
నేను మహేష్‌బాబుని: అల్లు అయాన్
హైదరాబాద్: టాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ యాక్టర్ మహేష్ బాబు అభిమానుల లిస్టులో మరో ప్రముఖ వ్యక్తి చేరాడు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ తనేనంటూ చెప్తున్నాడు. ఇంతకి ఎవరు ఆవ్యక్తి అనుకుంటున్నారా.. అతను అల్లు వారింటి అబ్బాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల తనయుడు అల్లు అయాన్. ఇటీవల ఓ వీడియోలో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు బొమ్మలతో ఆడుకుంటున్న అయాన్ సమాధానమిస్తూ కనిపించాడు.
తాను చిట్టి మహేష్‌బాబునని అల్లు అయాన్ ముద్దుముద్దు మాటలతో చెబుతున్నాడు. వీడియోలో నీ పేరేంటి? అని అడిగితే .. అయాన్ అని బదులిచ్చాడు. సైకిల్ తొక్కేటప్పుడు నువ్వు ఎవరని అడిగితే.. ఏ మాత్రం ఆలోచించకుండా ‘మహేష్‌బాబు’ అని సమాధానం ఇచ్చాడు ఈ జూనియర్ స్టైలిష్ స్టార్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.