Chatrapathi Movie
-
ఛత్రపతిలో ఇంటర్వెల్ సీన్ సీక్రెట్ ని బయటపెట్టిన ప్రభాస్!
-
ఛత్రపతి శేఖర్.. పెద్దలను ఎదురించి పెళ్లి.. కానీ తర్వాతే!
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమా గుర్తుందా?.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ప్రభాస్‌కు ఫ్రెండ్‌గా మెప్పించిన నటుడు చంద్రశేఖర్. టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే చంద్రశేఖర్ ఆర్ఆర్ఆర్లోనూ కీలక పాత్ర పోషించారు. ఛత్రిపతి సినిమాతోనే అతన్నిఅందరూ ఛత్రపతి శేఖర్ అని పిలుస్తుంటారు. కానీ ఆయన గురించి చాలామందికి తెలియని ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదేంటో తెలుసుకుందాం పదండి. చంద్రశేఖర్ మాజీ భార్య నీల్యా భవానీ కూడా నటి అన్నసంగతి చాలామందికి తెలియదు. ఆమె చాలా సినిమాల్లో నటించినప్పటికీ.. చంద్రశేఖర్ భార్య అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన భార్య కూడా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్. పండగ చేస్కో, కిక్2, సైరా నరసింహారెడ్డి, జెంటిల్మెన్.. లాంటి చాలా సినిమాల్లో ఆమె నటించింది. కోలీవుడ్‌లోనూ అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో మెరిసింది. చంద్రశేఖర్‌తో ప్రేమ పెళ్లి.. ఖమ్మం జిల్లాకు చెందిన నీల్యా భవానీ చంద్రశేఖర్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది. పెద్దలు అంగీకరించకపోవడంతో ఎదురించి మరీ వివాహాబంధంతో ఒక్కటయ్యారు. కానీ ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా.. ప్రస్తుతం నీల్యా భవాని ప్రస్తుతం సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తోంది. ఆ సమయంలో చంద్రశేఖర్ నటుడిగా నిలదొక్కుకోకపోవడంతో భవానీ తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. -
ఓటీటీలోకి బెల్లంకొండ హిందీ మూవీ.. ఆరునెలల తర్వాత ఇప్పుడు
రీసెంట్ టైమ్స్‌లో థియేటర్లలో రిలీజైన ఎలాంటి సినిమా అయినా సరే నెల, నెలన్నరలోపే ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చేస్తోంది. అలాంటిది ఓ సినిమాని దాదాపు ఐదారు నెలల రిలీజ్ చేయకుండా అలా ఉంచేశారు. ఇప్పుడేమో చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇంతకీ ఆ సినిమా సంగతేంటి? అసలు దీనికి కారణమేంటి? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్‌కి తగ్గట్లు మన హీరోలు.. బాలీవుడ్‌లోనూ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. 'ఛత్రపతి' రీమేక్‌తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులోనే ఒక్కటి తప్ప మరో హిట్ కొట్టలేకపోయాడు. అలాంటిది హిందీలో, అదీ కూడా ఓ రీమేక్‌తో ప్రేక్షకుల్ని పలకరించాడు. కానీ ఘోరమైన టాక్ వచ్చింది. కలెక్షన్స్ అయితే మరీ దారుణం. ఈ ఏడాది మే 12న రిలీజైన ఈ సినిమాని థియేటర్లలో జనాలు చూడలేకపోయారు. దీనికి తోడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ మూవీ గురించి మర్చిపోయారు. ఓటీటీలో కూడా రిలీజ్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు సడన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు తెలిసింది. దీంతో మళ్లీ ట్రోలర్స్ బెల్లంకొండ మూవీపై విరుచుకుపడుతున్నారు. థియేటర్లలో చూడటానికి చాలా కష్టపడ్డారు. మరి ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి? (ఇదీ చదవండి: నెలన్నర నుంచి ఓటీటీ ట్రెండింగ్‌లో ఆ థ్రిల్లర్ మూవీ) -
రాజమౌళి, ప్రభాస్ ఎంట్రీతో పూర్తిగా మారిపోయిన హిందీ ఛత్రపతి లెక్కలు
-
ప్రతిరోజూ భోజనంలో అవి ఉండాల్సిందే.. నా బ్యూటీ సీక్రెట్ అదే: హీరోయిన్
‘కిట్టీ పార్టీ’ అనే సిరీస్‌తో బుల్లి తెరపై అడుగుపెట్టిన ముంబై భామ నుస్రత్ భరూచా. జై సంతోషీ మా సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె తాజాగా ఛత్రపతి(హిందీ) సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో జోడీ కట్టింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్న నుస్రత్ తన అందమైన చర్మానికి అమ్మ చెప్పిన చిట్కాలే కారణం అంటూ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసింది. ‘‘మా అమ్మ.. పార్లర్లో మెరుగులు దిద్దే అందాలను ఇష్టపడదు.మంచి నీళ్లు ఎక్కువగా తాగుతూ, ప్రతిరోజూ భోజనంలో తాజా ఆకుకూరలు ఉండేలా చూసుకుంటే చర్మం నిత్యం నిగనిగలాడుతూ ఉంటుందంటుంది. అలా మా అమ్మ చెప్పిన చిట్కాల్లో నేను తప్పకుండా పాటించేది.. మంచి నీళ్లు ఎక్కువగా తాగడం, వారంలో వీలైనన్ని సార్లు మొహానికి పెరుగు లేదా మీగడతో సున్నితంగా మసాజ్ చేసుకోవడం. ఇవే నా చర్మ సౌందర్యానికి కారణం’’ అని 37 ఏళ్ల నుస్రత్ చెప్పుకొచ్చింది. చదవండి: తలలో మల్లెపూలు పెట్టుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసా? వీటిలోని ‘ఆర్సిటిన్’ అనే రసాయనం -
ప్రభాస్‌కు, సాయికి పోలికలు వద్దు: వీవీ వినాయక్
‘నేటి యువతలో చాలామంది తెలుగు ‘ఛత్రపతి’ (2005) సినిమాను చూసి ఉండరు. వారికి హిందీ రీమేక్ ‘ఛత్రపతి’ (2023) ఫ్రెష్‌గా ఉంటుంది. ఇక అప్పట్లో ‘ఛత్రపతి’ని చూసినవారు తెలుగు ‘ఛత్రపతి’ సినిమాను పాడు చేయకుండా బాగా తీశారని అనుకుంటారు. లొకేషన్స్, సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు కొత్తగా ఉంటాయి. ఓ ప్రాపర్ హిందీ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. (చదవండి: ‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను: వాసుకి ) ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 2005లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాను అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో జయంతి లాల్ గడ నిర్మించిన ఈ సినిమా మే 12న హిందీలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ – ‘‘తెలుగులో సాయి హీరోగా నటించిన సినిమాలు హిందీలో అనువాదమై, మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ కోసం తను ఫిజిక్ బాగా మెయిన్టైన్ చేశాడు. హిందీ నేర్చుకున్నాడు. ఇంట్రవెల్, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్‌లో సాయి నటన చూసి నేనే ఆశ్చర్యపోయాను. (చదవండి: ఆ ఓటీటీలోకి రానున్న ది కేరళ స్టోరీ! ) ఈ చిత్రంతో సాయి బాలీవుడ్లో హీరోగా నిలబడిపోతాడనే నమ్మకం ఉంది. రీమేక్ అంటే కొన్ని ఐకానిక్ షాట్స్‌ను టచ్ చేయకపోవడమే మంచిది. మేమూ అదే చేశాం. ఇక యాక్టింగ్ పరంగా ప్రభాస్‌కు, సాయికి పోలికలు వద్దు. అయితే ‘ఛత్రపతి’ సినిమాలో హీరో క్యారెక్టర్‌కు సాయి న్యాయం చేశాడని మాత్రం చెప్పగలను. హిందీ ‘ఛత్రపతి’ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాను కేవలం హిందీ భాషలోనే రిలీజ్ చేస్తున్నాం’’ అని అన్నారు. ‘‘మాస్ పల్స్ తెలిసిన దర్శకుల్లో వీవీ వినాయక్‌గారు ఒకరు. తెలుగులో ‘అల్లుడు శీను’తో మా అబ్బాయి (బెల్లంకొండ సాయి)ని ఇంట్రడ్యూస్ చేసిన వినాయక్‌గారు హిందీలోనూ పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేయవచ్చు. కానీ హిందీలో తీసిన సినిమాను హిందీ భాషలోనే ఆడియన్స్‌కు చూపిద్దామన్నారు వినాయక్‌గారు. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో పెన్ స్టూడియోస్ లాంటి నిర్మాణసంస్థ మా అబ్బాయితో సినిమా నిర్మించడం నాకు గర్వంగా ఉంది’’ అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేష్.