ఊరంతా సందడి..
ఐదు రోజుల పాటు నేత్రపర్వంగా సాగిన వినాయక చవితి వేడుకలు మంగళవారం ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. వివిధ కళారూపాల కోలాహలం మధ్య జిల్లా కేంద్రం అనంతపురంలో కొలువుదీర్చిన వినాయకుడి ప్రతిమలను భక్తిశ్రద్ధలతో నిమజ్జనానికి తరలించారు. నీటి కొరత కారణంగా జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న శింగనమల చెరువులో ఈ ఏడాది గణేశ్ నిమజ్జనాన్ని చేపట్టారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి వినాయక ప్రతిమల తరలింపు మొదలైంది. పలు వీధులు దాటుకుంటూ సప్తగిరి సర్కిల్ మీదుగా శింగనమల వైపు విగ్రహాలను తరలించారు.
- అనంతపురం కల్చరల్