతను స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న తర్వాత ఆమెను విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్టల్‌కు తీసుకెళ్లనున్నట్లు అచ్యుతరావు తెలిపారు. -
కాకినాడలో పరువు హత్య
-
కూతురితో సహజీవనం చేస్తున్నాడని..
కాకినాడ : కూతురుతో సహజీవనం చేస్తున్న వ్యక్తిపై...ఆమె తండ్రి దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. వివరాలు కాకినాడకు చెందిన పెండ్యాల రవిశంకర్(38) విద్యుత్ నగర్లో భార్య దేవితో కలసి ఉంటున్నాడు. ఇతడు వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా పిఠాపురానికి చెందిన దుర్గా భవానీ అనే మరో మహిళతో పదేళ్లగా సహజీవనం చేస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే ఈరోజు ఉదయం దుర్గా భవానీ తండ్రి నాగేశ్వరరావు పిఠాపురం నుంచి కూతురు ఇంటికి వచ్చాడు. అప్పుడే దుర్గ ఇంటికి వచ్చిన రవిశంకర్‌పై నాగేశ్వరరావు కత్తితో దాడి చేసి హతమర్చాడు. అడ్డు వచ్చిన కుమార్తెపై కూడా దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. నాగేశ్వరరావు ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
న్యాయం కోసం వివాహిత నిరసన
నెల్లూరు: నెల్లూరులోని ఎస్బీఐ కాలనీలో న్యాయం కోరుతూ అత్తింటి ఎదుట వివాహిత ఆందోళనకు దిగింది. నెల్లూరుకు చెందిన వెంకటసుబ్బయ్య కుమారుడు వెంకటేశ్వర్లుకు గూడూరుకి చెందిన భవానీతో కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. వెంకటేశ్వర్లు ఉద్యోగరీత్యా అమెరికాలో ఉన్నారు. కాగా, దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆదివారం ఉదయం తమ ఇంటికి వచ్చిన భవానీని వెంకటసుబ్బయ్య దంపతులు లోపలికి రానివ్వలేదు. ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. దీంతో భవానీ అక్కడే ఆందోళనకు దిగింది. మహిళా సంఘాల నేతలు ఆమెకు మద్దతు పలికారు. -
'భవానీగా ఉంటే.. అదోలా ఉండేది'
- పాఠశాలకు వచ్చిన భానుతో స్నేహితుల ముచ్చట్లు - పూర్వ విద్యార్థికి ఆసరా అందించిన ఉపాధ్యాయులు చిన్నశంకరంపేట: 'అమ్మాయిలా పెరిగినప్పటికీ వారితో స్నేహంగా ఉండాలంటే ఇబ్బం దిగా ఉండేది.. అదే అబ్బాయిలతో చనువుగా ఉండేందుకు ఇష్టపడేవాడిని'అని చిన్నశంకరంపేటకు చెందిన భవాని అలియాస్ భానుప్రసాద్ తెలిపాడు. ఇన్నాళ్లు అమ్మాయిగా పె రిగి.. ఇప్పుడు అబ్బాయిగా మారిన సందర్భంగా భానుప్రసాద్ బుధవారం చిన్నశంకరంపేటలో 'సాక్షి'తో తన అంతరంగాన్ని పం చుకున్నాడు. ఆమె అతడుగా మారిన వైనం వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మదిర గ్రామం భాగిర్తిపల్లికి చెందిన నాగులు, భాగ్యమ్మ దంపతులకు 17 ఏళ్ల క్రి తం బిడ్డపుట్టగా.. శరీరతీరును చూసి పాప గా నిర్ధారించుకున్నారు. భవాని అని పేరు పెట్టి బడికి పంపించారు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ ఆడపిల్ల లక్షణాలు కరువయ్యాయి. అయితే, నెల రోజుల క్రితం కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. భవానీ అమ్మాయి కాదు అబ్బాయి అని డాక్టర్లు తేల్చారు. జన్యుపరమైన లోపాల కారణంగా అంగం కడుపులోనే ఉండిపోవడంతో ఇన్నాళ్లు అందరూ అమ్మాయిగా భావించారని, శస్త్రచికిత్స చేసి అబ్బాయిగా మార్చాలని చెప్పడంతో భవానీతో పాటు.. బంధువులం తా నిర్ఘాంతపోయారు. దీంతో హైదరాబాద్‌లోని వాసవీ ఆస్పత్రిలో నెల రోజుల క్రితం శస్త్ర చికిత్స చేశారు. తర్వాత భవాని కాస్త భానుప్రసాద్‌గా మారాడు. బుధవారం భానుప్రసాద్ మాట్లాడుతూ ‘అమ్మాయిగా పెరిగినప్పటికీ నా ఇష్టాలన్నీ అబ్బాయిలాగే ఉండేవి. జడ వేసుకున్నా పూలు పెట్టుకునేందుకు ఇష్టపడేవాడిని కాదు. బొట్టు కూడా అంతంత మాత్రమే పెట్టుకునేవాడిని. పదోతరగతికి వచ్చేసరికి అమ్మాయిల కన్నా అబ్బాయిలతోనే స్నేహం చేయాలనిపించేది. తరగతి గదిలో అమ్మాయిల పక్కన కూర్చున్నప్పటికీ వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించేవాడిని. వారితో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు నాలో అలజడి రేగేది’ అని వివరించాడు. అ బ్బాయిలతో స్నేహం చేయడాన్ని ఉపాధ్యాయురాళ్లు తప్పుపడుతూ చీవాట్లు పెట్టేవారన్నాడు. మరిన్ని శస్త్ర చికిత్సలు అవసరమని డాక్టర్లు చెప్పారని, అవసరమైన వైద్య చేయించుకునేందుకు దాతల సాయం కోసం చూస్తున్నానని, దాతలు సహాయం చేయాల ని ఈ సందర్భంగా భవానీప్రసాద్ కోరుతున్నాడు. చీవాట్లు పెట్టేదాన్ని.. అబ్బాయిలతో స్నేహం అంత మంచిదికాదని భవానీని చీవాట్లు పెట్టేదాన్ని. పదోతరగతిలోకి వచ్చేసరికి భవాని అబ్బాయిల డ్రెస్‌లు వేసుకోవడం, వారితో కలసి డ్యాన్స్ చేయడాన్ని నేను తట్టుకోలేకపోయా. చీవాట్లు పెడితే నన్ను కోపంగా చూసేది. ఇప్పుడు చూస్తే అప్పుడు భవాని (భానుప్రసాద్) చేసింది కరెక్టేనని అనిపిస్తుంది. - ఏసుమణి, ఉపాధ్యాయురాలు, జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుల ఆర్థికసాయం భానుప్రసాద్ తాను చదువుకున్న చిన్నశంకరంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు బుధవారం వెళ్లాడు. అక్కడి ఉపాధ్యాయులతో తన అనుభవాన్ని పంచుకున్నాడు. అతని ప రిస్థితిని చూసి చలించిపోయిన ప్రధానోపాధ్యాయురాలు స్వరూపరాణి రూ.3,000, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రూ.1,100 ఆర్థిక సహాయం అందించారు. -
దైవదర్శనానికి వెళ్లి నదిలో గల్లంతు
పర్ణశాల వద్ద గోదావరిలో మునిగిన యువకుడు స్వగ్రామం పాత రావిచర్ల తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు పాతరావిచర్ల(నూజివీడు రూరల్) : మండలంలోని పాత రావిచర్లకు చెందిన యువకుడు స్నేహితులతో కలిసి భద్రాచలంలో స్వామివారి దర్శనానికి వెళ్లాడు. మార్గమధ్యంలో వారు పర్ణశాలలో ఆగారు. ఆ యువకుడు గోదావరిలో గల్లంతయ్యాడు. స్నేహితులు ఈ విషయాన్ని గ్రామస్తులకు ఫోన్ చేసి చెప్పారు. కుమారుడి జాడ కోసం దంపతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యువకుడి తండ్రి, స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం... పాత రావిచర్లకు చెందిన కొణతం వీర్రాజు, లక్ష్మీకుమారి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్దవాడైన చెన్నారావు(22)కు, కుమార్తె భవానికి(20)కి వివాహమైంది. చిన్నవాడైన కొణతం లోక్నాధ్(19) ఏడో తరగతితో చదువు మానేశాడు. కొత్తరావిచర్ల గ్రామ శివారులోని సాయి ఆగ్రో కంపెనీలో నెలరోజుల క్రి తం ఉద్యోగంలో చేరాడు. కంపెనీ యజమాని వారానికొకసారి జీ తాలు ఇస్తుంటాడు. లోక్నాధ్ శని వారం సాయంత్రం జీతం తీసుకున్నాడు. గ్రామానికి చెందిన స్నేహితులు మందనాటి నాగరాజు, మందపాటి ఏడుకొండలు, పాలకుర్తి వెంకటేశ్వరరావు, కొలుసు రాంబాబు, మందపాటి కుమారస్వామి, ఆరేపల్లి రమేష్‌లతో కలిసి మరీదు రాముకు చెందిన ఆటోలో శనివారం రాత్రి భద్రాచలం వెళ్లాడు. గ్రామంలో అనుకున్నట్లు కాకుండా వారందరూ ముందుగా భద్రాచలానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలకు ఆదివారం ఉదయం ఆరు గంటలలోపు చేరుకున్నారు. అక్కడ గోదావరిలో స్నానానికి ఉపక్రమించారు. కొందరు మహిళలు స్నానం చేస్తుండటంతో కొంత ముందుకు వెళ్లారు. లోక్నాధ్ అక్క డ కాలుజారి నదిలో పడి కొట్టుకుపోయాడు. అతడిని రక్షించేందుకు మిత్రులు యత్నించారు. నది ఉధ్రుతంగా ప్రవహిస్తుండటంతో వారి ప్రయత్నా లు ఫలించలేదు. అతడి మిత్రులు గ్రామంలోని తమ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి, ఈ విషయాన్ని చెప్పారు. శనివారం రాత్రి 11 గంటలకు ఇంటినుంచి బయలుదేరిన కుమారుడు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలైనా ఫోన్ చేయకపోవడంతో స్వామివారి దర్శనం కోసం వేచి ఉంటాడని తల్లిదండ్రులు భావించారు. కుమారుడితో కలిసి వెళ్లిన స్నేహితులు ఎక్కడున్నారో ఫోన్ చేశారా ?అని వారి తండ్రులను వీర్రాజు ఆరా తీ శారు. మీ కుమారుడు గోదావరిలో ప్రమాదవశా త్తు పడి గల్లంతయ్యాడని వారు ఆయనకు చె ప్పా రు. ఆయన ఇంటికి వచ్చి భార్యకు ఈ విష యం చెప్పాడు. కుమారుడి జాడ తెలియక పోవడంతో దంపతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. -
ఎమ్మిగనూరులో బాల్య వివాహం
ఎమ్మిగనూరురూరల్, న్యూస్‌లైన్: పట్టణంలోని శ్రీ గుంటిరంగస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు బంధువులు బాలికకు వివాహం చేశారు. పెళ్లికుమారుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు పోలీసుల సహకారంతో వారికి కౌన్సెలింగ్ ఇప్పించి ఎవరి ఇళ్లకు వారిని పంపించివేశారు. సీడీపీఓ భవాని, ఎస్ఐ చంద్రబాబునాయుడు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని సోగనూరుకు చెందిన దాసరి మాదన్న(33)కు అదే గ్రామానికి చెందిన మేనత్త కుమార్తె దాసరి తిమ్మక్కతో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి బంధువైన నందవరం మండలం హలహర్వికి చెందిన దాసరి పాండురంగడు కుమార్తె మీనాక్షి(14)ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకు తన భార్య ఆరోగ్యం బాగా లేదని సాకు చూపించాడు. అమాయకురాలైన మొదటి భార్యపై ఒత్తిడి తెచ్చి తన రెండో పెళ్లికి ఒప్పించాడు. శుక్రవారం వెంకటాపురంలో గుంటిరంగస్వామి ఆలయంలో మీనాక్షిని వివాహం చేసుకున్నాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు పట్టణ ఎస్ఐ చంద్రబాబునాయుడు సహయంతో పెళ్లి మండ పానికి చేరుకున్నారు. ఇరు కుటుంబాల వారినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు. భార్య ఉండ గా వివాహం చేసుకోవటం చట్టరీత్యా నేరమని సూచించారు. మైనర్‌ను చేసుకోవడం మరీ పెద్ద నేరమన్నారు. భార్య ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నా వధువుకు 18 ఏళ్లు నిండి ఉండాలని, లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. వధూవరులతోపాటు కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి ఎవరి ఇళ్లకు వారిని పంపించారు. వారితో పాటు ఐసీడీఎస్ సూపర్వైజర్ పుష్పవతి, బాలల సమగ్ర సంరక్షణ పథకం జిల్లా కోఆర్డినేటర్ రాజు, ఎంవీఎఫ్ మండల కోఆర్డినేటర్ రామకృష్ణ తదితరులు ఉన్నారు.