resuced
-
Video: వరద నీటిలో చిక్కుకున్న జంట.. కారుపై కూర్చొని..
అహ్మదాబాద్: గుజరాత్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెరువులు, వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తోన్న ఓ జంట నదిలో చిక్కుకుపోవడం తీవ్ర కలకలం సృష్టించింది. అనంతరం, ఎంతో కష్టం మీద వారిద్దరినీ కాపాడారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని సంబర్కంట ప్రాంతంలో ఓ జంట వరద నీటిలో చిక్కుకున్నారు. కారులో ప్రయాణిస్తోన్న జంట వరద నీటిలో మునిగిపోయింది. కారు కనిపించనంత వరకు వరద వచ్చింది. అతి కష్టంమీద కారు పైభాగానికి చేరుకున్న ఆ జంట.. సాయం కోసం దాదాపు రెండు గంటలపాటు దాంతో బిక్కుబిక్కుమంటూ వేచి చూశారు.అనంతరం, రంగంలోకి సహాయక బృందాలు వారిని కాపాడగలిగారు. మరికొంత సమయానికే కారు వరదలో కొట్టుకుపోయింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. गुजरात में बारिश ने मचाई तबाही, साबरकांठा में कार सवार परिवार नदी में बह गया#gujaratflood #gujaratrain #LivetimesNews #LTDigital pic.twitter.com/QsX3P5jGcb— Live Times (@livetimes_news) September 8, 2024 -
వయనాడ్ విలయం.. 206 మంది ఎక్కడ?
వయనాడ్ ప్రకృతి విలయానికి సంబంధించిన అప్డేట్స్.. 👉వయనాడ్ జిల్లాలో ప్రకృతి విలయం కారణంగా వందల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. వయనాడ్‌లో తాజాగా మృతుల సంఖ్యలో 357కు చేరుకుంది. ఇంకా 206 మంది ఆచూకీ తెలియటం లేదని అధికారులు చెబుతున్నారు.👉ఆరో రోజు రెస్క్యూ బృందాలు సెర్చ్ ఆపరేషన్ కోసం ముందుకు సాగుతున్నాయి. #WATCH | Kerala: Search and rescue operations in landslide-affected areas in Wayanad entered 6th day today. The death toll stands at 308. Drone visuals from Bailey Bridge, Chooralmala area of Wayanad. pic.twitter.com/PK8nHd1BHr— ANI (@ANI) August 4, 2024 👉ఇక, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో బురద, శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించే పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి అధునాతన రాడార్లను రప్పించి, గాలించిన తర్వాత సహాయక చర్యలు ముగుస్తాయి. #WATCH | Kerala: Search and rescue operations in landslide-affected areas in Wayanad entered 6th day today. The death toll stands at 308. Drone visuals from Bailey Bridge, Chooralmala area of Wayanad. pic.twitter.com/PK8nHd1BHr— ANI (@ANI) August 4, 2024👉చెలియార్ నదిలో లభ్యమైన మృతదేహాలు, శరీర భాగాల్ని గుర్తించటం కష్టంగా మారింది. జిల్లాలో ఇప్పటివరకు 215 మృతదేహాల్ని వెలికితీశారు. ఇందులో 87 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. 30 మంది చిన్నారులుగా గుర్తించారు.👉ఇక, కల్పేట ఫారెస్ట్ ఆఫీసర్ కే హాషిస్ నేతృత్వంలోని రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించింది. అటవీ ప్రాంతంలో ఉన్న లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఓ గిరిజన కుటుంబం చిక్కుకోగా, నాలుగున్నర గంటలపాటు శ్రమించి తాళ్ల సహాయంతో రెస్క్యూ బృందం కొండపైకి చేరుకొని గిరిజన కుటుంబాన్ని కాపాడింది.केरल: वायनाड में भूस्खलन प्रभावित क्षेत्रों में बचाव और तलाशी अभियान 6वें दिन भी जारी.#Kerala #Rescue #Wayanad #News #BreakingNews pic.twitter.com/AwKMkBUjYc— Dainik Hint (@dainik_hint) August 4, 2024👉వయనాడ్ బాధితులకు సాయం చేసేందుకు ప్రముఖ సినీనటుడు మోహన్‌లాల్ ముందుకొచ్చారు. టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో ఉన్న ఆయన- సైనిక దుస్తుల్లో వచ్చి, విపత్తు ప్రాంతాన్ని సందర్శించి బలగాలతో సమావేశమయ్యారు. విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా రూ.3 కోట్ల విరాళాన్ని బాధితుల కోసం ఇస్తున్నట్లు తెలిపారు. #WayanadLandslides #RescueOperationsPreparations for the erection of a bridge on #Meppadi-#Chooralmala Road are underway. Bridging assets from Delhi along with dog squad have landed at Kannur Airport, with further movement to the site being meticulously coordinated. The relief… pic.twitter.com/S4lFJ8kwKX— Southern Command INDIAN ARMY (@IaSouthern) July 31, 2024 👉వయనాడ్ విపత్తులో ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక రోజంతా ఓ కుటుంబం చేసిన యుద్ధం వెలుగులోకి వచ్చింది. చూరల్‌మలలోని అంజిశచలయిల్ ప్రాంతానికి చెందిన సుజాత కుటుంబం ఒకే రోజు రెండు భయంకర అనుభవాలను ఎదుర్కొన్నది. కొండ చరియలు విరిగిపడటంతో ఈ కుటుంబం దగ్గరలో ఉన్న ఓ కొండపైకి చేరుకుని ఒక చిన్న గుహ లాంటి ప్రదేశంలో తలదాచుకున్నది. #Wayanad #WayanadLandslide #PrayForWayanadm #helping #Humanity #elephantlove #Kerala #KeralaFlooding #JUSTIN #TrendingNews #keralanews #TamilnaduStandsWithKerala #BREAKINGNEWS Pray for Wayanad =🙏🏻🥹💯This is a video record of a true incident = 😭💯 pic.twitter.com/WnL42MIHVC— A𝚂𝙷𝙸𝙺🦋 (@KuttyAshik_0907) August 4, 2024 👉అయితే, వీరి పక్కనే ఒక అడవి ఏనుగుల మంద కూడా ఉన్నది. తమను ఏమీ చేయవద్దని ఏనుగులను ప్రార్థించామని, అవి తమ జోలికి రాలేదని సుజాత చెప్పారు. మరునాడు ఉదయం సహాయ సిబ్బంది వీరిని రక్షించారు. ప్రస్తుతం సుజాతతో పాటు ఆమె మనవరాలు మృదుల సురక్షితంగా ఉండగా, మిగతా కుటుంబసభ్యులు గాయాలతో చికిత్స పొందుతున్నారు. -
ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్
కోట్లాది మంది ప్రార్థనలు ఫలించాయి. ఉత్తరాఖండ్ సిల్క్యారా సొరంగం ఆపరేషన్ విజయవంతం అయ్యింది. టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులను మంగళవారం సురక్షితంగా బయటకు తెచ్చింది రెస్క్యూ టీం. పాక్షికంగా కూలిపోయిన టన్నెల్లో చిక్కుకున్న కూలీలంతా క్షేమంగానే ఉండగా.. వైద్య పరీక్షల కోసం ఆంబులెన్స్‌లో వాళ్లను ఆస్పత్రికి తరలించారు. మొత్తంగా 17 రోజులపాటు నిర్మిరామంగా కృషి చేసి బయటకు తెచ్చిన బలగాలపై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని వీడియో సందేశం ఎక్స్‌లో ఉంచారు. కార్మికులను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేసిన అధికారులు.. చివరకు రాట్‌హోల్ మైనింగ్ టెక్నిక్‌తో విజయం సాధించారు. మంగళవారం సాయంత్రం ఐదుగురు సభ్యుల బృందం ప్రత్యేక పైప్ ద్వారా లోపలికి వెళ్లి కార్మికులను ఒక్కొక్కరిగా బయటకు తెచ్చింది. గంటపాటు కొనసాగిన ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయ్యింది. ఘటనాస్థలానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, రోడ్డు రవాణా శాఖల మంత్రి జనరల్ వీకే సింగ్‌లు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. सिल्क्यारा टनल बचाव कार्य में शामिल सभी का धन्यवाद। #SilkyaraTunnelRescue pic.twitter.com/H8r0JsRELY — Nitin Gadkari (@nitin_gadkari) November 28, 2023 నవంబర్ 12వ తేదీన పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తూ కొంతభాగం కూలిపోయి 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి వాళ్లను బయటకు తెచ్చేందుకు సహాయక బలగాలు నిర్విరామంగా కృషి చేశాయి. అదృష్టవశాత్తూ టన్నెల్లో రెండు కిలోమీటర్ల ప్రాంతం తిరగడానికి ఉండడం, బయట నుంచి తాగునీరు, ఆహారం, ఔషధాలు అందించడంతో వాళ్లంతా క్షేమంగా ఉండగలిగారు. మరోవైపు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వీలుకల్పించి మానసికంగానూ ధైర్యం అదించారు అధికారులు. This is called rat mining. A person is filling this small bucket with hand tools to create further space and a push cushion machine advances this pipe inside the rubble. Process was repeated numerous times to dig down and reach trapped workers. #UttarakhandTunnelRescue pic.twitter.com/HGZMLnMWNe — Dutchess of Saffronation (@Kaalbhairavee) November 28, 2023 అంతకు ముందు దాదాపు 17 రోజులుగా సొరంగంలో ఉన్న వీరి వద్దకు ఆరు అంగుళాల వ్యాసం ఉన్న గొట్టాన్ని పంపించారు. ఆ పైప్ ద్వారా ఓ ఎండోస్కోపీ తరహా కెమెరాను పంపగా.. కూలీలంతా సురక్షితంగా ఉన్నట్లు అందులో కన్పించింది. ఫలించిన ప్రార్థనలు కుటుంబ సభ్యుల ఆందోళనలు ఒకవైపు.. మరోవైపు సొరంగంలో చిక్కుకున్న కార్మికులు బయటకు రావాలని కోట్ల మంది ప్రార్థించారు. అధికారులు సైతం ఆశలు వదిలేసుకోకుండా నిరంతరంగా శ్రమించారు. కార్మికులు బయటకు వస్తున్న సమయంలో మిఠాయిలు పంచుకుంటూ స్థానికులు కనిపించారు. #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue: Locals distribute sweets outside Silkyara tunnel as trapped workers are being rescued from the tunnel pic.twitter.com/oASZAy8unf — ANI (@ANI) November 28, 2023 #WATCH| Uttarkashi (Uttarakhand) tunnel rescue: CM Pushkar Singh Dhami meets the workers who have been rescued from inside the Silkyara tunnel pic.twitter.com/vuDEG8n6RT — ANI (@ANI) November 28, 2023 Uttarkarshi tunnel collapse UPDATE: Photos of the first worker rescued from the tunnel. pic.twitter.com/Iq0iVHOarv — Press Trust of India (@PTI_News) November 28, 2023 -
విశాఖ బీచ్‌లో రాళ్ల మధ్య యువతి.. 12 గంటల నరకం తర్వాత..
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని అప్పికొండ బీచ్‌లో ఓ యువతి రాళ్ల మధ్య చిక్కుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాళ్ల మధ్య అపస్మారక స్థితిలో సదరు యువతి మృత్యువుతో పోరాడింది. అదృష్టవశాత్తు యువతిని స్థానికులు గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, సదరు యువతి.. మరో యువకుడితో కలిసి బీచ్‌కు వెళ్లడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన కావ్య.. వర్మ రాజుతో కలిసి ఈ నెల 2 నుంచి అప్పికొండ శివాలయ పరిసరాల్లో ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం తీరం దగ్గరలో ఉన్న రాళ్ల గుట్టలపై ఆమె ఫొటో తీసుకుంటున్న క్రమంలో కిందపడిపోయింది. ఎత్తైన ప్రదేశం నుంచి జారి పడిపోయింది. ఈ క్రమంలో కావ్య.. అపస్మారక స్థితికి చేరుకోవడంతో వర్మ రాజు అక్కడి నుంచి పారిపోయడు. అప్పటికే రాత్రి కావడంతో కావ్య రాళ్ల మధ్యలో నుంచి కేకలు వేసింది. వర్మ రాజు ఎక్కడ.. బీచ్‌లో రాత్రివేళ జన సంచారం లేకపోవడంతో అలాగే రాత్రంతా మృత్యువుతో పోరాడింది. సోమవారం ఉదయం బీచ్‌కు వచ్చిన కొందరు జాలర్లు యువతిని చూడగా.. అక్కడే ఉన్న గజ ఈతగాళ్ల సహాయంతో అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. యువతి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం 108 వాహనంలో కావ్యను కేజీహెచ్‌కు తరలించారు. ఈ సందర్బంగా తాను కాలుజారి రాళ్ల మధ్య పడిపోయానని.. వర్మ రాజును ఏమీ అనవద్దని ఆమె పోలీసులు కోరడం విశేషం. ఇక పరారీలో ఉన్న వర్మరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంబులెన్సు సిబ్బంది యువతి తల్లికి సమాచారమివ్వగా.. వారు విశాఖ బయలుదేరి వెళ్లారు. ఇదిలా ఉంటే తమ కుమార్తె కనపడటంలేదని యువతి తల్లి మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేశారు.. ఇంతలో పీఎస్ నుంచి అంబులెన్స్ సిబ్బందికి సమాచారమిచ్చారు. దువ్వాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పరారీలో ఉన్న యువకుడికి ప్రమాదం జరిగిందని.. అతడు కూడా కేజీహెచ్‌లో ఉన్నట్లు సమాచారం. యువతి మిస్సింగ్ కేసు.. విశాఖకు వెళ్లడం ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఒడిశా దుర్ఘటన.. శవాలా గుట్టలు చూశాక ఆకలేస్తుందా?
ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదం దుర్ఘటన.. 278 కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవాళ్లలో మరికొందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ఇంకా వంద దాకా మృతదేహాల్ని గుర్తించాల్సిన పరిస్థితి. ఎంబాంబింగ్ ద్వారా మృతదేహాల్ని ఎంతో కాలం భద్రపర్చలేమని అంటున్నారు అధికారులు. మరోవైపు గుర్తుపట్టలేని విధంగా మారిన మృతదేహాల్లో తమ వారిని వెతుక్కునేందుకు అయినవాళ్లు పడుతున్న ఆరాటం దృశ్యాలు మనసుల్ని కలిచివేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంకోపక్క ఆ మృతదేహాలు తమవాళ్లవేనంటూ నాటకాలతో పరిహారం దక్కించుకునేందుకు కొందరు చేస్తున్న దుర్మార్గ ప్రయత్నాలు సైతం వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. సహాయక చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సిబ్బంది కూడా తీవ్రంగా కలత చెందుతున్నారు. తమ భావోద్వేగాలను ప్రదర్శిస్తున్నారు. నీళ్లను చూసిన ప్రతిసారి దాన్ని రక్తంగా ఒకాయన భావిస్తుంటే.. మరో సిబ్బంది ఆ శవాల గుట్టలను చూశాక ఆకలి కోరికే మరచిపోయారట. ఇలా తమ సిబ్బంది ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి సంబంధించిన విషయాలను ఎన్డీఆర్ఎఫ్ డీజీ వెల్లడించారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ డీజీ అతుల్ కర్వాల్ బాలాసోర్ యాక్సిడెంట్ ఆ పరిస్థితులను వివరిస్తూ.. ‘ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లినప్పుడు.. సహాయక చర్యల్లో పాల్గొన్న తమ సిబ్బంది అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారు. నీటిని చూసిన ప్రతిసారి రక్తమేనని ఒక సిబ్బంది భ్రమ పడుతుంటే.. మరొకరు మాత్రం ఆ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఆకలి కోరికే పోయిందని చెప్పారు. ఇలా మా సిబ్బంది ఎదుర్కొంటున్న ఈ తరహా సవాళ్లను దృష్టిలో పెట్టుకొని వారికి మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు. ఒడిశా రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగారు 300మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొన్నారు. వీళ్లకు స్థానికులు కొందరు సహకరించడం గమనార్హం. బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీయడంలో ఎన్డీఆర్ఎఫ్ కీలకంగా వ్యవహరించింది. దాదాపు 44 మంది బాధితులను సురక్షితంగా బయటకు తీయగా.. 121 మృతదేహాలను వెలికి తీశారు. విపత్తుల వేళ ఎంతో గుండె నిబ్బరం ప్రదర్శించే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిలో.. కొందరు మానసిక వేదనకు గురవుతున్నట్లు స్వయానా ఎన్డీఆర్ఎఫ్ డీజీ వెల్లడించడం గమనార్హం. ఇదీ చదవండి: ఒడిశా రైలు ప్రమాదంలో 40 మంది కరెంట్ షాక్‌తో మృతి? -
‘విద్యార్థుల తరలింపు సీఎం జగన్ కృషి వల్లే సాధ్యమైంది’
సాక్షి, తాడేపల్లి : మణిపూర్‌లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్థుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రెండు ప్రత్యేక విమానాల్లో విద్యార్థులను ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. కాగా, ఇంఫాల్ నుంచి 106 మంది విద్యార్థులతో ప్రత్యేక విమానం బయలుదేరింది. ఇక, విద్యార్థుల భోజన, రవాణా సదుపాయాలన్నీ ప్రభుత్వ ఖర్చుతోనే ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ సెక్రటరీ ముత్యాలరాజు స్పందించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను రక్షించాం. ఈ ఆపరేషన్‌పై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. మణిపూర్ సీఎస్‌తో మన ప్రభుత్వం టచ్‌లో ఉంది. ఒక్కో విద్యార్థిని నోడల్ పాయింట్‌గా పెట్టుకుని మిగతా స్టూడెంట్స్‌ని గుర్తించాం. ఇప్పటి వరకు 161 మంది విద్యార్థులను గుర్తించాం. కమర్షియల్ ఫ్లైట్స్‌లో వారిని తీసుకురావాలంటే లేట్ అవుతుందని స్పెషల్ ఫ్లైట్స్ పంపాం. విమానయాన శాఖ కూడా వెంటనే స్పందించింది. కోల్కత్తా, హైదరాబాద్‌లో దిగిన విద్యార్థులను గమ్యస్థానాలకు చేరుస్తాం. హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యే క బస్సులు ఏర్పాటు చేశాం. కొందరికి రెగ్యులర్ ఫ్లైట్స్‌లో కూడా టికెట్టు బుక్ చేశాం. వారిని ఎయిర్‌పోర్టు నుంచి కార్లలో స్వస్థలాలకు పంపుతాం అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ఫలించిన సీఎం జగన్ యత్నం -
నీళ్లలో దూకాడు.. బీజేపీ తరపున జాక్‌పాట్ కొట్టాడు
గాంధీనగర్: గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాదం.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సుమారు 135 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ప్రమాదంపై నమోదైన కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అయితే.. ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతున్న టైంలో.. ఓ వ్యక్తి ప్రముఖంగా వార్తల్లో హైలెట్ అయ్యారు. ఆయనెవరో కాదు.. మోర్బీ మాజీ ఎమ్మెల్యే కంతిలాల్ అమృతీయ(60). ఇప్పుడు ఆయన జాక్‌పాట్ కొట్టాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం గురువారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది బీజేపీ. ఇందులో మోర్బీ నియోజవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకి కాకుండా.. కంతిలాల్‌కు సీటు ఇచ్చి ఆశ్చర్యపర్చింది బీజేపీ. ఈ విషయాన్ని స్థానిక మీడియా ఛానెల్స్ ప్రముఖంగా ప్రచురించాయి. అక్టోబర్ 30వ తేదీన రాత్రి ప్రమాదం జరగ్గా.. ఆ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని లైఫ్ ట్యూబ్ ధరించి నీళ్లలోకి దూకి సహాయక చర్యల్లోకి పాల్గొన్నారు ఆయన. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కాగా.. మోకాళ్ల లోతు నీళ్లలో ఆయన ఆ పని చేశారంటూ మరోవైపు ట్రోలింగ్ కూడా నడిచింది. కంతిలాల్ అమృతీయ.. బీజేపీ నేత. గతంలో రెండుసార్లు మోర్బీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సేవాకార్యక్రమాలతోనూ ఆయన మంచి గుర్తింపు ఉంది అక్కడ. అయితే.. મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના ખુબ જ કમનસીબ છે. હું સ્થળ પર જ છું. સૌને નમ્ર અપીલ કે આ દુઃખની ઘડીમાં આપણે સૌ સાથે મળી શક્ય તેટલા લોકોને મદદરૂપ થઈએ. નોંધ:જે જગ્યાએ બચાવ કાર્ય ચાલુ છે ત્યા ખોટી ભીડ ના કરીએ જેથી રાહતકાર્યમાં કોઈ અડચણ ના આવે.@narendramodi @AmitShah @Bhupendrapbjp pic.twitter.com/s5HG2ZY0zt — Kantilal Amrutiya (@Kanti_amrutiya) October 30, 2022 ఈ అసెంబ్లీ ఎన్నికల జాబితాలో తొలుత కంతిలాల్ లేడని, అయితే సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న తరుణంలోనే ఆయనకు బీజేపీ సీటు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే బ్రిజేష్ మెర్జాను మోర్బీ ప్రమాదం నేపథ్యంలో ప్రజావ్యతిరేకతకు కారణం అవుతారనే ఉద్దేశంతోనే తప్పించినట్లు కథనాలు అందుతున్నాయి. ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండు దశల్లో డిసెంబర్ 1, 5వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు.. డిసెంబర్ 8వ తేదీన ప్రకటిస్తారు. ఇదీ చదవండి: క్రికెటర్ జడేజా భార్య.. బీజేపీ సీటుపై అక్కడ పోటీ -
ఆత్మహత్యకు రెడీ అయిన మహిళ.. పోలీసు తెలివికి ఫిదా.. వీడియో వైరల్
ఆమెకు ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు గానీ.. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైంది. ఆత్మహత్య చేసుకోవడానికి ఆమె నివాసం ఉంటోన్న అపార్ట్మెంట్ కిటికీలోని నుంచి కిందకు దూకెందుకు రెడీ అయ్యింది. ఇంతలో ఎంతో చాకచక్యంగా ఫైర్‌ఫైటర్ ఆమెను ఆత్మహత్య చేసుకోకుండా నిలువరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. జపాన్‌కు చెందిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె అపార్ట్మెంట్లోని కిటికిలోని నుంచి కిందకు దూకెందుకు సిద్దమైంది. ఇంతలో అక్కడకు చేరుకున్న ఫైర్‌ఫైటర్.. ఎంతో ధైర్యంతో, చాకచక్యంగా ఆమెను కాపాడాడు. సదరు మహిళ అపార్ట్మెంట్ పైనున్న ఫ్లాట్‌లోకి వెళ్లిన ఫైర్‌ఫైటర్ తాడు సాయంతో కిటికి వద్దకు వచ్చి.. ఆమెను ఒక్కసారిగా రెండు కాళ్లతో లోపలికి తన్నాడు. దీంతో, ఆమె కిటికిలోని నుంచి లోపలపడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. Vid of a Japanese firefighter rescuing a suicidaI lady was a job well-done 🔥😂😂😂😂😫 pic.twitter.com/8ocMHJahPN — Communicator of Ilorin (@usman__haruna) October 13, 2022 -
గోవాలో టూరిస్టులకు తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్
Dudhsagar Water Falls.. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, వర్షాల నేపథ్యంలో వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాల వేళ గోవాలోని దూద్‌సాగర్ వాటర్‌ఫాల్స్ వద్ద పెను ప్రమాదం తప్పింది. 40 మంది పర్యాటకులను సిబ్బంది కాపాడారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. కొద్దిరోజులుగా గోవాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. కాగా, శుక్రవారం సాయంత్రం కూడా భారీ వర్షాలు కురవడంతో దూద్‌సాగర్ జలపాతం నీటి మట్టం గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వాటర్‌ఫాల్స్ చూసేందుకు వచ్చిన 40 మందికి పైగా పర్యాటకులు నీటిలో చిక్కుకున్నారు. నీటిమట్టం పెరగడం వల్ల క్రాసింగ్ కోసం ఉపయోగించిన వంతెన కూలిపోయింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన దృష్టి లైఫ్‌సేవర్స్ పర్యాటకులను కాపాడారు. అనంతరం, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. The River Lifesaver rescued around 40 guests stuck at Dudhsagar Waterfall due to turning of crossing bridge where water level increased due heavy rainfall. I thank and congratulate the River Lifesavers for rescuing the tourists. pic.twitter.com/prw6yK69qi — Dr. Pramod Sawant (@DrPramodPSawant) October 14, 2022 ఈ సందర్భంగా లైఫ్‌సేవర్స్.. పర్యాటకులను కాపాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఆ ప్రాంతంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక, గోవాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంతో కొద్దిరోజుల పాటు దూద్‌సాగర్ జలపాతంలోకి ఎవరూ వెళ్లకూడదని దృష్టి లైఫ్‌సేవర్స్ హెచ్చరించింది. ఈ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్పందించారు. ఈ సందర్భంగా పర్యాటకులను కాపాడిన లైఫ్ సేవర్స్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. Today evening due to heavy rain at Karnataka water level at Dudhsagar waterfall increase due to this crossing bridge got turn. around 40 Guest stuck and unable to cross River Lifesaver went on bridge and help one by one to cross bridge pic.twitter.com/TutWgQFci8 — Dev walavalkar (@walavalkar) October 14, 2022 -
వరద బీభత్సం.. హెలికాప్టర్ రాకపోతే ప్రాణాలు పోయేవే!
దేశవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొర్లిపొంగుతున్నాయి. దీంతో కొన్నిచోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకుంటున్నారు. ఇక, గుజరాత్లో కురిసిన భారీ వర్షాలకు అంబికా నది ఒడ్డున ఒక్కసారిగి ఆకస్మిక వరదలు వచ్చాయి. ఈ వదరల్లో దాదాపు 16 మంది చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వారిని రక్షించాలని కలెక్టర్ వల్సాద్.. కోస్ట్ గార్డ్ అధికారులను అభ్యర్థించారు. దీంతో రంగంలోకి దిగిన ఇండియన్ కోస్ట్ అధికారులు చేతక్ హెలికాప్టర్ ద్వారా 16 మందిని అతికష్టం మీద కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో బలమైన గాలుల కారణంగా హెలికాప్టర్ సైతం.. ఒడిదుడుకులకు లోనైంది. Gujarat | On request from Collector Valsad to rescue personnel stranded due to flash floods on the banks of river Ambika, Indian Coast Guard launched an op through Chetak helicopter and rescued 16 people amidst marginal visibility in strong winds & heavy rains: ICG officials pic.twitter.com/LhJxJzboMs — ANI (@ANI) July 11, 2022 ఇది కూడా చదవండి: వరదల్లో కొట్టుకుపోయిన లారీ.. రేషన్ బియ్యం నీటిపాలు -
తిరుమల బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం.. కిడ్నాపర్ ఎవరంటే..?
సాక్షి, తిరుమల: ఎట్టకేలకు తిరుమలలో కిడ్నాప్ అయినా బాలుడు గోవర్ధన్ ఆచూకీ లభ్యమైంది. ఈ నెల 1వ తేదీన శ్రీవారి ఆలయం ముందు బాలుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఐదు రోజులుగా బాలుడి కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో కిడ్నాప్ చేసిన మహిళే మరోసారి బాలుడిని తిరుమలకు తీసుకురావడంతో వారిద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. కాగా, కిడ్నాప్ చేసిన మహిళను కర్నాటకకు చెందిన పవిత్రగా పోలీసులు గుర్తించారు. గోవర్దన్‌ను మొదట తిరుమల కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తరలించి అనంతరం పోలీసులు అతడి తల్లిదండ్రులకు అప్పగించడంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. మరోవైపు.. కిడ్నాపర్ పవిత్రపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: సరూర్‌నగర్‌లో పరువు హత్య -
వరద నీటిలో చిక్కుకున్న మహిళ
-
నది ప్రవాహంలో చిక్కుకున్న కార్మికులను కాపాడిన సిబ్బంది : హరిద్వార్
-
మానేరు వాగులో ఆరు గంటలు..
మానేరు వాగులో చేపల వేట కు వెళ్లిన ముగ్గురు యువకులు ఒక్కసారిగా వచ్చిన వరదకు అందులోనే చిక్కుకుపోయారు. చెట్టును పట్టుకుని ఇద్దరు, పైపును పట్టుకుని మరొకరు సుమారు ఆరు గంటలు నరకయాతన పడ్డారు. అప్రమత్తమైన అధికారులు, పోలీసులు రెస్క్యూటీం సహకారంతో ముగ్గురినీ ప్రాణాలతో రక్షించారు. ఈ సంఘటన వీణవంక మండలం చల్లూరు వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. సాక్షి, వీణవంక(హుజూరాబాద్): చల్లూరు గ్రామానికి చెందిన నేదురు రవి, నేదురు శ్రీనివాస్, మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన తిరుపతి ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో మానేరు వాగులో చేపలు పట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో వాగులో ఉధృతి ఎక్కువగా ఉండటంతో ముగ్గురూ కొట్టుకుపోయారు. వాగు ఒడ్డు నుంచి 600 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టును నేదురు శ్రీనివాస్, తిరుపతి పట్టుకున్నారు. నేదురు రవి వాగు ఒడ్డు నుంచి కిలోమీటర్ దూరం కొట్టుకుపోయి అక్కడ ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావి పైపు కనిపించడంతో దానిని పట్టుకున్నాడు. సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తుండగా వాగు ఒడ్డు నుంచి వెళ్తున్నవారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై కిరణ్‌రెడ్డి, సర్పంచ్ పొదిల జ్యోతిరమేశ్, ట్రస్మా అధ్యక్షుడు ముసిపట్ల తిరుపతిరెడ్డి వెంటనే వాగు వద్దకు చేరుకుని స్థానికుల సహాయంతో రక్షించేందుకు ప్రయణ్నించారు. కానీ వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఫలితం లేకుండా పోయింది. ట్రస్మా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కలెక్టర్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో రెస్క్యూటీం రంగంలోకి దిగింది. చదవండి: (ఒక్కసారిగా పెరిగిన వరద, ముగ్గురూ వాగులోనే..) వాగులో ఆరుగంటలు... సాయంత్రం 4 గంటలకు గల్లంతైన యువకులు రాత్రి 10 గంటల వరకు సుమారు ఆరు గంటలు వాగులేనే బిక్కుబిక్కు మంటు గడిపారు. కాపాడాలంటూ నేదురు శ్రీనివాస్, తిరుపతి రోదిస్తూ వేడుకున్నారు. నేదురు రవి అచూకీ కనుక్కోవడం కొంత ఆలస్యమైంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో వారిని కాపాడటానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సాయంత్రం 7 గంటలకు కరీంనగర్‌కు చెందిన రెస్క్యూటీం సభ్యులు వాగు వద్దకు చేరుకుని మొదటగా రవిని రక్షించేందుకు ప్రయణ్నించారు. మూడుసార్లు రవి వద్దకు వెళ్లి వెనక్కు వచ్చిన సిబ్బంది చివరకు తాడు సహాయంతో రాత్రి 9.40 గంటలకు రక్షించగలిగారు. మిగిలిన ఇద్దరినీ 10 గంటల సమయంలో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో చచ్చి బతికామంటు వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఎల్ఎండీ గేట్లు మూయడంతో... కరీంనగర్ ఎల్ఎండీకి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పెరుగడంతో అధికారులు సాయంత్రం నీటి విడుదలను పెంచారు. సుమారు లక్ష క్యూసెక్కులు దిగువకు వదలడంతో మానేరు వాగు ఉప్పొంగి ప్రవహించింది. వరదను అంచనా వేయకుండా యువకులు చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు. యువకుల గల్లంతు విషయం తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్ ఎల్ఎండీ గేట్లు మేసివేయాలని ఎస్సారెస్పీ అధికారులను ఆదేశించారు. దీంతో హుటాహుటిన గేట్లు మూసివేయడంతో వాగులో వరద ఉధృతి తగ్గుముఖంపట్టింది. దీంతో యువకులను కాపాడడం రెస్క్యూ సిబ్బందికి సులువైంది. హెలిక్యాప్టర్ తెప్పిస్తే బాగుండేది... ముగ్గురు యువకులు ఆరు గంటలపాటు ప్రాణాపాయ స్థితిలో వాగులో కొట్టుమిట్టాడారు. హెలిక్యాప్టర్ సకాలంలో తెప్పిస్తే యువకులను త్వరగా కాపాడేవారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆరు గంటల జాప్యంలో యువకులు పట్టు కోల్పోతే ప్రాణాలు కోల్పోయేవారని పేర్కొంటున్నారు. వరదలో ఆరు గంటలు చుక్కలు చూశామని, అసలు ప్రాణాలతో బయటపడుతామని అనుకోలేదని బాధితులు తెలిపారు. తహసీల్దార్ కనకయ్య, ఎస్సై కిరణ్‌రెడ్డి, ట్రస్మా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సర్పంచ్ పొదిల్ల జ్యోతిరమేశ్కు కృతజ్ఞతలు తెలిపారు. -
ఊహించని ప్రమాదం.. ఉత్త చేతులతో కాపాడారు
కాలిఫోర్నియా : ఉవ్వెత్తున్న ముంచుకోచ్చిన హిమపాతంతో అక్కడంతా గందరగోళంగా మారింది. స్నోబోర్డింగ్ కోసం వెళ్లిన ఐదుగురు చెల్లాచెదురు అయిపోయారు. వారిని చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు హాహాకారాలు చేయసాగారు. అంత సురక్షితంగా ఉన్నారనుకున్న క్రమంలో ఓ మహిళ తన భర్త కనిపించటం లేదంటూ బిగ్గరగా అరిచింది. రక్షణ సిబ్బందితోపాటు ప్రేక్షకులు కూడా రంగంలోకి దిగి అతన్ని వెతకటం ప్రారంభించారు. దాదాపు 20 నిమిషాల తర్వాత మంచు పొరల్లో కూరుకుపోయిన అతన్ని గుర్తించారు. గడ్డ కట్టిన మంచును ఉత్త చేతులతో తవ్వి అతని ప్రాణాలు కాపాడారు. వెంటనే ఆస్ప్రతికి తరలించగా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. కాలిఫోర్నియా, నెవాడా మధ్యలో ఉన్న స్క్వా వ్యాలీలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తన పుట్టినరోజు జరుపుకునేందుకు భార్యతోసహా వచ్చిన వ్యక్తికి ఈ అనుభవం ఎదురైంది. స్థానికుల చొరవతో అతను ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. మంచు కప్పేయటంతో ఆ రిసార్ట్‌ను తాత్కాలికంగా మూసేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. -
ఊహించని ప్రమాదం.. ఉత్త చేతులతో కాపాడారు
-
23 మంది కార్మికులను రక్షించిన వాయుసేన
పాపన్నపేట(మెదక్): మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాల్సన్‌పల్లి శివారులో వరదలో చిక్కుకుపోయిన 23 మంది కార్మికులను ఆదివారం ఉదయం భారత వాయుసేనకు చెందిన రెండు హెలికాప్టర్ల ద్వారా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. శనివారం మధ్యప్రదేశ్, ఒడిశాకు చెందిన 23 మంది కార్మికులు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ బృందాలు శనివారం వాతవరణం అనుకూలించకపోవడంతో ఆదివారం ఉదయం వారిని సురక్షితంగా బయటకు తెచ్చారు.