కొరటాల శివకు మహేష్ గిఫ్ట్
సూపర్స్టార్ మహేష్ బాబు మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. తన కెరీర్లోనే ఘనవిజయం సాధించిన శ్రీమంతుడు సినిమాను తనకు అందించిన దర్శకుడు కొరటాల శివకు ఓ లగ్జరీ కారును గిఫ్ట్ ఇచ్చాడు. ఎలాంటి మాస్ ఎలిమెంట్స్ లేకుండా తెరకెక్కిన ఓ మామూలు కథను ఇంతటి ఘనవిజయంగా మలిచిన శివకి ఆడి ఎ6 కారు అందించాడు మహేష్.
మహేష్ ఇచ్చిన ఈ సడన్ సర్ప్రైజ్ తో ఆనందంతో పాటు షాక్కు గురయ్యాడు కొరటాల శివ. ఆదివారం రాత్రి కొరటాలను ఆడి షోరూంకు ఆహ్వానించిన మహేష్ దాదాపు 50 లక్షల రూపాయల ఖరీదైన ఈ కారును అందించాడు. అక్కడే ఉన్న మహేష్ భార్య నమ్రత, షోరూం నిర్వాహకులు కొరటాలకు అభినందనలు తెలియజేశారు.
మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా తెరకెక్కిన శ్రీమంతుడు సినిమాను మైత్రి మూవీస్ బ్యానర్తో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మించాడు. ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతున్న శ్రీమంతుడు వందకోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండో చిత్రంగా నిలిచింది.
Thank u @urstrulyMahesh sir and Namrata garu for such a lovely gesture. Really overwhelmed by ur love and positivity. Respect sir
— koratala siva (@sivakoratala) September 21, 2015