Indian Coast Guard Recuse Operation In Gujarat Floods - Sakshi
Sakshi News home page

వరద బీభత్సం.. హెలికాప్టర్‌ రాకపోతే ప్రాణాలు పోయేవే!.. వీడియో వైరల్‌

Published Mon, Jul 11 2022 8:38 PM | Last Updated on Mon, Jul 11 2022 8:53 PM

Indian Coast Guard Recuse Operation In Gujarat Floods - Sakshi

దేశవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొర్లిపొంగుతున్నాయి. దీంతో కొన్నిచోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకుంటున్నారు. ఇక, గుజరాత్‌లో కురిసిన భారీ వర్షాలకు అంబికా నది ఒడ్డున ఒక్కసారిగి ఆకస్మిక వరదలు వచ్చాయి.

ఈ వదరల్లో దాదాపు 16 మంది చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వారిని రక్షించాలని కలెక్టర్‌ వల్సాద్‌.. కోస్ట్‌ గార్డ్‌ అధికారులను అభ్యర్థించారు. దీంతో రంగంలోకి దిగిన ఇండియన్‌ కోస్ట్‌ అధికారులు చేతక్‌ హెలికాప్టర్‌ ద్వారా 16 మందిని అతికష్టం మీద కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో బలమైన గాలుల కారణంగా హెలికాప్టర్‌ సైతం.. ఒడిదుడుకులకు లోనైంది. 

ఇది కూడా చదవండి: వరదల్లో కొట్టుకుపోయిన లారీ.. రేషన్‌ బియ్యం నీటిపాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement