మహేష్ సినిమా కథ, కొరటాలది కాదా..? | Koratala Siva Buys Story Rights from Srihari Nanu for mahesh Babu | Sakshi
Sakshi News home page

మహేష్ సినిమా కథ, కొరటాలది కాదా..?

Published Sat, Dec 10 2016 10:38 AM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM

మహేష్ సినిమా కథ, కొరటాలది కాదా..?

మహేష్ సినిమా కథ, కొరటాలది కాదా..?

రచయితగా ఇండస్ట్రీకి పరిచయం అయి, తరువాత దర్శకుడిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ కొరటాల శివ. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సాధించిన కొరటాల శివ, ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కించబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. గతంలో ఇదే కాంబినేషన్లో రూపొందిన శ్రీమంతుడు ఘనవిజయం సాధించటంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

స్వతహాగా రచయిత అయిన కొరటాల శివ, ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలకు కథా కథనాలను తనే రాసుకున్నాడు. అయితే మహేష్తో చేయబోయే కొత్త సినిమాకు మాత్రం మరో దర్శకుడి నుంచి కథను తీసుకున్నాడట. భూమిక నిర్మాతగా మారి తెరకెక్కించిన తకిట తకిట సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీహరి నాను, మహేష్ బాబు కోసం ఓ పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాను సిద్ధం చేశాడన్న టాక్ వినిపిస్తోంది.

శ్రీహరి చెప్పిన లైన్ నచ్చిన కొరటాల, ప్రస్తుతం ఆ కథను పూర్తి స్క్రిప్ట్గా రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమాకు 'భరత్ అను నేను' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. 2017 జనవరిలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను అఫీషియల్ గా ఎనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement