కూతురితో సహజీవనం చేస్తున్నాడని.. | father attack on daughter in kakinada | Sakshi
Sakshi News home page

కూతురితో సహజీవనం చేస్తున్నాడని..

Published Mon, Jun 22 2015 12:24 PM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM

కూతురితో సహజీవనం చేస్తున్నాడని..

కూతురితో సహజీవనం చేస్తున్నాడని..

కాకినాడ : కూతురుతో సహజీవనం చేస్తున్న వ్యక్తిపై...ఆమె తండ్రి దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన  తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. వివరాలు కాకినాడకు చెందిన పెండ్యాల రవిశంకర్(38) విద్యుత్ నగర్‌లో భార్య దేవితో కలసి ఉంటున్నాడు. ఇతడు వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా పిఠాపురానికి చెందిన దుర్గా భవానీ అనే మరో మహిళతో పదేళ్లగా సహజీవనం చేస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు.

అయితే ఈరోజు ఉదయం దుర్గా భవానీ తండ్రి నాగేశ్వరరావు పిఠాపురం నుంచి కూతురు ఇంటికి వచ్చాడు. అప్పుడే దుర్గ ఇంటికి వచ్చిన రవిశంకర్‌పై నాగేశ్వరరావు కత్తితో దాడి చేసి హతమర్చాడు. అడ్డు వచ్చిన కుమార్తెపై కూడా దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. నాగేశ్వరరావు ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement