srimanthudu
-
శ్రీమంతుడు వివాదం.. తెరపైకి రూ. 15 లక్షల టాపిక్.. అసలు వివాదం ఇదే..!
-
శ్రీమంతుడు వివాదం.. తెరపైకి రూ. 15 లక్షల టాపిక్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు- కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన చిత్రం శ్రీమంతుడు. 2015లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా కథ విషయంలో గతంలోనే వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో కొరటాల శివకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై తాజాగా చిత్ర యూనిట్ రియాక్ట్ అయింది. శ్రీమంతుడు సినిమా కథ విషయంపై ఎవరూ ఎటువంటి అభిప్రాయాలకు రావొద్దంటూ యూనిట్ విజ్ఞప్తి చేసింది. శ్రీమంతుడు సినిమాతో పాటుగా చచ్చేంత ప్రేమ అనే నవల కూడా రెండూ అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. ఇవి వేటికవే ప్రత్యేకం, రెండూ ఒకటి కావు. ఆ పుస్తకంతో పాటు సినిమాను కూడా ఒకసారి పరిశీలించండి. అప్పుడు వాస్తవం ఎంటో తెలుస్తోంది. ఈ వ్వవహారం ఇప్పటికి కూడా కోర్టు పరిధి రివ్యూలోనే ఉంది. కాబట్టి ఎవరూ ఒక అభిప్రాయానికి రావొద్దని మీడియాతో పాటు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. రూ. 15 లక్షలు ఇస్తామన్నారు: శరత్ ఈ వివాదంపై రచయిత శరత్ చంద్ర కూడా స్పందించారు. తన కథను కాపీ కొట్టి దర్శకుడు కొరటాల శివ సినిమా తెరకెక్కించారని ఆయన ఆరోపించారు. ' 2012లో నేను రాసిన 'చచ్చేంత ప్రేమ' అనే నవల స్వాతి మాస పత్రికలో ప్రచురితమైంది. అప్పట్లో ఈ నవలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. దీంతో ఇదే కథతో ఒక సినిమా చేద్దామని దర్శకుడు సముద్రను కలిశాను. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. త్వరలో ఈ ప్రాజెక్ట్‌ను కూడా మొదలు పెట్టాలనుకున్న సమయంలో 'శ్రీమంతుడు' థియేటర్లోకి వచ్చేసింది. ఆ సమయంలో నా స్నేహితులు కొందరు సనిమా చూసి అది నా కథే అని చెప్పడంతో నేను కూడా వెళ్లి చూశాను. నా నవలలో ఉన్నది ఉన్నట్లు వారు తెరకెక్కించారు. దీంతో డైరెక్టర్‌తో మాట్లాడాను కూడా ఈ కథ నాదేనని చెప్పాను. కానీ ఆయన అందుకు అంగీకరించలేదు. ఆ సమయంలో కొందరు సినీ పెద్దలు ఎంటర్ అయ్యారు. రూ. 15 లక్షలు ఇచ్చి రాజీ కుదుర్చే ప్రయత్నం కూడా చేశారు. ఈ వివాదంలో రచయితల అసోసియేషన్ నాకు ఎంతో సాయం అందించింది. వారి సాయంతోనే కోర్టు మెట్లెక్కాను. ఇప్పటికైనా ఈ కథ నాదేనని అంగీకరించమని కోరుకుంటున్నాను.' అని శరత్ చంద్ర పేర్కొన్నారు. -
శ్రీమంతుడు వివాదం.. దేవర డైరెక్టర్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు- కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన చిత్రం శ్రీమంతుడు. 2015లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా కథ విషయంలో గతంలోనే వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంలో కొరటాల శివకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది. కాగా.. గతంలో స్వాతి పత్రికలో ప్రచురించిన కథను కాపీ చేసి శ్రీమంతుడు సినిమా తీశారని రచయిత శరత్ చంద్ర హైదరాబాద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' రిలీజ్.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!) గతంలో శ్రీమంతుడు కథను కాపీ కొట్టారంటూ తన వద్ద ఉన్న ఆధారాలను విచారణ సమయంలో రచయిత శరత్ చంద్ర సమర్పించారు. వాటిని పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం రచయితల సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా నాంపల్లి కోర్టు ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. దీంతో డైరెక్టర్ కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొరటాల శివ దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సినిమా విడుదలైన 8 నెలల తర్వాతే శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించారని.. హైకోర్టు, స్థానిక కోర్టు తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని కొరటాల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే రచయితల సంఘం నివేదిక ఆధారంగానే స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుందని.. తీర్పులో స్పష్టమైన అంశాలు పొందుపరిచిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కొరటాల శివ పిటిషన్‌పై తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది. అంతే కాకుండా మీ పిటిషన్‌న డిస్మిస్ చేయమంటారా? మీరే వెనక్కి తీసుకుంటారా? అని న్యాయవాది నిరంజన్‌రెడ్డిని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దీంతో తామే పిటిషన్ వెనక్కి తీసుకుంటామని చెప్పడంతో సుప్రీం ఓకే చెప్పింది. కాగా.. కొరటాల శివ ప్రస్తుతం దేవర సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తోంది. -
10 కోట్ల వ్యూస్.. సంబరంలో మహేశ్ ఫ్యాన్స్
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, సందేశాత్మక చిత్రాల డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘శ్రీమంతుడు’ . ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూమీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ‘ఆగడు’వంటి డిజాస్టర్ తర్వాత మహేశ్‌ను నిలబెట్టడంతో పాటు, అయన మార్కెట్‌ను అమాంతం పెంచింది ‘శ్రీమంతుడు’ . తాజాగా ఈ సినిమా మరో ఘనతను అందుకుంది. యూట్యూబ్‌లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన తొలి తెలుగు సినిమాగా శ్రీమంతుడు రికార్డుల్లోకెక్కింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా తెలిపింది. 2015లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు టీవీల్లో ప్రసారమైంది. అయితే కేవలం యూట్యూబ్‌లో 10 కోట్లకు పైగా మంది వీక్షించడం విశేషం. మామూలుగా తెలుగు సినిమా హిందీలో డబ్ అయితే ఇన్ని వ్యూస్ వస్తాయి. కానీ ఓ తెలుగు సినిమాకు ఏకంగా ఇన్ని వ్యూస్ రావడం ‘శ్రీమంతుడు’కే దక్కింది. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, జగతిబాబు, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతమందించిగా మైత్రీ మూవీ మేకర్స్, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై మహేష్ బాబు, నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, మోహన్ సంయుక్తంగా నిర్మించారు. #Record100MForSRIMANTHUDUhttps://t.co/XaQuDXKl7j pic.twitter.com/3YK21BdMWP — Mythri Movie Makers (@MythriOfficial) April 17, 2020 చదవండి: మీ నిస్వార్థ సేవకు సెల్యూట్: మహేశ్ బాబు పుష్ప కోసం హోమ్‌వర్క్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సినిమా కష్టాలు
-
నేను మహేష్‌బాబుని: అల్లు అయాన్
-
నేను మహేష్‌బాబుని: అల్లు అయాన్
హైదరాబాద్: టాలీవుడ్లో మోస్ట్ పాపులర్ యాక్టర్ మహేష్ బాబు అభిమానుల లిస్టులో మరో ప్రముఖ వ్యక్తి చేరాడు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ తనేనంటూ చెప్తున్నాడు. ఇంతకి ఎవరు ఆవ్యక్తి అనుకుంటున్నారా.. అతను అల్లు వారింటి అబ్బాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల తనయుడు అల్లు అయాన్. ఇటీవల ఓ వీడియోలో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు బొమ్మలతో ఆడుకుంటున్న అయాన్ సమాధానమిస్తూ కనిపించాడు. తాను చిట్టి మహేష్బాబునని అల్లు అయాన్ ముద్దుముద్దు మాటలతో చెబుతున్నాడు. వీడియోలో నీ పేరేంటి? అని అడిగితే .. అయాన్ అని బదులిచ్చాడు. సైకిల్ తొక్కేటప్పుడు నువ్వు ఎవరని అడిగితే.. ఏ మాత్రం ఆలోచించకుండా ‘మహేష్‌బాబు’ అని సమాధానం ఇచ్చాడు ఈ జూనియర్ స్టైలిష్ స్టార్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
బీఎన్ఆర్ స్మారక పురస్కార ప్రధానోత్సవం
-
'ఘాజీ కోసం 50 సినిమాలు వదులుకున్నా'
c. రెగ్యులర్ కమర్షియల్ జానర్‌కు భిన్నంగా, తొలి భారతీయ అండర్ వాటర్ వార్ ఫిలింగా గుర్తింపు తెచ్చుకున్న ఘాజీ.. నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులకు కూడా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన మధీ ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం ఘాజీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సినిమాటోగ్రాఫర్ మధీ, తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఘాజీ మేకింగ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎంత కష్టపడ్డారు అన్న అంశాలతో పాటు.. మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించాడు. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన మధీకి తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే అప్పటికే ఘాజీ సినిమాకు కమిట్ అవ్వటంతో దాదాపు 50 చిత్రాలకు నో చెప్పాడట. ఆవారా, మిర్చి, రన్ రాజా రన్, శ్రీమంతుడు, ఘాజీ లాంటి వరుస సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న మధీ, అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భాగమతితో పాటు ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీకి కూడా సినిమాటోగ్రఫీ అందించేందుకు రెడీ అవుతున్నాడు. -
హీరో మహేశ్ కు కోర్టు నోటీసు
హైదరాబాద్: మహేశ్ బాబు సినిమా ‘శ్రీమంతుడు’పై వివాదం ముదురుతోంది. హీరో మహేశ్ బాబు, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత ఎర్నేని నవీన్ లకు కోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. మార్చి 3న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. తాను రాసిన ‘చచ్చేంత ప్రేమ’ నవలను కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమా తీశారని శరత్ చంద్ర అనే నవలాకారుడు ఫస్ట్ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన కోర్టు చిత్ర నిర్మాణ బృందంలో కొందరికి ఇప్పటికే సమన్లు జారీ చేసింది. ఎంబీ క్రియేషన్, మైత్రిమూవీస్ పతాకంపై తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ మహేశ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘శ్రీమంతుడు’ స్ఫూర్తితో పలువురు ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకున్నారు. మహేశ్ కూడా రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. -
’శ్రీమంతుడు’కి కోర్టు సమన్లు
హైదరాబాద్: హిట్ చిత్రంగా పేరొంది.. మహేశ్ బాబు కెరీర్లోనే గొప్ప చిత్రంగా నిలిచిన ‘శ్రీమంతుడు’కి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. తాను రాసిన నవలను ఆధారంగా శ్రీమంతుడు చిత్రంగా మలిచారని శరత్ చంద్ర అనే నవలాకారుడు వేసిన పిటిషన్‌ను ఫస్ట్ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సువర్ణ రాజు చిత్ర నిర్మాణ బృందంలో కొందరికి సమన్లు జారీ చేశారు. ఎంబీ క్రియేషన్ అధినేత, మైత్రిమూవీస్ అధినేత ఎర్నేని నవీన్, దర్శకుడు కొరటాల శివకు మంగళవారం కోర్టుల సమన్లు పంపించింది. గతంలో ఇదే కేసు విషయంలో సివిల్ కోర్టులో కూడా కేసు నమోదు చేశారు. హిందీలో ఇదే చిత్రాన్ని బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో తీయబోతున్న విషయం తెలిసి ఇంజక్షన్ ఆర్డర్ కోసం సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. ఇదిలా ఉండగానే తాజాగా క్రిమినల్ కోర్టు సమన్లు జారీ చేసింది. స్వాతి మాస పత్రికలో తాను ‘చచ్చేంత ప్రేమ’ అనే శీర్షికతో రాసిన నవలను శ్రీమంతుడు చిత్రంగా మలిచారని ఆరోపిస్తూ కుట్రపూరిత నేరం ఐపీసీ 120బి కింద కేసు నమోదు చేయాలని కోరుతూ క్రిమినల్ కోర్టులో శరత్చంద్ర కేసు వేశారు. దీని ప్రకారమే తాజాగా సమన్లు జారీ చేశారు. -
మహేష్ సినిమా కథ, కొరటాలది కాదా..?
రచయితగా ఇండస్ట్రీకి పరిచయం అయి, తరువాత దర్శకుడిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ కొరటాల శివ. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సాధించిన కొరటాల శివ, ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కించబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. గతంలో ఇదే కాంబినేషన్లో రూపొందిన శ్రీమంతుడు ఘనవిజయం సాధించటంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. స్వతహాగా రచయిత అయిన కొరటాల శివ, ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలకు కథా కథనాలను తనే రాసుకున్నాడు. అయితే మహేష్‌తో చేయబోయే కొత్త సినిమాకు మాత్రం మరో దర్శకుడి నుంచి కథను తీసుకున్నాడట. భూమిక నిర్మాతగా మారి తెరకెక్కించిన తకిట తకిట సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీహరి నాను, మహేష్ బాబు కోసం ఓ పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాను సిద్ధం చేశాడన్న టాక్ వినిపిస్తోంది. శ్రీహరి చెప్పిన లైన్ నచ్చిన కొరటాల, ప్రస్తుతం ఆ కథను పూర్తి స్క్రిప్ట్‌గా రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమాకు 'భరత్ అను నేను' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. 2017 జనవరిలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను అఫీషియల్ గా ఎనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
'శ్రీమంతుడు'కి మరో రికార్డ్
టాలీవుడ్ ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డ్ లన్నింటిని తిరగరాసిన సూపర్ హిట్ సినిమా శ్రీమంతుడు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలన విజయం నమోదు చేసింది. మహేష్ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అతి పెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిన ఈసినిమా ఇప్పటికీ తన రికార్డ్ ల హవా కొనసాగిస్తూనే ఉంది. తాజాగా శ్రీమంతుడు ఆడియో యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన శ్రీమంతుడు ఆడియో సాంగ్స్ ను అదే కంపెనీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లోనూ రిలీజ్ చేసింది. దాదాపు ఏడాదిన్నర క్రితం రిలీజ్ అయిన ఈ పాటలను ఇప్పటి వరకు 80 లక్షల మందిపైగా వినటంతో అరుదైన రికార్డ్ శ్రీమంతుడు సొంతమయ్యింది. ఈ విజయం పై ఆదిత్య మ్యూజిక్ కంపెనీతో పాటు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. -
మహేశ్ బాబు మధురానుభూతి
ఒక యావరేజ్, రెండు డిజాస్టర్ల తర్వాత ఏ హీరో అయినా ప్రయోగం చేయడానికి సిద్ధపడతాడా? అదికూడా.. సింపుల్ గా సైకిల్ తొక్కుతూ, లుంగీ కట్టుకొని నడుస్తూ, గ్రామాన్ని ఉద్ధరించే క్యారెక్టర్ మీదని దర్శకుడు చెబితే.. 'సరే' అనడం కుదిరేపనేనా! స్టార్ డమ్ చట్రంలో ఇరుక్కుపోయిన ఏ హీరో అలాంటి సాహసానికి 'సరే' అనడు.. ఒక్క మహేశ్ బాబు తప్ప! అలా సరిగ్గా ఏడాది కిందట అతను చేసిన సినీ ప్రయోగం.. సామాజికంగానూ పెను మార్పులకు కారణమైంది. (గోల్డెన్ చాన్స్ కొట్టేసిన రకుల్ ప్రీత్) కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'శ్రీమంతుడు' సినిమాని ఆదర్శంగా తీసుకుని చాలామంది ధనవంతులు, ఎన్నారైలు తమ ఊళ్లను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. 2015, ఆగస్టు 7న విడుదలైన 'శ్రీమంతుడు' నేటితో ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబు 'శ్రీమంతుడు' అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. 'ఒక్కసారి వెన్కి తరిగి చూసుకుంటే శ్రీమంతుడు టీంతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అవి మధురానుభూతులు. ఇంతకాలం ప్రేమను పంచినందుకు కృతజ్ఞతలు' అంటూ ట్విట్టర్ వేదికగా మనసులో మాటలను వెల్లడించారు. హీరోయిన్ శృతి హాసన్ కూడా శ్రీమంతుడు గుర్తుల్ని వల్లెవేసుకున్నారు. (మహేష్ లుక్ ఇదేనా..?) ప్రస్తుతం మహేశ్ బాబు.. మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. రకుల్ ప్రీత్ హీరోయిన్ కాగా, దర్శకుడు ఎస్ జే సూర్య విలన్ గా నటిస్తున్నారు. మహేశ్ బాబు పుట్టినరోజు(ఆగస్టు 9) సందర్భంగా కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. (పుట్టిన రోజున అభిమానులకు మహేష్ గిఫ్ట్) Cheers to Team Srimanthudu :) #1YearForSensationalSrimanthudu pic.twitter.com/zk90ys41wi — Mahesh Babu (@urstrulyMahesh) 7 August 2016 I look back at the whole experience of working with an amazing team with lots of happiness and fond memories.. — Mahesh Babu (@urstrulyMahesh) 7 August 2016 Thanks for all your love, today we celebrate 1 year since #Srimanthudu release. — Mahesh Babu (@urstrulyMahesh) 7 August 2016 It's been a year since @shrutihaasan stole our hearts as #Charuseela ! #1YearForSensationalSrimanthudu pic.twitter.com/gAAtQUch9D — SukhmanPhangura (@SukhmanPhangura) 7 August 2016 -
శ్రీమంతుడు కాంబినేషన్లో మరో సినిమా..?
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సూపన్ హిట్ సినిమా శ్రీమంతుడు. మహేష్ కెరీర్లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులన్నింటిని బద్దలు కొట్టింది. దీంతో మరోసారి ఇదే కాంబినేషన్లో సినిమా ఉంటుందంటూ ప్రకటించారు మహేష్ బాబు, కొరటాల శివ. కానీ ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది అన్న విషయం మాత్రం చెప్పలేదు. అయితే బ్రహ్మోత్సవం సినిమాతో భారీ డిజాస్టర్‌ను చూసిన మహేష్, వీలైనంత త్వరగా మరోసారి కొరటాలతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. అందుకే ప్రస్తుతం చేస్తున్న మురుగదాస్ సినిమా పూర్తవ్వగానే కొరటాల కాంబినేషన్లో సినిమాను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. కొరటాల శివ, డివివి దానయ్య బ్యానర్లో సినిమా చేయాల్సి ఉండటంతో ఆ సినిమాను మహేష్‌తోనే చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. -
సైమాకు థ్యాంక్స్ చెప్పిన సూపర్ స్టార్
హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డు-2016 అందుకోవటం సంతోషంగా ఉందని తెలిపాడు. అవార్డు అందుకున్న సందర్భంగా మహేష్ బాబు సోమవారం 'థ్యాంక్యూ సైమా' అంటూ ట్విట్ చేశాడు. శ్రీమంతుడు చిత్రానికిగానూ ప్రిన్స్ ఉత్తమ నటుడుగా సైమా అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సింగపూర్‌లో ఆదివారం ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా అవార్డుల ఎంపిక జరగగా, ఆ పోటీలో మహేష్ బాబు దూసుకుపోయి తొలి స్థానంలో నిలిచాడు. కాగా ఇప్పటివరకూ అయిదు సైమా అవార్డు వేడుకలు జరగ్గా, మహేష్ బాబు మూడుసార్లు సైమా అవార్డులను అందుకోవటం విశేషం. 2012లో దూకుడు, అలాగే 2014లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలకు మహేష్ ఉత్తమ నటుడుగా అవార్డులు కైవసం చేసుకున్నాడు. తాజాగా వచ్చిన అవార్డుతో అతడు ముచ్చటగా మూడోసారి కూడా ఉత్తమ నటుడుగా ఎంపిక కావటం విశేషం. కాగా మహేష్ బాబు, శృతిహాసన్ హీరో, హీరోయిన్లుగా, కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు తెరకెక్కిన విషయం తెలిసిందే. ఘన విషయం సాధించిన ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. Received my "Best Actor" Trophy for Srimanthudu! Thank You @siima — Mahesh Babu (@urstrulyMahesh) 4 July 2016 -
రా... రా శ్రీమంతుడా
ఎక్కడి సమస్యలు అక్కడే గ్రామాల వైపు కన్నెత్తి చూడని వైనం ఆదర్శంగా తీర్చి దిద్దుతామని హామీలతో సరి దత్తత గ్రామాల వైపు కన్నెత్తి చూడని శ్రీమంతులు దాతలు వచ్చారు.. మా కష్టాలు తీరుస్తారు.. కన్నీళ్లు తుడుస్తారు.. మా ఊరి దిశ, దశ మారుస్తారు.. ఇక పల్లె ప్రగతి బాట పడుతుంది.. అని గ్రామీణ ప్రజలు భావించారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. పురం అభివృద్ధి పథంలో నడవడం మాట అటుంచితే కనీస వసతులు కల్పిస్తే చాలన్న పరిస్థితులు నెలకొన్నాయి పలు దత్తత గ్రామాల్లో. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పారిశామ్రిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, శ్రీమంతులు ముందుకు వచ్చి పలు పల్లెటూళ్లను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. సమస్యలు పరిష్కరించి, ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీలు ఇచ్చారు. అదన్నారు.. ఇదన్నారు.. ఏదీ లేదాయె. చివరకు పల్లెవాసి అభ్యున్నతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా మారింది. అయినా వారు నేటికీ రారా శ్రీమంతుడా.. అని ఎదురు చూస్తున్నారు. మాటిచ్చారు.. మరిచారు మదనపల్లె: గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామంటూ గొప్పల కోసం కొందరు శ్రీమంతులు మాట ఇచ్చారు. ఆ తరువాత మరిచారు. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీని డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ఏడాది క్రితం దత్తత తీసుకున్నారు. పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఈశ్వరమ్మకాలనీ, రంగారెడ్డి కాలనీల్లో సభలు, సమావేశాలు నిర్వహించారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం కొంత కాలం పోలీసుల పహారా, విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ, అసాంఘిక కార్యకలాపాలు జరగనీయకుండా పోలీసు వ్యవస్థను పటిష్ట పరిచారు. గ్రామంలో 15 మంది సీపీవోలను ఎంపిక చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవి తప్పా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. కాప్పల్లెలో కానరాని ప్రగతి రామసముద్రం మండలం కాప్పల్లె పంచాయతీని నాయకుడు హనమంతుశాస్త్రి దత్తత తీసుకున్నారు. ఏడాది క్రితం ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అమలు పరచకుండా ముఖం చాటేశా రు. ఫలితంగా ఆ గ్రామం అభివృద్ధికి నోచుకోక పోతోంది. నిమ్మనపల్లె మండలం ఆచార్లపల్లెను టీడీపీ నాయకులు ఆర్జే వెంకటేష్ ఏడాది క్రితం దత్తత తీసుకున్నారు. కనీసం నీటి కొళాయిలు కూడా ఏర్పాటు చేయకపోవడం ఇందు కు నిదర్శనమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ఆచార్లపల్లెతోపాటు తవళం గ్రామాన్ని భాస్కర్‌నాయుడు దత్తత తీసుకుని తవళం నేలమల్లేశ్వర ఆలయం వరకూ రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటించారు. ఇంతకు మించి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో నాయకులు ఇచ్చిన హామీలు ఉత్తుత్తిగా మిగిలిపోయాయి. ముఖం చాటేశారు శ్రీకాళహస్తి రూరల్: ‘మేలచ్చూరు గ్రావుం. కొండ కింద ఒదిగిన ఓ గిరి జన ఆవాసం. ఏళ్ల తరబడి అభివృద్ధికి దూరంగా విసిరేసిన పల్లె అది. అక్కడున్న 150 కుటుంబాల్లోని ప్రజల బతుకులు రెక్కాడితే గానీ డొక్కాడని దీనస్థితి. అరుుతే ప్రధాని మోడీ పిలుపు అందుకున్న పారిశ్రామికవేత్త శ్రీనివాసులు గ్రావూన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ఏడాది కిందట హామీ ఇచ్చారు. దీంతో మేలచ్చూరు వాసులు శ్రీవుంతుడు సినివూలో చూపినట్లు తమ గ్రామం బాగుపడిపోతుందని సంబరపడిపోయూరు. అయితే వారి ఆశలు రోజులు గడిచేకొద్దీ అడియూశలయ్యూరుు. వూటిచ్చిన పెద్ద వునిషి గ్రావూభివృద్ధి సంగతి అటుంచితే.. కనీసం గ్రావుం వైపు ఇప్పటివరకు కన్నెతి చూడలేదంటూ ఆవేదన చెందుతున్నారీ గిరిపుత్రులు. ఒక్క మేలచ్చూరు పరిస్థితే కాదు... వుండలంలోని దత్తత గ్రావూలన్నింటిలోనూ పరిస్థితి దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.’ శ్రీకాళహస్తి వుండలంలోని చల్లపాళెం పంచాయుతీని వేవుూరు వుునిచంద్రారెడ్డి, ఊరందూరు శ్రీరామ్, ఎగువవీధి చేవుూరు రమేష్, యూసారపు అనంతకువూర్, కుంటిపూడి రేవిళ్ల నిరంజన్‌బాబు, కలవగుంట రుద్రశేఖర్రెడ్డి, కృష్ణారావు, గంగలపూడి శ్రీనివాసులునాయుుడు, బీవీ పురం డాక్టర్ రమేష్, మేలచ్చూరు శ్రీనివాసులు, వుుచ్చువోలు పృధ్విరాజ్, జలగం రాజేష్ దత్తతకు తీసుకున్నారు. అరుుతే వారు ఇప్పటివరకు ఆయా గ్రామాల్లో ఎలాంటి పనులు చేయుకపోగా, ఆ ఊళ్ల వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని స్థానికులు తెలిపారు. గట్టు దాటని గడ్డూరు బెరైడ్డిపల్లె: వుండలంలోని గడ్డూరు పంచాయతీని కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన టీడీపీ కోరం అనే సంస్థ ఏడాది క్రితం దత్తత తీసుకుంది. పంచాయతీని అభివృద్ధి చేస్తావుని గొప్పలు చెప్పింది. అయితే ఈ గ్రామం వైపు ఇంతవరకు కన్నెత్తి చూడలేదు. దీంతో ఆ పంచాయతీలో సవుస్యలు విలయతాండవం చేస్తున్నాయి. సువూరు 300 కుటుంబాలున్న ఈ గ్రామంలో వీధి దీపాలు సైతం వెలగక పోవడంతో అంధకారం నెలకొంది. డ్రైనేజీ వ్యవస్త దెబ్బతినడంతో వుురుగు నీరు వీధుల్లో ప్రవహిస్తోంది. కొన్ని వీధుల్లో మురుగు కాలువలు, సిమెంటు రోడ్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రావుంలో వీధి కొళాయిలు ఏర్పాటు చేయుక పోవడంతో ఊర్లో ఉన్న నీటితొట్టెల్లోని నీటిని తీసుకువెళ్లి, తాగాల్సిన దుస్థితి నెలకొంది. అభివృద్ధి జాడ లేదు అధికారులు, ప్రజా ప్రతినిధులు అభివృద్ధి మాట ఎప్పుడో మరిచారు. కనీసం దత్తత తీసుకున్న దాతలైనా మా పంచాయతీ వైపు కన్నెత్తి చూడకపోవడంతో ప్రగతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాగా ఉంది. తాగునీటి కోసం వుహిళలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఇలాంటి దుస్థితి ఏ గ్రావూనికి రాకూడదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. -వినోద్‌కువూర్, గడ్డూరు మా తలరాతలు మారలే! తవు కాలనీలో నెలకొన్న సవుస్యలను పరిష్కరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు పలు సార్లు విన్నవించాం. అయినా వారు పట్టించుకోలేదు. దాతలైనా బాగుపరస్తారనుకున్నాం. వారు మాట ఇచ్చి మరిచారు. కాలం వూరుతున్నా వూ తలరాతలు వూరడం లేదు. ఇప్పటికీ చేతిపంపులో నీరే వాడుకుంటున్నాం. -రావుచంద్రప్ప, గడ్డూరు అభివృద్ధిని విస్మరించారు! రామకుప్పం: వుండలంలోని ఆరివూనిపెంట, కొంగనపల్లె, చెల్దిగానిపల్లె గ్రావూలను దత్తత తీసుకున్నట్టు ప్రకటించిన దాతలు ఆ గ్రామాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. గ్రావూలను ప్రగతి పథంలో నడపడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంలేదు. దీంతో గ్రావు ప్రజలు తీవ్ర నిరాశతో కుమిలి పోతున్నారు. ఆరిమానిపెంట గ్రావూన్ని దత్తత తీసుకున్న డీఎఫ్‌వో చక్రపాణిరెడ్డి గ్రామ ఛాయలకు కూడా రాలేక పోయారు. దీంతో గ్రామంలో నిరుద్యోగ సమస్య, సీసీ రోడ్లు సమస్య తదితర సమస్యలు పరిష్కారం గ్రామస్తులకు కలగానే మిగిలింది. సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కొంగనపల్లెని చిన్నకృష్ణ, చెల్దిగానిపల్లెని ఉమాపతి దత్తత తీసుకున్నారేగానీ అభివృద్ధి విషయుంలో ఏ మాత్రం పురోగతి సాధించలేక పోయారు. బృందమ్మా.. బంధమేదీ? తొట్టంబేడు: అటవీశాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ తీసుకున్న దత్తత గ్రామాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఆ గ్రామాలను గురించి ఆమె పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆ పల్లెల్లో ప్రగతి పడకేసింది. మండలంలోని కొన్నలి, బోనుపల్లి గ్రామాలను మంత్రి సతీమణి బృందమ్మ దత్తత తీసుకున్నారు. అనంతరం వాటిని గురించి మరిచారు. దీంతో కొన్నలిలో రోడ్లు అధాన్నంగా ఉన్నాయి. మురుగునీటి కాలువలు, వీధిదీపాలు లేవు. మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. గ్రావుంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఎన్టీఆర్ సుజలస్రవంతి పథకంగా మార్చి తాగునీటిని విక్రయిస్తున్నా రు. ఇంతవరకు బృందవ్ము ఒక్క రూపాయి సొంత నిధులను ఆ గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు చేసిన దాఖలాలు లేవు. బోనుపల్లి అభివృద్ధి కోసం రూ.10 కోట్లు నిధులు నిధులు వచ్చాయని బృందమ్మ చెప్పినట్లు కొన్ని పత్రికల్లో వార్తలు వారే రాయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిధులను ఉపయోగించి అరకొర పనులను చేపట్టి ఆ పనులు సొంత నిధులతో చేసినట్లు చెప్పుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బోసన్నా.. ఆ గ్రామాన్ని చూడన్నా! పలమనేరు : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు పలమనేరు మండలంలోని సముద్రపల్లె గ్రామాన్ని స్థానిక టీడీపీ నాయకుడు సుభాష్‌చంద్రబోస్ ఏడాది కిందట దత్తత తీసుకున్నారు. ఆ మేరకు కలెక్టర్ ఇచ్చిన శిక్షణ తరగతులకు సైతం హాజరయ్యారు. ఆపై గ్రామంలో తను సొంతంగా చేసిన అభివృద్ధి పనులు ఇంకా మొదలు కాలేదు. కేవలం ప్రభుత్వం నుంచీ అందే అరాకొర నిధులు తప్పా దాత నుంచి గ్రామానికి ఒరిగిందేమీ లేదు. దీంతో గ్రామస్తులకు ఇక్కట్లు మాత్రం తప్పడం లేదు. గ్రామానికి దారి కూడా మూసేశారు సుమారు 160 గడపలున్న ఈ గ్రామానికి దారిదే అసలు సమస్య. గ్రామంలోని ఓ పెద్దమనిషి తన భూమంటూ దారిని మూసేశాడు. దీంతో గ్రామంలోని పాఠశాలకు, అంగన్వాడీ కేంద్రానికి, పంచాయతీ భవనానికి దారి లేకుండా పోయింది. ఇక తావడపల్లె మీదుగా పలమనేరుకు, రైతుల పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్య కొన్నాళ్లుగా ఉన్నా పట్టించుకునేవారే కరువయ్యారు. దీంతో తమ గ్రామంలో నెలకొన్న దారి సమస్యను కనీసం అధికారపార్టీ నాయకుడు, గ్రామాన్ని దత్తత తీసుకున్న దాత అయిన బోస్ పట్టించుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సమస్యల సంద్రం.. గతంలో ఉత్తమ పంచాయతీగా ఎంపికైన సముద్రపల్లె సమస్యల సంద్రంగా మారింది. పలుచోట్ల రోడ్లు అధ్వానంగా మారాయి. గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. పలు వీధులు ఆక్రమణలకు గురై కుచించుకుపోయాయి. గ్రామంలోని రోడ్ల పక్కన పేడదిబ్బలు దర్శమిస్తున్నాయి. పారిశుద్ధ్యం లోపించింది. దీంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. అభివృద్ధి జరగాలి మా గ్రామంలో పలు వీధులకు సీసీ రోడ్లు లేవు. ముఖ్యంగా వీధి దీపాలు వెలగక రాత్రి సమయాల్లో ఇబ్బంది పడుతున్నాం. ఇళ్లపైనే విద్యుత్ తీగలు ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ను గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయాలని కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక డ్రైనేజీలు దెబ్బతిని కాలువనీళ్లన్నీ ఎక్కడపడితే అక్కడ నిలిచిపోతాయి. బోసన్న గ్రామాన్ని దత్తత తీసుకున్నారు కాబట్టి మాసమస్యలను తీరిస్తే సంతోషిస్తాం. -స్వతంత్రబాబు, నూనేవారిపల్లె అన్న తరచూ వస్తూనే ఉన్నారు గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న విషయం గురించి ఎంపీడీవో దాతకు బోస్‌కు చెప్పాల్సి ఉంది. కానీ మెడమ్ ఈ విషయాన్ని మరి చినట్టున్నారు. ముఖ్యంగా గ్రామంలో దారి సమస్య ఉంది. దీన్ని త్వరగా పరిష్కారం చేయాలి. ఈ మధ్యనే ప్రభుత్వం నుంచి నిధులందాయి. దాంతో సీసీ రోడ్లు కొంత వేయిస్తున్నాం. -విజయ్‌కుమార్, సర్పంచ్, సముద్రపల్లె ప్రకటనలకే పరిమితం పీలేరు: కనీస వసతులకు నోచుకోని గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పలు గ్రామాలను దాతలు దత్తత తీసుకున్నారు. ఈ తంతు ప్రారంభమై ఏడాది కాలం దాటుతున్నా దాతలు ఎవరూ తాము దత్తత తీసుకున్న గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. పీలేరు మండలంలో 20 గ్రామాలను దాతలు దత్తత తీసుకున్నారు. ఆమూరి నాగరాజ అనే దాత ఒక్కరే 14 గ్రామాలను దత్తత తీసుకున్నారు. అలాగే వీరబోయని రెడ్డిప్రసాద్, దొడ్డిపల్లె గ్రామాన్ని, జె. మోహన్‌రాజు యర్రగుంట్లపల్లెను, శ్రీనివాసులు ముడుపులవేములను, ఎం. రవిప్రకాష్ వేపులబైలును, రాజశేఖర్‌రాజు, చరణ్‌రెడ్డి పీలేరును దత్తతు తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఎక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాఖ లాలు లేవు. కేవీపల్లె మండలంలో... కేవీపల్లె మండల అభివృద్ధి అధికారి రామచంద్ర సొంత గ్రామమైన మఠంపల్లె గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. 80 కుటుంబాలు ఉన్న గ్రామంలో పలు సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. వీధి దీపాలు కూడా లేవు. పక్కా గృహాలు మంజూరు కాకపోవడంతో ఇప్పటికీ సుమారు పది కుటుంబాల వారు పూరి గుడిసెల్లో కాపురం ఉంటున్నారు. గ్రామంలో మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. తాను దత్తత తీసుకున్న మఠంపల్లె గ్రామంలోని సమస్యలపై సర్వే చేపడుతున్నట్లు ఎంపీడీవో రామచంద్ర తెలిపారు. గుర్రంకొండ మండలంలో... సాక్ష్యాత్తు జిల్లా ఎస్పీ ఘట్టవునేని శ్రీనివాస్ దత్తత తీసుకొన్న సంగసముద్రం గ్రామం ఇంతవరకు అభివృద్ధికి నోచుకోలేదు. గ్రామానికి మినరల్ వాటర్‌ప్లాంట్, కల్యాణమండపం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు మరిన్ని హామీలు ఇచ్చారు. హామీల్లో వాటర్‌ప్లాంట్ మాత్రమే ఏర్పాటు చేశారు. అంతటితో సరిపెట్టుకుని మిగిలిన హామీలు నెరవేర్చలేదు. కలికిరి మండలంలో.... కలికిరి మండలంలో మెరవకిందపల్లెపంచాయతీ ఎంపీడీవో ఇందిరమ్మ ఏడాది క్రితం దత్తత తీసుకున్నారు. అలాగే టి.చండ్రావారిపల్లె పంచాయతీని హౌసింగ్ ఏఈ వెంకటరెడ్డి దత్తత తీసుకున్నారు. మొదట్లో కొంతకాలం గ్రామాల్లో పర్యటించి హడావిడి చేశారు. అనంతరం దత్తత గ్రామాల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించలేదు. కలకడ మండలంలో... మండలంలోని నడిమిచెర్ల, కోన, గుడిబండ పంచాయతీలను నాగరాజ దత్తతు తీసుకున్నారు. బాలయ్యగారిపల్లె, కలకడ, బాటవారిపల్లెను శేఖర్, గంగాపురం, కే.దొడ్డిపల్లె, దేవలపల్లె పంచాయతీలను మద్దిపట్ల వెంకట్రమణ, ఎర్రకోటపల్లె, నవాబుపేట, ముడియంవారిపల్లె శంకర్‌నాయుడు, ఎనుగొండపాళెం, కదిరాయచెరువులను శ్రీనివాసులునాయుడు దత్తత తీసుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు. సర్వేలతోనే సరి పెద్దతిప్పసముద్రం/బి.కొత్తకోట: తంబళ్లపల్లెని యోజకవర్గంలో దత్తత గ్రామాల్లో అభివృద్ధి సర్వేలకే పరిమితమైంది. తరువాత వాటి గురించి దాతలు పట్టించుకున్న దాఖలాలు లేవు. నియోజకవర్గంలో పెద్దమండ్యం మండలం మిన హా మిగిలిన ఐదు మండలాల్లోని 30 పంచాయతీ లను శ్రీమంతులు దత్తత తీసుకున్నారు. దత్త త గ్రామాల వివరాలను ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌లో నమోదు చేశారు. దీంతో ఆయా మండలాల్లోని అధికారులు దత్తత తీసుకున్న గ్రామాలకు వెళ్లి ప్రజలు ఎలాంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు, ఆర్థిక వనరులు, తక్షణం ఎలాంటి పనులు చేపట్టాలనే అంశాలపై సమగ్రంగా సర్వే నిర్వహించారు. ఆ తరువాత మిన్నకుండిపోయారు. దత్తత గ్రామాల్లో పరిస్థితి ఇలా.. బి.కొత్తకోట మండలంలోని 11 పంచాయతీలను పలువురు దత్తత తీసుకున్నారు. సదరు శ్రీమంతులు ఆ గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు. మేజర్ గ్రామ పంచాయతీ అయిన బి.కొత్తకోటను పోటీ పడి 10 మంది దత్తత తీసుకున్నా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు. కురబలకోట మండలంలోని అంగళ్లు గ్రామాన్ని దత్తత తీసుకున్న ఓ కళాశాల యాజమాన్యం ఏడాదికి రూ.20 లక్షలు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేసి గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని ఢంకా బజాయించినా ఫలితం శూన్యమని ప్రజలు ఆరోపిస్తున్నారు. పెద్దతిప్పసముద్రం మండలంలో కందుకూరు, టీ సదుం, రంగసముద్రం, తుమ్మరకుంట, బూర్లపల్లి, ములకలచెరువు మండలంలో బురకాయలకోట, బీకువారిపల్లి, మద్దినాయునిపల్లి, వేపూరికోట, కాలువపల్లి, కదిరినాయునికోట, తంబపల్లి మండలంలోని గుండ్లపల్లి, కొటాల, గోపిదిన్నె, ఎద్దులవారిపల్లి, బాలిరెడ్డిగారిపల్లి గ్రామాలను ఒకే వ్యక్తి దత్తత తీసుకున్నారు. కోటకొండ, తంబళ్లపల్లె గ్రామాలను మరో ఇద్దరు దత్తత తీసుకున్నారు. అయినా ఇంత వరకు దత్తత గ్రామాల గురించి పట్టించుకునే నాథులే కరువయ్యారు. -
బాహుబలి, శ్రీమంతుడు పోటాపోటీ
రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబులు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. ఆ ఇద్దరి సినిమాలకు సంబంధించిన ఇతర నటులు, సాంకేతిక నిపుణులు కూడా బరిలోకి దిగి ఒకరిపై ఒకరు కాలుదూస్తున్నారు. 63వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో.. ప్రభాస్ బాహుబలికి 9 నామినేషన్లు దక్కగా, మహేశ్ శ్రీమంతుడు సినిమాకు 8 నామినేషన్లు దక్కాయి. దీంతో పలు కేటగిరిల్లో ఈ రెండు సినిమాల మధ్య సరవత్తర పోటీ ఏర్పాడనుంది. చిన్న సినిమాగా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన 'మళ్లీ మళ్లీ రానిరోజు' సినిమాకు ఐదు నామినేషన్లు దక్కాయి. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా అందజేసే ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలకు ఈ ఏడాది హైదరాబాద్ వేదికగా నిలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో ఉత్తమ సినిమాలకు అందించే 63వ ఫిల్మ్‌ఫేర్ పురస్కారాల వేడుకను హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించనున్నారు. ఈనెల 18న జరగనున్న వేడుకకు నాలుగు భాషల నటీనటులు తరలిరానున్నారు. నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.. ఉత్తం సినిమా బాహుబలి భలే భలే మగాడివోయ్ మళ్లీ మళ్లీ ఇది రాని రోజు కంచె శ్రీమంతుడు ఉత్తమ దర్శకుడు కొరటాల శివ(శ్రీమంతుడు), క్రాంతి మాధవ్(మళ్లీ మళ్లీ..), క్రిష్ (కంచె), రాజమౌళి(బాహుబలి), త్రివిక్రమ్(సన్ ఆఫ్ సత్యమూర్తి) ఉత్తమ నటుడు అల్లు అర్జున్(సత్యమూర్తి), మహేశ్ బాబు(శ్రీమంతుడు), నాని(భలే భలే..), జూ. ఎన్టీఆర్(టెంపర్), ప్రభాస్(బాహుబలి) ఉత్తమ నటి అనుష్క(రుద్రమదేవి), హెబా పటేల్(కుమారి 21 ఎఫ్), నిత్యా మీనన్(మళ్లీ మళ్లీ), శృతి హాసన్(శ్రీమంతుడు), తమన్నా(బాహుబలి) ఉత్తమ సహాయ నటుడు అల్లు అర్జున్(రుద్రమదేవి), జగపతిబాబు(శ్రీమంతుడు), పోసాని కృష్ణ మురళి(టెంపర్), రాణా(బాహుబలి), సత్యరాజ్(బాహుబలి) ఉత్తమ సహాయ నటి కృతి కర్బందా(బ్రూస్ లీ), పవిత్రా లోకేశ్(మళ్లీ మళ్లీ), రమ్యకృష్ణ(బాహుబలి), రేవతి(లోఫర్), సుక్రీతి (కేరింత) బెస్ట్ మ్యూజిక్ అనూప్ రూబెన్స్(గోపాల గోపాల), చిరంతన్ భట్ (కంచె), దేవీ శ్రీ ప్రసాద్(శ్రీమంతుడు), గోపీ సుందర్(మళ్లీ మళ్లీ), కీరవాణి(బాహుబలి) బెస్ట్ లిరిక్స్ అనంత శ్రీరామ్(మేఘాలు లేకున్నా- కుమారి 21 ఎఫ్), చంద్రబోస్(ఎందుకో ఈ వేళ- గోపాల గోపాల), రామజోగయ్య శాస్త్రి(పోరా శ్రీమంతుడా- శ్రీమంతుడు), సీతారామశాస్త్రి(రా ముందడుగేద్దాం- కంచె), శ్రీమణి((శీతాకాం సూర్యుడిలాగా- సన్ ఆఫ్ సత్యమూర్తి) బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్) ధనుంజయ్ (భాజే భాజే- గోపాల గోపాల), కీర్తి సంఘాటియా (నీకు తెలియనిదా నేస్తమా- కంచె), ఎంఎల్ఆర్ కార్తికేయన్(పోరా శ్రీమంతుడా శ్రీమంతుడు), యాజిన్ నిజార్ (చారుశీలా- శ్రీమంతుడు), యాజిన్ నిజార్(మేఘాలు లేకున్నా- కుమారి 21 ఎఫ్) బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (ఫిమేల్) ఐశ్వర్య(మర్హబా- మళ్లీ మళ్లీ ఇది రాని రోజు), గీతా మాధురి(జీవనది- బాహుబలి), జొనితా గాంధీ(ఈ కథ- కేరింత), మోహన భోజరాజు(సైజ్ సెక్సీ- సైజ్ జీరో), శ్రీయా ఘోషాల్(నిజమేనని- కంచె) -
టాప్ త్రీలో అ..ఆ..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో.. నితిన్, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా అ..ఆ.. అనసూయ రామలింగం వర్సెన్ ఆనంద్ విహారి అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది. వేరే సినిమాలేవి బరిలో లేకపోవటం, సమ్మర్ సీజన్‌కు ఆఖరి చిత్రం కావటంతో కలెక్షన్ల పరంగా కూడా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఓవర్సీస్లో భారీ వసూళ్లను రాబడుతోంది. తొలి వారాంతనికి 1.7 మిలియన్ డాలర్లను వసూళు చేసిన అ..ఆ.. స్టార్ హీరోలకు షాక్ ఇస్తుంది. బాహుబలి, శ్రీమంతుడు సినిమాలు తప్ప ఇంత వరకు తొలి వారమే ఈ స్థాయి కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమా మరోటి లేదు. దీంతో త్రివిక్రమ్‌తో పాటు నితిన్ మార్కెట్ రేంజ్ కూడా భారీగా పెరిగిటనట్టే అని భావిస్తున్నారు. తొలి వారాంతానికి 4.4 మిలియన్ డాలర్లు వసూలు చేసి బాహుబలి టాప్ ప్లేస్‌లో ఉండగా, 2.09 మిలియన్ డాలర్లతో శ్రీమంతుడు రెండో స్ధానంలో నిలిచింది. 1.7 మిలియన్ డాలర్లతో అ..ఆ.., ఆ తరువాతి స్థానంలో నిలిచింది. నాన్నకు ప్రేమతో, అత్తారింటికి దారేది లాంటి భారీ బ్లాక్ బస్టర్స్‌ను దాటి అ..ఆ.. వసూళ్లు సాధించటం ట్రేడ్ పండితులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. -
అప్పుడు టెన్షన్... ఇప్పుడు కూల్!
మనకెంతో ఇచ్చిన ఊరికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి.. లేకపోతే లావైపోతాం.. ఇది ‘శ్రీమంతుడు’ డైలాగ్. రీల్ కోసం ఈ డైలాగ్ మాట్లాడిన మహేశ్‌బాబు రియల్‌గా కూడా ఇదే పాటిస్తారు. తెరపై తనని చూసి, ఇష్టపడటంతో పాటు, తన సినిమాలను హిట్ చేస్తున్న ప్రేక్షకులకుమంచి సినిమాలు ఇవ్వాలనుకుంటారు. ‘శ్రీమంతుడు’ ఇచ్చారు. ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’ కూడా మంచి సినిమానే అంటున్నారు. వరుసగా మంచి సినిమాలిస్తే.. ఇక మహేశ్‌బాబు లావు ఎందుకు అవుతారు. ఈ హ్యాండ్సమ్ హీరోతో ‘సాక్షి’ స్పెషల్ టాక్... ♦ ‘బ్రహ్మోత్సవం’ కారణంగా వ్యక్తిగా ఎదిగానని ఆడియో ఫంక్షన్లో అన్నారు. ఒక సినిమా అంత ప్రభావితం చేస్తుందా? డెఫినెట్‌గా చేస్తుంది. ఎందుకంటే, ఒక సినిమాకి దాదాపు ఏడెనిమిది నెలలు పని చేస్తాం. ఆ ట్రావెల్లో ఆ సినిమాలో ఉన్న మంచి విషయాలు మనల్ని వెంటాడతాయి. శ్రీకాంత్‌గారి సినిమాల్లో చిన్న చిన్న విలువలు ఉంటాయి. అలాంటి చిన్న విలువలను మోడ్రన్ డే లైఫ్‌లో మనం మర్చిపోతుంటాం. ఈ సినిమా చేస్తున్నప్పుడు అవి గుర్తొచ్చాయి. చూసే ప్రేక్షకులకు కూడా గుర్తొస్తాయి. ♦ మీకు గుర్తొచ్చిన రెండు, మూడు విషయాలను షేర్ చేసుకుంటారా? మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం రెగ్యులర్‌గా లంచ్‌కి కలుస్తుంటాం. ఆ సమయంలో హాయిగా కబుర్లు చెప్పుకుంటాం. ‘బ్రహ్మోత్సవం’లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. అందరం కలిసి టూర్‌కి వెళతాం. ఆ టూర్‌ని బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ ఎంజాయ్మెంట్లో ఒక పాట కూడా పాడుకుంటాం. రియల్ లైఫ్‌లో అలా పాటలు పాడుకోలేం కానీ, ఆ టూర్ తాలూకు సన్నివేశాలు చేస్తున్నప్పుడు నా ఫ్యామిలీ గుర్తొచ్చింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఇంకా చాలా చాలా గుర్తొచ్చాయి. ♦ ‘శ్రీమంతుడు’ మంచి ఎమోషనల్ మూవీ... ‘బ్రహ్మోత్సవం’ కూడా అలానే ఉంటుందేమో అనిపిస్తోంది.. ‘శ్రీమంతుడు’ లార్జర్ దేన్ లైఫ్. అందుకు పూర్తిగా భిన్నంగా ఉండే సినిమా ‘బ్రహ్మోత్సవం’. ఏ సినిమా వేల్యూ దానికి ఉంటుంది. ‘శ్రీమంతుడు’తో దీనికి పోలిక లేదు. ♦ ‘శ్రీమంతుడు’తో మీ ఇమేజ్ ఒక్కసారిగా స్కై హై అయ్యింది.. దాంతో నెక్ట్స్ సినిమా ఏం చేయాలా? అనే భయం ఏర్పడిందా? ‘పోకిరి’ అప్పుడు భయం వేసింది. మళ్లీ నెక్ట్స్ సినిమా ఏంటి? అని. అప్పుడు నా వయసూ తక్కువ. కెరీర్ వయసూ తక్కువే. దాంతో కొంచెం టెన్షన్ అనిపించింది. ‘శ్రీమంతుడు’ తర్వాత భయం అనిపించలేదు. వ్యక్తిగా, నటుడిగా పరిణతి వచ్చింది. జెన్యూన్‌గా చేసిన సినిమా అందరి కితాబులు అందుకున్నందుకు హ్యాపీ అనిపించింది. ‘శ్రీమంతుడు’ తర్వాతి సినిమా ఏంటి? అని ఆలోచించాను. కాన్సన్ట్రేషన్ ‘బ్రహ్మోత్సవం’ పై పెట్టా. టెన్షన్ పడకుండా కూల్‌గా చేశా. ♦ ‘శ్రీమంతుడు’ అందరి హార్ట్‌ని టచ్ చేసింది కాబట్టి, మళ్లీ అలానే అవ్వాలని ‘బ్రహ్మోత్సవం’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ని కావాలనే అంగీకరించారా? ‘శ్రీమంతుడు’ అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడే చెప్పారు. ఆయన కథలు రియలిస్టిక్‌గా ఉంటాయి. అలా ఇది నాకు బాగా కనెక్ట్ అయింది. యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఇప్పటివరకూ ఇలాంటి కథతో నేను సినిమా చేయలేదు. ♦ వసూళ్ల పరంగా ‘శ్రీమంతుడు’ని ‘బ్రహ్మోత్సవం’ దాటేస్తుందనిపిస్తోందా? అసలు వసూళ్ల గురించి నేను ఆలోచించలేదు. అది మన చేతుల్లో లేదు. మన బాధ్యత అంతా మంచి సినిమా చేయడం వరకే. కష్టపడి చేయాలి. మిగతాదంతా ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. ♦ టాలీవుడ్లో నంబర్ వన్ ప్లేస్‌కి సంబంధించిన స్పేస్ అలా ఉండిపోయింది. కొంతమంది మీరే ‘నంబర్ వన్’ అంటారు.. లేదండి. నేను దాని గురించి ఆలోచించను. ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు నాకు ముఖ్యం. నా సినిమాలను వాళ్లు ఆదరిస్తే ఆనందపడతాను. వాళ్లకు గ్రేట్‌ఫుల్‌గా ఉండాలనుకుంటాను. ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకుల కోసం మంచి సినిమాలు చేయాలని అనుకుంటాను. నా దృష్టంతా ఎప్పుడూ మంచి సినిమా మీదే ఉంటుంది. నంబర్ మీద ఉండదు. ♦ ఈ మధ్య సొంతూరు బుర్రిపాలెం వెళ్లారు.. అంతకుముందెప్పుడు వెళ్లారు? నా మొదటి సినిమా ‘రాజకుమారుడు’కి వెళ్లాను. ఆ తర్వాత ఇదే వెళ్లడం. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత వెళ్లినప్పటికీ ప్రజలు రిసీవ్ చేసుకున్న విధానం ఆశ్చర్యపరిచింది. ఎండని లెక్క చేయకుండా పిల్లలు, పెద్దవాళ్లందరూ నన్ను చూడ్డానికి గంటలు గంటలు నిలబడటం ఏదో చెప్పలేని ఫీలింగ్‌ని కలిగించింది. ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. ♦ సెలబ్రిటీలు మనుషులే అయినప్పటికీ మిమ్మల్ని చూడ్డానికి మిగతా మనుషులు వెయిట్ చేస్తుంటారు ? ఆ సమయంలో ఓ స్టార్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ‘దటీజ్ ది పవర్ ఆఫ్ సినిమా’. సినిమా ఆర్టిస్ట్ కావడం నా లక్. నిజంగానే మాతో ప్రేక్షకులకు ఏ బంధమూ ఉండదు. కానీ, విపరీతంగా ప్రేమిస్తారు. ఆ ప్రేమ చూసినప్పుడు బాధ్యత బాగా పెరిగినట్లుగా అనిపిస్తుంది. మంచి సినిమా చేసి, వాళ్లని ఆనందపరచాలనిపిస్తుంది. ♦ వ్యక్తిగా, నటుడిగా మీ నాన్నగారు సాధించిన దాంట్లో మీరెంత ఎచీవ్ చేశారనుకుంటున్నారు? నాన్నగారితో పోలికా? ‘హీ ఈజ్ గ్రేట్’. అందుకే నాన్నగారి చేసినదాంట్లో మనం ఎంత చేశాం? అని ఎప్పుడూ ఆలోచించలేదు. బట్.. నా కెరీర్ ప్రోగ్రెస్ అవుతున్న విధానం చూసి, ఆయన చాలా ఆనందపడతారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ♦ ఈ మధ్య ఓ ఫుట్‌బాల్ ట్రైనర్ ట్రైనప్ అయినట్లుగా అయ్యారట. రోజు రోజుకీ యంగ్‌గా కనిపించడానికి అదే రీజనా? బేసిక్‌గా నాకు ఫిట్‌గా ఉండటం ఇష్టం. కొత్త కొత్త ఎక్స్ర్సైజులు ట్రై చేస్తుంటాను. ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’కి అనే కాదు.. ‘శ్రీమంతుడు’ అప్పుడు కూడా వర్కవుట్స్ చేశాను. ఎప్పుడూ చేస్తూ ఉంటాను. ♦ హ్యాండ్సమ్గా పుట్టినందుకు ఆ దేవుడికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పుకున్నారా? యస్.. ఐయామ్ వెరీ మచ్ బ్లెస్డ్. గాడ్కి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. నాకూ, నా సిస్టర్, బ్రదర్.. అందరికీ నాన్నగారి జీన్స్ వచ్చింది. నేను నాన్నగారిలా ఉంటాను. ♦ మీ మేనరిజమ్స్‌లో మీ అబ్బాయి గౌతమ్ ఫాలో అయ్యేవి... తల్లిదండ్రుల దగ్గర్నుంచి పిల్లలకు కొన్ని మేనరిజమ్స్ వస్తాయి. నేను ఒక రకంగా నవ్వుతాను. గౌతమ్ నవ్వు అచ్చంగా అలానే ఉంటుంది. నేను మాట్లాడేటప్పుడు చేతులు ఎలా ఊపుతానో గౌతమ్ కూడా అంతే. గౌతమ్ ఎక్కువగా నాన్నగారిలా ఉంటాడు. ♦ ఎక్కువగా హాలిడే ట్రిప్స్ వెళుతుంటారు.. ఆ ప్లేసెస్‌ని ఎవరు సెలక్ట్ చేస్తారు? పిల్లలే అడుగుతారు. ముఖ్యంగా గౌతమ్.. ‘ఆ ప్లేస్’కి వెళదాం అని సెలక్ట్ చేస్తాడు. వాళ్ల ఇష్టానికి తగ్గట్టే హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తుంటాం. ♦ చదువులో మీ పిల్లలు మీకన్నా బెటరా? మీరే బాగా చదివేవారా? నేను బ్యాడ్ స్టూడెంట్‌ని కాదు. కానీ, నా పిల్లలు నాకన్నా బాగానే చదువుతారని చెప్పొచ్చు. ♦ చదువు విషయంలో ఒత్తిడి చేస్తుంటారా? అస్సలు లేదు. ఎందుకంటే పదేళ్ల లోపు పిల్లలను జడ్జ్ చేయకూడదు. చిన్నప్పుడు బాగా చదవకపోతే పెద్దయ్యాక కూడా చదవరనీ, చిన్నప్పుడు బాగా చదివితే పెద్దయ్యాక కూడా చదువుతారనీ అనలేం. పిల్లల్ని జస్ట్ వాళ్ల లైఫ్ వాళ్లని ఎంజాయ్ చేయనివ్వాలి.రేవతి, సత్యరాజ్, మహేశ్‌బాబు, రజిత, ఈశ్వరీ రావ్, జయసుధ ♦ మూడు చక్రాల బుల్లెట్‌కి ఇన్స్పిరేషన్ అదే! ‘‘ప్రతి ఊరిలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. అలా ఓ ఊరిలో జరిగిన బ్రహ్మోత్సవాలను తీసుకొని మా ‘బ్రహ్మోత్సవం’ చిత్రం తెరకెక్కించాం. కుటుంబంతో కలిసి సంతోషంగా చూసేలా తీర్చిదిద్దాం’’ అని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అన్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోన్న ఈ చిత్రం గురించి శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ - ‘‘కుటుంబ కథా చిత్రమిది. అందులోనే లవ్‌స్టోరీ ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ గురించి చూపించాం. రాజస్థాన్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ రాష్ట్ర టూరిజం వాళ్ల వద్ద మూడు చక్రాల బుల్లెట్ ఉండేది. చూసేందుకు డిఫరెంట్‌గా ఉండటంతో బాగుంటుందనిపించి, అలాంటి వెహికల్ తయారు చేయించాం. హీరో, హీరోయిన్లు, ఇతర నటీనటులందరితో తీసిన ‘సంగీత్’ ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. మా చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే కాన్ఫిడెన్స్ ఉంది. ♦ ‘24’ సినిమా మీదాకా వచ్చింది కదా.. ఎందుకు అంగీకరించలేదు? ఆ సినిమా సూర్యగారు మాత్రమే చేయగలరని నా ఫీలింగ్. ఎవరెవరికి ఏది సూట్ అవుతుందో తెలుసుకోవాలి. నేను ‘24’ చేయలేను. అలాగే, ‘శ్రీమంతుడు’ క్యారెక్టర్ నాకు బాగా సూట్ అవుతుంది. కొన్ని క్యారెక్టర్స్ కొంతమందికే సూట్ అవుతాయి. ప్రతి యాక్టర్‌కి ఒక్కో సినిమా అలా ఉండిపోతుంది. ♦ మీ ‘ఎంబి కార్పొరేషన్’పై తీసిన మొదటి సినిమా ‘శ్రీమంతుడు’ మంచి సక్సెస్‌నిచ్చింది. ఇప్పుడు రెండో సినిమాకి కూడా ఓ నిర్మాతగా చేశారు కదా.. ప్రతి సినిమాకీ అలా చేస్తారా? అలా ఏం లేదు. డెఫినెట్‌గా నేను నమ్మిన సినిమాలకు నేను అసోసియేట్ అవుతాను. నమ్మనంత మాత్రాన అది బ్యాడ్ మూవీ అనలేం. కథ విన్నప్పుడు ఎక్కడో కనెక్ట్ అయిపోతాం. ‘బ్రహ్మోత్సవం’ నచ్చింది. అందుకే అసోసియేట్ అయ్యాను. ♦ ప్రొడక్షన్ చూసుకోవడం ఇబ్బందిగా అనిపించిందా? నేనా సైడ్ పట్టించుకోను. వేరే టీమ్ చూసుకుంటారు. పీవీపీగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన కూడా కథని నమ్మారు. ఖర్చుకు వెనకాడకుండా బడ్జెట్ పెట్టారు. ఆయనలాంటి నిర్మాత లేకపోతే ఇలాంటి మంచి సినిమాలు రావు. ♦ ఫైనల్లీ మీ తదుపరి సినిమా గురించి? తెలుగు, తమిళ భాషల్లో మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నా. ఇప్పట్నుంచీ ఓ పదిహేను, ఇరవై రోజులు బ్రేక్ తీసుకుని, ఆ తర్వాత ఆ సినిమాలో బిజీ అయిపోతా. - డి.జి. భవాని -
ఫ్లాపైనా, హిట్టయినా నా బాధ్యతే: మహేశ్ బాబు
ముంబై: సూపర్ స్టార్ మహేశ్‌బాబూ తాజా సినిమా 'బ్రహ్మోత్సవం'పై భారీ అంచనాలే ఉన్నాయి. 'శ్రీమంతుడు' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకాభిమానుల్లో 'బ్రహోత్సవం'పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబు ఐఏఎన్ఎస్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్లో డిస్ట్రిబ్యూటర్లు సినిమా ఆడకపోతే.. తమకు పరిహారం ఇవ్వాలని కోరుతున్న వివాదంపై స్పందిస్తూ.. తన సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా అది తన బాధ్యతగా భావిస్తానని ఆయన స్పష్టం చేశారు. 'పోకిరి', 'అతడు', 'దూకుడు', 'శ్రీమంతుడు' వంటి సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ఆయన ఇంకా ఏమంటున్నారంటే.. ప్రశ్న: మీ కొత్త 'బ్రహ్మోత్సవం' సినిమాపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఎన్నో అంచనాలు ఉన్నాయి. సినిమా గురించి చెప్పండి.. మహేశ్: కుటుంబ నేపథ్యంతో సాగే ప్రేమకథా చిత్రం 'బ్రహ్మోత్సవం'. వ్యక్తుల నడుమ ఉండే అనుబంధాల గురించి ఈ సినిమా ఉంటుంది. ప్రశ్న: ప్రస్తుతమున్న దశలో మీరు సవాల్‌తో కూడుకున్న పాత్రలు చేయాలనుకుంటున్నారా? 'బ్రహ్మోత్సవం' అలాంటిదేనా? మహేశ్: సవాల్ అనే పదం ఉపయోగించడం కరెక్ట్ కాదు కానీ, స్క్రిప్ట్ స్థాయిలో నన్ను ఎక్సైటింగ్కు గురిచేసే కథల్నే నేను చేస్తాను. 'బహ్మోత్సవం'లో కూడా నా పాత్ర, దానిని పోషించిన తీరు నా వరకు కొత్తవే. ప్రశ్న: ఎందుకు చాలాకాలంగా సినిమా విడుదల తేదీపై అనిశ్చితి నెలకొంది? సినిమా రిలీజ్ డేట్ ఏమిటి? మహేశ్: మా షెడ్యూల్ ప్రకారం సినిమా ఆడియో మే 6న రిలీజ్ కానుంది. అప్పుడే మేం అధికారికంగా విడుదల తేదీని ప్రకటిస్తాం. ప్రశ్న: బాక్సాఫీస్ వద్ద 'శ్రీమంతుడు' పర్ఫార్మెన్స్ మీకు సంతృప్తినిచ్చిందా? మహేశ్: 'శ్రీమంతుడు' నా హృదయానికి చేరువగా వచ్చిన సినిమా. నా సొంత ప్రొడక్షన్లో తీసిన తొలి సినిమా ఇది. బాక్సాఫీస్ వద్ద సినిమా పర్ఫార్మెన్స్ ఎంతో సంతృప్తినిచ్చింది. ప్రశ్న: సినిమాలు ఫ్లాప్ అయితే చాలా నష్టపోతున్నామని, అలాంటి సందర్భాల్లో తమకు పరిహారం ఇవ్వాలని ఇటీవలికాలంలో డిస్టిబ్యూటర్లు డిమాండ్ చేయడం టాలీవుడ్లో వివాదం రేపుతున్నది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? మహేశ్: నా సినిమా ఆడినా, ఆడకపోయినా అది నా బాధ్యతగానే భావిస్తాను. ప్రశ్న: 16 ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. తెలుగు పరిశ్రమను దాటి మీ పరిధిని మరింత పెంచుకోవాలనుకుంటున్నారా? మహేశ్: ప్రస్తుతం నటనపైనే నా దృష్టంతా. నా వృత్తి పట్ల నేనెంతో మక్కువతో, తపనతో ఉన్నా. అంతకుమించి మరేదీ కూడా నేను ఆలోచించడం లేదు. -
ఆ దర్శకులతో సూపర్ స్టార్
ఇన్నాళ్లు తెలుగు సినిమా, తెలుగు టెక్నిషియన్లు అంటూ ఇక్కడే కాలం గడిపేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు రూట్ మార్చాడు. మార్కెట్‌ను విస్తరించుకునేందుకు పరభాషా దర్శకుల మీద దృష్టిపెడుతున్నాడు. ఇప్పటికే శ్రీమంతుడు సినిమాను తమిళ్లో కూడా రిలీజ్ చేసిన మహేష్. తన నెక్ట్స్ సినిమాను బైలింగ్యువల్‌గా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న మహేష్, ఆ సినిమా పూర్తవ్వగానే తమిళ స్టార్ డైరెక్టర్ మురుగుదాస్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తరువాత కూడా తమిళ దర్శకులతోనే పనిచేసే ఆలోచనలో ఉన్నాడు ప్రిన్స్. విజయ్ హీరోగా తెరకెక్కిన తేరి సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న అట్లీ దర్వకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న టాక్ వినిపిస్తోంది. వీళ్లేకాదు తమిళ నాట మాస్ డైరెక్టర్‌గా పేరున్న లింగుసామి, మహేష్ హీరోగా ఓ యాక్షన్ డ్రామా తెరకెక్కించాలని చాలారోజులుగా ప్రయత్నిస్తున్నాడు. తనీఒరువన్ సినిమాతో నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న జయం రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానంటూ మహేష్ స్వయంగా మాట ఇచ్చాడు. ఇలా వరుసగా తమిళ దర్శకులతోనే సినిమాలు ప్లాన్ చేస్తున్న మహేష్, మన దర్శకులకు టైం ఎప్పుడిస్తాడో మరి. -
హిట్ కొట్టినా చాన్స్ ఇవ్వడం లేదా..?
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో ముందుగా వినిపించే పేరు శృతిహాసన్. ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు లాంటి వరుస బ్లాక్ బస్టర్స్‌లో నటించిన ఈ బ్యూటి, ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తుంది. సాదారణంగా టాలీవుడ్లో ఒక్క హిట్ ఇచ్చినా.. ఆ హీరోయిన్ వెంటే పరిగెడుతుంటారు. అలాంటిది శృతిని మాత్రం పట్టించుకోవట్లేదు. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉందన్న టాక్ ఉన్నా, శృతికి మాత్రం అవకాశాలు రావటం లేదు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ప్రేమమ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది శృతి. స్టార్ హీరోల సరసన భారీ బడ్జెట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటి, ప్రేమమ్ లాంటి మీడియం బడ్జెట్ సినిమాను అంగీకరించడం కూడా విశేషమే. ప్రేమమ్‌తో పాటు హిందీలో, తమిళ్లో ఒక్కో సినిమా చేస్తున్న శృతి, కావాలనే సినిమాలను తగ్గించుకుంటుందా..? లేక ఆఫర్లే రావటం లేదా..? అన్న విషయం తెలియలేదు. -
సర్దార్, శ్రీమంతుడుని దాటేశాడు
భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన టాలీవుడ్ ఎంటర్టైనర్ సర్దార్ గబ్బర్‌సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్‌సింగ్ పాత్రలో కనిపించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందు నుంచే రికార్డ్ల వేట మొదలు పెట్టింది. ముఖ్యంగా తెలుగులో సెకెండ్ బిగెస్ట్ హిట్‌గా నిలిచిన శ్రీమంతుడు రికార్డ్స్‌ను టార్గెట్ చేస్తూ రిలీజ్ అయిన ఈ సినిమా, తొలి అడుగులో అనుకున్నది సాధించింది. ఓవర్ సీస్లో భారీగా ప్రీమియర్ షోస్ ఏర్పాటు చేసి దాదాపు 42 దేశాల్లో 180కి పైగా స్క్రీన్స్‌లో సర్దార్ గబ్బర్‌సింగ్‌ను రిలీజ్ చేశారు. దీనికి తోడు సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అవ్వటంతో తొలి రోజు వసూళ్లలో సంఛలనాలు నమోదు చేసింది. ఒక్కరోజులోనే ఆరు లక్షల డాలర్లకు పైగా వసూళ్లను సాధించి బాహుబలి తరువాత తొలి రోజు అత్యథిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా డివైడ్ టాక్‌తో ఓపెన్ అయినా, పవర్ స్టార్ అభిమానులను మాత్రం బాగానే అలరిస్తోంది. మరో రెండు వారాల పాటు పెద్ద సినిమాలేవి రిలీజ్ లేకపోవటంతో సర్దార్ ఖాతాలో మరెన్ని రికార్డులు చేరుతాయో అని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నారు. -
కర్ణాటకలో ‘శ్రీమంతుడు’
బెంగళూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి నియోజకవర్గంలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని ఎంపీలు, ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చినా ఎవరు పెద్దగా ముందుకు రావడం లేదు. మహేశ్ బాబు ‘శ్రీమంతుడు’ సినిమా స్ఫూర్తితో కొంతమంది సినీ కళాకారులు కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు. అదే స్ఫూర్తితో ఆర్వీ ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న రాహుల్ ప్రసాద్ అనే 24 ఏళ్ల యువకుడు 140 ఇళ్లున్న కర్ణాటకలోని భద్రపుర అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. రాష్ట్ర రాజధాని బెంగళూరుకు యాభై కిలోమీటర్లు, మైసూర్ రోడ్డుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామాన్ని రాజకీయ నాయకులెవరూ పట్టించుకోవడం లేదు. ఓపెన్ డ్రౌనేజ్ వల్ల కాల్వలు మురికి కంపుకొడుతుండడంతోపాటు దోమల బ్రీడింగ్ కేంద్రాలుగా మారిపోయాయి. దానికి తోడు మెజారిటీ ఇళ్లలో మరుగుదొడ్లు లేవు. ప్రజలు బహిర్భూమికి వెళ్లడమే అలవాటు. ఫలితంగా గ్రామ ప్రజలు, ముఖ్యంగా పిల్లలు అంటు రోగాల పాలవుతున్నారు. గ్రామంలో వైద్య సౌకర్యం కూడా లేదు. రోగమొచ్చినా, నొప్పొచ్చిన 8 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. గ్రామానికి విద్యుత్ సౌకర్యం కూడా సరిగ్గా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాలుగేళ్ల క్రితం రాహుల్ ప్రసాద్ ఈ ఊరిలో పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఓ వైద్య శిబిరంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఇలా అప్పుడప్పుడు వెళుతూ వస్తున్నారు. పిల్లలకు పౌష్టికాహారాన్ని, మందులను ఉచితంగా అందజేస్తూ వచ్చారు. అయినా గ్రామ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక ఇలాగైతే లాభం లేదనుకున్న రాహుల్ గ్రామం మొత్తాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించారు. అందుకు వెంటనే మంచనాయకనహల్లి పంచాయతీ డెవలప్మెంట్ అనుమతి తీసుకున్నారు. జువనైల్ కేర్ చారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. సహకార పద్ధతిలో గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఊరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించారు. ప్రజల సహకారంతో మురికినీటి వ్యవస్థను మెరగుపర్చారు. పిల్లల చదువుకోసం గ్రామంలోనే ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసి వారికి చదువు చెప్పడం ప్రారంభించారు. ట్రస్టుకు వచ్చే విరాళాలను గ్రామాభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారు. పీజో ఎలక్ట్రానిక్ జనరేటర్ల ద్వారా గ్రామంలో విద్యుత్ వ్యవస్థను మెరగుపర్చేందుకు ప్రస్తుతం కృషి చేస్తున్నారు. రాహుల్ స్వచ్ఛంద సేవను గుర్తించిన ఐక్యరాజ్య సమితి ‘కర్మవీర్ చక్ర’ అవార్డుతో సత్కరించింది. ఐక్యరాజ్య సమితి సహకారంతో భారత ఎన్జీవోల సమాఖ్య ఏర్పాటు చేసిన రెక్స్ గ్లోబల్ ఫెల్లోషిప్ కూడా రాహుల్‌కు లభించింది. -
కొరటాలకు మరో కానుక
చేసినవి రెండు సినిమాలే అయినా.. దర్శకుడిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు కొరటాల శివ. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన శివ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈసినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాతో మహేష్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ ను అందించిన కొరటాలను భారీ గిఫ్ట్ తో సర్ప్రైజ్ చేశాడు సూపర్ స్టార్. 50 లక్షలు విలువ చేసే లగ్జరీ కారును కొరటాల శివకు గిఫ్ట్ గా ఇచ్చాడు మహేష్. ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. మహేష్ సినిమా సక్సెస్ తరువాత గిఫ్ట్ ఇస్తే ఎన్టీఆర్ మాత్రం సినిమా మొదలవ్వగానే కొరటాలకు విలువైన కానుక ఇచ్చాడు. ఎన్టీఆర్ దాదాపు 20 లక్షల రూపాయల విలువ చేసే వాచ్ ని కొరటాలకు గిఫ్ట్ గా ఇచ్చాడన్నటాక్ వినిపిస్తోంది. సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే ఇంత భారీ కానుకను అందుకున్న కొరటాల.. మరి ఎన్టీఆర్ కెరీర్‌కు ఎలాంటి బ్రేక్ ఇస్తాడో చూడాలి. -
'శ్రీమంతుడి కథ నాదే.. కాపీ కొట్టారు'
హైదరాబాద్: తెలుగులో రికార్డులు సృష్టించిన శ్రీమంతుడు చిత్ర యూనిట్ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా తను రాసిన నవలను కాపీ కొట్టి తీశారని రచయిత శరత్ చంద్ర కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని గురువారం సిటీ సివిల్ కోర్టు అడిషనల్ జడ్జి సింగారెడ్డి కేసు విచారించారు. 2012లో తాను రాసిన నవల స్వాతి మాస పత్రికలో ప్రచురితమైందని ఆ నవల కథనే మైత్రీ మూవీ మేకర్స్ 'శ్రీమంతుడు' చిత్రంగా నిర్మాణం చేసిందని పిటిషన్ దారు పేర్కొన్నారు. ఆయన తరుపున సీనియర్ న్యాయవాదులు వీఆర్ మాచవరం, పవని శివకుమార్ వాదిస్తున్నారు. చిత్ర దర్శకుడు కొరటాల శివతోపాటు ఎర్నినేని నవీన్, హృతిక్ రోషన్‌లను ప్రతివాదులుగా చేర్చారు. శ్రీమంతుడు చిత్రాన్ని హిందీ భాషలో తీయాలని కొరటాల శివ ప్రయత్నిస్తున్నారని, విచారణ పూర్తయ్యే వరకు వేరే భాషలోకి వెళ్లకుండా స్టే ఇవ్వాలని కోర్టును శరత్ చంద్ర కోరారు. దీంతో ప్రతివాదులకు అర్జంట్ నోటీసులను జారీ చేసిన కోర్టు.. విచారణ వచ్చే నెల 4కు వాయిదా వేసింది. -
చరణ్, కొరటాల సినిమా ఆగిపోలేదా..?
బ్రూస్ లీ ఫెయిల్యూర్‌తో ఆలోచనలో పడ్డ రామ్ చరణ్ తిరిగి ఫాంలోకి రావడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తనీ ఒరువన్ రీమేక్‌లో నటిస్తున్న చెర్రీ. ఆ సినిమా తరువాత కూడా ఇంట్రస్టింగ్ కాంబినేషన్ల కోసం ట్రై చేస్తున్నాడు. గతంలో ఆగిపోయిన ప్రాజెక్ట్స్ విషయంలో కూడా పునరాలోచన చేస్తోన్నాడు మెగా పవర్ స్టార్. మిర్చి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కొరటాల శివ తన రెండో సినిమాగా రామ్ చరణ్ హీరోగా ఓ చిత్రాన్ని ప్రారంభించాడు. బండ్ల గణేష్ నిర్మాతగా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ సినిమా తరువాత రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లకుండానే ఆగిపోయింది. దీంతో ఇక ఆ ప్రాజెక్ట్ లేనట్టే అని భావించారు అంతా. తరువాత శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన కొరటాలతో ఇప్పుడు సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు చెర్రీ. కొరటాల ప్రస్తుతం ఎన్టీఆర్‌తో చేస్తున్న జనతా గ్యారేజ్ సినిమా తరువాత చరణ్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఇది గతంలో ఆగిపోయిన సినిమానేనా..? లేక కొత్త కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తార అన్న విషయం మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ తరువాతే తెలిసే అవకాశం ఉంది. -
శ్రీమంతుడు @ 175
ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్ హీరోల సినిమాలు కూడా థియేటర్లలో యాబై రోజులు నడవటం లేదు. తొలి మూడు వారాల్లోనే ఎంత పెద్ద సినిమా అయినా ఢీలా పడిపోతుండటంతో 40, 50 రోజులకు మించి ఏ సినిమా థియేటర్లలో కనిపించే పరిస్థితి కనిపించటంలేదు. అలాంటిది శ్రీమంతుడు సినిమా మాత్రం ఏకంగా 175 రోజుల పాటు ఒకే థియేటర్లో ప్రదర్శింపబడి రికార్డ్ సృష్టించింది. మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు ఆగస్టు 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. బాహుబలి సినిమా తరువాత 100 కోట్లు వసూలు చేసిన సినిమాగా రికార్డ్ సృష్టించిన శ్రీమంతుడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ లోని లక్ష్మణ్ థియేటర్లో ఈ రోజుకూ నాలుగు ఆటలు ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమా ఈ రోజు ( జనవరి 28)తో 175 రోజులు పూర్తి చేసుకుంటుండటంతో అభిమానులు పండగచేసుకుంటున్నారు. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, కొరటాల మార్క్ టేకింగ్, డైలాగ్స్ సినిమా సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేశాయి. ఇప్పటికే పలుమార్లు టీవీలో కూడా ప్రసారమయిన శ్రీమంతుడు, ఇప్పటికీ థియేటర్లో ప్రదర్శింపబడుతుండటంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఆమిర్‌కు షాకిస్తున్న మహేష్‌బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ సూపర్ స్టార్లకు కూడా చుక్కలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా ఎండార్స్మెంట్ల విషయంలో ఇప్పటికే సౌతిండియాలో టాప్ ప్లేస్‌లో ఉన్న మహేష్ బాబు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా పోటీ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు సౌత్ ఇండియాకు సంబంధించిన యాడ్స్ మాత్రమే చేస్తున్న ఈ రాజకుమారుడు త్వరలోనే నేషనల్ యాడ్స్‌లో మెరిసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న పలు కంపెనీలు, ఆయనతో తమ అగ్రిమెంట్ ముగియటంతో, మహేష్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు రెడీ అవుతున్నాయట. శ్రీమంతుడు సినిమాతో భారీ కలెక్షన్లతో పాటు ఓవర్సీస్లో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో పలు కంపెనీలు మహేష్ మీద దృష్టి పెట్టాయి. ఇప్పటికే నెంబర్ పరంగా అత్యధిక బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న మహేష్.. నేషనల్ యాడ్స్‌లో కూడా సత్తా చాటితే సంపాదన పరంగా కూడా రికార్డ్ సృష్టించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. -
అతని చెంప చెళ్లుమనిపించాను
చెన్నై : క్షణ క్షణంబుల్ మారున్ జవరాళ్ల చిత్తంబుల్ అన్న జాతీయాన్ని నటి శ్రుతీహాసన్ జ్ఞప్తికి తెస్తున్నారు. ఇంతకు ముందు వరకూ తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. పెళ్లి చేసుకుని తీరాలన్నది రూలా? అనే విధంగా మాట్లాడిన నటి. ఇప్పుడు మనసు సడన్‌గా పెళ్లి పైకి మళ్లింది. పెళ్లి చేసుకోవాలి, ఆదర్శ తల్లినవ్వాలి అంటున్నారు. ఈ ముద్దుగుమ్మలో ఇంత మార్పుకు కారణాలేమిటబ్బా? అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆరాలు తీయడం మొదలెట్టాయి. ఆ మధ్య టాలీవుడ్ చిత్రం శ్రీమంతుడు ఘన విజయాన్ని,తాజాగా కోలీవుడ్ చిత్రం వేదాళం సంచలన విజయాన్ని ఎంజాయ్ చేస్తూ పుల్ జోష్‌లో ఉన్నారు శ్రుతి. ఇక అసలు విషయం ఏమిటంటే ఇలా కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో టాప్ హీరోయిన్గా వెలిగిపోతున్న సంచలన తార శ్రుతీహాసన్ ఇటీవల సీనియర్ నటి కుష్బూ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఒక ప్రముఖ చానల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన గురించి ప్రచారం అవుతున్న వదంతులు, ప్రేమ, వ్యక్తిగత అంశాల గురించి చూద్దాం. నేనెవరికీ ప్రపోజల్ చేయలేదు ‘ఇప్పటి వరకూ నాకు ఎవరూ లవ్ ప్రపోజ్ చేయలేదు. అందువల్ల నేనూ ఎవరికీ పెళ్లి ప్రపోజల్ చేయలేదు. ఒక సారి స్నేహితుడొకరు ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేమను ప్రపోజ్ చేశాడు. ఊహించని ఆ పరిణామానికి కాస్త చలించిన మాట నిజం. తక్షణమే తేరుకుని అతని చెంప చెళ్లుమనిపించాను. ఇక కోస్టార్స్‌తో చెట్టాపట్టాల్ లాంటి నిరాధార వదంతులకు స్పందిండం బోర్ అనిపిస్తోంది. కుటుంబం గురించి మాట్లాడాలంటే ముందుగా మా అమ్మ గురించే చెప్పాలి. ఆమె కూతుర్ని కావడం గర్వంగా ఉంది. గత 20 ఏళ్ల క్రితమే పర్జానియా చిత్రంలో నటనకుగాను జాతీయ అవార్డును అందుకున్న నటి మా అమ్మ. అలాగే నాన్న కమలహాసన్, చెల్లెలు అక్షరలతో కలిసి నటించాలన్న కోరిక బలంగా ఉంది. అక్షరను నేనెప్పుడూ పోటీగా భావించను. తను నా చెల్లెలు. నా కళ్ల ఎదుట పెరిగింది. సినిమాలో ఎవరి స్థానం వారికి ఉంటుంది. వ్యక్తిగతం గురించి చెప్పాలంటే నాకిప్పుడు వెంటనే పెళ్లి చేసుకోవాలని, ఆదర్శ తల్లినవ్వాలని కోరిక’ అంటూ చెప్పుకొచ్చింది. -
కొరటాల దర్శకత్వంలో హృతిక్
మిర్చి, శ్రీమంతుడు సినిమాల సక్సెస్‌తో మంచి ఫాంలో ఉన్న దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్న శివ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడట. ఇప్పటికే ఇందుకు సంబందించిన ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. తెలుగులో మహేష్ బాబు హీరోగా ఘనవిజయం సాధించిన శ్రీమంతుడు సినిమాను బాలీవుడ్లో హృతిక్ రోషన్ హీరోగా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు కొరటాల శివ. శ్రీమంతుడు సినిమా బాలీవుడ్ రీమేక్ రైట్స్‌ను ఈరోస్ ఇంటర్ నేషనల్ సంస్థతో కలిసి తానే స్వయంగా తీసుకున్నాడు శివ. ఇప్పటికే ఈ సినిమాను చూసిన హృతిక్, బాలీవుడ రీమేక్‌లో నటించడానికి తన అంగీకారాన్ని తెలిపాడు. క్లైమాక్స్ పార్ట్‌లో కొన్ని మార్పులు సూచించిన బాలీవుడ్ స్టార్, త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట. తెలుగు వర్షన్లో జగపతిబాబు కనిపించిన పాత్రలో బాలీవుడ్లో హృతిక్ రియల్ ఫాదర్ రాకేష్ రోషన్ ను నటింప చేయాలని ప్రయత్నిస్తున్నారు. హృతిక్ ప్రస్తుతం మొహంజోదారో అనే పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాలో నటిస్తుండగా, కొరటాల శివ ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న జనతాగ్యారేజ్ (వర్కింగ్ టైటిల్) సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు ఆగస్టులో పూర్తి అయ్యే అవకాశం ఉంది కనుక ఆ తరువాత బాలీవుడ్ శ్రీమంతుడు సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. టాలీవుడ్లో తొలి సినిమాతోనే సంఛలనం సృష్టించిన కొరటాల శివ బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. -
శ్రీమంతుడి ఔదార్యం
మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శక త్వంలో వచ్చిన ‘శ్రీమం తుడు’ ఈ మధ్యే 100 రోజులు పూర్తి చేసుకుంది. మహేశ్ ఉపయోగించిన సైకిల్ కోసం 2,200మంది నమోదు చేసుకున్నారు. ఈ కాంటెస్ట్‌కు వచ్చిన డబ్బులో రూ.10 లక్షలను ‘బసవ తారకం కేన్సర్ ఆస్పత్రి’కి, రూ.5 లక్షలను ‘హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్’కు యూనిట్, మహేశ్ భార్య నమ్రత ఇచ్చారు. -
సూపర్‌స్టార్ కొత్త కారు
శ్రీమంతుడు సక్సెస్ మహేష్ బాబులో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమాతో హీరోగానే కాక నిర్మాతగా కూడా విజయం సాధించిన మహేష్ అదే జోష్‌లో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నాడు. తనకు శ్రీమంతుడు లాంటి భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ కొరటాల శివకు లేటెస్ట్ మోడల్ కారును బహుమతిగా అందించిన మహేష్, దీపావళి పండుగ సందర్భంగా తన ఫ్యామిలీ కోసం కూడా కొత్త కారు కొన్నాడు. ప్రస్తుతం సంపన్నవర్గాల్లో స్టేటస్ సింబల్‌గా భావిస్తున్న రేంజ్ రోవర్ కారును దీపావళి పండుగ సందర్భంగా మహేష్ కొనుగొలు చేశాడు. ఆ కారు ముందు, కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి మహేష్ బాబు దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇటీవలే ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ ట్రిప్ ముగించుకొని వచ్చిన మహేష్ బాబు తిరిగి షూటింగ్‌లతో బిజీ అయ్యాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి మంచి విజయాన్ని అందించిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం షూటింగ్లో పాల్గొంటున్నాడు మహేష్. కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను పివిపి సినిమాస్ బ్యానర్‌తో పాటు మహేష్‌బాబు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నాడు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2016 సమ్మర్ లోరిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
టాలీవుడ్లో మరో శ్రీమంతుడు
శ్రీమంతుడు సినిమా ఇన్సిపిరేషన్‌తో వెనకపడిన గ్రామాలను దత్తత తీసుకోవాటానికి చాలామంది సినీ తారలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమాలో హీరోగా నటించిన మహేష్ బాబు తెలంగాణ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా సిద్దాపురం గ్రామాన్ని, ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోగా, అదే బాటలో మరో నటుడు ప్రకాష్‌రాజ్ కూడా నడిచాడు. తెలంగాణలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రకాష్‌రాజ్ ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించాడు. తాజాగా మరో సీనియర్ నటుడు సుమన్ కూడా ఈ లిస్ట్‌లో చేరడానికి రెడీ అవుతున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తన మద్దతు తెలిపిన సుమన్ తెలంగాణలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా, మాడుగుల మండలం, సుద్దపల్లి గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచన ఉన్నాడు. త్వరలోనే ఈ విషయాన్ని సుమన్ అధికారికంగా ప్రకటించనున్నాడు. -
బాలీవుడ్లో మహేష్ మూవీ
టాలీవుడ్లో నెంబర్ వన్ హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. వంద కోట్ల వసూళ్లతో టాలీవుడ్ సినిమా స్టామినా ప్రూవ్ చేసిన సూపర్ స్టార్, ప్రస్తుతం తన మార్కెట్ పరిధిని మరింత విస్తరించుకునే పనిలో ఉన్నాడు. అందుకే తన ప్రతి సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఫార్ములాతో శ్రీమంతుడు సినిమాకు భారీ కలెక్షన్లు సాధించిన మహేష్, తదుపరి సినిమాల విషయంలో మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడు. మహేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మోత్సవం' సినిమాలో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఘనవిజయం సాదించటంతో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని భావిస్తున్నారు. దీంతో పాటు శ్రీమంతుడు సినిమా ఇచ్చిన కిక్‌తో బ్రహ్మోత్సవాన్ని కూడా తెలుగుతో పాటు తమిళ్లోనూ తెరకెక్కిస్తున్న ప్రిన్స్, మలయాళంలోనూ డబ్బింగ్ వర్షన్‌ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీల మీద దృష్టి పెట్టిన రాజకుమారుడు త్వరలో నార్త్‌లోనూ అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. బ్రహ్మోత్సవం సినిమా తరువాత తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు మహేష్. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈసినిమాను తెలుగు తమిళ్‌తో పాటు హిందీలోనూ ఒకేసారి తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో చాలా సార్లు బాలీవుడ్ ఆఫర్స్ వచ్చినా తిరస్కరించిన మహేష్ ప్రస్తుతం మార్కెట్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాడట. సోషల్ మెసేజ్‌తో భారీగా తెరకెక్కుతున్న మహేష్, మురుగదాస్‌ల సినిమాను ఎన్ వి ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 12న ఈసినిమాను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతోపాటు నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక చేస్తున్నారు చిత్రయూనిట్. -
వెన్నెల్లో ఇద్దరు చంద్రులు.. చీకట్లో ప్రజలు: యాష్కీ
సాక్షి, హైదరాబాద్: నిన్నటిదాకా తిట్టుకున్న ఇద్దరు చంద్రులు ఇప్పుడు వెన్నెల్లో తేలుతూ రెండు రాష్ట్రాల ప్రజలను చీకట్లో ముంచుతున్నారని ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లను ఉద్దేశించి మాజీ ఎంపీ మధుయాష్కీ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఆవరణలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును జేజమ్మ కూడా రక్షించలేడన్న కేసీఆర్ ఇప్పుడు ఆయనతోనే లడ్డూలు, పూలగుత్తులు ఇచ్చిపుచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసును ఏమి చేశారో ప్రజలకు చెప్పాలని మధుయాష్కీ డిమాండ్ చేశారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న బెత్తెడుగాళ్లు జానెడు పనుల గురించి, సీఎల్పీ నేత జానారెడ్డి వంటి వారి గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. సినిమా పరిశ్రమను బ్లాక్మెయిల్ చేస్తూ శ్రీమంతుడు సినిమాకు నిర్మాతగా, బాహుబలి సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా మంత్రి కేటీఆర్ వ్యవహరించారని ఆరోపించారు. అవినీతిలో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన హెచ్చరించారు. -
తెలుగు స్టార్ హీరోలకు ఝలక్ ఇచ్చిన అనుష్క
-
మహేష్‌తో మరోసారి శృతి
టాలీవుడ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్లను బాగా ఫాలో అవుతారు. అందుకే ఒకసారి మంచి హిట్ వస్తే అదే కాంబినేషన్లో తిరిగి పనిచేయాలనుకుంటారు. మామూలు హీరోలు మాత్రమే కాదు సూపర్ స్టార్లు కూడా ఇలాంటి సెంటిమెంట్లనే ఫాలో అవుతున్నారు. టాలీవుడ్ రాజకుమారుడు మహేష్ బాబు తన నెక్ట్స్ సినిమా కోసం ఇలాంటి ఓ సక్సెస్ఫుల్ కాంబినేషన్‌ను సెట్ చేస్తున్నాడు. శ్రీమంతుడు సక్సెస్‌తో ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తను చేయబోయే నెక్ట్స్ సినిమాను కూడా ఫైనల్ చేసేస్తున్నాడు. బ్రహ్మోత్సవం సినిమా తరువాత తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శతక్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు మహేష్. సామాజిక సమస్యల నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సోనాక్షి సిన్హా లీడ్ రోల్లో అకీరా అనే హిందీ సినిమా చేస్తున్న మురుగదాస్, ఆ సినిమా పూర్తి కాగానే మహేష్ సినిమా పని మొదలు పెట్టనున్నాడు. ఈ సినిమా కోసం మరోసారి శృతిహాసన్‌తో ఆడిపాడటానికి రెడీ అవుతున్నాడు మహేష్. శ్రీమంతుడు సినిమాతో తన కెరీర్లోనే బిగెస్ట్ హిట్ అందించిన కాంబినేషన్లో సినిమా చేస్తే సెంటిమెంట్ కూడా వర్క్ అవుట్ అవుతుందని ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఉన్నారు. -
అభిమానులకు మహేష్ మరో కానుక
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులకు మరో కానుక అందించారు. శ్రీమంతుడు చిత్రం లోని పూర్తి నిడివి గల వీడియోసాంగ్స్ ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశాడు. ఒక చిత్రానికి సంబంధించి వీడియో సాంగ్స్ ని..సామాజిక అనుసంధాన వేధిక ద్వారా విడుదల చేయడం ఇదే తొలిసారి. -
చరణ్ తరువాత ఎన్టీఆర్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' సినిమా ఇప్పటికీ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. గ్రామాలను దత్తత తీసుకోవటం అనే సోషల్ మెసేజ్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో మంది సెలబ్రిటీలకు ఇన్సిపిరేషన్‌గా నిలిచింది. ఈ సినిమా తరువాత చాలా మంది సౌత్ సినిమా సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీసుకోవటానికి ముందుకు వచ్చారు. 'శ్రీమంతుడు' లాంటి భారీ విజయం తరువాత, మహేష్ ఓ ఇంట్రస్టింగ్ కామెంట్ చేశాడు. ఇంత మంచి సినిమా చేసిన తరువాత ఒక్క రామ్‌చరణ్ తప్ప ఇంకెవరు తనకు శుభాకాంక్షలు తెలియజేయలేదన్నాడు. అప్పట్లో ఈ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే 'శ్రీమంతుడు' రిలీజ్ సమయంలో విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ ఇటీవలే మహేష్‌కు స్వయంగా ఫోన్ చేసిన అభినందనలు తెలిపాడు. 'నాన్నకు ప్రేమతో' ఫారిన్ షెడ్యూల్ ముగించుకొని ఇండియాకు తిరిగొచ్చిన ఎన్టీఆర్ 'శ్రీమంతుడు' సినిమాను చూశాడు. వెంటనే మహేష్ కు స్వయంగా కాల్ చేసిన ఎన్టీఆర్ ఇంత మంచి సినిమా చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేశాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాన్నకు ప్రేమతో' షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ అక్టోబర్ రెండో వారంలో నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ చేయనున్నాడు. -
బాహుబలి, శ్రీమంతుడిని వెనక్కి నెట్టేసిన 'కోర్టు'
న్యూఢిల్లీ: జాతీయ అవార్డును గెలుచుకున్న ప్రతిష్ఠాత్మక మరాఠీ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచింది. 88వ ఆస్కార్ అవార్డుల ప్రధాన కార్యక్రమం కోసం భారత్ నుంచి ఈ సినిమాను అధికారికంగా ఎంపిక చేసినట్లు జ్యూరీ చైర్మన్ అమోల్ పాలేకర్ బుధవారం వెల్లడించారు. కోర్టు లోపల జరిగే సన్నివేశాలతో సాగే డ్రామాతో ఈ చిత్రాన్ని ప్రముఖ మరాఠీ దర్శకుడు చైతన్య తమనే రూపొందించారు. ముంబయి కింది స్థాయి కోర్టులో ఓ వృద్ధ ఫోక్ సింగర్‌కు సంబంధించిన కేసు వాదోపవాదాలతో ఈ చిత్రం ముందుకు సాగుతుంది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కోసం బాహుబలి, శ్రీమంతుడు, బాలీవుడ్ నుంచి పీకే, మేరీ కోం వంటి చిత్రాలున్నప్పటికీ వాటిని వెనక్కి నెట్టేసి మరీ 'కోర్టు' చిత్రం నామినేషన్ పొందింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చి నెలలో 88వ ఆస్కార్ అవార్డుల ప్రధాన కార్యక్రమం జరగనుంది. ఆస్కార్ నామినేషన్ కోసం ఈ చిత్రం ఎంపిక చేసినట్లు ప్రకటించిన అనంతరం జ్యూరీ చైర్మన్ అమోల్ పాలేకర్ మాట్లాడుతూ ఉత్తమ విదేశీ భాషల చిత్రాల కేటగిరీ కింద వచ్చిన చిత్రాలకు 'కోర్టు' గట్టి పోటిని ఇస్తుందని చెప్పారు. ఎంపిక బృందం ఏకగ్రీవంగా కోర్టు చిత్రాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. మొత్తం 30 చిత్రాలను ఎంపిక ప్యానెల్ తొమ్మిది రోజులపాటు హైదరాబాద్ లో చూసిన తర్వాత చివరకు కోర్టు చిత్రాన్ని ఎంపిక చేసినట్లు వివరించారు. -
కొరటాల శివకు మహేష్ గిఫ్ట్
సూపర్‌స్టార్ మహేష్ బాబు మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. తన కెరీర్లోనే ఘనవిజయం సాధించిన శ్రీమంతుడు సినిమాను తనకు అందించిన దర్శకుడు కొరటాల శివకు ఓ లగ్జరీ కారును గిఫ్ట్ ఇచ్చాడు. ఎలాంటి మాస్ ఎలిమెంట్స్ లేకుండా తెరకెక్కిన ఓ మామూలు కథను ఇంతటి ఘనవిజయంగా మలిచిన శివకి ఆడి ఎ6 కారు అందించాడు మహేష్. మహేష్ ఇచ్చిన ఈ సడన్ సర్ప్రైజ్ తో ఆనందంతో పాటు షాక్‌కు గురయ్యాడు కొరటాల శివ. ఆదివారం రాత్రి కొరటాలను ఆడి షోరూంకు ఆహ్వానించిన మహేష్ దాదాపు 50 లక్షల రూపాయల ఖరీదైన ఈ కారును అందించాడు. అక్కడే ఉన్న మహేష్ భార్య నమ్రత, షోరూం నిర్వాహకులు కొరటాలకు అభినందనలు తెలియజేశారు. మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా తెరకెక్కిన శ్రీమంతుడు సినిమాను మైత్రి మూవీస్ బ్యానర్‌తో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మించాడు. ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతున్న శ్రీమంతుడు వందకోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండో చిత్రంగా నిలిచింది. Thank u @urstrulyMahesh sir and Namrata garu for such a lovely gesture. Really overwhelmed by ur love and positivity. Respect sir — koratala siva (@sivakoratala) September 21, 2015 -
'నేనూ శ్రీమంతుడు చూశా.. చాలా బాగుంది'
శ్రీమంతుడు సినిమా విడుదలై ఇప్పటికి దాదాపు ఆరు వారాలవుతోంది. ఇన్నాళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బిజీ షెడ్యూల్లోంచి కాస్తంత తీరిక చేసుకుని ఆ సినిమా చూశారు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలన్న సందేశంతో కూడిన ఆ సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఆ సందేశం 'స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్'ను ప్రతిబింబిస్తోందంటూ ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. దానికి సినిమా హీరో మహేశ్ బాబు కూడా సంతోషించాడు. సినిమా మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ట్విట్టర్లోనే సమాధానం ఇచ్చాడు. సినిమా చూసినందుకు థాంక్స్ కూడా చెప్పాడు. Watched #Srimanthudu @urstrulyMahesh. Great movie on giving back to society. Glad that the message reflects 'Smart Village Smart Ward'. — N Chandrababu Naidu (@ncbn) September 13, 2015 @ncbn Humbled and honoured sir... Glad you liked our film. Thank you very much. — Mahesh Babu (@urstrulyMahesh) September 14, 2015 -
మహేష్‌ను భయపెట్టిన మగధీర
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఇటీవల మగధీర సినిమా వల్ల భయపడ్డాడు.. అదేంటి ఎప్పుడో రిలీజ్ అయిన మగధీర ఇప్పుడు మహేష్ ను భయపెట్టడం ఏంటి అనుకుంటున్నారా.. అవునండి శ్రీమంతుడు సినిమా రిలీజ్ సమయంలో మగధీర సినిమా గుర్తుకు వచ్చిన మహేష్ చాలా టెన్షన్ పడ్డాడట. ఈ విషయాన్ని స్వయంగా మహేషే ప్రకటించాడు. శ్రీమంతుడు సినిమా తరువాత ఎంతో ఆనందంగా తన నెక్ట్స్ సినిమా బ్రహ్మోత్సవం షూటింగ్ స్టార్ట్ చేసిన సూపర్ స్టార్.. ఈ మూవీ రిలీజ్‌కు ఒక రోజు ముందు తన పరిస్థితిని వివరించాడు. ' శ్రీమంతుడు సినిమా ఎంతకలెక్ట్ చేసింది అన్న విషయం అప్రస్తుతం, ఈ సినిమా బిగ్ హిట్. ఇప్పుడు అందరూ హ్యాపి, కాని రిలీజ్‌కు ముందు రోజు మాత్రం నేను చాలా టెన్షన్ పడ్డాను. ముఖ్యంగా మగధీర లాంటి బిగ్ హిట్ సినిమా తరువాత దాదాపు రెండు నెలల పాటు ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదు. బాహుబలి సక్సెస్ తరువాత కూడా అలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. అందుకే శ్రీమంతుడు రిలీజ్ తనను మరింత టెన్షన్ కు గురిచేసింది.' అంటూ ఆ రోజు తన టెన్షన్ గుర్తు చేసుకున్నాడు మహేష్. -
సెంటిమెంట్‌ను మహేష్ బ్రేక్ చేస్తాడా?
'శ్రీమంతుడు' సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న మహేష్ త్వరలో 'బ్రహ్మోత్సవం' షూటింగ్లో పాల్గొననున్నాడు. అయితే ఇదే సమయంలో మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ప్రిన్స్ అభిమానులను కలవరపెడుతుంది. 16 ఏళ్ల కెరీర్లో మహేష్ ఇంత వరకు చేయని ఓ సాహసం త్వరలో చేయబోతున్నాడట. ఇప్పటి వరకు ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించని ఈ సూపర్ స్టార్ త్వరలోనే ఓ తమిళ రీమేక్‌లో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో శంకర్ డైరెక్షన్లో '3 ఇడియట్స్' సినిమాకు రీమేక్‌గా రూపొందిన 'స్నేహితుడు' సినిమా సమయంలో కూడా ఇదే చర్చ తెరమీదకు వచ్చింది. మహేష్‌తో ఈ సినిమాలో నటింపచేయాలని ఎంత ప్రయత్నించిన రీమేక్ సినిమా అన్న ఉద్దేశ్యంతో అంగీకరించలేదు. అదే సమయంలో తనకు రీమేక్ సినిమాలు చేయటం ఇష్టం లేదని తేల్చిచెప్పాడు రాకుమారుడు. ఇటీవల తమిళంలో సంచలనం సృష్టిస్తున్న 'తనీఒరువన్' సినిమా నేపధ్యంలో మరోసారి అదే టాపిక్ తెరమీదకు వచ్చింది. ఈ సినిమాను మహేష్ హీరోగా రీమేక్ చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు పలువురు టాలీవుడ్ దర్శకనిర్మాతలు. ఇప్పటికే ఈ సినిమా ప్రివ్యూ కూడా చూసిన మహేష్ ఇంతవరకు తన అభిప్రాయం మాత్రం చెప్పలేదు. ప్రిన్స్ రెస్పాన్స్ చూసిన వారు మాత్రం మహేష్ తన కండిషన్స్ ను తనే బ్రేక్ చేసి 'తనీ ఒరువన్' రీమేక్ చేయటం ఖాయం అంటున్నారు. -
కండలవీరుడు... శ్రీమంతుడు?
సొంతూరికి ఏదైనా చేయాలనే శ్రీహర్ష పాత్రలో మహేశ్‌బాబు ఒదిగిపోయారు. మంచి కథా కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ దత్తత తీసుకుని విజయాన్నందించింది. ఇప్పుడీ సినిమా హిందీ రీమేక్‌లో నటించడానికి సల్మాన్‌ఖాన్ సుముఖత వ్యక్తం చేశారట. అలాగే నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం. గతంలోనే మహేశ్‌బాబు ‘పోకిరి’ని ‘వాంటెడ్’గా రీమేక్ చేసి తన కెరీర్లో ఓ మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అన్నీ కుదిరితే ‘శ్రీమంతుడు’గా సల్మాన్ సందడిని వెండితెరపై చూడొచ్చు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని భోగట్టా! -
మహేష్ ఈజీగా రీచ్ అయ్యాడు..
తెలుగు సినిమా మార్కెట్ పరిధి ఇప్పుడు భారీగా విస్తరిస్తోంది. ఇన్నాళ్లు రీజనల్ సినిమాగా రూ.30, 40 కోట్లకు మాత్రమే పరిమితమైన తెలుగు సినిమా ఇప్పుడు వంద కోట్ల మార్క్‌ను కూడా దాటేసింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుతం 'బాహుబలి'తో తొలిసారిగా ఈ ఫీట్ సాధించింది తెలుగు సినిమా. అంతేకాకుండా నెల వ్యవధిలోనే మరోసారి అదే రికార్డ్‌ను సొంతం చేసుకుంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన శ్రీమంతుడు సినిమా కేవలం 25 రోజుల్లో రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. అయితే బాహుబలి సినిమా కోసం మూడేళ్ల పాటు వందల మంది స్టార్ టెక్నిషియన్స్ పనిచేసి సాధించిన ఫీట్‌ను మహేష్ మాత్రం ఈజీగా రీచ్ అయ్యాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా గట్టి పట్టు ఉన్న మహేష్, శ్రీమంతుడు సినిమాలో తమిళ, మళయాల మార్కెట్లపై కూడా తన ఆధిపత్యాన్ని చూపించాడు. మహేష్ చూపించిన బాటలో నడవటానికి మరింత మంది హీరోలు రెడీ అవుతున్నారు. -
సినిమా ట్రైలర్‌పై ప్రశంసల జల్లు
మెగా ఫ్యామిలీ వారసుడు వరుణ్ తేజ్ రెండో సినిమాగా తెరకెక్కిన 'కంచె' ట్రైలర్ సినీ అభిమానులతో పాటు సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంటుంది. ప్రముఖ హీరోలతో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా ట్రైలర్ బాగుందంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రీమంతుడు సినిమా సక్సెస్ తరువాత ఫారిన్ టూర్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ కూడా ఈ ట్రైలర్‌పై స్పందించాడు. 'కంచె' టీజర్ పై తన ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించాడు. రెండో ప్రపంచ యుద్ధ నేపధ్యంతో తెరకెక్కిన కంచె ట్రైలర్‌ను చిత్ర యూనిట్ .. ఆ యుద్దం మొదలైన సెప్టెంబర్ 1న రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. 'ముకుంద' చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్... ఆ సినిమాలో క్లాసీ మాస్‌గా కనిపిస్తే...కంచెలో మాత్రం డిఫరెంట్ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. The trailer of Kanche is stunning . All the best to the entire team .. — Mahesh Babu (@urstrulyMahesh) September 1, 2015 మహేశ్ బాబుతో పాటు ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, మరో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, హీరో రామ్, బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్, కెమెరామన్ సెంథిల్.. ఇలా అనేకమంది ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా ట్రైలర్ స్టన్నింగ్‌గా ఉందని మెచ్చుకున్నారు. మొత్తానికి వరుణ్ తేజ్ రెండో సినిమా టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రముఖుల దృష్టిని కూడా ఆకర్షించినట్లయింది. Very impressive. Can see lot of research and hard work going into this one..all the best to team #Kanche https://t.co/Q5TZsdu7Kb — rajamouli ss (@ssrajamouli) September 1, 2015 #Kanche trailer is fab.Hpy 2 c this change in Telugu Cinema.Congrats @DirKrish & @IAmVarunTej .Tough competition on Oct2..I LIKE ;) #SHIVAM — Ram Pothineni (@ramsayz) September 2, 2015 Just one word for the trailer of director Krish's #Kanche: STUNNING. Here's the link to the trailer. Watch it! http://t.co/cT4fvWfqEU — taran adarsh (@taran_adarsh) September 1, 2015 The Trailer looks Stunning, WOW what an effort, Hats off to #Krish and the Whole team of #Kanche. https://t.co/L6shZ3BE5h — KK Senthil Kumar (@DOPSenthilKumar) September 1, 2015 Guys welcome @nikitindheer this is his first Telugu movie.playing a pivotal role in #Kanche ..looking great brother! https://t.co/AMHKZeHeLQ — Varun Tej Konidela (@IAmVarunTej) September 1, 2015 -
మహేష్ బాటలో శృతి
హీరోయిన్ శృతి హాసన్..ప్రిన్స్ మహేశ్ బాబు బాటలో నడుస్తోంది. సౌత్ తో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా వరుస సక్సెస్ లతో టాప్ ప్లేస్ కి చేరిన శృతి హాసన్ త్వరలో ఓ ఊరిని దత్తత తీసుకోవటానికి ప్లాన్ చేసుకుంటోంది. ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమాలో హీరోగా నటించిన మహేష్ ఇప్పటికే రెండు గ్రామాలు దత్తత తీసుకోగా, హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ కూడా అదే ప్రయత్నాల్లో ఉంది. ఇటీవలే నిర్మాతగా మారి, షార్ట్ ఫిలింస్ ను ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ బ్యూటి... ఔత్సాహిక కళాకారులకు చేయూతనందిస్తానంటోంది. మంచి కథ, కథనాలు, మ్యూజిక్ తో వస్తే, తన బ్యానర్ పై సినిమాలు తెరకెక్కించడానికి కూడా సిద్దమని ప్రకటించింది. అయితే ఊరిని దత్తత తీసుకోవాలన్న ఆలోచన తనకు శ్రీమంతుడు సినిమాతో మాత్రం రాలేదట.. తన తండ్రి కమల్ హాసన్ స్ఫూర్తితోనే ఈ ఆలోచన చేస్తున్నట్టుగా చెపుతోంది శృతి. -
‘శ్రీమంతుడు’లో రెండు కొత్త సీన్లు!
‘మా సంస్థలో వచ్చిన తొలి చిత్రం ‘శ్రీమంతుడు’ బ్లాక్ బస్టర్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. సెలబ్రిటీస్, స్పోర్ట్స్ పర్సన్, పొలిటీషియన్స్ అందరూ ఈ సినిమా చూసి అభినందిస్తున్నారు. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఈ వారంలో సినిమా చూస్తానన్నారు’’ అని నవీన్ ఎర్నేని చెప్పారు. మహేశ్‌బాబు, శ్రుతీహాసన్ కాంబినేషన్లో శివ కొరటాల దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ నిర్మించిన ‘శ్రీమంతుడు’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. నేటి నుంచి మరో రెండు సీన్లను జత చేస్తున్నామని శివ కొరటాల తెలిపారు. -
శ్రీమంతుడును రీమేక్ చేస్తున్న సల్మాన్!
-
శ్రీమంతుడికి బీజేపీ అధ్యక్షుడి అభినందనలు
హైదరాబాద్: ఒక ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేసే కాన్సెప్ట్‌తో వచ్చిన మూవీ శ్రీమంతుడు. హీరో మహేష్ బాబు కెరీర్ లో ఈ సినిమా మంచి విజయం సాధించి.. కలెక్షన్లలో దూసుకుపోతోంది. దీంతో పాటు ఈ సినిమా పలువురికి ఆదర్శవంతంగా కూడా నిలుస్తోంది. రూ.కోట్లు సంపాదించినా.. దేశ, విదేశాల్లో స్థిరపడినా.. లగ్జరీ జీవితం గడుపుతున్నా.. పుట్టి, పెరిగిన ఊరికి ఏమైనా చేయాలనే తపన పలువురి మనసులను తాకింది. ప్రస్తుతం శ్రీమంతుడు ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రులు, ఎంపీలను సైతం శ్రీమంతుడు విపరీతంగా ఆకర్షించింది. కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఢిల్లీలోని తన సహచరుల వద్ద శ్రీమంతుడు సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారట. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పాలమూరు జిల్లాలోని గ్రామాన్ని దత్తత తీసుకున్నమహేష్ బాబును ట్విట్టర్ ద్వారా అభినందించారు. Sincere thanks and best wishes srimanthudu mahesh babu for adopting a village in Paalamuru, telangana. #Srimanthudu — G.Kishan Reddy (@kishanreddybjp) August 22, 2015 -
మహేష్ విజయహాసం!
-
శ్రీమంతుడు నా కెరీర్లో కీలకం
-
'అనంత' శ్రీమంతులు..!
ఉద్యోగ, వ్యాపార రీత్యా సొంతూరి నుంచి వెళ్లిపోయి ఎక్కడెక్కడో స్థిరపడినప్పటికీ, స్వగ్రామంపై మమకారంతో ఎంతో మంది తన సంపాదనతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వీరిలో కొందరు వృద్ధులకు ఆసరాగా నిలుస్తున్నారు. ఇంకొందరు అనాథలను చేరదీస్తున్నారు. పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇలా వారికి తోచిన సహకారమందిస్తున్నారు. అభివృద్ధి పనులు, దేవాలయ నిర్మాణాలు చేపడుతున్నారు. సొంతూరిపై మమకారంతో ఉపకారం చేస్తున్న 'మాఊరి శ్రీమంతుల'పై ప్రత్యేక కథనం. సొంతూరిపై మమకారం నార్శింపల్లి: సొంతూరిపై మమకారంతో గ్రామాభివృద్ధి కోసం విద్యావంతులు విశేష సేవలందిస్తున్నారు. ఒకరు వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వృద్ధులకు సేవలు చేస్తే, మరొకరు ఉన్నత పాఠశాలను నిర్మించి విద్యాభివృద్ధికి పాటు పడుతున్నారు. గ్రామానికి చెందిన మత్తులూరు నరసింహప్ప విద్యావంతుడు. ఉన్నతోద్యోగం చేసి విరమణ పొందారు. సామాన్య కుటుంబంలో జన్మించిన నరసింహప్ప ఐఏఎస్ చదివి ఆదాయపు పన్ను కమిషనర్‌గా 2009లో పదవీ విరమణ చేశారు. ఈయన వృద్ధులకు సేవలు చేయాలనే తలంపుతో 1993లో రాష్ట్రీయ సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. కన్నవారు ఉండి కూడా అనాథలైన వృద్ధులు, తన వారంటూ లేని 25 మంది వృద్ధులను పోషిస్తున్నారు. సామాన్య కుటుంబంలో జన్మించిన జాస్తి వెంకట రాముడు ఐపీఎస్ చదివి ఉన్నతోద్యోగాలు పొందుతూ చివరకు రాష్ట్ర పోలీసు బాసుగా డీజీపీ పదవి చేపట్టారు. ఆయన కూడా గ్రామాభివృద్ధికి పాటు పడుతున్నారు. తన సొంత భూమి 20 ఎకరాల్లో జేవీఎం ఆర్డీటీ ఉన్నత పాఠశాలను నిర్మించి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. నామ మాత్రపు ఫీజులతో ఎల్కేజీ నుంచీ పదోతరగతి వరకూ చదివిస్తున్నారు. రూ.10 లక్షలతో శ్మశాన వాటిక చుట్టూ ప్రహరీ నిర్మించారు. గ్రామంలో శ్రీరాముల దేవాలయం, కళాకారుల క్షేత్రం నిర్మించారు. గ్రామాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామంటున్నారు. పాంచజన్యుడి సేవలు హిందూపురం: హిందూపురంలో పుట్టి పెరిగిన పాంచజన్య తన జీవితంలో కొంత భాగాన్ని సమాజ సేవకు కేటాయించారు. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు కలిగి లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, వాసవీ క్లబ్ ద్వారా సొంతూరిలోనే సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పాంచజన్య బ్యానర్‌పై ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, సూపర్‌బజార్ లాంటి వ్యాపారాలను నిర్వహించారు. 2002లో ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు పాంచజన్య బ్రిలియంట్స్ పాఠశాలను ప్రారంభించారు. దీంతోపాటు సత్యనారాయణశెట్టి, తాయారమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీని నిర్మించి పేద విద్యార్థులకు సాల్కర్షిప్తోపాటు ఎంతో మందికి ఉచిత విద్యను అందిస్తున్నారు. పట్టణంలో చికున్‌గున్యా, డెంగీలాంటి వ్యాధుల బారిన పడిన వారికి మెడికల్ క్యాంపులు నిర్వహించి ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేశారు. కర్నూలు, విశాఖలో సంభవించిన వరదల్లో బాధితులకు తన వంతు సాయం అందించారు. భూదాత.. ఈ శివానంద విడపనకల్లు: మండల పరిధిలోని పాల్తూరు గ్రామానికి చెందిన సామాన్య రైతు కుటుంబానికి చెందిన దిండిన రుద్రప్ప కుమారుడు దండిన శివానంద తన చాకచక్యంతో నేర్పుతో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. మొదట్లో కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో కాటన్ వ్యాపారం ప్రారంభించారు. క్రమంగా పలు రాష్ట్రాల్లో కాటన్ మిల్లులు స్థాపించారు. పుట్టిన ఊరికి కొంత సేవ చేయాలని అనుకుని, పాల్తూరు గ్రామ ప్రజలకు చేదోడు వాడోడుగా ఉంటూ ఆర్థిక సాయం చేస్తున్నారు. తన తల్లిదండ్రులు జ్ఞాపకార్థంగా దాదపు రు.20 లక్షల పెట్టి గౌరమ్మ దేవాలయం నిర్మించి తన భక్తిని చాటుకున్నారు. మరో రెండు దేవాలయాలకు మరమ్మతులు చేయించారు. గ్రామంలో హాస్పిటల్ నిర్మాణం కోసం కోట్లు విలువ చేసే రెండున్నర ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. మా ఊరికో దేవాలయం బత్తలపల్లి : కన్నతల్లిలాంటి సొంతూరుకు ఎంత చేసినా తక్కువే అంటున్నాడు మండలంలోని అప్రాచ్చెరువుకు చెందిన తుంపిరి సాలప్ప. గ్రామానికి చెందిన తుంపిరి నరసింహులు కుమారుడు సాలప్ప రైల్వే ఇంజనీర్‌గా బెంగళూరులో స్థిరపడ్డారు. ప్రస్తుతం పదవీ విరమణ చేశారు. గ్రామాన్ని వదిలి 40 ఏళ్లు గడిచినా స్వగ్రామాన్ని మరువలేదు. బంధువుల కోరిక మేరకు రూ.5 లక్షలతో అప్రాచ్చెరువు ఎస్సీ కాలనీ(గుమ్మల్లకుంట ఎస్సీ కాలనీ)లో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించారు. -
ప్రభుత్వ విధానాల్లోకి శ్రీమంతుడు కాన్సెప్ట్
-
చిన్నారి ‘శ్రీమంతుడు’
-
చిన్నారి ‘శ్రీమంతుడు’
⇒ మృత్యు ముఖంలోనూ ఊరి బాగు కోసం ⇒తపన.. ‘శ్రీమంతుడే’ స్ఫూర్తి ⇒పోలీసుల సహకారంతో బైక్‌పై షికారు చేయాలనే ⇒తన కోరికను నెరవేర్చుకున్న బాలుడు ⇒బ్యాటరీ బైక్‌పై హైదరాబాద్ రోడ్లపై షికారు హైదరాబాద్: శ్రీమంతుడు సినిమాలో మహేశ్‌బాబులాగా తన ఊరి బాగు కోసం కృషి చేస్తానంటున్నాడు మృత్యువుకు చేరువలో ఉన్న ఓ చిన్నారి. బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న ఈ బాలుడు.. బైక్‌పై షికారు చేయాలనేది తన కోరికగా చెప్పాడు. ఈ విషయం మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా తెలుసుకున్న పోలీసులు ఆ మేరకు సోమవారం ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు సమీపంలోని ఎర్రగుంట్లకు చెందిన చాకిబండ పవన్‌కుమార్ (7) అక్కడే శ్రీ చైతన్య స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. గత ఏడాది డిసెంబర్లో తీవ్ర జ్వరంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు రామాంజనేయులు, అంజలితో కలసి హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి వచ్చాడు. పరీక్షల అనంతరం పవన్‌కు బ్లడ్ కేన్సర్ ఉన్నట్లు తేలింది. దీంతో అతడిని ఎంఎన్జీ కేన్సర్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నారు. మూడు నెలల కిందట అక్కడి వచ్చిన మేక్ ఏ విష్ ఫౌండేషన్ సభ్యులకు తనకు బైక్ నడపాలని ఉందని పవన్ చెప్పాడు. ఈ విషయాన్ని వారు ట్రాఫిక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు నుంచి బ్యాటరీ బైక్‌పై పవన్ చక్కర్లు కొట్టాడు. ట్రాఫిక్ డీసీపీ ఎల్ఎస్. చౌహాన్, అదనపు కమిషనర్ పాపయ్య, పంజగుట్ట ఏసీపీ మాసుం బాషా, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ఉమా మహేశ్వర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి ఈ మేరకు ట్రాఫిక్‌ను నియంత్రించి బాలుడి కోరిక తీర్చారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... తనకు సీబీఐ ఆఫీసర్ కావాలని ఉందని, సినీ నటుడు మహేశ్‌బాబు అంటే చాలా ఇష్టమని చెప్పాడు. శ్రీమంతుడు సినిమాలో మహేశ్‌బాబు హర్షగా.. ఊరి బాగు కోసం కృషి చేసినట్లు తాను కూడా తన గ్రామం అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపాడు. -
’శ్రీమంతుడు’ ఫుల్ హ్యాపీ
-
నాన్నగారు అలా అన్నప్పుడు కన్నీళ్లు వచ్చేశాయ్
నాన్నగారు అలా అన్నప్పుడు కన్నీళ్లు వచ్చేశాయ్...అన్నయ్య మొదటిసారి బొకే ఇచ్చాడు...నిద్రపోయి పదిహేను రోజులైంది...వెంకీగారు ఇంటికొచ్చి గంట మాట్లాడారు... మహేశ్ బాబుఅన్న మాటలివి. ఇంకా మహేశ్ ఏమేం అంటున్నారో చూద్దాం... ‘శ్రీమంతుడు నాకు క్రూషియల్ మూవీ’ అని విడుదలకు ముందు అన్నారు... రిలీజ్ దగ్గరయ్యే కొద్దీ టెన్షన్ పడ్డారా? సినిమా రిలీజ్‌కు మరో వారం రోజులు ఉందనగా నాకు నిద్ర మాయమైపోయింది. సక్సెస్ గ్యారంటీ అనే నమ్మకం ఉన్నా ఎందుకో నిద్రపట్టలేదు. విడుదలయ్యాక వచ్చిన హిట్ టాక్ని ఆస్వాదించే క్రమంలో ఓ వారం రోజులు నిద్రపోలేదు. మామూలు స్థితికి రావడానికి ఓ రెండు వారాలు పడుతుందేమో (నవ్వుతూ). ఓ పది వారాల తర్వాత ఎంజాయ్ చేయడం మొదలుపెడతాను. ఆగస్ట్ 7 (‘శ్రీమంతుడు’ విడుదలైన రోజు)ని జీవితంలో మర్చిపోలేను. ఓ మిరాకిల్‌లా అనిపిస్తోంది. ఈ సక్సెస్ క్రెడిట్ శివగారికే దక్కుతుంది. కొరటాల శివ ఈ కథ చెప్పినప్పుడు ఏమైనా లోపాలు కనిపించాయా? ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఇప్పటివరకూ నా కెరీర్లో ఏ లోపాలూ లేని కథ ఇదే. మంచి సందేశంతో ఉన్న కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. అందుకే కథ వినగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేశాను. ఇది చాలా హానెస్ట్ కాన్సెప్ట్ కాబట్టే, ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. మంచి కథలను ఆదరిస్తారని ప్రేక్షకులు మరోసారి ప్రూవ్ చేశారు. నటుడిగా మీకెలాంటి తృప్తినిచ్చింది.. ఆ మధ్య విడుదలైన ‘1 నేనొక్కడినే’తో ‘శ్రీమంతుడు’ని పోల్చితే..? నా పదిహేనేళ్ల కెరీర్లో నటుడిగా ఇది నా బెస్ట్ మూవీ అంటాను. ‘1 నేనొక్కడినే’తో పోల్చి చెప్పాలంటే నటుడిగా ‘శ్రీమంతుడు’ సంతృప్తినిచ్చింది. వంద కోట్ల క్లబ్లో ఈ చిత్రం చేరిందని ట్రేడ్ టాక్.. వసూళ్లు గురించి మీరేమంటారు? మంచి కంటెంట్‌తో చేసిన చిత్రం ఇది. వసూళ్ల గురించి మాట్లాడటం రెస్పెక్ట్ కాదు. ఈ చిత్రానికి మీరు కూడా ఓ నిర్మాత కాబట్టే, భారీగా ప్రచారం చేస్తున్నారా? ఏ సినిమాకైనా ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. నేను చేసే ప్రతి సినిమా నాకు హార్ట్‌లాంటిది. నేనే సినిమాని ప్రమోట్ చేయడానికి వెనకాడలేదు. కానీ, ఈ సినిమాకి నిర్మాతను కాబట్టే, భారీగా ప్రమోట్ చేస్తున్నానని కొంతమంది అనుకుంటున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి, జనాలకు దగ్గరవ్వాలనే తాపత్రయంతో ప్రచారం చేశాం. మీ పిల్లలు గౌతమ్, సితార ఈ సినిమా చూశారా? సాధారణంగా నేను యాక్ట్ చేసే సినిమాలను గౌతమ్ చూడడు. ఈ చిత్రాన్ని థియేటర్లో చూశాడు. చాలా బాగుందన్నాడు. సితార అయితే సినిమాలోని అన్ని పాటలూ పాడేస్తోంది. కొన్ని లిరిక్స్ నాకే తెలియదు (నవ్వుతూ). ఈ సినిమా చూసి, కృష్ణగారు ఏమన్నారు? నాన్నగారు చిన్నపిల్లాడిలాంటివారు. ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు. మహేశ్‌బాబు కెరీర్లోనే బెస్ట్ ఫిలిం అని శివగారితో అన్నారు. నాతోనూ అలానే అన్నారు. నాన్నగారి మాటలు వినగానే ఒక్కసారిగా కళ్లు చెమర్చాయి. మీ రియల్ లైఫ్ అన్నయ్య (రమేశ్ బాబు), రీల్ బ్రదర్ (వెంకటేశ్) ఏమన్నారు? మా అన్నయ్య బొకే ఇచ్చి మరీ అభినందించాడు. నా ఇన్నేళ్ల కెరీర్లో అన్నయ్య బొకే ఇవ్వడం ఇదే తొలిసారి. విచిత్రంగా అనిపించింది. ఇక, మా పెద్దోడు (వెంకటేశ్) ‘నీతో పర్సనల్‌గా మాట్లాడాలి’ అని ఇంటికొచ్చారు. ఓ గంటసేపు మాట్లాడారు. సినిమా బాగుందని, బాగా యాక్ట్ చేశావని అభినందించారు. ఈ చిత్రంలో ఎమోషనల్ సీన్స్‌లో మీరు బాగా యాక్ట్ చేశారని అందరూ అంటున్నారు.. హోమ్‌వర్క్ ఏమైనా చేశారా? ఇప్పటివరకూ ఏ సినిమాకీ నేను హోమ్‌వర్క్ చేయలేదు. నేను హోమ్‌వర్క్ చేయడం అంటే డెరైక్టర్‌తో ఇంటరాక్ట్ కావడమే. ఈ కథలో మంచి సోల్ ఉంది. అందుకే ఎమోషన్ సీన్స్ బాగా చేయగలిగాను. ఆ సీన్స్‌లో నటించడం పూర్తయ్యాక మా డెరైక్టర్, కెమెరా అసిస్టెంట్ తదితరులను చూస్తే, వాళ్ల కళ్లల్లో నీళ్లు ఉండేవి. దాంతో ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అవుతారని అనిపించింది. పొలిటీషియన్స్ నుంచి కామన్ మ్యాన్ వరకు ఈ చిత్రాన్ని చాలామంది అభినందించడం ఎలా ఉంది? మిరాకిల్లానే ఉంది. మహేశ్‌బాబు జడ్జిమెంట్ అద్భుతం అని, హ్యాట్సాఫ్ అని అంటున్నారు. కొంతమందైతే ఇలాంటి కథతో సినిమా చేయడం రిస్క్ అన్నారు. ‘శ్రీమంతుడు’ చేసినప్పుడు నాకేమీ అనిపించలేదు కానీ, ఇప్పుడీ మాటలు వింటుంటే భయమేస్తోంది. యాక్చువల్‌గా నాకు తెలిసి తెలుగు ప్రేక్షకులు చూసినంత ఎక్కువగా వేరేవాళ్లు సినిమాలు చూడరు. మంచి సినిమా చేస్తే ‘ఆకాశమే హద్దు’ అన్నది ఈ సినిమాతో మరోసారి నిరూపితమైంది. ‘శ్రీమంతుడు’లో సైకిల్ తొక్కారు కాబట్టి.. ఈ మధ్య వాటికి డిమాండ్ పెరిగింది... విడిగా కూడా మీరు సైకిల్ తొక్కుతున్నారా? శివగారు సైకిల్ కాన్సెప్ట్ చెబితే, కొత్తగా అనిపించి, చేశాను. డిమాండ్ పెరిగితే మంచిదే. ఇక, సినిమాలో తొక్కాను కదా అని.. విడిగా కూడా సైకిలేసుకుని నేను రోడ్ల మీద వెళితే పిచ్చోడనుకుంటారు (నవ్వుతూ). లుంగీలో కనిపించడం కూడా మీ అభిమానులకు బాగా నచ్చింది? వాస్తవానికి ఈ మధ్య చేసిన సినిమాల్లో దర్శకులు లుంగీ సీన్ పెట్టాలనుకున్నారు కానీ, కథకు కనెక్ట్ కాలేదు. ఈ కథలో వచ్చిన పాటకు కుదరడంతో ఓకే అన్నాను. లుంగీ కట్టుకోవడం ఇబ్బందిగా అనిపించింది కానీ, రెస్పాన్స్ బాగుంది. గ్రామాన్ని దత్తత తీసుకునే కాన్సెప్ట్‌తో సాగే సినిమా ఇది. మీ సొంత ఊరు బుర్రిపాలెంను దత్తత తీసుకుంటాననన్నారు కదా.. అదేమైంది? ‘శ్రీమంతుడు’ రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాక మా బావ (గల్లా జయదేవ్) బుర్రిపాలెంని దత్తత తీసుకోమని సలహా ఇచ్చారు. అప్పుడు తీసుకుంటే పబ్లిసిటీ స్టంట్ అంటారు. అందుకే ఆగాను. ఇప్పుడు మా బావతో కలిసి ఆ విషయం గురించి చర్చిస్తున్నాను. మరో రెండు నెలల్లో ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ చిత్ర విజయం మీరు తదుపరి చేయబోయే ‘బ్రహ్మోత్సవం’పై భారీ అంచనాలు పెంచుతుంది కదా? ఇంకా ‘శ్రీమంతుడు’ విజయాన్నే ఆస్వాదించలేదు. తదుపరి చిత్రం గురించి అడిగి, అప్పుడే ప్రెజర్ మొదలుపెట్టేస్తున్నారు (నవ్వుతూ). వచ్చే నెల ఆ చిత్రం ఆరంభమవుతుంది. అందుకని ఇప్పుడే ఆలోచించడంలేదు. ‘మంచి హీరోయిజమ్’ ట్రెండ్ మళ్లీ మొదలైంది - రాజేంద్రప్రసాద్ రాజేంద్రప్రసాద్: ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణగార్ల టైమ్‌లో హీరోయిజమ్ అంటే పాజిటివ్‌గా ఉండేవి. వాటి ప్రభావం జనాల్లో చాలా ఉండేది. ఆ తర్వాత తర్వాత నరుక్కోవడం, చంపుకోవడం ఎక్కువైంది. ఇప్పుడు మళ్లీ ఆ పాత హీరోయిజమ్ ట్రెండ్‌ను మొదలుపెట్టిన చిత్రం ‘శ్రీమంతుడు’. మహేశ్‌బాబు నటించిన చిత్రాల్లో ‘ఒక్కడు, ‘అతడు’, ‘పోకిరి’ నాకు చాలా ఇష్టం. మహేశ్ ఈ చిత్రంలో ఇంకా మెచ్యుర్డ్‌గా నటించాడు. జగపతిబాబు: ఇందులో నాది రిచ్ ఫాదర్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ని శివ సరిగ్గా తీసి ఉండకపోతే పిచ్చి ఫాదర్‌లా కనిపించి ఉండేవాణ్ణి. సినిమాలో మహేశ్ నన్ను ‘అండీ’ అని పిలవడం చాలా బాగుంటుంది. నేను తండ్రి పాత్రలే చేస్తానని చాలామంది ఫిక్సయినట్లున్నారు. కానీ, అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంది. జుత్తుకి రంగు వేసుకుంటే హీరోగానూ చేయొచ్చు (నవ్వుతూ). కొరటాల శివ: పరీక్షలు బాగా రాయనివాడికి ఏ టెన్షనూ ఉండదు. ఎలాగూ రిజల్ట్ ముందే ఊహిస్తాడు. ఎటొచ్చీ బాగా రాసినవాళ్లకే టెన్షన్ అంతా. మేం ‘శ్రీమంతుడు’ అనే పరీక్ష బాగా రాశాం. కొంచెం టెన్షన్‌గా, పాజిటివ్‌గా రిజల్ట్ కోసం ఎదురు చూశాం. పాజిటివ్ మైండ్‌తో చేస్తే, పాజిటివ్ రిజల్టే వస్తుందని ప్రూవ్ అయ్యింది. ఈ చిత్రాన్ని అంగీకరించిన మహేశ్‌బాబుకి ధన్యవాదాలు. మా ఊళ్లో శ్రీమంతులు కూడా సైకిల్ తొక్కుతుంటారు. ఆ పాయింట్‌నే ఇందులో పెట్టాను. నవీన్: 2014 ఏప్రిల్ 18న మహేశ్‌బాబుతో మా బ్యానర్లో ‘శ్రీమంతుడు’ సెట్ అయ్యింది. అప్పుడెంత ఆనందపడ్డామో.. ఈ సినిమా విజయానికి అంతే ఆనందపడుతున్నాం. మా సంస్థలో ప్రతిష్ఠాత్మక చిత్రంగా నిలిచిపోయింది. తమిళ, మలయాళ భాషల్లో కూడా బాగా ఆడుతోంది. -
'శ్రీమంతుడు సక్సెస్ ఆనందంగా ఉంది'
-
'శ్రీమంతుడు సక్సెస్ ఆనందంగా ఉంది'
హైదరాబాద్ : శ్రీమంతుడు చిత్రం ద్వారా యువత స్ఫూర్తి పొందితే చాలని ప్రిన్స్ మహేశ్ బాబు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని తాజ్ కృష్టా హోటల్ లో శ్రీమంతుడు చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో మహేశ్ బాబు మాట్లాడుతూ.... శ్రీమంతుడు చిత్రం సక్సెస్ ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా సక్సెస్ ఇంత స్థాయిలో ఉంటుందని అసలు ఊహించలేదని వెల్లడించారు. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడం కూడా ఆనందాన్ని ఇచ్చిందని మహేశ్ చెప్పారు. చిత్రంలోని 'సైకిల్' ఐడియా దర్శకుడు కొరటాల శివ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించిందన్నారు. తన తండ్రి స్వగ్రామమైన గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత తనకు స్పష్టత వస్తుందని మహేశ్ పేర్కొన్నారు. సినిమా కలెక్షన్ల కన్న గౌరవం చాలా ముఖ్యమని ఓ విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు మహేశ్ సమాధానమిచ్చారు. తన కెరీర్లోనే శ్రీమంతుడు ఉత్తమ చిత్రమని పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారని మహేశ్ చెప్పారు. కష్టపడి చదివి పరీక్ష రాసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో... ఈ చిత్రం విడుదల సమయంలో తమ పరిస్థితి అలానే ఉందని ఈ దర్శకుడు కొరటాల శివ తెలిపారు. హీరో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... ఒకప్పుడు హీరో ఎలా ఉండేవాడు ... ఇప్పుడు ఎలా ఉన్నాడు... శ్రీమంతుడు తర్వాత ఎలా ఉన్నాడు అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుందన్నారు. శ్రీమంతుడుతో తెలుగు సినిమా ట్రెండ్ మారిందన్నారు. ఈ చిత్రం చూసి చాలా మంది ప్రేరణ పొందుతున్నారని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు జగపతి బాబుతోపాటు ఈ చిత్రంలో నటించిన పలువురు నటీనటులు హాజరయ్యారు. ప్రిన్స్ మహేశ్ బాబు, శ్రుతి హాసన్ జంటగా నటించి శ్రీమంతుడు ఆగస్టు 7 ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. -
ఆదర్శవంతంగా శ్రీమంతుడు!
హైదరాబాద్: ఒక ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేసే కాన్సెప్ట్‌తో వచ్చిన మూవీ శ్రీమంతుడు. హీరో మహేష్ బాబు కెరీర్ లో ఈ సినిమా మంచి విజయం సాధించి.. కలెక్షన్లలో దూసుకుపోతోంది. దీంతో పాటు ఈ సినిమా పలువురికి ఆదర్శవంతంగా కూడా నిలుస్తోంది. రూ.కోట్లు సంపాదించినా.. దేశ, విదేశాల్లో స్థిరపడినా.. లగ్జరీ జీవితం గడుపుతున్నా.. పుట్టి, పెరిగిన ఊరికి ఏమైనా చేయాలనే తపన పలువురి మనసులను తాకింది. ప్రస్తుతం శ్రీమంతుడు ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రులు, ఎంపీలను సైతం శ్రీమంతుడు విపరీతంగా ఆకర్షించింది. కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఢిల్లీలోని తన సహచరుల వద్ద శ్రీమంతుడు సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారట. ఇదిలా ఉండగా ఈ సినిమాను చూసి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామరావు ప్రశంసలు కురిపించారు. పల్లెలను అభివృద్ధి చేయూలని సీఎం కేసీఆర్ ప్రారంభించిన గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని శ్రీమంతుడు సినిమాతో పోల్చారు. దీంతో పాటు సినిమాను చూసిన పలువురు నటులు సైతం శ్రీమంతుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ హీరో వెంకటేశ్ తో సహా పలువురు మహేష్ బాబును ప్రత్యేకంగా కలిసి అభినందించారు. ఈ సినిమాలోని చక్కటి సందేశం వాణిజ్యపరంగా లాభాలను తెచ్చిపెడుతుందని నటుడు మరో హీరో కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. -
శ్రీమంతుడికి మంత్రి కేటీఆర్ కితాబు
-
గ్రామాన్ని దత్తత తీసుకుంటా
గ్రామాన్ని దత్తత తీసుకుంటానంటున్నారు నటి శ్రుతిహాసన్. ఇప్పుడీమె దక్షిణాదిలోనే కాదు ఉత్తరాదిలోనూ క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతున్నారు.తమిళంలో విజయ్ సరసన నటించిన భారీ చిత్రం పులి త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అజిత్‌కు జంటగా ఏఎం.రత్నం నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో మహేశ్‌బాబుతో నటించిన శ్రీమంతుడు చిత్రం ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో విడుదలై విజయవంతంగా ప్రదర్శింబడుతోంది. ఇది చిత్ర కథానాయకుడు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని దీన దశలో ఉన్న అక్కడి ప్రజలను ఆదుకునే ఇతివృత్తంతో తెరకెక్కిన కథా చిత్రం. కథానాయికి గ్రామీణాభివృద్ధికి పాటు పడే విద్యను చదువుతుంది. ఇది శ్రుతిహాసన్ పోషించిన పాత్ర. కాగా శ్రుతిహాసన్ తన ట్విట్టర్లో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. గ్రామాన్ని దత్తత తీసుకునే ఇతి వృత్తంతో కూడిన శ్రీమంతుడు చిత్రంలో నటించారు. నిజ జీవితంలో గ్రామాన్ని దత్తత తీసుకుంటారా? అన్న అభిమాని ప్రశ్నకు తప్పకుండా.అలాంటి ఆలోచన నాకు ఉంది అని బదులిచ్చారు. దృఢమైన వ్యక్తిత్వాన్ని, అంకితభావాన్ని నా తండ్రి కమలహాసన్ నుంచి నేర్చుకున్నాను. ఇంకా చాలా నేర్చుకుంటున్నాను. తన వంతు సేవ ప్రజలకు చేస్తాను. అలాగే నటిగా బిజీగా ఉన్నా సంగీతంపై ఇష్టంతో త్వరలో ఒక మ్యూజికల్ ఆల్బమ్ చెయ్యాలనుకుంటున్నాను. నాకు నచ్చిన విహార ప్రాంతం లాస్ ఏంజిల్స్. ఇష్టమైన వంటకం సాంబారు అన్నం. ఇక తన చెల్లెలు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తను అందరికీ నచ్చే అమ్మాయి. -
ఆలోచింపజేసే 'శ్రీమంతుడు' డైలాగులు..
కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం శ్రీమంతుడు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం అరుదైన కలెక్షన్లను రాబడుతోంది. అయితే ఈ సినిమాలో కొన్ని డైలాగులు ప్రతి మనిషిని ఆలోచింపజేస్తున్నాయి. ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ స్వతహాగా రచయిత కావడంతో చక్కని డైలాగులు రాశారు. మహేశ్ బాడీలాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఉంటాయి సంభాషణలు. ఎక్కడా భారీ డైలాగులు వినిపించవు. ‘ఎదుగుదల అంటే మన చుట్టూ ఉన్నవాళ్లు ఎదగడం’, ‘సాటి మనిషి కష్టాన్ని చూడకపోతే మనం భూమ్మీద సంఘంలో బతకడం ఎందుకు?’ లాంటి డైలాగులు సున్నితంగా మనసును తాకుతాయి. ‘ఊరు చాలా ఇచ్చింది. ఎంతోకొంత తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే లావయిపోతారు’ లాంటి డైలాగులు వినోదాన్ని ఇస్తూనే ఆలోచింపజేస్తాయి. ఈ డైలాగుల్ని మహేశ్ పలికే విధానం చాలా బాగుంది. -
శ్రీమంతుడు సినిమా మేకింగ్ విశేషాలివీ..
బాహుబలి తర్వాత వచ్చినా.. సూపర్‌హిట్ టాక్‌తో నడుస్తున్న శ్రీమంతుడు సినిమా గురించిన విశేషాలను ప్రేక్షకులతో నిర్మాణ సంస్థ వాళ్లు పంచుకున్నారు. ఈ వీడియోను మహేశ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా 'ఫన్ టైమ్స్ :) ' అంటూ షేర్ చేశారు. ప్రధాన పాత్రధారులు మహేశ్ బాబు, శ్రుతిహాసన్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, దర్శకుడు కొరటాల శివ.. వీళ్లంతా ఈ సినిమా గురించి చెప్పిన విశేషాలతో పాటు.. సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, మేకింగ్ వీడియోలు అన్నింటినీ ఇందులో పొందుపరిచారు. పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, సినిమాలో మరో కీలక నటుడు రాహుల్ రవీంద్రన్ లాంటి వాళ్లు కూడా తమ అభిప్రాయాలను ఈ వీడియోలో పంచుకున్నారు. సినిమా షూటింగ్ విశేషాలను కూడా చూపించడం మరో ఆసక్తికరమైన అంశం. సినీ నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ ఈ వీడియోను యూట్యూబ్ ద్వారా అందించింది. ఈ లింకును మహేశ్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. Fun times :) https://t.co/VoujlvsEBw — Mahesh Babu (@urstrulyMahesh) August 11, 2015 -
శ్రీమంతుడి ఎఫెక్ట్: రోడ్డెక్కిన సైకిళ్లు!
హైదరాబాద్: సినిమాలు యువత మీద గట్టిగానే ప్రభావం చూపిస్తాయి. 1989 ప్రాంతంలో శివ సినిమా విడుదలైనప్పుడు అప్పటి కాలేజి కుర్రాళ్లు చాలామంది సైకిల్ చైన్లు పట్టుకుని తిరిగేవాళ్లు. ఇక ఫ్యాషన్ల విషయంలో కూడా హీరోలను అనుకరించడం మన యూత్‌కు మామూలే. తాజాగా విడుదలైన శ్రీమంతుడు సినిమాలో హీరో మహేశ్ బాబు సైకిల్ మీదే ఎక్కువగా తిరుగుతుంటాడు. అది చూసి కుర్రాళ్లంతా సైకిళ్ల దుమ్ము దులుపుతున్నారు. నిన్న మొన్నటి వరకు తల్లిదండ్రులు ఎక్కడికైనా సైకిల్ వేసుకుని వెళ్లమంటే కావాలంటే నడిచి వెళ్తా, లేకపోతే బండి వేసుకెళ్తా గానీ.. సైకిలా అని అడిగేవవాళ్లంతా కూడా ఇప్పుడు మారిపోతున్నారు. ఇంట్లో మూలపడిన సైకిళ్లను బయటకు తీసి, శుభ్రంగా తుడిచి, బాగు చేయించుకుని వాటిమీద షికార్లకు వెళ్తున్నారు. చిన్న చిన్న అవసరాలకు వెళ్లడంతో పాటు.. సాయంత్రాలు అలా బయటకు వెళ్లాలన్నా సైకిళ్లను బయటకు తీస్తున్నారు. చివరకు కొన్ని కార్పొరేట్ కార్యాలయాల్లో పనిచేసేవాళ్లు కూడా ఇప్పటివరకు క్యాంపస్‌లో ఉన్న సైకిళ్లను ముట్టుకునేవారు కారు. ఇప్పుడు మాత్రం ఆ సైకిళ్లకు పోటీ పెరిగిపోతోందని ఇన్ఫోసిస్ ఉద్యోగి శ్రీహర్ష చెప్పాడు. ఇటు ఆరోగ్యంతో పాటు అటు కాలుష్య నియంత్రణకు కూడా సైకిళ్లు ఎంతగానో ఉపయోగపడతాయన్న విషయం తెలిసిందే. చైనా లాంటి దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో తప్పనిసరిగా సైకిళ్లు వాడాలన్న నిబంధనలున్నాయి. మన దేశంలో అలాంటి నిబంధనలు అక్కర్లేదు.. ఇలా హీరోలతో నాలుగైదు సినిమాల్లో సైకిళ్లు తొక్కిస్తే చాలని అంతా అనుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో మెట్రోరైలు తిరగడం మొదలుపెడితే.. ఇక సైకిళ్ల వాడకం కూడా ఎక్కువ కావచ్చని అంటున్నారు. మెట్రో స్టేషన్లలో సైకిళ్లు ఉంచుతామని, వాటిని వాడుకుని మళ్లీ స్టేషన్లో అప్పగించొచ్చని అధికారులు చెబుతున్న విషయం తెలిసిందే. ఇదంతా జరిగితే.. వాతావరణ కాలుష్యం తగ్గుతుంది, హైదరాబాదీయుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. -
కొరటాల శివకి మహేష్ మరో ఛాన్స్ ఇచ్చాడా ?
-
మేకింగ్ ఆఫ్ మూవీ - శ్రీమంతుడు
-
50 కోట్లు దాటిన 'శ్రీమంతుడు'
చెన్నై: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ శ్రీమంతుడు రూ.50 కోట్లు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం వారం ప్రారంభంలోనే రూ.50 కోట్లు వసూళ్లను రాబట్టడంతో తెలుగు చిత్ర సీమకు మరింత ఉత్సాహాన్నిచ్చినట్లయింది. కాగా, ఈ చిత్రం విడుదలైన రోజే రూ.31కోట్లు సాధించిందని చిత్ర వర్గాలు తెలిపాయి. మరోపక్క, అమెరికాలో కూడా విడుదలైన ఈ చిత్రం సోమవారం రెండు మిలియన్ డాలర్లను దాటనుందట. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ వంటి ప్రముఖ నటులు ఉన్నారు. కోటీశ్వరుడైన ఓ యువకుడు ఊరిని దత్తత తీసుకునే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. -
శ్రీమంతులు!
-
శ్రీమంతుడి స్ఫూర్తితో.. పలుగు పట్టిన యాక్టర్
శ్రీమంతుడు సినిమాలో హీరో మహేశ్ బాబు ఓ సన్నివేశంలో స్వయంగా పలుగుపట్టి చెరువు పూడిక తీసేందుకు చేయి కలుపుతాడు. ఆ సన్నివేశంతో స్ఫూర్తి పొందాడో.. లేక మొత్తం సినిమా కాన్సెప్టు అయిన ఊరిని బాగు చేయాలన్న నినాదం చూసి ముచ్చట పడ్డాడో గానీ.. నటుడు బ్రహ్మాజీ కూడా పలుగు పట్టాడు. షార్ట్స్, టీషర్టు వేసుకుని పలుగు పట్టుకుని మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వాడు. దానికి సంబంధించిన ఫొటోలు ట్విట్టర్లో దర్శనమిచ్చాయి. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా.. ఒళ్లు చెమటలు పట్టేలా కష్టపడుతున్నట్లు ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. నిజంగానే శ్రీమంతుడి స్ఫూర్తితో అంతా ఇలా ముందుకు వెళ్లి.. నాలుగు పనులు చేసి ఊళ్లను బాగుచేస్తే అంతకంటే కావల్సింది ఏముంటుంది? -
శ్రీమంతుడు చూసి జక్కన్న ఫ్లాట్
ఊరు మనకు చాలా ఇచ్చింది.. మనం తిరిగి ఏదో ఒకటి ఇచ్చేయాలి. లేకపోతే లావైపోతాం అంటూ.. సొంతూరి సెంటిమెంటుతో అభిమానుల హృదయాలు కొల్లగొట్టిన ‘శ్రీమంతుడు’ సినిమా చూసి టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కూడా ఫ్లాటైపోయారు. కుటుంబ సమేతంగా ఈ సినిమా చూసిన తర్వాత ఆయన తన ఫీలింగులను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకునే కాన్సెప్టును ఫ్యామిలీ సెంటిమెంటుతో చాలా తెలివిగా కలిపారని, అదే ఈ సినిమా విజయ రహస్యమని చెప్పారు. దర్శకుడు కొరటాల శివ చాలా బాగా చేసినందుకు అభినందనలు చెబుతూనే.. కలెక్షన్లు మాత్రం మహేశ్ బాబు వల్లే వస్తాయని స్పష్టం చేశారు. ఈ సినిమాలో మహేశ్ చాలా కూల్ గా కనపడుతూ, అంచనాలకు అందకుండా నటించి, ఏమాత్రం హడావుడి లేకుండా డైలాగులు చెప్పి ప్రేక్షకుల హృదయాలను చేరుకున్నారన్నారు. యూనిట్ సమష్టి కృషి చాలా అత్యద్భుతంగా ఉందని రాజమౌళి మెచ్చుకున్నారు. ఇక శ్రుతిహాసన్ ని చూస్తే ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతామని, ఆమె తన నటనలో చాలా ఎత్తులు ఎదిగిందని ప్రశంసల జల్లు కురిపించారు. దర్శకుడి విజన్ ను మాదీ ఫొటోగ్రఫీ మరింత పెంచిందని సాంకేతిక అంశాలనూ స్పృశించారు. తమ కుటుంబం మొత్తం ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశామన్నారు. శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ విజయం సాధించడంలో సినిమాలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలంటూ ముగించారు. The success of srimanthudu lies in the clever mixture of village adoption with family sentiment. Well done sivagaru. But The paisa vasool — rajamouli ss (@ssrajamouli) August 7, 2015 Comes from the man himself, mahesh looks cool, acts subtle talks mellow. But the overall effect is flabbergasting. Shruthi hassan grooves — rajamouli ss (@ssrajamouli) August 7, 2015 Comes from the man himself, mahesh looks cool, acts subtle talks mellow. But the overall effect is flabbergasting. Shruthi hassan grooves — rajamouli ss (@ssrajamouli) August 7, 2015 are breath taking and she has improved by leaps and bounds on the acting front. And madhie’s photography enhanced the director’s vision. — rajamouli ss (@ssrajamouli) August 7, 2015 Our whole family enjoyed the movie. Congratulations to everyone involved in srimanthudu for the blockbuster succcess.. — rajamouli ss (@ssrajamouli) August 7, 2015 -
శ్రీమంతుడు.. సీన్ బై సీన్
కొరటాల దర్శకత్వంలో, సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన శ్రీమంతుడు ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాలో హర్ష క్యారెక్టర్లో మరింత ఎలివేట్ అయ్యాడు. కాలేజీ బోయ్లాగా అమ్మాయిలను మనుసులను దోచేశాడు. మహేష్ ఛార్మ్, అద్బుతమైన సినిమాటోగ్రఫీ దేవీశ్రీ మ్యూజిక్ మ్యాజిక్ చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ అదర్శ్ గ్రామ యోజన పథకానికి సెల్యులాయిడ్ ఎలిమెంట్స్ జోడించినట్టుగా మన జన్మభూమికి ఎంతో కొంత సేవ చేయండంటూ చిన్నపాటి మెసేజ్‌తో వచ్చిన ఈ మూవీ విశేషాలు ఇవీ.. తెరపై మహేష్ బాబును చూసిన ఫ్యాన్స్ పండగే అని చెప్పాలి. నవయువకుడిలాగా మెరిసిపోతున్న యువరాజు ని చూసి అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బియ్యేంత అద్భుతంగా ఉంది హర్షవర్ధన్ పాత్ర. అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేశాడు. రామ రామ అంటూ అద్భుతమైన పాటతో హీరో ఎంటరవుతాడు. ఏ మాత్రం వయసు కనిపించకుండా అచ్చం కాలేజీ కుర్రాడిలా కనువిందు చేశాడు. ఇక మొదటి సారి మహేష్ బాబుతో పూర్తిస్థాయిలో స్క్రీన్ పంచుకుంటున్న శృతిహాసన్ అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే... ప్రెటీ లుక్స్‌తో ఈ అందాల రాశి ఎంట్రీ చాలా గ్రాండ్‌గా ఉంది. మహేశ్ తండ్రి పాత్ర చేసిన జగపతిబాబు క్యారెక్టర్ కూడా చాలా రిచ్‌గా ఉంది. సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ధనవంతుడి తండ్రి పాత్రలో ఆయన అడుగడుగునా హుందాతనాన్ని, దర్పాన్ని ఒలికిస్తూ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఈ సందర్భంగా తండ్రీ కొడుకుల మధ్య సంభాషణలు హృదయానికి హత్తుకునేలా ఆకట్టుకుంటాయి. ప్రిన్స్ చురుకైన చూపులతో సొగసుగా అలరిస్తే.. జగపతి పాత్ర కొంచెం గడుసుగా, మరింత గంభీరంగా ఉండి.. అన్ని వయసుల ప్రేక్షకుల మనసులను దోచుకుంటాయి. వారిద్దరి మధ్య సాగే గంభీరమైన, రసవత్తరమైన డైలాగులు మళ్లీ మళ్లీ వినాలనిపించేలా.. బావున్నాయి. మహేశ్‌బాబు మైమరిపించే అందానికి తోడు ఆసక్తికరమై కాలేజీ వాతావరణం, అద్భుతమైన దృశ్యాలు మరింత అందంగా ఒదిగిపోయాయి. సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర,విలన సంపత్ (శశి) ఎంటరవుతాడు. అద్భుతమైన సాహిత్యానికి సంగీతం జత కలిస్తే ఆవిష్కరించే పాటే 'జత కలిసే'.... స్క్రీన్ మీద అభిమానులకు పండగ చేసింది. స్క్రీన్ ప్లే చాలా పకడ్బందీగా చాలా ఆకర్షణీయంగా ఉంది. మహేశ్‌బాబు రెట్టించిన అందంతో ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఇంతలో కథలో ఓ చిన్న ట్విస్ట్. దీంతో సినిమాలో సీరియస్ వాతావరణం వచ్చేస్తుంది. మహేశ్, శృతిల మధ్య ప్రేమ సన్నివేశాలు చాలా హృద్యంగా, అందంగా ఉంటాయి. వాస్తవానికి దగ్గరగా ఉండి మనసును హత్తుకుంటాయి. మూడోపాట 'చారుశీల స్వప్నబాల'కు అభిమానులు ఈలలు, కేకలతో గోల చెయ్యాల్సిందే. కేరింతలు కొట్టాల్సిందే. కథలో మరో ఆసక్తికర మలుపునకు నాంది నాలుగో పాట . ఇంటర్వెల్. ఫస్ట్ హాఫ్ మాంచి ఫీల్‌తో పరిగెట్టి, సెకండాఫ్‌కి వచ్చేసరికి ఎమోషన్స్ బీట్స్‌తో, ప్రెడిక్టబుల్ క్లైమాక్స్‌తో స్లో అయ్యింది. అయినా ఓకే. మహేశ్ బాబు, అలీ మధ్య కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది. కామెడీ సీన్లను పండించడంలో మరోసారి హీరో సక్సెస్ అయ్యాడు. విలన్లతో ఘర్షణపడే సన్నివేశంతో సెకండ్ హాఫ్ మొదలవుతుంది. లెంగ్తీ డైలాగులు కాకుండా చిన్నగా, సూటిగా ఉంటాయి. డైలాగ్ డెలివరీ అద్భుతం. తమ గ్రామస్తులను ఆకట్టుకొని, గ్రామ అభివృద్ధికి తోడ్పడేందుకు ప్రయత్నిస్తాడు హీరో. గ్రామ వికాసమే తమ వికాసమని వారు తెలిసుకునేలా చేస్తాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలు కంటికి ఇంపుగా ఉంటాయి. పల్లెటూరి లొకేషన్స్, క్యారెక్టర్స్ అదిరిపోయాయి. చాలా సింపుల్‌గా , క్యూట్‌గా ఈ సన్నివేశాల్లో మహేశ్ మరింత ఆకట్టుకుంటాడు. ఈ సందర్భంగా వచ్చే ఒక మోటివేషనల్ సాంగ్, లోగోలో మోదీ ఛాయలు లీలగా మనకు కనిపిస్తాయి. ఇక విలన్, కథానాయకుడి మధ్య వచ్చే భయంకరమైన సన్నివేశాలతో కథ మరో కీలకమలుపు తిరుగుతుంది. యాక్షన్ సన్నివేశాలతో సినిమాలో లీనమైపోతాడు ప్రేక్షకుడు. కన్నార్పకుండా కథలో మమేకమైపోతాడు. ఇంతటి గంభీరమైన వాతావరణంలో ఆఖరిపాట ఆకట్టుకుంటుంది. దిమ్మతిరిగే.. అంటూ సాగే ఈ మాంచి మాస్ మసాలాతో కొంచెం రిలీఫ్ అవుతాడు ప్రేక్షకుడు. అయితే మహేశ్ సినిమాలు రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారికి కొత్తగానూ, అదే సమయంలో ఎమోషన్ సీన్స్ బేస్‌గా నడుస్తుంది. కలెక్షన్ల పరంగా శ్రీమంతుడు ఫుల్ సక్సెస్ అయ్యేలా ఉంది. -
శ్రీమంతుడిపై టాలీవుడ్ ప్రశంసల జల్లు
మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సినిమాపై సామాన్య ప్రేక్షకులు, మహేశ్ అభిమానులే కాదు.. టాలీవుడ్ దిగ్గజాలు కూడా చాలామంది ప్రశంసల జల్లు కురిపించారు. సినిమాకు అన్ని చోట్ల నుంచి మంచి రిపోర్టులు వస్తున్నాయని, మొత్తం టీం అంతటికీ అభినందనలని 500 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టించిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించినందుకు అభినందనలని నిర్మాతలు రవిశంకర్, నవీన్, సీవీ మోహన్‌లకు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర అన్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్లోనే ఇది అద్భుతమైన సినిమా అవుతుందని ఆయన అన్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా సినిమాను ఎంతగానో ప్రశంసించారు. చాలా మంచి రిపోర్టులు వస్తున్నాయని, తన స్నేహితుడు మహేశ్ బాబుకు అభినందనలని ఆయన చెప్పారు. శ్రీమంతుడు గురించి టాక్ ఇప్పటికే వచ్చేసిందని, ఇది బ్లాక్‌బస్టర్ అవుతుందనే అందరూ చెబుతున్నారని మహేశ్ అన్న, సీనియర్ నటుడు నరేష్ ట్వీట్ చేశారు. ఇంకా.. నిఖిల్, సుధీర్ బాబు, రాహుల్ రవీంద్రన్, ప్రదీప్, గోపీమోహన్ తదితరులు అందరూ కూడా శ్రీమంతుడు సినిమా మీద ప్రశంసలు కురిపించారు. Show time srimanthudu...great reports from all over..congratulations to the whole team... — rajamouli ss (@ssrajamouli) August 7, 2015 Congrats to naveen, tammudu,cvm for blockbuster debut. SRIMANTHUDU will be one of the outstanding movies in superstar's career. — Anil Sunkara (@AnilSunkara1) August 7, 2015 Very very good reports on #srimanthudu. Really happy for my friend #mahesh... #shiva.. congrats to the whole team ... Cheersss — Prakash Raj (@prakashraaj) August 7, 2015 SRIMANTHUDU talk is out already - they are saying it's the BIGGEST HIT IN MAHESH'S CAREER . Even bad mouths can't help talking gud. — Actor Naresh (@ItsActorNaresh) August 7, 2015 Icing on cake,#Srimanthudu blockbuster talk n #KrishnammaKalipindiIddarini completes 50days today. https://t.co/9GsbrEKvwk — Sudheer Babu (@isudheerbabu) August 7, 2015 Outstanding!So good to see all the positive tweets about #Srimanthudu!Congrats to the whole team:)Watching it tonight in Chennai.Can't wait! — Rahul Ravindran (@23_rahulr) August 7, 2015 Blockbuster reports from everywhere... Super happy about Superstar and the entire team of #Srimanthudu... Congratulations everyone -
శ్రీమంతుడిది ఓ అద్భుత విజయం: వర్మ
-
జీవితంలోనే అత్యంత సంతోషమైన రోజు: మహేశ్
ఎప్పుడూ తన సినిమాల గురించి పెద్దగా మాట్లాడని మహేశ్ బాబు.. శ్రీమంతుడు సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ చూసి ఊరుకోలేకపోయాడు. తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుల్లో ఇదొకటని ట్వీట్ చేశాడు. శ్రీమంతుడు సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని, ఇది చూసి చాలా సంతోషిస్తున్నానంటూ.. 'లవ్యూ ఆల్' అని చెప్పాడు. శ్రీమంతుడు సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. అంతర్జాతీయంగా కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అమెరికాలో కూడా సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నట్లు ట్వీట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద కొందరు అభిమానులు ప్రీమియర్ షోతో మొదలుపెట్టి.. నాలుగు షోలకు టికెట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇవన్నీ చూసి మహేశ్ బాబు మంచి ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది. 1 of the happiest days of my life .. Overwhelming response for Srimanthudu ..humbled .. Love you all.. — Mahesh Babu (@urstrulyMahesh) August 7, 2015 -
శ్రీమంతుడిది ఓ అద్భుత విజయం: వర్మ
హైదరాబాద్: ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాపై విడుదలకు ముందే ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శ్రీమంతుడు సినిమా సింపుల్ అండ్ ప్లెయిన్ మూవీగా పేర్కొంటూ ట్వీట్ చేశాడు. ఈ సినిమా ఒక గొప్ప విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీగా తీసిన బాహుబలి తర్వాత.. శ్రీమంతుడు నేరుగా మనసును తాకి అద్భుత విజయం సాధించిందన్నారు. మంచి ఛార్మింగ్ ఉన్న నటుడు క్లోజప్‌లో నటిస్తే అంతకంటే అద్భుతమైన విజువల్ ఏమీ ఉండదని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విటోరియో స్టొరారో చెప్పారని అన్నారు. మహేశ్ బాబు లాంటి మంచి నటుడు క్లోజప్‌లో చేస్తే.. అద్భుతమైన కంప్యూటర్ గ్రాఫిక్స్ కలిగించే ప్రభావం కంటే చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. వందల కోట్లతో వందలాది రోజుల షూటింగు చేస్తేనే కాదని.. సింపుల్ స్టోరీ, ప్లెయిన్ క్లోజప్స్‌తో కూడా మాయ చేయొచ్చని శ్రీమంతుడు సినిమా రుజువు చేసినట్లు రాంగోపాల్ వర్మ చెప్పారు. So soon after extravaganza of Bahubali,Srimanthudu simplicity told with heart also can create thundering impact is a greater achievement — Ram Gopal Varma (@RGVzoomin) August 7, 2015 Cinematographer Vittorio storaro said there's no greater visual than a charming actor performing in a close up and Mahesh is proof of that — Ram Gopal Varma (@RGVzoomin) August 7, 2015 What's amazing about cinema is that a right actor's close up like Mahesh can create a greater impact than a great CG generated visual — Ram Gopal Varma (@RGVzoomin) August 7, 2015 Srimanthudu proved impact doesn't only come frm 100's of crores n 100s of days shooting..a simple story nd plain closeups of Mahesh can too — Ram Gopal Varma (@RGVzoomin) August 7, 2015