
సాక్షి, తిరుమల: ఎట్టకేలకు తిరుమలలో కిడ్నాప్ అయినా బాలుడు గోవర్ధన్ ఆచూకీ లభ్యమైంది. ఈ నెల 1వ తేదీన శ్రీవారి ఆలయం ముందు బాలుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఐదు రోజులుగా బాలుడి కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ క్రమంలో కిడ్నాప్ చేసిన మహిళే మరోసారి బాలుడిని తిరుమలకు తీసుకురావడంతో వారిద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. కాగా, కిడ్నాప్ చేసిన మహిళను కర్నాటకకు చెందిన పవిత్రగా పోలీసులు గుర్తించారు. గోవర్దన్‌ను మొదట తిరుమల కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తరలించి అనంతరం పోలీసులు అతడి తల్లిదండ్రులకు అప్పగించడంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. మరోవైపు.. కిడ్నాపర్ పవిత్రపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: సరూర్‌నగర్‌లో పరువు హత్య
Comments
Please login to add a commentAdd a comment