ఛత్రపతి శేఖర్.. పెద్దలను ఎదురించి పెళ్లి.. కానీ తర్వాతే! | Chatrapathi Sekhar Ex-Wife Is Also A Film Actress; Check Her Name And Latest Photos - Sakshi
Sakshi News home page

Chatrapathi Sekhar: ప్రేమ వివాహం.. భార్యతో విడాకులు.. ఆమె కూడా!

Published Fri, Mar 22 2024 6:12 PM | Last Updated on Fri, Mar 22 2024 7:26 PM

Chatrapathi Sekhar Ex Wife Also Acts In Tollywood Movies - Sakshi

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమా గుర్తుందా?.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ప్రభాస్‌కు ఫ్రెండ్‌గా మెప్పించిన నటుడు చంద్రశేఖర్. టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే చంద్రశేఖర్ ఆర్ఆర్ఆర్‌లోనూ కీలక పాత్ర పోషించారు. ఛత్రిపతి సినిమాతోనే అతన్నిఅందరూ ఛత్రపతి శేఖర్ అని పిలుస్తుంటారు. కానీ ఆయన గురించి చాలామందికి తెలియని ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదేంటో తెలుసుకుందాం పదండి. 

చంద్రశేఖర్ మాజీ భార్య నీల్యా భవానీ కూడా నటి అన్నసంగతి చాలామందికి తెలియదు. ఆమె చాలా సినిమాల్లో నటించినప్పటికీ.. చంద్రశేఖర్ భార్య అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన భార్య కూడా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్‌.  పండగ చేస్కో, కిక్2, సైరా నరసింహారెడ్డి, జెంటిల్‌మెన్.. లాంటి చాలా సినిమాల్లో ఆమె నటించింది. కోలీవుడ్‌లోనూ అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో మెరిసింది.

చంద్రశేఖర్‌తో ప్రేమ పెళ్లి.. 

ఖమ్మం జిల్లాకు చెందిన నీల్యా భవానీ చంద్రశేఖర్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది. పెద్దలు అంగీకరించకపోవడంతో ఎదురించి మరీ వివాహాబంధంతో ఒక్కటయ్యారు. కానీ ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా.. ప్రస్తుతం నీల్యా భవాని ప్రస్తుతం సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తోంది. ఆ సమయంలో చంద్రశేఖర్‌ నటుడిగా నిలదొక్కుకోకపోవడంతో భవానీ తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement