ధీ... మంతుడు | Mahesh Babu's Srimanthudu audio launch on July 18! | Sakshi
Sakshi News home page

ధీ... మంతుడు

Published Tue, Jul 14 2015 12:52 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

ధీ... మంతుడు - Sakshi

ధీ... మంతుడు

హీరో మహేశ్‌బాబు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఆగస్టు 9  ఈ యువ సూపర్‌స్టార్ పుట్టినరోజు. అంతకు రెండు రోజుల ముందే  ఆగస్టు 7న ‘శ్రీమంతుడు’ చిత్రం ద్వారా అభిమానులకు మహేశ్ వెండితెర విందు చేయనున్నారు. ఊరు, ఊరులోని జనం బాగు కోరే ఒక ధనిక యువ కుడిగా ఆయన కనిపించనున్నట్లు సినిమా టీజర్‌ను బట్టి ఊహిస్తున్నారు. ప్రభాస్‌తో ‘మిర్చి’ ద్వారా మంచి హిట్ సొంతం చేసుకున్న దర్శక- రచయిత కొరటాల శివ తాజా చిత్రమిది. మహేశ్ సరసన శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సుకన్య, తులసి, సంపత్‌రాజ్ లాంటి సుపరిచితులైన నటీనటులు చాలామందే ఉన్నారు.  

తమిళ నటుడు హరీశ్ ఉత్తమన్ ఇందులో విలన్. చెన్నైలో పుట్టి పెరిగిన విషయం తెలియని హరీశ్, సెట్స్‌లో మహేశ్ గడగడా తమిళం మాట్లాడడం చూసి, డంగైపోయారట. అన్నట్లు, కుటుంబబంధాలతో పాటు యాక్షన్‌కూ ప్రాముఖ్యమున్న సినిమా ఇది. ఇంటర్వెల్ ముందు హీరో, విలన్ల మధ్య యాక్షన్  పార్‌‌ట సూపర్ అని నటీనటులే చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు ఈ 18న హైదరాబాద్‌లో పెద్దయెత్తున జరిగే కార్యక్రమంలో విడుదల కానున్నాయి. కాగా, టెక్నికల్‌గా కూడా బాగా వచ్చిన ఈ సినిమా మళ్లీ ఒక మంచి హిట్టందిస్తుందని హీరో మహేశ్ ధీమాగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement