
అభిమానులతో శ్రీమంతుడి మాటా.. ముచ్చట
మరో ఆరు రోజుల్లో విడుదలవుకు సిద్ధంగా ఉన్న శ్రీమంతుడు సినిమా విశేషాలను మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
హైదరాబాద్: మరో ఆరు రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న శ్రీమంతుడు సినిమా విశేషాలను మహేశ్ బాబు ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. శనివారం సాయంత్రం 6గంటల నుంచి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. వాటిలో కొన్ని మీకోసం
అభిమాని: ఈ సినిమా ఒప్పుకోవడానికి మీకు నచ్చిన అంశం ఏంటి ?
మహేశ్ బాబు: సమాజానికి తిరిగి ఇవ్వడం అనేది నన్ను ఈ సినిమా ఒప్పుకోవడానికి ఎంతగానో ప్రేరేపించేలా చేసింది....
అభిమాని: ఈ సినిమాలో మీకు నచ్చిన సాంగ్ ?
మహేశ్ బాబు: జాగో జాగో ...
అభిమాని: హర్ష కారెక్టర్లో మీకు నచ్చింది..
మహేశ్ బాబు: సింప్లిసిటీ
అభిమాని: మీకు ఛాలెంజింగ్గా అనిపించి సీన్స్ ఏమైనా ఉన్నాయా?
మహేశ్ బాబు: క్లైమాక్స్కు ముందు సీన్స్లో అనిపించింది...
అభిమాని: జగపతి బాబుతో కలిసి నటించడం ఎలా అనిపించింది...
మహేశ్ బాబు: అయనతో కలిసి నటించడం నిజంగా అద్భుతంగా భావిస్తున్నా!
అభిమాని: దేవీశ్రీప్రసాద్ గురించి ఒక్క పదంలో చెప్పండి
మహేశ్ బాబు: రాక్స్టార్
అభిమాని: ఈ సినిమాలో శృతి గురించి చెప్పండి
మహేశ్ బాబు: ఆల్రౌండర్
అభిమాని: శ్రీమంతుడుతో ఏదైనా సామాజిక సందేశం ఇవ్వదలచుకున్నారా...
మహేశ్ బాబు: అవును కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడుకున్న ఒక సందేశం ఉంది.
అభిమాని: అరబ్ అభిమానుల గురించి ఏదైనా చెప్పండి...మేమందరం మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతాం..
మహేశ్ బాబు: ఐ లవ్ యూ టూ...
అభిమాని: శ్రీమంతుడులో మీకు నచ్చిన డైలాగ్..
మహేశ్ బాబు: ఊరి నుంచి చాలా తీసుకున్నారు. వెనక్కి ఇచ్చేయాలి లేకపోతే లావయిపోతారు..
అభిమాని: రాజమౌళితో కలసి జేమ్స్బాండ్ తరహాలో సినిమా తీస్తున్నారని వార్తలొస్తున్నాయి...ఎంత వరకు వాస్తవం ?
మహేశ్ బాబు: అలాంటిదేమీ లేదు..
అభిమాని: మీ నాన్నగారి గురించి ఒక్కమాటలో
మహేశ్ బాబు: ఆయన ఒక సూపర్ స్టార్...ఆయన మా నాన్న అని చెప్పుకోవడం నిజంగా గర్వకారణం.
అభిమాని: మొదటిసారి శ్రీమంతుడు కథ విన్నపుడు మీ రియాక్షన్ ఏంటి ?
మహేశ్ బాబు: ఆలోచించకుండా సినిమాకు ఓకే చెప్పేశా...
అభిమాని: మీ కుటుంబం నుంచి మూడుతరాల హీరోలు కృష్ణా, మహేష్, గౌతంలతో సినిమా(మనం సినిమాలాంటి సినిమా)ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా..?
మహేశ్ బాబు: మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తాం.
అభిమాని: చాలా మంది మిమ్మల్ని బాలీవుడ్ లో చూడాలనుకుంటున్నాము..మీ అభిప్రాయం ఏంటి ?
మహేశ్ బాబు: ఇప్పుడు కాదు...మంచి కథ కూడా దొరికాలి కదా!
అభిమాని: చిన్ని యువరాణి సితార గురించి మీరు చెబితే వినాలనుకుంటున్నాం ..
మహేశ్ బాబు: తను మూడో ఏట అడుగుపెట్టింది...తను ఎంతో సంతోషంగా ఉంది.
అభిమాని: సినిమా ట్రైలర్ చూసిన తర్వాత కృష్ణ గారు ఏమన్నారు...?
మహేశ్ బాబు: నన్ను పిలిచి అద్భుతంగా ఉందన్నారు...
అభిమాని: ఈ సినిమాకి టైటిల్ ఎవరు పెట్టారు..?
మహేశ్ బాబు: డైరెక్టర్ శివ సర్
అభిమాని: మహేష్ స్ట్రిక్ట్ ఫాదరా?? లేక కూల్ ఫాదరా ?? ఫ్రెండ్లీ ఫాదరా??
మహేశ్ బాబు: కూల్ ఆండ్ ఫ్రెండ్లీ డ్యాడ్
అభిమాని: మీకు నచ్చిన ప్రదేశం ?
మహేశ్ బాబు: న్యూజిలాండ్
అంతేకాకుండా ఈ సినిమా డైరెక్టర్ కొరటాల శివ అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చారు.
. @urstrulyMahesh I watched you performing very intensely in some scenes. I wonder how it was to shift 'on and off' camera
— koratala siva (@sivakoratala) August 1, 2015