
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: వినాయక విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాలు చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
చదవండి: వేయలేక.. వదల్లేక.. భక్తులకు నిమజ్జనం టెన్షన్
ఇదిలా ఉండగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో తయారైన వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సోమవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. హైకోర్టు ఉత్తర్వులను సాధ్యమైనంత త్వరగా సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని సీఎం కేసీఆర్ వారిని ఆదేశించారు.
చదవండి: TS High Court:హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయాలని పురాణాల్లో చెప్పారా?
Comments
Please login to add a commentAdd a comment