కర్ణాటకలో లొంగిపోయిన చివరి మావోయిస్టు | Last Maoist Surrendered In Karnataka | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో లొంగిపోయిన చివరి మావోయిస్టు

Published Sun, Feb 2 2025 8:40 PM | Last Updated on Sun, Feb 2 2025 8:47 PM

Last Maoist Surrendered In Karnataka

బెంగళూరు:కర్ణాటక మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని సీఎం సిద్ధరామయ్య ఇటీవల చేసిన ప్రకటన నిజమైంది. రాష్ట్రంలో చివరి మావోయిస్టుగా భావిస్తున్న తొంబట్టు లక్ష్మీ ఆదివారం(ఫిబ్రవరి2) పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఉడుపి పోలీసు ఉన్నతాధికారుల ముందు సరెండర్‌ అయ్యారు.

తనకు ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వానికి లక్ష్మీ ఈ సందర్భంగా  ధన్యవాదాలు తెలిపారు.లక్ష్మీ స్వగ్రామం కుందపుర తాలుకాలోని మచ్చట్టు.దాదాపు ఇరవై ఏళ్ల క్రితం కుటుంబాన్ని విడిచి మావోయిస్టు పార్టీలోకి వెళ్లింది. సమీప ప్రాంతాల్లో మావోయిస్టు సాహిత్యం ప్రచారం చేయడంతోపాటు పోలీసులపై దాడి ఘటనల్లో ఆమెపై గతంలో మూడు కేసులు నమోదయ్యాయి.

చాలా ఏళ్లుగా ఆమె ఏపీలో తలదాచుకున్నట్లు సమాచారం.ఇటీవల లక్ష్మీ లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు.సరెండర్‌ కమిటీ సభ్యుడు,గతంలో లొంగిపోయిన ఆమె భర్త సలీంతో కలిసి ఉడుపి పోలీసుల ముందుకు వచ్చారు.కాగా, కర్ణాటకను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. 

ఇందులో భాగంగా మావోయిస్టుల సరెండర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో లొంగిపోయే మావోయిస్టులకు మార్గం సుగమం అయింది. రెండురోజుల క్రితమే శృంగేరి తాలూకా కిగ్గా గ్రామానికి చెందిన మావోయిస్టు నాయకుడు రవీంద్ర నెమ్మార్‌ చిక్కమగళూరులో అధికారుల ముందు లొంగిపోయాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement