'వినాయక నిమజ్జనానికి రూ.4.7 కోట్లు' | minister harish rao statement on vinayaka nimajjanam | Sakshi
Sakshi News home page

'వినాయక నిమజ్జనానికి రూ.4.7 కోట్లు'

Published Sat, Sep 19 2015 2:24 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 AM

minister harish rao statement on vinayaka nimajjanam

హైదరాబాద్: వినాయక చవితి నిమజ్జనానికి నీటిపారుదల శాఖ విభాగం తరఫున రూ.4 కోట్ల 70 లక్షలు ఖర్చు పెడతామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ నగరంలో మీడియాతో మాట్లాడారు. వినాయక చవితి నిమజ్జనాన్ని పురస్కరించుకుని ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్లో 33 క్రేనులు, చెరువుల వద్ద 21 క్రేనులు, నెక్లెస్ రోడ్డులో 48 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

మిషన్ కాకతీయ పనులు ఈ ఏడాది పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. గణేశుడి దయతో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులన్నీ నిండాయని తెలిపారు. మరిన్ని వర్షాలు పడి మరిన్ని చెరువులు నిండాలని గణేశుడని కోరుకుంటున్నాని చెప్పారు. గణేశుడి నిమజ్జనానికి ప్రజలందరూ సహకరించాలని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా ప్రజలను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement