audi a6
-
గుజరాత్ వరదలు : ‘‘బతకడానికి ఇంకేం మిగల్లేదు’’!
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు గుజరాత్‌ను అతలాకుతలం చేశాయి. వడోదర సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జనజీవితం అస్తవ్యస్తమైంది గాంధీనగర్, ఖేడా, వడోదర తదితర ప్రాంతాల్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఇప్పటికే 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 18వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆగస్టు 30 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు 15 అడుగుల పొడవైన మొసళ్లు ఇళ్లల్లోకి చొరబడుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. వడోదర నివాసి ఆవేదన గుజరాత్ వర్షభీభత్సానికి అద్దం పట్టింది. వరద ఉదృతికి విలువైన మూడు కార్లు నీళ్లలో మునిగిపోయాయంటూ ఒక వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.. ఇక బతకడానికి ఏమీ మిగల్లేదు అంటూ తన బాధను పంచుకున్నాడు. దీనికి సంబంధించి నీట మునిగిన తన మూడు కార్ల ఫోటోలను రెడ్డిట్ యాప్‌లో షేర్ చేశాడు. పోస్ట్ ప్రకారం, 50 లక్షల రూపాయల విలువైన ఖరీదైన కారు ఆడి ఏ6,మారుతి సుజుకి సియాజ్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ భారీ వర్షం కారణంగా దెబ్బతిన్నాయి.అయితే వీధిలో పార్క్ చేయడం వల్లే ఇలా జరగిందన్న నెటిజన్లు వ్యాఖ్యలకు స్పందించిన ఆయన మరింత వివరంగా తన దుస్థితిని వివరించాడు. తాను 5 BHK బంగ్లాలో ఉంటాననీ 85 ఇళ్లు ఉన్న సొసైటీలో, ప్రతీ ఇంటికి 3 కార్ పార్కింగ్లు ఉంటాయని తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నీట మునిగాయని , తన ఇంట్లోకి 7 అంగుళాలు, బయట దాదాపు 4 అడుగుల నీరు చేరిందని తెలిపారు. దీంతో నెటిజన్లు సానుభూతి ప్రకటించారు.VIDEO | Gujarat Rains: Crocodile spotted at roof of a house as heavy rainfall inundate Akota Stadium area of Vadodara. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz)#GujaratRains #GujaratFlood pic.twitter.com/FYQitH7eBK— Press Trust of India (@PTI_News) August 29, 2024 -
ఎట్టకేలకు ఆడి ఏ6 భారత మార్కెట్లోకి
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ 2020 మోడల్ ఏ6 సెడాన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మిడ్-సైజ్ లగ్జరీ సెడాన్ విభాగంలో 8వ జనరేషన్ ఆడి ఏ 6ను గురువారం ఆవిష్కరించింది. భారత క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆడీ ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్‌తో కలిసి ఈ కారును విడుదల చేశారు. దీని ప్రారంభ ధరను రూ. 54.20 లక్షలు’ఎక్స్‌షోరూం)గా హై ఎండ్ వెర్షన్ ధర రూ. 59.20 లక్షలుగా ఉండనుంది. ప్రీమియం ప్లస్, టెక్నాలజీ అనే రెండు వేరియంట్లలో ఈ కారు లభిస్తుంది. పూర్తిగా అప్‌గ్రేడ్ చేసిన స్టైలింగ్, మెరుగైన ఇంటీరియర్‌తో, వెనుక భాగంలో ఎక్కువ స్పేస్ తదితర మార్పులతో సరికొత్తగా దీన్ని తీసుకొచ్చింది. ఆడీ ఏ6 ప్రధాన ఫీచర్లు : 2.0 లీటర్ల టీఎఫ్ఎస్ఐ, బీఎస్-6 పెట్రోల్ ఇంజిన్, 240 బీహెచ్పీ శక్తిని, 370 ఎన్ఎం టార్క్, 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేరుబాక్స్, ,ఎనిమిది ఎయిర్‌బ్యాగులు, ఇంటీరియర్‌గా ట్విన్ టచ్ స్ర్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఏబీఎస్, ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్, ఈఎస్పీ, పార్కింగ్ సెన్సర్స్, 360 డిగ్రీ కెమెరా వంటి అధునాతన సౌకర్యాలతో క్యాబిన్ తీర్చిదిద్దింది. కేవలం 6.8 సెకన్లలో కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కారు ముందు భాగంలో సింగిల్ ఫ్రేమ్ గ్రిల్, సరికొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌లను అమర్చారు. 18 అంగుళాల అలాయ్ వీల్స్, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్ సదుపాయం, వర్చువల్ కాక్‌పిట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫోర్-జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, లైటింగ్ ప్యాకేజీ లాంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. డీజిల్ ఇంజిన్ కార్లకు స్వస్తి పలకాలనే ఫోక్స్‌వ్యాగన్ నిర్ణయంలో ఈ కారు ప్రస్తుతం కేవలం పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లభ్యం కానుందని ఆడీ తెలిపింది. అయితే భారత్‌లో మాత్రం డిమాండ్ ఆధారంగా భవిష్యత్తులో డీజిల్ ఇంజిన్ వేరియంట్‌ను విడుదలచేయనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇక మార్కెట్లో ప్రత్యర్థుల పోటీ విషయానికి వస్తే...మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్, బీఎండబ్ల్యూ 5 సిరీస్, వోల్వో ఎస్90, జాగ్వార్ ఎక్స్ఎఫ్తో ఈ కారు పోటీపడనుంది. -
కార్ల కాలుష్యంపై ఫోక్స్‌వ్యాగన్‌కు భారత్ నోటీసులు
న్యూఢిల్లీ: ఆడిఏ6 , ఆక్టావియా తదితర డీజిల్ కార్ల నుంచి ప్రామాణిక స్థాయికి మించి కాలుష్యకారక వాయువులు వెలువడుతున్నాయని పరీక్షల్లో తేలడంతో జర్మన్ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌కు భారత్ నోటీసులు జారీ చేసింది. కంపెనీ వివరణతో పాటు సాంకేతిక అంశాలు మొదలైనవి కూడా ఇవ్వాలని సూచిం చినట్లు భారీ పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి అంబుజ్ శర్మ తెలిపారు. ల్యాబొరేటరీల్లో పరీక్షలతో పోలిస్తే బైట రహదారిపై ఆడిఏ6, జెటా, ఆక్టావియా, ఆడిఏ4 డీజిల్ కార్లు అధికంగా కాలుష్య వాయువులు విడుదల చేస్తున్నాయని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్(ఏఆర్ఏఐ) గుర్తిం చినట్లు చెప్పారు. ఏఆర్ఏఎ నోటీసులు అందాయని, నవంబర్ 30లోగా వివరణ ఇవ్వనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కాలుష్య ప్రమాణ పరీక్షల నుంచి మోసపూరితంగా గట్టెక్కించే సాఫ్ట్వేర్.. ఫోక్స్‌వ్యాగన్ కార్లలో ఉందని తేలడం, దీంతో ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున వాహనాలను సంస్థ రీకాల్ చేయడం తెలి సిందే. కంపెనీపై అమెరికా దాదాపు 18 బిలియన్ డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. -
కొరటాల శివకు మహేష్ గిఫ్ట్
సూపర్‌స్టార్ మహేష్ బాబు మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. తన కెరీర్లోనే ఘనవిజయం సాధించిన శ్రీమంతుడు సినిమాను తనకు అందించిన దర్శకుడు కొరటాల శివకు ఓ లగ్జరీ కారును గిఫ్ట్ ఇచ్చాడు. ఎలాంటి మాస్ ఎలిమెంట్స్ లేకుండా తెరకెక్కిన ఓ మామూలు కథను ఇంతటి ఘనవిజయంగా మలిచిన శివకి ఆడి ఎ6 కారు అందించాడు మహేష్. మహేష్ ఇచ్చిన ఈ సడన్ సర్ప్రైజ్ తో ఆనందంతో పాటు షాక్‌కు గురయ్యాడు కొరటాల శివ. ఆదివారం రాత్రి కొరటాలను ఆడి షోరూంకు ఆహ్వానించిన మహేష్ దాదాపు 50 లక్షల రూపాయల ఖరీదైన ఈ కారును అందించాడు. అక్కడే ఉన్న మహేష్ భార్య నమ్రత, షోరూం నిర్వాహకులు కొరటాలకు అభినందనలు తెలియజేశారు. మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా తెరకెక్కిన శ్రీమంతుడు సినిమాను మైత్రి మూవీస్ బ్యానర్‌తో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మించాడు. ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతున్న శ్రీమంతుడు వందకోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండో చిత్రంగా నిలిచింది. Thank u @urstrulyMahesh sir and Namrata garu for such a lovely gesture. Really overwhelmed by ur love and positivity. Respect sir — koratala siva (@sivakoratala) September 21, 2015