vinayaka nimajjanam
-
అనంతపురంలో వినాయక నిమజ్జనం సందడి (ఫొటోలు)
-
భక్త 'గణ' యాత్ర
సాక్షి, హైదరాబాద్: గణపతి నిమజ్జన వేడుకలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి. వేల సంఖ్యలో వినాయక విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో విగ్రహాలు, భక్తులతో రహదారులు కిటకిటలాడాయి. నగరం నలువైపుల నుంచి తరలి వచ్చిన భక్తజన సందోహంతో సాగరతీరం సందడిగా మారింది. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు, పీపుల్స్‌ప్లాజా తదితర ప్రాంతాల్లో ‘జై బోలో గణపతి మహారాజ్‌కీ జై ’అంటూ నినాదాలు హోరెత్తాయి. వైవిధ్య భరితమైన వినాయక మూర్తుల నిమజ్జన వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. భక్తుల నినాదాలు, నృత్యాలతో కూడిన శోభాయాత్రతో మహానగరం ఆధ్మాత్మికతను సంతరించుకుంది. 63 అడుగుల ఖైరతాబాద్ శ్రీ దశ మహావిద్యా గణపతి నిమజ్జన వేడుకలు మధ్యాహ్నం 1.27 గంటలకే ముగిశాయి. ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్త జనందోహం నడుమ శోభాయాత్ర ప్రశాంతంగా సాగింది. ఉదయం 6.12 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్. రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మీనార్, సచివాలయం, ఎన్టీయార్మార్గ్ మీదుగా ఉదయం 11.40 గంటలకు 4వ నంబర్ క్రేన్ వద్దకు చేరుకుంది. మధ్యాహ్నం 12.24 గంటలకు చివరి పూజ నిర్వహించిన గంట తరువాత మహాగణపతిని నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని విభాగాల సహకారంతో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేకత ఉందని పది రోజుల్లో 50 లక్షల మంది దర్శించుకున్నారని చెప్పారు. గురువారం నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో భారీగా పోటెత్తిన భక్త జనం వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ మహాగణపతి నిమజ్జన వేడుకలు ముగిసిన తర్వాత వివిధ ప్రాంతాల నుంచి బొజ్జ గణపయ్యలు సాగరతీరంలో నిమజ్జనానికి తరలివచ్చారు. మధ్యలో స్వాగత వేదికలు గణపతులకు సాదర స్వాగతం పలికాయి. రకరకాల ఆకృతులలో అందంగా రూపుదిద్దుకున్న మూషికవాహనుడి విగ్రహాలు ఆకట్టుకున్నాయి. తిరుపతి వెంకటేశ్వర దేవస్థానం అలంకరణలో ఏర్పాటు చేసిన మండపాలు, విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, జీమెయిల్ వంటి సోషల్ మీడియాను ప్రతిబింబించే చిన్న చిన్న విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి నిమజ్జనానికి తీసుకొచ్చారు. అబిడ్స్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పండ్లతో అలంకరించిన విగ్రహాలు, కాగితంతో అందంగా తీర్చిదిద్దిన పర్యావరణ గణపతులు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కోసం అమరవీరుల స్మారక చిహ్నం వద్ద బారులు తీరిన వినాయక విగ్రహాలు ఏరియల్ నిఘా రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిసేందుకు పోలీస్‌శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీ స్ కమిషనర్లు వినాయక నిమజ్జన ప్రాంతాలు పరిశీలించారు. హైదరాబాద్ పరిధిలో గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని మంత్రులు మహమూ ద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి డీజీపీ అంజనీకుమార్ ఏరియల్ వ్యూ ద్వారా పర్యవేక్షించారు. హెలికాప్టర్లో శోభాయాత్రను, హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్న తీరును పరిశీలించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ కూడా పాల్గొన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా శోభయాత్రను పరిశీలించారు. సీసీటీవీ కెమెరాల లైవ్ ఫీడ్‌ను చూస్తూ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. నగరం ఆధ్యాత్మిక సంద్రమైంది. ఎటుచూసినా భక్తజన సందోహం.. అంతటా గణనాథుని నిమజ్జన వేడుకల కోలాహలం.. దారిపొడవునా వినాయకులకు ఘన స్వాగతాలు.. ట్యాంక్బండ్లు, చెరువుల వద్ద వీడ్కోళ్లు.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. 63 అడుగుల ఖైరతాబాద్ శ్రీ దశ మహావిద్యా గణపతి నిమజ్జనోత్సవం మధ్యాహ్నం 1.27 గంటలకే ముగిసింది. -
ఖైరతాబాద్ గణేశుడి వద్ద ఇసుకేస్తే రాలని జనం
సాక్షి, హైదరాబాద్: వారాంతం కావడంతో ఖైరతాబాద్ గణేషుడి దర్శనార్థం జనం పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచే ఖైరతాబాద్ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. ఇసుకేస్తే రాలని జనం.. జైబోలో గణపతి మహా రాజ్ కి జై నినాదాలతో ఖైరతాబాద్ ప్రాంగణం మారుమోగిపోతోంది.ఆదివారం మధ్యాహ్నం వరకే లక్షన్నర మంది భక్తుల దర్శనం చేసుకున్నట్లు అంచనా వేస్తోంది ఖైరతాబాద్ మహా గణపతి నిర్వాహక కమిటీ. సెప్టెంబర్ 28వ తేదీన నగరంలో నిమజ్జనం జరగనుంది. నిమజ్జనానికి ముందు ఆదివారం కావడంతో జనం ఖైరతాబాద్ గణేషుడి దర్శనార్థం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం దాటాక.. జనం రావడం ఒక్కసారిగా పెరిగింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర లైన్లో నిల్చున్నారు భక్తులు. దీంతో.. వీఐపీ దర్శనాలను నిలిపివేసి సాధారణ భక్తులను అనుమతిస్తున్నారు. ఆదివారం సాయంత్రం సమయంలో ఈ సందడి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఖైరతాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు.. మెట్రో స్టేషన్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. మరోపక్క.. నగరంలో విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే వందల కొద్దీ విగ్రహాలు ట్యాంక్‌బండ్ వైపు చేరుకుంటున్నాయి. ఖైరతాబాద్, సోమాజిగూడ, నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు విపరీతమైన రద్దీతో నిండిపోయాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు.. శాంతి భద్రతలను పోలీసులు పరిరక్షిస్తున్నారు. -
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
పిఠాపురం: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్రంలో ఆదివారం ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో ఒకరు మృతిచెందగా, ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు. యు.కొత్తపల్లి మండలం నాగులాపల్లికి చెందిన సుమారు 70మంది యువకులు వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి ఊరేగింపుగా తీసుకు వెళ్లారు. ఉప్పాడ సమీపాన హార్బర్ నిర్మాణ స్థలం వద్దకు విగ్రహాన్ని తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. విగ్రహం మళ్లీ వెనక్కి కొట్టుకు రాసాగింది. ఈ విషయాన్ని గమనించిన చింతపల్లి సతీ‹Ùరెడ్డి, తమిలిశెట్టి విజయవర్ధనరెడ్డి, అనిశెట్టి వెంకటరెడ్డిలతోపాటు మరో ముగ్గురు యువకులు విగ్రహాన్ని తిరిగి లోపలకు నెట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో సముద్ర ఉధృతి ఎక్కువగా ఉండడంతో విగ్రహంతోపాటు వారిని కూడా కెరటాలు ఒక్కసారిగా సముద్రంలోకి లాగేశాయి. భయంతో కేకలు వేస్తున్న వారిని అక్కడే ఉన్న మత్స్యకారులు గమనించి బోటుపై వెళ్లి ఆరుగురిలో నలుగురు యువకులను రక్షించి ఒడ్డుకు తీసుకు వచ్చారు. ఆ నలుగురిలో అనిశెట్టి వెంకటరెడ్డి అలియాస్ వంశీరెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. చింతపల్లి సతీ‹Ùరెడ్డి, తమిలిశెట్టి విజయవర్ధనరెడ్డి ఆచూకీ కోసం పోలీసులు, అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ఘటనాస్థలాన్ని అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, సీఐ వైఆర్కే శ్రీనివాస్ పరిశీలించారు. మరో ఇద్దరి గల్లంతు ఇదిలా ఉండగా, వినాయక నిమజ్జనం చేస్తుండగా కాకినాడ జిల్లా పిఠాపురం శాలిపేటకు చెందిన ఇద్దరు గల్లంతయ్యారు. నవఖండ్రవాడ వద్ద పిఠాపురం బ్రాంచి కెనాల్ (పీబీసీ)లో వినాయక విగ్రహ నిమజ్జనం కోసం విగ్రహాన్ని దించుతుండగా ఐదుగురు వ్యక్తులు కాలువ ఉధృతికి కొట్టుకుపోయారు. వారిలో ముగ్గురిని స్థానికులు రక్షించారు. జోగా కుమారస్వామి (36), దోసూరి నరసింహాచారి (35) గల్లంతయ్యారు. -
రెచ్చగొట్టి.. రెచ్చిపోయారు
ప్రత్తిపాడు : వినాయక నిమజ్జన వేడుకల్లో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడి రెచ్చగొట్టి.. రెచ్చిపోయి, పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చారు. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో ప్రత్తిపాడు ఎస్ఐ సీహెచ్ ప్రతాప్‌కుమార్ తలకు తీవ్రగాయమైంది. పలువురికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు చౌదరి యౌత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని ఆదివారం సాయంత్రం నిమజ్జనానికి తరలించారు. ఊరేగింపు అంకమ్మగుడి, రెడ్ల రామాలయం, పాతమల్లాయపాలెం కూడలికి చేరుకుంది. అక్కడ టీడీపీ శ్రేణులు తెలుగుదేశం పాటలతో పాటు పార్టీ జెండాలు ఊపుతూ రెచ్చగొట్టే సినిమా డైలాగు (నీ జీవో గాడ్స్ ఆర్డర్, నా జీవో నా ఆర్డర్, నరకడం మొదలు పెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలియదు నా కొడకల్లారా)లు పదే పదే పెట్టారు. గంటల తరబడి ఒకే చోట అవే పాటలు, అవే డైలాగులు పెట్టి రెచ్చగొడుతుండటంతో, కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు సర్దిచెప్పి ఊరేగింపు ముందుకు సాగేలా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు ఏమాత్రం సంయమనం పాటించకుండా ఇందిరాగాంధీ బొమ్మ సెంటరులోని వైఎస్సార్ కాంస్య విగ్రహం వద్ద, రజకుల రామాలయం వద్ద ఉన్న వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను చింపేశారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సీఎం ఫ్లెక్సీలను చేతిలో పట్టుకుని ప్రదర్శించారు. టీడీపీ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంస్య విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అంతలో టీడీపీ శ్రేణులు వైఎస్సార్ కాంస్య విగ్రహంపైకి, వైఎస్సార్సీపీ శ్రేణులపైకి చెప్పులు విసిరారు. రాళ్లు రువ్వారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు వారి దాడిని ప్రతిఘటిస్తూ రాళ్లు రువ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రత్తిపాడు ఎస్ఐ సీహెచ్ ప్రతాప్‌కుమార్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతరులు కూడా గాయపడ్డారు. అంతలో సీఐ సుబ్బారావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని, ఇరువర్గాలను చెదరగొట్టారు. -
కాపు కాసి.. కళ్లల్లో కారం కొట్టారు..
పెదనందిపాడు (ప్రత్తిపాడు): గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో ఈ నెల 20న వినాయక నిమజ్జన కార్యక్రమంలో పక్కా పథకం ప్రకారం వంద మంది టీడీపీ కార్యకర్తలు కాపు కాసి వైఎస్సార్సీపీ కార్యకర్తల కళ్లలో కారం కొట్టి దాడికి పాల్పడ్డారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈ ఘటనలో గాయపడిన పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను గురువారం ఆమె పరామర్శించారు. మేదరమెట్ల వెంకటప్పయ్య చౌదరి, ఇంటూరి శ్రీకాంత్, ఇంటూరి హనుమంతరావుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పారు. ఇతరత్రా బాధితులు, స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దెబ్బలు తగిలిన వారితో, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమం చేసుకుంటున్న సమయంలో, మాజీ జెడ్పీటీసీ ఇంట్లో పక్కా పథకం ప్రకారం వంద మంది టీడీపీ శ్రేణులు కాపుకాసి వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టి, రాళ్లు వేసి ఘర్షణ వాతావరణం సృష్టించారన్నారు. ఇదేమని ప్రశ్నించిన హనుమంతరావుపై దాడికి పాల్పడ్డారని, అడిగేందుకు వెళ్లిన ఆయన కుమారుడు శ్రీకాంత్‌ను 20, 30 మంది కలిసి దాడి చేస్తూ.. ఇంట్లోకి లాక్కెళ్లారన్నారు. శ్రీకాంత్ స్పృహ కోల్పోయిన పరిస్థితుల్లో, చనిపోయారనుకుని వైఎస్సార్సీపీ శ్రేణులు కంగారు పడి తలుపులు పగలగొట్టి పోలీసుల సాయంతో బయటకు తీసుకువచ్చారని వివరించారు. ఇంత జరిగినా దెబ్బలు తిని గాయాలపాలైన వారిని ఓ వర్గం మీడియాలో చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వాస్తవ పరిస్థితిని గమనించేందుకే కొప్పర్రుకు వచ్చానని తెలిపారు. హోం మంత్రి ఇంకా ఏమన్నారంటే.. అధికారం అంటే బాధ్యత అనుకుంటున్నాం ► పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నానని ప్రతిపక్షనేత చంద్రబాబు వ్యాఖ్యానిస్తుండటం దారుణం. అదే నిజమైతే ఈ రెండున్నరేళ్లలో ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగాయా? ► మా వైఎస్సార్సీపీ కార్యకర్తలంటే శాంతి కాముకులు. ఎక్కడా ఘర్షణలు జరగాలని మేం అనుకోవడం లేదు. మేము అధికారం అంటే బాధ్యత అనుకుంటున్నాం. ► కొప్పర్రులో 2014లో జెడ్పీటీసీగా గెలుపొందిన వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్న వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేసే కొత్త సంస్కృతిని అలవాటు చేశారు. ఇంత మందిపై దాడి చేయడమే కాకుండా, వాళ్లపైనే బురద జల్లాలని అనుకోవడం దురదృష్టకరం. ► మా వాళ్ల మీదే దాడి చేసి, మా వాళ్ల మీదే తప్పుడు కేసులు పెట్టి.. అన్యాయంగా శిక్షలు ఖరారు చేయించాలన్న గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు వాస్తవాల మేరకు చర్యలు తీసుకుంటే హోం మినిస్టర్ బలవంతంగా మా వాళ్లపై కేసులు పెట్టించారని ఆరోపిస్తారు. అందుకే వాస్తవాలేమిటో బాహ్య ప్రపంచానికి చెబుతున్నాం. ► సమావేశంలో వైఎస్సార్సీపీ మండల పార్టీ కన్వీనర్ మదమంచి వాసు, కొప్పర్రు సర్పంచ్ సాతులూరి సురేష్, ఉప సర్పంచ్ ఏలూరి శ్రీకాంత్, ఎంపీటీసీ సభ్యుడు షేక్ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
‘గణ’యాత్ర.. జన జాతర
సాక్షి, హైదరాబాద్: మహానగరం భక్తజన సంద్రమైంది. ఆదివారం హైదరాబాద్‌లో గణనాథుల నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. భక్తుల జయజయ ధ్వానాలు, డప్పు కళాకారుల దరువులు, యువత నృత్యాలు, విభిన్న రూపాల్లో దర్శనమిచ్చిన గణపతులు, పోటాపోటీగా సాగిన లడ్డూ వేలంపాటలతో శోభాయాత్రలో ఆద్యంతం పండుగ వాతావరణం నెలకొంది. బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు ఆదివారం ఉదయం నుంచి రాత్రి పొద్దు పోయే వరకు హుస్సేన్‌సాగర్ సహా వివిధ చెరువుల్లో నిమజ్జనపర్వం కొనసాగింది. ముఖ్యంగా 40 అడుగుల ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తుల కోలాహలం మధ్య ఉదయం 10:30 గంటలకు మొదలైన పంచముఖ రుద్ర మహాగణపతి శోభాయాత్ర మధ్యాహ్నం 3:23 గంటలకు నిమజ్జనంతో ముగిసింది. మధ్యాహ్నం నుంచి మోస్తరు వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా భక్తులు భారీ స్థాయిలో యాత్రను తిలకించేందుకు తరలివచ్చారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్లు జాతరలను తలపించాయి. సోమవారం తెల్లవారుజాము వరకు హుస్సేన్‌సాగర్‌లో సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 25 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో ప్రమాదాలు జరగకుండా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సాగర్‌లో పడవలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డీజీపీ మహేందర్‌రెడ్డి నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. హుస్సేన్‌సాగర్ వద్ద 40 క్రేన్లను ఏర్పాటుచేసి నిమజ్జనం నిర్వహించారు. బాలాపూర్ వినాయకుడి లడ్డూతో శశాంక్‌రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ బాలాపూర్ లడ్డూ 18.90లక్షలు ►ప్రసాదాన్ని ఏపీ సీఎం జగన్‌కు అందిస్తామన్న వేలంపాట విజేతలు సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక బాలాపూర్ లడ్డూ ఈ ఏడాదీ రికార్డు ధర పలికింది. ఆది వారం గణేశ్ నిమజ్జనం సందర్భంగా బాలాపూర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిం చిన వేలంపాటలో ఏకంగా రూ. 18.90 లక్షలకు (2019లో రూ. 17.60 లక్షలు పలికింది) లడ్డూ అమ్ముడుపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, నాదర్ గుల్కు చెందిన అబాకస్ విద్యాసంస్థల అధినేత మర్రి శశాంక్‌రెడ్డి సంయుక్తంగా లడ్డూ ప్రసా దాన్ని చేజిక్కించుకున్నారు. వేలంలో బాలాపూర్ లడ్డూను పొందడం అదృష్టంగా భావిస్తున్నట్లు రమేశ్ యాదవ్ తెలిపారు. ఈ ప్రసాదాన్ని ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డికి అందజేస్తానని చెప్పారు. రమేశ్ సహాయంతో ఈ ఏడాది లడ్డూను దక్కించుకున్నందుకు సంతోషంగా ఉందని మర్రి శశాంక్‌రెడ్డి పేర్కొన్నారు. వేలంపాటకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ డాక్టర్ అనితా హరినాథ్‌రెడ్డి, మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బాలాపూర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కల్లెం నిరంజన్‌రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. -
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
-
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): బొజ్జ గణపయ్య నిమజ్జనోత్సవానికి సర్వం సన్నద్ధమైంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. లక్షలాది మంది ఈ శోభాయాత్రలో పాల్గొంటారని, సుమారు 320 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్ర జరుగుతుందని, ఆయా రహదారులలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రహదారుల మరమ్మతులు చేపట్టవలసిన ప్రాంతాలను గుర్తించి వెంటనే చేయాలని, విగ్రహాలకు అడ్డంగా ఉండే విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు తొలగించాలని సూచించారు. శుక్రవారం ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లో చేపట్టిన ఏర్పాట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, కలెక్టర్ శర్మన్, వాటర్ వర్క్స్ అధికారి సత్యనారాయణ, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పర్యవేక్షించారు. ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిమజ్జనం ఏర్పాట్లను తెలియజేశారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగే విధంగా పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహించనున్నట్లు చెప్పారు. సుమారు 19 వేల మంది వివిధ స్థాయిలలో పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ప్రతి క్రేన్ వద్ద ఒక పోలీసు అధికారిని నియమించడంతో పాటు ప్రతి విగ్రహం వెంట నిమజ్జన యాత్రలో ఒక పోలీసు అధికారి ఉంటారు. నిమజ్జనం దృష్ట్యా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఎంఎంటీఎస్ స్పెషల్ ... ► ట్యాంక్‌బండ్‌కు తరలి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా లింగంపల్లి– సికింద్రాబాద్, ఫలక్‌నుమా–సికింద్రాబాద్, లింగంపల్లి–నాంపల్లి రూట్లో ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. ► ఆదివారం రాత్రి 11 గంటల వరకు ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో రైళ్లను అన్ని రూట్లలో నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సులు.. ► నిమజ్జనం సందర్భంగా భారీగా తరలి రానున్న భక్తజనసందోహం కోసం గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఆదివారం ఉదయం నుంచి నిమజ్జన వేడుకలు పూర్తయ్యే వరకు 565 ప్రత్యేక బస్సులను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ► బషీరాబాగ్ – కాచిగూడ, బషీర్‌బాగ్–రాంనగర్, ఓల్డ్ ఎమ్మెల్యేక్వార్టర్స్–దిల్‌సుఖ్‌నగనర్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్–ఎల్బీనగర్, ఓల్డ్ ఎమ్మెల్యేక్వార్టర్స్ – వనస్థలిపురం, మిధాని రూట్లలో బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. ► ఉప్పల్– ఇందిరాపార్కు, మల్కాజిగిరి–ఇందిరాపార్కు, ఇందిరాపార్కు నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, జామై ఉస్మానియా వరకు ► లక్డీకాపూల్ నుంచి టోలీచౌకి,ఖైరతాబాద్ నుంచి బీహెచ్‌ఈఎల్‌వరకు, లకిడికాఫూల్ నుంచి కొండాపూర్, యూసుఫ్‌గూడ, రాజేంద్రనగర్ రూట్లలో ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ► ఆల్ఇండియా రేడియో నుంచి కోఠీ, ఖైరతాబాద్ నుంచి జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కూకట్పల్లి,బోరబండ, బాచుపల్లి,లింగంపల్లి, పటాన్చెరు. తదితర ప్రాంతాలకు బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. నిమజ్జన మార్గాల్లో మళ్లింపు.. ► పాతబస్తీ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు కొనసాగనున్న నిమజ్జన శోభాయాత్ర దృష్ట్యా పాతబస్తీ మీదుగా రాకపోకలు సాగించే బస్సులను అఫ్జల్‌గంజ్ వరకే పరిమితం చేస్తారు. ► సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లే బస్సులు ఇందిరాపార్కు వరకు పరిమితమవుతాయి. ఉప్పల్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే బస్సులు కూడా ఇందిరాపార్కుకే పరిమితమవుతాయి. ► ప్రత్యేక బస్సులన్నింటికీ ‘గణేశ్ నిమజ్జనం స్పెషల్’ అనే డెస్టినేషన్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. అర్ధరాత్రి తరువాత కూడా ఈ బస్సులు తిరుగుతాయి. హెచ్ఎండీఏ.. ► హుస్సేన్‌సాగర్‌లోని విగ్రహాలు, పూజాసామాగ్రి తదితర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడంతోపాటు జీహెచ్ఎంసీ పారిశుధ్యవిభాగంతో సమన్వయంతో తరలిస్తుంది. ► ఈ పనుల కోసం వెయ్యిమంది సిబ్బంది విధుల్లో ఉంటారు. వాటర్‌బోర్డు.. ► 101 ప్రాంతాల్లో తాగునీటి సదుపాయానికి జలమండలి ఏర్పాట్లు చేపట్టింది. గణేశ్ యాత్రలో ఇంకా.. ► గణేశ్ శోభాయాత్ర మార్గంలో 38 ఫైర్ వాహనాలు ఉంచుతారు. ► సరూర్‌నగర్, కాప్రా, ప్రగతినగర్ చెరువుల వద్ద బోట్లు అందుబాటులో ఉన్నాయి. ► టూరిజం శాఖ ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్ ట్యాంక్‌బండ్ వైపు 3 బోట్లు, నెక్లెస్‌రోడ్ వైపు 2 బోట్లు అందుబాటులో. వీటితోపాటు 4 స్పీడ్బోట్లు. 10 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు ► విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్ చుట్లూ 48 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు. సరూర్‌నగర్ చెరువు వద్ద 5 ట్రాన్స్ఫార్మర్లు. వీటితో సహా వివిధ ప్రాంతాల్లో మొత్తం 101 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు ► జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు రూ. 1.52 కోట్లతో 41284 తాత్కాలిక లైటింగ్ ఏర్పాట్లు. చదవండి: నా భర్తను వెతికి పెట్టండి: కెనడాలో తెలుగు మహిళ ఆవేదన చదవండి: ఇదే చివరిసారి.. గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి -
ఇదే చివరిసారి.. గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో తయారుచేసిన గణేశ్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. అదికూడా ఈ ఏడాది నిమజ్జనానికే అను మతి ఇస్తున్నామని స్పష్టంచేసింది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన వేడుకలకు ఇదే చివరి అవకాశమని, ఇది పునరావృతం కారాదని తేల్చిచెప్పింది. హుస్సేన్‌సాగర్, చిన్నచిన్న ఇతరత్రా చెరువుల్లో పీఓపీతో చేసిన వినాయక ప్రతిమల నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ధర్మాసనంలో జస్టిస్ హిమాకోహ్లి ఉన్నప్పటికీ గతంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ అంశంలో ఆదేశాలు ఇచ్చిన కారణంగా ఈ కేసు విచారణలో భాగస్వామ్యం కాలేనని చెప్పారు. చదవండి: 2nd ICT Policy: ఐదు అంశాలు.. పన్నెండు రంగాలు తరచూ ఈ సమస్య వస్తోంది... తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. గణేశ్ విగ్రహాల నిమజ్జనం వల్ల పర్యావరణ కాలుష్యం కానీయబోమని చెప్పారు. ప్రతిమ నిమజ్జనం ఒక క్రేన్‌తో చేస్తామని, వెంటనే మరో క్రేన్‌తో వాటిని బయటకు తీసి ఘనవ్యర్థాల నిర్వహణ నిమిత్తం తరలించి రీసైక్లింగ్ చేస్తామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయబోమని నివేదించారు. ‘‘దురదృష్టవశాత్తు ఈ సమస్య హైదరాబాద్‌లో తరచూ వస్తూ ఉంటుంది. కోర్టు అనేక మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అన్నింటినీ పాటించడం లేదు. ఏటా హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం నిర్వహిస్తున్నారు. అది కాలుష్యానికి కారణమవుతోంది. సొలిసిటర్ జనరల్ వాదనలు పరిగణనలోకి తీసుకుంటే పీవోపీ ప్రతిమల నిమజ్జనం సందర్భంగా హుస్సేన్‌సాగర్‌లో కాలుష్యం పెరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నిమజ్జనం అయిన వెంటనే విగ్రహాలను తీసేస్తామని అంటున్నారు. ఈ దిశగా నిమజ్జనం రోజున కార్యక్రమాలపై హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. ఇదే చివరి అవకాశం’అని ధర్మాసనం పేర్కొంది. పీఓపీ విగ్రహాల తయారీపై నిషేధం ఉన్నప్పటికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. చదవండి: మద్యం దుకాణాల లైసెన్సుల జారీలో రిజర్వేషన్లు చివరి నిమిషంలో వస్తారు.. ‘హుస్సేన్‌సాగర్ పరిశుభ్రతకు ఏటా ఎక్కువ మొత్తంలో నిధులు వెచ్చిస్తున్న విషయం మీకు (తుషార్ మెహతా) తెలియదు. ఏటా నిమజ్జనానికి అనుమతినిస్తే సుందరీకరణ కోసం వెచ్చించడం ఎందుకు? దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. చివరి నిమిషంలో వస్తారు. అసలు ఏం జరుగుతోంది’అని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. ఇకపై సమర్థవంతంగా ప్రణాళిక చేపడతామని అఫిడవిట్లో హామీ ఇచ్చామని, వేడుకల మధ్య తలెత్తిన సమస్యలకు ఓ పరిష్కారం గుర్తించామని తుషార్ మెహతా తెలిపారు. ఈ సమయంలో హైకోర్టులో పిటిషన్‌దారు వేణుమాధవ్ అభిప్రాయాన్ని జస్టిస్ ఎన్వీ రమణ అడిగారు. 2005 నుంచి పిటిషన్లు వేసుకుంటూ వస్తున్నానని వేణుమాధవ్ తెలిపారు. ‘క్రమశిక్షణ, ప్రజల మద్దతు ఎంతో అవసరం. లక్షలాది మంది ప్రజలు వచ్చినప్పుడు ఈ సరస్సుకు వెళ్లు ఆ సరస్సుకి వెళ్లు అని చెప్పడం సాధ్యమేనా? ప్రజలు వారంతట వారే వస్తారు. భారీ ప్రతిమలు అనుమతించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పీవోపీ నిషేధానికి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ చర్యల పట్ల సంతృప్తిగా లేం. చివరి నిమిషంలో అసాధ్యమైన వాటిని అమలు చేయాలని మేం ఆదేశించలేం. ఈ ఏడాదికి మాత్రం అనుమతి ఇస్తున్నాం. వచ్చే ఏడాది తప్పకుండా కోర్టు ఆదేశాలు పాటిస్తామని తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలి’అని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. పిటిషనర్ ఫిర్యాదులోని ఇతరత్రా అంశాల్లో జోక్యం చేసుకోబోమని వాటిని హైకోర్టు పరిష్కరిస్తుందన్నారు. -
వినాయక నిమజ్జనంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
-
వేయలేక.. వదల్లేక.. భక్తులకు నిమజ్జనం టెన్షన్!
ఓ వైపు చెరువుల్లో పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ నిబంధనలు...మరోవైపు తెచ్చిన విగ్రహాన్ని ఎలాగైనా నిమజ్జనం చేయాలనే ఆరాటం మధ్య భక్తులు ఒత్తిడికి గురవుతున్నారు. పోలీసుల కంటపడకుండా నానా ఇబ్బందులు పడుతూ దొడ్డిదారిలో వెళ్లి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా సోమవారం ట్యాంక్‌బండ్‌పై ఇలా ప్రమాదపుటంచున నిమజ్జనం చేయడం కనిపించింది. సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జనాలకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం నుంచి స్పష్టమైన సూచనలు లేకపోవడం..హైకోర్టు ఆదేశాల గురించి ప్రజలకు తెలియకపోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చెరువుల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో చేసిన, కెమికల్స్‌తో కూడిన రంగుల విగ్రహాలను నిమజ్జనం చేయరాదనే హైకోర్టు ఆదేశాలు తెలియని ప్రజలు ప్రతి సంవత్సరం మాదిరిగానే తాము ఎప్పుడూ నిమజ్జనం చేసే ప్రాంతాలకు విగ్రహాలతో వెళ్తున్నారు. కానీ ఆయా విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు పోలీసులు అనుమతించడం లేదు. దీంతో ఆ విగ్రహాలను నీళ్లలో వేయలేక.. అక్కడే వదిలి వెళ్లలేక వారంతా అయోమయానికి గురవుతున్నారు. వందలాది మంది దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో విగ్రహాలను తీసుకువచ్చి...తీరా నిమజ్జనానికి అనుమతి లేదని తెలిసి అవాక్కవుతున్నారు. చదవండి: హుస్సేన్‌సాగర్‌లో ‘నిమజ్జనం’పై సుప్రీంకు.. పోలీసులకు తలనొప్పులు సరూర్‌నగర్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లోని చెరువుల వద్దకు బ్యాండు మేళాలతో డ్యాన్సులు చేస్తూ వెళ్తున్న భక్త జనం విగ్రహాలను నిమజ్జనం చేయకుండా అక్కడే వదిలేస్తున్నారు. ఈ వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది. సాధారణంగా నాలుగు రోజుల వరకు చిన్న విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయడం, ఐదో రోజునుంచే మూడు నాలుగు అడుగులు, అంతకంటే ఎక్కువ ఎత్తు విగ్రహాలను నిమజ్జనం చేయడం తెలిసిందే. దీంతో ఐదోరోజైన మంగళవారం పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయి. కొన్ని చెరువుల వద్ద మాత్రం ఎలాంటి ప్రతికూలత లేకపోవడంతో నిమజ్జనాలు చేసి వెళ్తున్నారు. చదవండి: హైదరాబాద్: వినాయక నిమజ్జనం ఎక్కడ? అధికారుల మల్లగుల్లాలు విగ్రహాల నిమజ్జనాలకు సోమవారం హైకోర్టు నుంచి సానుకూల స్పందన వస్తుందని అధికారులు ఆశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని హైకోర్టు స్పష్టం చేయడంతో వివిధ శాఖల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. కోర్టు అనుమతించిన బేబీ పాండ్స్ (ప్రత్యేక నిమజ్జన కొలను)లోనే నిమజ్జనాలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసే ప్రయత్నాల్లో మునిగారు. భారీ గణపతులు సైతం బేబీ పాండ్స్‌లోనే... ► ఖైరతాబాద్, బాలాపూర్ వంటి పెద్ద వినాయక విగ్రహాలను సైతం బేబీ పాండ్స్‌లోనే నిమజ్జనం చేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. సంజీవయ్యపార్కు, నెక్లెస్‌రోడ్ వద్ద హుస్సేన్సా గర్ నీటిలోనే రెండు బేబీపాండ్స్ ఉన్నాయి. పెద్ద విగ్రహాలను కూడా వాటిల్లో నిమజ్జనం చేసేందుకు అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. ► మరోవైపు హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు కూడా తెలుస్తోంది. ఏదేమైనా , తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ, తదితర అధికారులు బిజీబిజీగా ఉన్నారు. ఏం చేస్తున్నారన్నది మాత్రం స్పష్టంగా వెల్లడించడం లేరు. ► బేబీపాండ్స్లోనే అన్నివిగ్రహాల నిమజ్జనం జరగాలంటే ఎక్కువ రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. జాప్యం జరగకుండా ఉండేందుకు బేబీపాండ్స్ను పూర్తిగా నీటితో నింపి, వాటిల్లో విగ్రహాలను తడిచేలా ముంచి వెంటనే తొలగించే చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తద్వారా వేగంగా జరగడంతోపాటు పెద్ద విగ్రహాలవి కూడా పూర్తిచేయాలని భావిస్తున్నారు. బేబీ పాండ్లు నిర్మించారిలా.. జీహెచ్ఎంసీ నిరి్మంచిన బేబీ పాండ్లు 26 అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పు, 12– 15 అడుగుల లోతు ఉన్నాయి. వీటిల్లో కొన్నింటికి పవర్ బోర్లతో నీరు నింపే సదుపాయం ఉంది. లేనివాటికి ట్యాంకర్లతో నీటిని నిండుగా నింపే యోచనలో ఉన్నారు. దిగువ ప్రాంతాల్లోనే.. అంబీర్‌చెరువు (కూకట్పల్లి), రంగధాముని చెరువు (కూకట్పల్లి), బోయిన్‌చెరువు (హస్మత్‌పేట్), ఊరచెరువు (కాప్రా), చెర్లపల్లిచెరువు, పెద్దచెరువు(గంగారం), వెన్నెల చెరువు(జీడిమెట్ల), మల్కచెరువు(రాయదుర్గం), నల్లగండ్ల చెరువు, పెద్దచెరువు(మన్సూరాబాద్),పెద్దచెరువు(నెక్నాంపూర్),లింగంచెరువు(సూరారం), ముండ్లకత్వ (మూసాపేట), నాగోల్ చెరువు, కొత్తచెరువు(అల్వాల్),నల్లచెరువు(ఉప్పల్), పత్తికుంట(రాజేంద్రనగర్), గురునాథ్‌చెరువు(మియాపూర్), గోపిచెరువు(లింగంపల్లి), రాయసముద్రం(ఆర్సీపురం), కైదమ్మ కుంట (హఫీజ్‌పేట), దుర్గంచెరువు, బండచెరువు (మల్కాజిగిరి), హుస్సేన్‌సాగర్‌లో రెండు పాండ్లు ఉన్నాయి. -
వినాయక నిమజ్జనంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
న్యూఢిల్లీ: వినాయక విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాలు చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చదవండి: వేయలేక.. వదల్లేక.. భక్తులకు నిమజ్జనం టెన్షన్ ఇదిలా ఉండగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో తయారైన వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సోమవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. హైకోర్టు ఉత్తర్వులను సాధ్యమైనంత త్వరగా సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని సీఎం కేసీఆర్ వారిని ఆదేశించారు. చదవండి: TS High Court:హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయాలని పురాణాల్లో చెప్పారా? -
హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయాలని పురాణాల్లో చెప్పారా?
దేవుడు పెట్టమన్నాడా... తనకు భారీ విగ్రహాలు పెట్టాలని, అవి ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసినవే ఉండాలని వినాయకుడు కోరుకోడు. దేవుడి విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేయాలని పురాణాల్లో ఎక్కడా పేర్కొనలేదు. జీహెచ్ఎంసీ చట్టంలోనే జల కాలుష్యం జరగకుండా చూడాలని ఉంది. ఈ చట్టం వచ్చి 66 ఏళ్లు అయ్యింది. అయినా ఇప్పటికీ విగ్రహాల నిమజ్జనం పేరుతో కాలుష్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం ట్యాంక్ బండ్ వైపు చేపట్టరాదని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌తో పాటు ఇతర చెరువుల్లో నిమజ్జనం చేయరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఈ ఉత్త ర్వులను సవరించాలంటూ జీహెచ్ఎంసీ వేసిన పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం కొట్టేసింది. నిమజ్జనంపై ఆదేశా లను సవరించాలని జీహెచ్ఎంసీ తరఫున రివ్యూ పిటిషన్ వేసినట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరీందర్ నివేదించారు. ఇప్ప టికే ట్యాంక్‌బండ్‌పై భారీ క్రేన్ లను ఏర్పాటు చేశామని, బేబీ పాండ్స్‌లో భారీ విగ్రహాలను నిమజ్జనం చేయడం సాధ్యం కాదని తెలిపారు. ఈ ఏడాదికి ట్యాంక్‌బండ్ వైపు నిమజ్జనానికి, అలాగే పీవోపీ విగ్రహాల నిమజ్జనం చేసేందుకు అనుమతించాలని కోరారు. నిమజ్జనం పూర్తయిన 24 గంటల్లో వ్యర్థపదార్థాలను తొలగిస్తామని తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై అనుమతించకపోతే వేలాది విగ్రహాల నిమజ్జనానికి ఆరు రోజుల సమయం పడుతుందని, అలాగే నెక్లెస్‌రోడ్, ఇతర మార్గాల్లో ఇప్పటికిప్పుడు రబ్బర్ డ్యాం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తెలిపారు. ఈ పరిస్థితులను అర్థం చేసుకొని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని అభ్యర్థించారు. గతంలో జీహెచ్ఎంసీ దాఖలు చేసిన మూడు కౌంటర్లలో ఎక్కడా బేబీ పాండ్స్‌లో నిమజ్జనానికి ఇబ్బందులు ఉన్నాయని పేర్కొనలేదని ధర్మాసనం అభ్యంతరం వ్యక్తంచేసింది. తాము ఆదేశాలు జారీచేసిన తర్వాత ఇప్పుడు పొంతన లేని కారణాలు చెబుతున్నారని మండిపడింది. 2001లోనే స్పష్టమైన తీర్పు... ‘2001లో హైకోర్టు కాలుష్యాన్ని నియంత్రించాలని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. తర్వాత మరో ధర్మాసనం కూడా అదే తరహాలో తీర్పులో పేర్కొంది. 2020 జూన్‌లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) పీవోపీ విగ్రహాలను నిషేధించాలని.. జల, శబ్ధ కాలుష్యం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ మార్గదర్శకాలు జారీచేసింది. దాదాపు ఏడాది ముందే సీపీసీబీ మార్గదర్శకాలు జారీచేసినా అమలు చేయకుండా ఇప్పుడు మినహాయింపులు కోరడం సరికాదు. జలాశయాలను కలుషితం చేస్తామంటే అనుమతించాలా? మేం చట్టాలను, హైకోర్టు తీర్పులను మాత్రమే అమలు చేయాలంటున్నాం. చట్టాలను ఉల్లంఘిస్తారా? అమలు చేస్తారా? అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం’అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ డబ్బు వృథాకు ఎవరు బాధ్యులు.. ‘ట్యాంక్‌బండ్ వైపు ఇటీవల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు నిమజ్జనానికి అనుమతిస్తే కొత్తగా వేసిన రెయిలింగ్, గార్డెన్స్, ఇతర లైటింగ్ దెబ్బతినే అవకాశం ఉంది. నిమజ్జనం ఉంటుందని తెలిసినా ఎందుకు అక్కడ అభివృద్ధి పనులు చేపట్టారు? ఇప్పుడు నిమజ్జనానికి అనుమతిస్తే అవన్నీ దెబ్బతిని తిరిగి నిర్మించాలి. మనం చెల్లించే పన్నుల ద్వారా ప్రభుత్వం ఈ పనులు చేపట్టింది. ఈ డబ్బు వృథాకు ఎవరు బాధ్యులు’అని ధర్మాసనం జీహెచ్ఎంసీ తరఫున హాజరైన న్యాయవాదిని ప్రశ్నించింది. తమ ఆదేశాలను సవరించమని, అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసుకోవాలని స్పష్టం చేస్తూ జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్‌ను కొట్టేసింది. హుస్సేన్‌సాగర్‌లో ‘నిమజ్జనం’పై సుప్రీంకు.. సాక్షి, హైదరాబాద్: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో తయారైన వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయవద్దంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై సోమవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. హైకోర్టు ఉత్తర్వులను సాధ్యమైనంత త్వరగా సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని సీఎం కేసీఆర్ వారిని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రెచ్చిపోయిన పచ్చపార్టీ నేతలు.. ఎస్సైకి గాయం
సాక్షి, ఉంగుటూరు: కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తేలప్రోలు గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపులో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. గ్రామంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. దీంతో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకున్నాయి. ఘర్షణలో టీడీపీ వర్గం రాళ్లు రువ్వింది. దీంతో ఆత్కూరు ఎస్సై శ్రీనివాసరావుతోపాటు ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. టీడీపీ శ్రేణుల దాడులపై వైఎస్సార్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
రెచ్చిపోయిన పచ్చపార్టీ నేతలు..
-
పుణెలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో
-
వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి
మేళతాళాలతోపాటు కోలాటాల సందడి హోరు.. డీజే సౌండ్స్‌కు అనుగుణంగా యువకుల స్టెప్పుల జోరు.. ఇలా ఎంతో ఉత్సాహంగా... వినోదభరితంగా సాగిపోతున్న వినాయక ఉత్సవ ఊరేగింపులో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. వినాయక ఉత్సవం చూడటానికి ఎంతో ఆనందంగా తన తాతగారింటికి వచ్చిన ఆరేళ్ల బాలుడిని మృత్యువు రూపంలో వచ్చిన వినాయక విగ్రహం బలి తీసుకుంది. ట్రాక్టరుపై నుంచి పడిన విగ్రహం కిందే పసిప్రాణం నలిగిపోయింది. కుటుంబానికి భారం కాకూడదని డైలీ వేజస్ పనిలో చేరిన ఇంటర్ విద్యార్థి ఎదుగదలను చూడలేని యముడు విద్యుత్ రూపంలో వచ్చి ప్రాణాలు తోడేశాడు. అప్పటి వరకూ తోటి కార్మికులతో ఎంతో ఉల్లాసంగా సీరియల్ లైటింగ్ తొలగిస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. అంతవరకూ సందడిలో ముగిగిపోయిన భక్తులు గొల్లుమన్నారు. అప్పుడే నూరేళ్లు నిండాయా అని వారి తల్లులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. ట్రాక్టరుపై ఊరేగింపులో విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మరో ఘటనలో మృతిచెందాడు. ప్రమాదాలు.. ఎక్కడెక్కడ, ఎలా జరిగాయి.. ► పొందూరు మండలం బురిడికంచరాం గ్రామంలో బుధవారం రాత్రి వినాయక ఊరేగింపులో ట్రాక్టర్ చక్రాలు బురద గుమ్మిలో చిక్కుకున్నాయి. ఒక్కసారిగా అదుపు తప్పడంతో గణపతి విగ్రహం వెనుకకు వాలి కింద పడిపోయింది. ఆ సమయంలో ట్రాక్టర్ వెనుక పెద్ద పిల్లలు తప్పించుకోగా ముక్కుపచ్చలారని యారబాటి వేణుగోపాల్ (6) విగ్రహం కింద నలిగిపోయాడు. ►పోలాకి మండలం తోటాడకు చెందిన అలిగి హేమంత్‌కుమార్ (19) గురువారం మధ్యాహ్నం తోటి కార్మికులతో నరసన్నపేటలో విద్యుత్ సీరియల్ లైటింగ్ తొలగిస్తున్నాడు. విద్యుత్ తీగలకు లైటింగ్ కర్ర తగలడంతో దానికి ఉన్న జియా వైరు ద్వారా విద్యుత్ ప్రవహించి షాక్ గురయ్యాడు. అదే స్థలంలో వర్షపు నీటిలో పడటంతో కార్మికుల కళ్లెదుటే అక్కడికక్కడే మృతి చెందాడు. ►సారవకోట మండలం బుడితి గ్రామంలో బుధవారం రాత్రి ట్రాక్టర్‌పై నిల్చొన్న ధర్మాన రాంబాబు(49)కు పైనున్న విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. నరసన్నపేటలో విషాదం నరసన్నపేట: పోలాకి మండలం తోటాడకు చెందిన అలిగి హేమంత్‌కుమార్ (19) శివానీ లైటింగ్ సంస్థలో డైలీ వేజస్గా రెండు రోజులుగా పనికి వస్తున్నాడు. ఇందులో భాగంగా గురువారం స్థానిక పాత స్టేట్‌బ్యాంకు వీధిలో వినాయక మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సీరియల్ లైట్లు తొలగిస్తున్నాడు. పదకొండు గంటల సమయంలో వర్షం పడటంతో పని నిలిపి మళ్లీ సాయంత్రం అరుకు చెందిన ఎస్ దేవుడు, కే డంబు, కల్లె మోహన్లతో కలసి మొదలు పెట్టారు. రోడ్డుకు రెండు వైపులా లైట్లు కట్టేందుకు పెట్టిన కర్రలకు జియా వైర్ తీస్తున్నప్పుడు ప్రమాదానికి గురై మృతి చెందాడు. ► ప్రాణాలతో బయటపడ్డ మరో ముగ్గురు.. ఘటనా స్థలంలో దేవుడు, డంబు, మోహన్ వెంటనే మేల్కోని చేతిలో ఉన్న జియా వైర్‌ను విసిరి వేయడంతో క్షణాల్లో ప్రాణాలతో బయటపడ్డారు. హేమంత్‌కు విద్యుత్ పని చేసిన అనుభవం లేకపోవడంతో ప్రమాదానికి గురయ్యాడని చెబుతున్నారు. ► నిరుపేద కుటుంబం... హేమంత్‌కుమార్ తండ్రి అనంతరావు రిక్షా డ్రైవర్, పోలాకిలో రిక్షా తొక్కుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి లక్ష్మి వ్యవసాయ కూలీ. వీరికి ఇద్దరు పిల్లలు కాగా ఆరేళ్ల క్రితం కుమార్తె అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి కుమారుడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. పోలాకి ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఇంటర్ చదువుతున్న హేమంత్ సెలవుల్లో, కళాశాల విడుదల చేసిన తర్వాత డైలీ వేజస్కు పనికి వెళ్తుంటాడు. ఈ విధంగా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుండగా ఈ ప్రమాదానికి గురయ్యాడు. ఈ సందర్భంగా ఆర్అండ్బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పరామర్శించారు. మృతుడి తల్లి లక్ష్మిని ఓదార్చారు. అన్ని విధాలా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాద స్థలాన్ని నరసన్నపేట ఎస్ఐ వీ సత్యనారాయణతోపాటు విద్యుత్ శాఖ ఏడీ రామునాయుడు, ఏఈ చంద్రమౌళి తదితరులు పరిశీలించి ప్రమాద వివరాలు నమోదు చేశారు. విగ్రహం కింద పడి.. పొందూరు: మండలంలోని బురిడికంచరాం గ్రామంలో గణపతి విగ్రహ ఊరేగింపులో గోరింట గ్రామానికి చెందిన యారబాటి వేణుగోపాల్(6) మృతి చెందాడు. వేణుగోపాల్ తన తల్లిదండ్రులు మంగమ్మ, రమణ, అన్నయ్య కార్తీక్‌లతో కలసి మంగళవారం ఉదయం బురిడికంచరాంలో తాతగారికి ఇంటికి వచ్చాడు. ఆ రోజు రాత్రి తాతగారి కుటుంబంతో ఎంతో సరదాగా గడిపాడు. బుధవారం ఉదయాన్నే తిరిగి స్వగ్రామం వెళ్లిపోదామనుకున్నాడు. అయితే వినాయక నిమజ్జనోత్సవాన్ని చూద్దామని ఉండిపోయాడు. అదేరోజు రాత్రి ఊరేగింపులో ట్రాక్టర్ వెనుక ఉత్సాహంగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో విగ్రహం కింద పడిపోవడంతో పెద్ద పిల్లలు తప్పించుకోగా ముక్కుపచ్చలారని బాలుడు వేణుగోపాల్ ఉండిపోయాడు. వెంటనే విగ్రహం శిథిలాలను తొలగించి బాలుడిని తీశారు. తలకు తీవ్ర గాయం కావడంతో 108కి సమాచారమిచ్చి కారులో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. ఎచ్చెర్లకు కారు చేరుకోగానే 108 వాహనంలో బాలుడిని ఎక్కించి ఆక్సిజన్ పెట్టి తరలించారు. శ్రీకాకుళం ఆసుపత్రికి కొంత దూరంలో ఉండగానే ప్రాణాలు విడిచాడు. గురువారం మధ్యాహ్నం శ్రీకాకుళం రిమ్స్‌లో పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్ఐ మహ్మద్ యాసిన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ద్రవించిన హృదయం... మృతదేహాన్ని గోరింట గ్రామానికి మధ్యాహ్నం తీసుకువచ్చారు. అభం శుభం తెలియని కుమారుడిని తీసుకొస్తుండగా చూసిన తల్లి గుండెలవిసేలా బాదుకుంది. తన గారాలపట్టి ఇక లేడన్న సత్యాన్ని జీర్ణించుకోలేక ఒక్కసారిగా సొమ్మసిల్లిపోయింది. తండ్రి ఆవేదన, తల్లి కడుపుకోతతో రోదిస్తుంటే వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. రెండు గ్రామాల్లో విషాద ఛాయలు... వేణుగోపాల్ మృతితో బాలుడు స్వగ్రామం గోరింటతోపాటు తాతగారి ఊరు బురిడికంచరాంలో ప్రజలంతా ఆవేదనలో మునిగిపోయారు. వేణుగోపాల్ స్వగ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రగాఢ సంతాపం తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి సారవకోట: మండలంలోని బుడితి గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ రవికుమార్ వివరాల ప్రకారం... బుడితి గ్రామంలో బుధవారం రాత్రి నిమజ్జనానికి వినాయక విగ్రహానికి తరలిస్తున్న సమయంలో ట్రాక్టర్‌పై నిల్చొన్న ధర్మాన రాంబాబు(49)కు పైనున్న విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా కింద పడి పోయాడు. అయితే సిమెంట్ రోడ్డు మీద పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు సంజీవ్ ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం గురువారం పాతపట్నం ఆస్పత్రికి తరలించారు. -
శోభాయాత్ర సాగే మార్గాలివే..!
సాక్షి, హైదరాబాద్: నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న బొజ్జ గణపయ్యను గంగ వద్దకు చేర్చేందుకు చకచకా ఏర్పాట్లు జరగుతున్నాయి. గణనాథుల నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. నగరం మొత్తంలో ఇప్పటివరకు 20 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తొమ్మిదో రోజు 7 నుంచి 8 వేల వరకు గణనాథులు నిమజ్జనమయ్యే అవకాశముంది. 11వ రోజు బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు 18 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ శోభాయాత్ర 17 ప్రధాన రహదారుల్లో కొనసాగగా 10 వేల లారీలు ఈ యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. అలియాబాద్, నాగుల్చింత, చార్మినార్, మదీన, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్ బాగ్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా శోభాయాత్ర సాగుతుంది. నిమజ్జనాన్ని వీక్షించేందుకు విదేశాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్నారు. ఇక నిమజ్జనం సందర్భంగా గురువారం ఉదయం 9 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ప్రైవేటు వాహనాలకు శోభాయత్రలో అనుమతి ఉండదు. ప్రతి ఒక్కరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించాలి’ అని సూచించారు. ‘వినాయక నిమజ్జన వేడుకల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 10 పార్కింగ్ స్థలాల్ని ఏర్పాటు చేశాం. ఖైరతాబాద్, ఆనంద్‌నగర్ కాలనీ, గోసేవ సదన్, కట్టమైసమ్మ టెంపుల్, నిజాం కాలేజ్, ఎంఎంటీఎస్ ఖైరతాబాద్ స్టేషన్, బుద్ధభవన్ వెనుక, లోయర్ ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ స్టేడియం, పబ్లిక్ గార్డెన్లో పార్కింగ్ సదుపాయాలు కల్పించాం. ఇక నిర్దేశించిన మార్గాల్లో ఉదయం 6 గంటల నుంచి ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదు. మొత్తం 13 గంటలపాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి. ఎమర్జెన్సీ వాహనాలు, 108లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. చిన్న విగ్రహాలు ట్యాంక్‌బండ్ వైపు వెళ్లకుండా చూస్తాం. శుక్రవారం ఉదయానికల్లా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తాం. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ట్యాంక్‌బండ్‌పై వన్‌వేకు అనుమతి ఇస్తాం. ప్రజలు సహకరించాలి’ అని అనిల్ కుమార్ అన్నారు. -
హిందూపురంలో నేడు వినాయక నిమజ్జనం
అనంతపురం సెంట్రల్: హిందూపురంలో గురువారం నిర్వహిస్తున్న వినాయక నిమజ్జన వేడుకలకు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. బుధవారం బందోబస్తు ఏర్పాట్లకు సంబందించిన వివరాలను ‘సాక్షి’కి వెల్లడించారు. జిల్లాలో హిందూపురంలో ఏడు రోజులకు నిమజ్జన వేడుకలు నిర్వహిస్తారన్నారు. ఈ వేడుకల్లో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణలో ఐదుగురు డీఎస్పీలు, 19 మంది సీఐలు, 75 మంది ఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, స్పెషల్ పార్టీ బలగాలు మొత్తం 700 మందిని తరలిస్తున్నట్లు వివరించారు. నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిసేందుకు ఉత్సవ నిర్వాహకులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా డయల్–100, 9989819191 సెల్ నెంబర్‌కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ఊరంతా సందడి..
ఐదు రోజుల పాటు నేత్రపర్వంగా సాగిన వినాయక చవితి వేడుకలు మంగళవారం ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. వివిధ కళారూపాల కోలాహలం మధ్య జిల్లా కేంద్రం అనంతపురంలో కొలువుదీర్చిన వినాయకుడి ప్రతిమలను భక్తిశ్రద్ధలతో నిమజ్జనానికి తరలించారు. నీటి కొరత కారణంగా జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న శింగనమల చెరువులో ఈ ఏడాది గణేశ్ నిమజ్జనాన్ని చేపట్టారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి వినాయక ప్రతిమల తరలింపు మొదలైంది. పలు వీధులు దాటుకుంటూ సప్తగిరి సర్కిల్ మీదుగా శింగనమల వైపు విగ్రహాలను తరలించారు. - అనంతపురం కల్చరల్ -
మళ్లీ రా.. గణేశా!
‘సాక్షి’నెట్వర్క్: భక్తుల ఆటాపాటలు, భజన కోలాటాలతో గణేశ్ నిమజ్జనం వైభవంగా సాగింది. ఎటుచూసినా కోలాహలమే కనిపించింది. వర్షం కురుస్తున్నా యువకులు చిందులు వేస్తూ ఉత్సాహంగా ఏకదంతుడికి వీడ్కోలు పలికారు. ఎప్పటిలాగే నారాయణపేటలో శోభాయాత్ర వినూత్నంగా సాగింది. బుధవారం సాయంత్రం ప్రారంభమైన ఊరేగింపు గురువారం అర్ధరాత్రి దాటినా కొనసాగుతూనే ఉంది. నిమజ్జనంలో సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక అంశాలపై ఉత్సవకమిటీలు పోటీ పడి అలంకరణ చేశారు. అయిజ, కొడంగల్, షాద్‌నగర్, కొల్లాపూర్, ఆత్మకూరు, మక్తల్ పట్టణాలతో పాటు పలు మండలకేంద్రాల్లోనూ ఉత్సాహంగా నిమజ్జనం నిర్వహించారు. బీచుపల్లి, పెబ్బేరు కృష్ణా తీరంలో భారీగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. -
బై..బై.. గణేషా..
-
రూ.5.21 లక్షలు పలికిన గణేష్ లడ్డూ
హైదరాబాద్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజలు అందుకుంటున్న గణనాథుల లడ్డూలు వేలంలో అధిక రేటు పలుకుతున్నాయి. గురువారం నగరంలోని బడంగ్‌పేటలో గణేషుని లడ్డూ రూ. 5.21 లక్షలు పలికింది. పూజలందుకున్న గణనాథుడి లడ్డూను తమ సొంతం చేసుకునేందుకు భక్తులు ఉత్సాహంగా వేలంలో పాల్గొన్నారు. చివరికి వినాయక లడ్డూను వేలంలో బాదం నర్సింహయాదవ్ అనే వ్యక్తి రూ. 5.21 లక్షలకు దక్కించుకున్నారు. -
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
ఆత్మకూర్ : మండల పరిధిలోని బాలకిష్టాపూర్ తండాలో మంగళవారం రాత్రి 10:30గంటలకు వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తుండగా అపశ్రుతి చోటుచేసుకుం ది. ఎస్ఐ సీహెచ్ రాజు తెలిపిన వివరాలు.. తండాకు చెందిన మంగ్యానాయక్ (38) వినాయక నిమజ్జనంలో ఉన్న జనరేటర్ స్టార్ట్ కాకుండా మొరాయించింది. దాన్ని స్టార్ట్ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈయనకు భార్య శివమ్మ, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉంది. ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.