కర్ణాటక హైకోర్టులో ప్రజ్వల్‌ తల్లి భవానికి ముందస్తు బెయిల్‌ | Kidnap Case: Karnataka HC Grants Anticipatory Bail To Bhavani Revanna |Sakshi
Sakshi News home page

కర్ణాటక హైకోర్టులో ప్రజ్వల్‌ తల్లి భవానికి ముందస్తు బెయిల్‌

Published Tue, Jun 18 2024 12:22 PM

kidnap case: Karnataka hc grants anticipatory bail to Bhavani Revanna

బెంగళూరు: లైంగిక వేధింపు కేసులో నిందితుడు ప్రజ్వల్‌ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న ఆర్‌కే.నగర్‌కు చెందిన బాధితురాలి కిడ్నాప్‌ కేసులో మంగళవారం హైకోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. భవానీ రేవణ్ణ ఇప్పటికే సిట్‌ అడిగిన 85 ప్రశ్నలకు సమాధానమిచ్చారని కోర్టు తెలిపింది. ఆమె విచారణకు సహకరించడం లేదని సిట్‌ చెప్పడం సరికాదని కోర్టు పేర్కొంది.

 

తన ఇంట్లో పనిచేసే ఆర్‌కే నగర్‌కు చెందిన మహిళ కిడ్నాప్‌ కేసులో భవానీ రేవణ్ణ నిందితురాలు. ఆ మహిళ ప్రజ్వల్‌ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రజ్వల్‌ రేవణ్ణ  లైంగిక దాడి కేసులో కర్ణాటక ప్రభుత్వం విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మే 31న జర్మనీ నుంచి వచ్చిన ప్రజ్వల్‌ను సిట్ అధికారులు బెంగళూరు ఎయిర్‌పోర్టులోనే అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ప్రజ్వల్‌పై సిట్‌ విచారణ కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement