Nushrat Bharucha
-
ప్రతిరోజూ భోజనంలో అవి ఉండాల్సిందే.. నా బ్యూటీ సీక్రెట్ అదే: హీరోయిన్
‘కిట్టీ పార్టీ’ అనే సిరీస్‌తో బుల్లి తెరపై అడుగుపెట్టిన ముంబై భామ నుస్రత్ భరూచా. జై సంతోషీ మా సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె తాజాగా ఛత్రపతి(హిందీ) సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో జోడీ కట్టింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్న నుస్రత్ తన అందమైన చర్మానికి అమ్మ చెప్పిన చిట్కాలే కారణం అంటూ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసింది. ‘‘మా అమ్మ.. పార్లర్లో మెరుగులు దిద్దే అందాలను ఇష్టపడదు.మంచి నీళ్లు ఎక్కువగా తాగుతూ, ప్రతిరోజూ భోజనంలో తాజా ఆకుకూరలు ఉండేలా చూసుకుంటే చర్మం నిత్యం నిగనిగలాడుతూ ఉంటుందంటుంది. అలా మా అమ్మ చెప్పిన చిట్కాల్లో నేను తప్పకుండా పాటించేది.. మంచి నీళ్లు ఎక్కువగా తాగడం, వారంలో వీలైనన్ని సార్లు మొహానికి పెరుగు లేదా మీగడతో సున్నితంగా మసాజ్ చేసుకోవడం. ఇవే నా చర్మ సౌందర్యానికి కారణం’’ అని 37 ఏళ్ల నుస్రత్ చెప్పుకొచ్చింది. చదవండి: తలలో మల్లెపూలు పెట్టుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసా? వీటిలోని ‘ఆర్సిటిన్’ అనే రసాయనం -
బెల్లంకొండ హీరోయిన్ “యో...యో”
-
‘తాజ్ మహల్’ నటి నుస్రత్ గురించి ఈ విషయాలు తెలుసా?
భాషా భేదం లేకుండా అలరించిన హిందీ చిత్రం ‘ప్యార్ కా పంచ్‌నామా’. ఆ మూవీతో సినీ అభిమానులందరి దృష్టినీ ఆకర్షించిన నటి ‘నుస్రత్ భరూచా’. ఈ కథానాయిక తెలుగు ప్రేక్షకులకూ పరిచితమే 2010లో వచ్చిన ‘తాజ్ మహల్’ సినిమా ద్వారా! వెండితెర కంటే ముందు చిన్నతెర.. ఇప్పుడు వెబ్‌స్క్రీన్ మీదా కనిపిస్తూ నిత్యం లైమ్‌లైట్‌లో మెరిసిపోతోంది నుస్రత్. ► పుట్టింది, పెరిగింది ముంబైలో. తండ్రి తన్వీర్ భరూచా, బిజినెస్‌మన్. తల్లి తస్నీమ్ భరూచా.. గృహిణి. ► డిగ్రీ చదివే రోజుల నుంచే నాటకాల్లో నటించేది. ఆ సమయంలోనే ‘కిట్టీ పార్టీ’ అనే టెలివిజన్ షోను నిర్వహించే చాన్స్ వచ్చింది నుస్రత్‌కు. ఆ షో ఆమెకు మంచిపేరే తెచ్చిపెట్టింది ఆ వాతావరణం నచ్చక మధ్యలోనే ‘కిట్టీ పార్టీ’కి గుడ్ బై చెప్పేసింది. ► ఆ తర్వాత ‘జై సంతోషిమా’ అనే సినిమాలో అవకాశం వచ్చింది. పెద్దగా పేరు రాలేదు. 2010లో ‘తాజ్ మహల్’ చిత్రంతో తెలుగు వారికీ పరిచయం అయింది. ► నుస్రత్‌కు గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం ప్యార్ కా పంచ్‌నామా. దాని సీక్వెల్లోనూ నటించే చాన్స్ దొరికింది. అదీ ఆమె పాపులారిటీని పెంచింది. అనంతరం వచ్చిన సోనూ కే టీటూ కీ స్వీటీ.. గురించి చెప్పక్కర్లేదు. నుస్రత్‌కు ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావు వంటి హీరోల సరసన అభినయించే అవకాశాలను ఇచ్చింది. ► ఓ వైపు థియేటర్ ఆర్టిస్ట్, ఇంకో వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మ్యూజిక్ వీడియోల్లోనూ కనిపించింది. ► వెబ్ స్క్రీన్కు పెరుగుతున్న ఆదరణను గ్రహించి.. ‘అజీబ్ దాస్తా’అనే ఆంథాలజీలో నటించింది. నటిస్తోంది కూడా. ఫుడ్ అంటే ఓ సెలెబ్రేషన్లా భావించే కుటుంబం మాది. నాన్ వెజ్ అంటే చెప్పక్కర్లేదు. అలాంటిది హఠాత్తుగా వీగన్‌గా మారిపోయా. కొత్తలో చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు అలావాటైపోయింది. నా విల్ పవర్ అర్థమైంది. యాక్టింగ్ అనేది మంచి కెరీర్ కాదని మా బంధువుల అపోహ. అందుకే నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో యాక్టింగ్ అనేది పార్ట్ టైమ్ అని చెప్పేదాన్ని! – నుస్రత్ భరూచా -
అలా జరగడంతో భయమేసింది.. 30 సెకన్లలో బయటపడ్డా: నటి
Nushrratt Bharuccha Recalls Her Paranormal Experience: సినిమా అంటేనే ఊహాజనిత ప్రపంచం. మూవీ వరల్డ్‌లో అనేక జానర్స్ ఉంటాయి. అందులో ఒకటి హార్రర్ జానర్. ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చొబెట్టి వాళ్ల నటనతో భయపెడ్తుంటారు యాక్టర్స్. మరీ అలాంటి భయం యాక్టర్స్‌కు నిజ జీవితంలో ఎదురైతే ? ప్రేక్షకులను వారి సినిమాలతో భయపెట్టిన నటీనటులు ప్రాణ భయంతో పరుగులుపెడితే ! అవును. అలాంటి భయానక ఘటనే జరిగింది ఓ నటికి. బాలీవుడ్ నటీ నుష్రత్ భరుచ్చా ప్రస్తుతం ఫ్యూరియా దర్శకత్వంలో విడుదలైన 'చోరీ' సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఈ చిత్రంలో ఆమె 8 నెలల గర్భిణీ సాక్షి పాత్ర పోషించింది. ఈ సినిమా 2017లో విమర్శకుల ప్రశంసలు పొందిన మరాఠీ హార్రర్ 'లపచ్చాపి' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన భయానక సంఘటన గురించి చెప్పింది నుష్రత్. సినిమా షూటింగ్ కోసం ఢిల్లీలోని ఒక హోటల్లో బస చేయాల్సి వచ్చిందట. అప్పుడు తనకు జరిగిన వింత అనుభవాన్ని గుర్తు చేసుకుంది. 'హోటల్ ఉన్నప్పుడు నాకు కొంచెం విచిత్రంగా తోచింది. నేను నా సూట్‌కేస్‌ను టేబుల్‌పై తెరచి ఉంచి పడుకున్నాను. తెల్లారి లేచి చూసే సరికి నా సూట్‌కేస్ టేబుల్‌పై లేదు. నేలపై ఉంది. అంతేకాకుండా నా బట్టలు చిందరవందరగా నేలపై పడి ఉన్నాయి. అది నేను చేయలేదు. అక్కడ అంతా మాములుగా అనిపించలేదు. నాకు చాలా భయమేసింది. నా ప్రాణాల కోసం పరిగెత్తి 30 సెకన్లలో హోటల్ నుంచి బయటపడ్డాను.' అని నుష్రత్ భరుచ్చ తెలిపింది. నుష్రత్ నటించిన చోరీ నవంబర్ 26న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. 'సాక్షి, తనకు పుట్టబోయే బిడ్డను దుష్టశక్తులు ఎలా వెంబడించాయి. వాటినుంచి సాక్షి ఎలా పోరాడింది.' అనేది సినిమా కథ. -
తెరపై గర్బిణీలుగా మెప్పించిన నటీమణులు వీళ్లే..
Top 5 Actresses Who Played Pregnant Women Role: ప్రయోగాత్మక పాత్రల్లో నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్స్ ఎప్పుడూ ముందుంటారు. పలు ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తూ బీటౌన్ నటీమణులు తమ సొంత బ్యాంకింగ్‌ను ఏర్పర్చుకుంటున్నారు. మహిళా ప్రాధాన్యత చిత్రాల నుంచి బోల్డ్ క్యారెక్టర్ల వరకు పేరు తెచ్చుకుంటున్నారు. సినిమాల్లో కేవలం ఒక భాగం, సహాయక పాత్రలకు పరిమితం కాకుండా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా చాలా మంది నటీమణులు తల్లి పాత్రను పోషించారు. ఏ సంకోచం లేకుండా గర్భిణీ పాత్రలకు సైతం మొగ్గు చూపారు. ఈ గర్భిణీ స్త్రీలుగా తెరపై నటించిన బాలీవుడ్ నటీమణులు ఎవరెవరో ఓసారి చూద్దామా ! 1. నుష్రత్ భరుచ్చా (ఛోరీ) హిందీలో వస్తున్న హార్రర్ మూవీ 'ఛోరీ'లో నుష్రత్ భరుచ్చా గర్భిణీగా నటించారు. ఈ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు ఎంతో కష్టపడ్డారు. సినిమా షూటింగ్‌కు సుమారు 25 రోజుల ముందు 'గర్భిణీ బాడీసూట్'ను ధరించడం ప్రారంభించారు. ఈ విషయంపై ఆమె 'ఇప్పుడు నిజ జీవితంలో నేను గర్భివతిని కాలేను. కాబట్టి, ఒక బిడ్డను మోసే స్త్రీ ఎలా ఉంటుంది. ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఏం అనుభవిస్తుందో తెలుసుకోడానికే ఆ బాడీసూట్‌ను తయారు చేసుకున్నాను. గర్భిణీలకు వచ్చే సమస్యలను తెలుసుకోడానికి సినిమా షూటింగ్ ప్రారంభానికి 20-25 రోజుల ముందు ఆ బాడీసూట్‌ను ధరించాను. దాంతోనే తినడం, పడుకోవడం, బాత్రూమ్కు వెళ్లడం, చుట్టూ తిరగడం చేశాను.' అని తెలిపారు. 2. విద్యా బాలన్ (కహానీ) భారతీయ చలనచిత్ర రంగంలో మహిళల చిత్రీకరణలో మార్పు తీసుకురావడానికి పేరుగాంచిన నటి విద్యా బాలన్. 'కహానీ' చిత్రంలో గర్భిణీగా నటించి.. అందరి మెప్పు పొందారు. ఇందులో ప్రొస్తెటిక్ బేబీ బంప్‌ను ధరించి నటించారు విద్యా బాలన్. ఆమె ఎంతో చక్కగా, పరిపూర్ణతో ఆ పాత్రను పోషించారు. ప్రేక్షకులను కంటతడి పెట్టించి, విమర్శకుల ప్రశంసలు పొందారు. ప్రజల నుంచి మంచి ఆదరణ కూడా పొందారు. దీనికి రీమెక్‌గా తెలుగులో నయనతార హీరోయిన్గా 'అనామిక' రూపొందించారు. కానీ అందులో ఆమెను గర్భిణీ పాత్రలో చేయలేదు. 3. నీనా గుప్తా (బధాయి హో) 2018లో నటి నీనా గుప్తా, అమిత్ శర్మతో కలిసి 'బధాయి హో' సినిమాలో యాక్ట్ చేశారు. ఈ చిత్రంలో ఆమె 50 ఏళ్ల గర్భిణీ పాత్రను పోషించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాల్లో ఒకటిగా మంచి గుర్తింపు వచ్చింది ఈ సినిమాకు. 'పూర్తి వినోదాత్మకంగా అత్యంత ప్రజాధారణ పొందిన ఉత్తమ చిత్రం' విభాగంలో జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. 4. కరీనా కపూర్ ఖాన్ (గుడ్ న్యూస్) గుడ్ న్యూస్ సినిమాలో దీప్తి బాత్రాగా కరీనా కపూర్ పాత్ర 21వ శతాబ్దపు మహిళలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఆమె ఒక స్వతంత్ర, స్వయం సమృద్ధి గల వ్యక్తి పాత్రను పోషించారు. ఆమె కూడా బిడ్డను కలిగి ఉండాలని కోరుకునే అమ్మాయి కథ. తెరపై గర్భిణీ స్త్రీ పాత్రను వివరిస్తూ, గర్భధారణ సమయంలో స్త్రీ పడే కష్టాలు, ప్రభావాలు తెలిసేలా చక్కగా నటించారు. అందులో కియారా అద్వానీ కూడా గర్భిణీ పాత్రలో కనిపించారు. 5. కృతి సనన్ (మిమి) 'మిమి' చిత్రంలో కృతి సనన్ ఒక సరోగసి తల్లి పాత్రలో నటించారు. ఈ పాత్రతో ఆమె నటనకు మంచి బ్రేక్ వచ్చింది. ఎంతో పరిణితీ ఉన్న నటిగా ఆమె నిరూపించుకుంది. ఆ పాత్ర కోసం కృతి సనన్ సుమారు 15 కిలోల బరువు పెరగాల్సి వచ్చింది. -
టీవీలో నటిస్తున్నప్పుడే ఆ విషయం తెలిసింది: హీరోయిన్
గ్లామర్‌తో ఆకట్టుకున్నా స్థిరపడేది నటనతోనే అని నమ్ముతుంది నుస్రత్ భరూచా. అందమైన రూపం, అభినయ కౌశలం రెండిటికీ పోటీపెడుతూ టీవీ, సినిమా, ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. ►ముంబైలో పుట్టిపెరిగింది నుస్రత్. తన్వీర్ భరూచా, తస్నీమ్ భరూచాల ఏకైక సంతానం. కూతురు ఏది అడిగితే అది కాదనకుండా సమకూర్చినప్పటికీ ఆమె సినిమాల్లోకి వెళ్తానంటే మాత్రం ‘నో ’ అన్నారు నుస్రత్ అమ్మానాన్నా. దాంతో వాళ్లకు తెలియకుండానే ఆడిషన్స్ అటెండ్ అయింది. అలా ‘కిట్టీ పార్టీ’ అనే టీవీ సిరీయల్‌కు సెలక్ట్ అయ్యింది. ►సాయంకాలానికల్లా ఇంటికి చేరుతూ..తను టీవీ సీరియల్లో నటిస్తున్న విషయాన్ని తల్లి, తండ్రి దగ్గర దాచి పెట్టింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో చెప్పక తప్పలేదు. వాళ్లూ ఒప్పుకోక తప్పలేదు. ►2006లో ‘కల్ కిస్నే దేఖా’, ‘జై సంతోషీ మా’ సినిమాలు చేసింది. వీటితో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. 2010లో తెలుగులో శివాజీ హీరోగా నటించిన ‘తాజ్ మహాల్’, తమిళంలో ‘వాలిబా రాజా’ చిత్రాల్లోనూ నటించింది. ఇవీ అంతే.. నుస్రత్‌కు బ్రేక్ ఇవ్వలేకపోయాయి. ► అయితే, 2011లో విడుదలైన ‘ప్యార్ కా పంచ్‌నామా’ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. అందులో ఔనంటే కాదని.. కాదంటే ఔననే ప్రేమికురాలిగా.. బ్యాడ్ గర్ల్‌గా ఆమె కామెడీ టైమింగ్ విమర్శకుల ప్రశంసలను అందుకుంది.అనేక అవార్డులూ ఆమెను వరించాయి. ఆ తర్వాత వచ్చిన ఆ సినిమా సీక్వెల్ ‘ప్యార్ కా పంచ్‌నామా 2’ కూడా సూపర్ హిట్ అయింది. ►‘సోనూ కే టిటూ కీ స్వీటీ’, ‘డ్రీమ్ గర్ల్’ సినిమాలూ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ► ప్రస్తుతం వెబ్ దునియాలోనూ తన సత్తా చాటుతోంది. నెట్‌ఫ్లిక్స్ ‘అజీబ్ దాస్తా’ లో చెల్లెలి భవిష్యత్తు కోసం పోరాడే అక్కగా మెప్పించింది. నటన అంటే ఆషామాషీ కాదని, ఇందుకు బాగా కష్టపడాలనే సత్యం టీవీలో నటిస్తున్నప్పుడే తెలిసింది. అదీగాక హీరో కంటే హీరోయిన్ కెరీర్ తొందరగా ముగిసిపోతుంది. అందుకే ఉన్నన్నాళ్లూ మంచి సినిమాలు ఎంచుకుని సంతోషంగా గడపడానికే ఇష్టపడతాను. – నుస్రత్ భరూచా