హిందూపురంలో గురువారం నిర్వహిస్తున్న వినాయక నిమజ్జన వేడుకలకు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు.
అనంతపురం సెంట్రల్: హిందూపురంలో గురువారం నిర్వహిస్తున్న వినాయక నిమజ్జన వేడుకలకు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. బుధవారం బందోబస్తు ఏర్పాట్లకు సంబందించిన వివరాలను ‘సాక్షి’కి వెల్లడించారు. జిల్లాలో హిందూపురంలో ఏడు రోజులకు నిమజ్జన వేడుకలు నిర్వహిస్తారన్నారు. ఈ వేడుకల్లో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు.
అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణలో ఐదుగురు డీఎస్పీలు, 19 మంది సీఐలు, 75 మంది ఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, స్పెషల్ పార్టీ బలగాలు మొత్తం 700 మందిని తరలిస్తున్నట్లు వివరించారు. నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిసేందుకు ఉత్సవ నిర్వాహకులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా డయల్–100, 9989819191 సెల్ నెంబర్‌కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.