మాండ్య: కర్ణాటకలోని మాండ్యలో గణేష్ నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్లు రువ్వడం, విధ్వంసం సృష్టించడం వంటి ఘటనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనల్లో పలు దుకాణాలు, వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘర్షణలు మైసూరు రోడ్డులోని దర్గా సమీపంలో చోటుచేసుకున్నాయి. ఈ ఉదంతంలో పోలీసులు 46 మందిని అదుపులోకి తీసుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జి చేశారు. నాగమంగళ పట్టణంలో గణేష్ విగ్రహ నిమజ్జనం కోసం బద్రికొప్పలు గ్రామానికి చెందిన కొందరు యువకులు ఊరేగింపు నిర్వహిస్తుండగా, రెండు వర్గాల యువకుల మధ్య వాగ్వాదం జరిగింది. తరువాత ఊరేగింపుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.
రాళ్లదాడిలో కొందరు గాయపడ్డారని, పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని సమాచారం. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు ఈ ప్రాంతంలో సీఆర్‌పీసీ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. అల్లర్లుకు పాల్పడిన 46 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని మాండ్యా కంటే ముందు గుజరాత్‌లోని సూరత్‌లోనూ ఇలాంటి దృశ్యమే కనిపించింది. అల్లరి మూకలు గణపతి మండపంపై రాళ్లు రువ్వారు. దీంతో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. ఈ ఉదంతంలో 28 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: గణేష్ లడ్డూ చోరీ
VIDEO | Tensions gripped Nagamangala town in Karnataka's Mandya district earlier today (Wednesday) following clashes between two groups during Ganpati Visarjan. Stones were allegedly thrown on the procession, which led to the clashes. Section 144 has been imposed in the area.… pic.twitter.com/mlx8b4DzgQ
— Press Trust of India (@PTI_News) September 11, 2024
Comments
Please login to add a commentAdd a comment