ఊహించని ప్రమాదం.. ఉత్త చేతులతో కాపాడారు | Resucers Saved with Bare Hands Man form Avalanche | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 4 2018 1:17 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

Resucers Saved with Bare Hands Man form Avalanche - Sakshi

కాలిఫోర్నియా : ఉవ్వెత్తున్న ముంచుకోచ్చిన హిమపాతంతో అక్కడంతా గందరగోళంగా మారింది. స్నోబోర్డింగ్‌ కోసం వెళ్లిన ఐదుగురు చెల్లాచెదురు అయిపోయారు. వారిని చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు హాహాకారాలు చేయసాగారు.  అంత సురక్షితంగా ఉన్నారనుకున్న క్రమంలో ఓ మహిళ తన భర్త కనిపించటం లేదంటూ బిగ్గరగా అరిచింది. 

రక్షణ సిబ్బందితోపాటు ప్రేక్షకులు కూడా రంగంలోకి దిగి అతన్ని వెతకటం ప్రారంభించారు. దాదాపు 20 నిమిషాల తర్వాత మంచు పొరల్లో కూరుకుపోయిన అతన్ని గుర్తించారు. గడ్డ కట్టిన మంచును ఉత్త చేతులతో తవ్వి అతని ప్రాణాలు కాపాడారు. వెంటనే ఆస్ప్రతికి తరలించగా అతను ప్రాణాలతో బయటపడ్డాడు.

కాలిఫోర్నియా, నెవాడా మధ్యలో ఉన్న స్క్వా వ్యాలీలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తన పుట్టినరోజు జరుపుకునేందుకు భార్యతోసహా వచ్చిన వ్యక్తికి ఈ అనుభవం ఎదురైంది. స్థానికుల చొరవతో అతను ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. మంచు కప్పేయటంతో ఆ రిసార్ట్‌ను తాత్కాలికంగా మూసేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement