Chatrapathi Heroine Nushrratt Bharuccha Reveals About Her Beauty Secret, Deets Inside - Sakshi
Sakshi News home page

ప్రతిరోజూ భోజనంలో అవి ఉండాల్సిందే.. నా బ్యూటీ సీక్రెట్‌ అదే: హీరోయిన్‌

Published Thu, May 11 2023 1:31 PM | Last Updated on Thu, May 11 2023 1:52 PM

Chatrapathi Heroine Nushrratt Bharuccha Reveals Beauty Secret - Sakshi

‘కిట్టీ పార్టీ’ అనే సిరీస్‌తో బుల్లి తెరపై అడుగుపెట్టిన ముంబై భామ నుస్రత్‌ భరూచా. జై సంతోషీ మా సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె తాజాగా ఛత్రపతి(హిందీ) సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో జోడీ కట్టింది. 

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్న నుస్రత్‌ తన అందమైన చర్మానికి అమ్మ చెప్పిన చిట్కాలే కారణం అంటూ బ్యూటీ సీక్రెట్‌ రివీల్‌ చేసింది. ‘‘మా అమ్మ..  పార్లర్‌లో మెరుగులు దిద్దే అందాలను ఇష్టపడదు.మంచి నీళ్లు ఎక్కువగా తాగుతూ, ప్రతిరోజూ భోజనంలో తాజా ఆకుకూరలు ఉండేలా చూసుకుంటే చర్మం నిత్యం నిగనిగలాడుతూ ఉంటుందంటుంది.

అలా మా అమ్మ చెప్పిన చిట్కాల్లో నేను తప్పకుండా పాటించేది.. మంచి నీళ్లు ఎక్కువగా తాగడం, వారంలో వీలైనన్ని సార్లు మొహానికి పెరుగు లేదా మీగడతో సున్నితంగా మసాజ్‌ చేసుకోవడం. ఇవే నా చర్మ సౌందర్యానికి కారణం’’ అని 37 ఏళ్ల నుస్రత్‌ చెప్పుకొచ్చింది.

చదవండి: తలలో మల్లెపూలు పెట్టుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసా? వీటిలోని ‘ఆర్సిటిన్‌’ అనే రసాయనం
         

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement