ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు గుజరాత్‌ను అతలాకుతలం చేశాయి. వడోదర సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జనజీవితం అస్తవ్యస్తమైంది గాంధీనగర్, ఖేడా, వడోదర తదితర ప్రాంతాల్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఇప్పటికే 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 18వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆగస్టు 30 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు 15 అడుగుల పొడవైన మొసళ్లు ఇళ్లల్లోకి చొరబడుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.
వడోదర నివాసి ఆవేదన గుజరాత్ వర్షభీభత్సానికి అద్దం పట్టింది. వరద ఉదృతికి విలువైన మూడు కార్లు నీళ్లలో మునిగిపోయాయంటూ ఒక వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.. ఇక బతకడానికి ఏమీ మిగల్లేదు అంటూ తన బాధను పంచుకున్నాడు. దీనికి సంబంధించి నీట మునిగిన తన మూడు కార్ల ఫోటోలను రెడ్డిట్ యాప్‌లో షేర్ చేశాడు. పోస్ట్ ప్రకారం, 50 లక్షల రూపాయల విలువైన ఖరీదైన కారు ఆడి ఏ6,మారుతి సుజుకి సియాజ్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ భారీ వర్షం కారణంగా దెబ్బతిన్నాయి.
అయితే వీధిలో పార్క్ చేయడం వల్లే ఇలా జరగిందన్న నెటిజన్లు వ్యాఖ్యలకు స్పందించిన ఆయన మరింత వివరంగా తన దుస్థితిని వివరించాడు. తాను 5 BHK బంగ్లాలో ఉంటాననీ 85 ఇళ్లు ఉన్న సొసైటీలో, ప్రతీ ఇంటికి 3 కార్ పార్కింగ్‌లు ఉంటాయని తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నీట మునిగాయని , తన ఇంట్లోకి 7 అంగుళాలు, బయట దాదాపు 4 అడుగుల నీరు చేరిందని తెలిపారు. దీంతో నెటిజన్లు సానుభూతి ప్రకటించారు.
VIDEO | Gujarat Rains: Crocodile spotted at roof of a house as heavy rainfall inundate Akota Stadium area of Vadodara.
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz)#GujaratRains #GujaratFlood pic.twitter.com/FYQitH7eBK— Press Trust of India (@PTI_News) August 29, 2024
Comments
Please login to add a commentAdd a comment