సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ 2020 మోడల్ ఏ6 సెడాన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మిడ్-సైజ్ లగ్జరీ సెడాన్ విభాగంలో 8వ జనరేషన్ ఆడి ఏ 6ను గురువారం ఆవిష్కరించింది. భారత క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆడీ ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్‌తో కలిసి ఈ కారును విడుదల చేశారు. దీని ప్రారంభ ధరను రూ. 54.20 లక్షలు’ఎక్స్‌షోరూం)గా హై ఎండ్ వెర్షన్ ధర రూ. 59.20 లక్షలుగా ఉండనుంది. ప్రీమియం ప్లస్, టెక్నాలజీ అనే రెండు వేరియంట్లలో ఈ కారు లభిస్తుంది. పూర్తిగా అప్‌గ్రేడ్ చేసిన స్టైలింగ్, మెరుగైన ఇంటీరియర్‌తో, వెనుక భాగంలో ఎక్కువ స్పేస్ తదితర మార్పులతో సరికొత్తగా దీన్ని తీసుకొచ్చింది.
ఆడీ ఏ6 ప్రధాన ఫీచర్లు : 2.0 లీటర్ల టీఎఫ్ఎస్‌ఐ, బీఎస్-6 పెట్రోల్ ఇంజిన్, 240 బీహెచ్‌పీ శక్తిని, 370 ఎన్‌ఎం టార్క్, 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేరుబాక్స్, ,ఎనిమిది ఎయిర్‌బ్యాగులు, ఇంటీరియర్‌గా ట్విన్ టచ్ స్ర్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఏబీఎస్, ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్, ఈఎస్‌పీ, పార్కింగ్ సెన్సర్స్, 360 డిగ్రీ కెమెరా వంటి అధునాతన సౌకర్యాలతో క్యాబిన్ తీర్చిదిద్దింది. కేవలం 6.8 సెకన్లలో కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కారు ముందు భాగంలో సింగిల్ ఫ్రేమ్ గ్రిల్, సరికొత్త ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్‌లను అమర్చారు. 18 అంగుళాల అలాయ్ వీల్స్, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్ సదుపాయం, వర్చువల్ కాక్‌పిట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫోర్-జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, లైటింగ్ ప్యాకేజీ లాంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
డీజిల్ ఇంజిన్ కార్లకు స్వస్తి పలకాలనే ఫోక్స్‌వ్యాగన్ నిర్ణయంలో ఈ కారు ప్రస్తుతం కేవలం పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లభ్యం కానుందని ఆడీ తెలిపింది. అయితే భారత్‌లో మాత్రం డిమాండ్ ఆధారంగా భవిష్యత్తులో డీజిల్ ఇంజిన్ వేరియంట్‌ను విడుదలచేయనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇక మార్కెట్‌లో ప్రత్యర్థుల పోటీ విషయానికి వస్తే...మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్, బీఎండబ్ల్యూ 5 సిరీస్, వోల్వో ఎస్90, జాగ్వార్ ఎక్స్‌ఎఫ్తో ఈ కారు పోటీపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment